Friday, August 29, 2025

 *@ అతడు లేడు కానీ..@50
        తేది:27/08/2025
"""""""""""""""""""""""""""""""""""""""

అదొక బంజరుభూమి కనిపించినంత మేరా ఎడారిలా
వ్యాపించి ఉన్న ఆ భూమి కొన్నాళ్లకే పచ్చని చెట్లతో కళకళ లాడటం మొదలెట్టింది మరికొన్నాళ్లకు పెద్ద పెద్ద వృక్షాలతో
దట్టమైన అడవిలా మారి, పక్షులూ జంతువులతో
నిండిపోయింది...
అందులోంచి ప్రవహించే వాగులూ వంకలతో చుట్టుపక్కల ప్రాంతం సస్యశ్యామలంగా మారింది
పలు కుటుంబాలు వచ్చి నివాసం ఏర్పరచుకున్నాయి
చూస్తుండగానే అక్కడొక నందనవనం, దాన్ని ఆనుకుని ఒక
చక్కని పల్లె తయారయ్యాయి
సినిమా తెరమీద క్షణాల్లో దృశ్యాలు మారిపోయినట్లు కొద్ది కాలంలోనే అలా మారడం సాధ్యమేనా... ప్రకృతిలో ఏదో
మాయ జరిగింది అనుకున్నారు అధికారులు
అసలేం జరిగిందంటే...
ఫ్రాన్స్ వైపున్న ఆల్ప్స్ కొండప్రాంతం అది
ఆ నిర్మానుష్య ఎడారిలో చిక్కుకుపోయిన ఓబాటసారికి
దాహంతో నోరెండిపోతోంది అప్పుడో గొర్రెల కాపరి కనిపించి
అతడినో వాగు దగ్గరికి తీసుకెళ్లి దాహం తీర్చాడు ఒంటరిగా
అతడా ఎడారిలో ఏం చేస్తున్నాడని చూస్తే,
చిన్నచిన్న
గుంటలు తవ్వి ఓక్ విత్తనాలు పాతుతున్నాడు కాసేపు చూసి
తన దారిన తాను వెళ్లిపోయాడు బాటసారి అంతలో మొదటి
ప్రపంచ యుద్ధం జరిగింది అందులో పాల్గొన్న బాటసారి
మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు జీవితం నిరాసక్తంగా మారింది దాంతో మరోసారి పర్యటనకు బయల్దేరాడు
గతంలో వెళ్లిన కొండ ప్రాంతానికే వెళ్లాడు నాటి ఎడారి పదేళ్లలో పచ్చదనాన్ని సంతరించుకుంది చల్లని ఆవాతావరణం
అతణ్ని సేదదీర్చింది ఆ చెట్లన్నీ నాడు తన దాహం తీర్చిన
వ్యక్తి నాటినవేనని తెలిసి ఆశ్చర్యపోయాడా బాటసారి కొన్నేళ్ల
పాటు ఏటా వెళ్లి గమనించేవాడు భార్యను కోల్పోయిన ఆగొర్రెల కాపరి ఎవరిదీ కాని ఎడారి నేలలో రోజుకు వందగింజలు చొప్పున నాటుతూ వచ్చిన ఫలితమే ఈ పచ్చని
అడవి అని తెలుసుకున్నాడు గొర్రెలు మొక్కల్ని తినేస్తాయని
వాటిని పెంచడం మానేసి తేనెటీగలు పెంచుతుంటాడు
అతడు ఒక్క వ్యక్తి నిస్వార్థసేవ కిలోమీటర్ల మేర వ్యాపించిన
అడవిని సృష్టిస్తే...
ప్రతి వ్యక్తీ ఎంతో కొంత సొంతలాభం
మానుకుని ప్రకృతి గురించి బాధ్యతగా ఆలోచిస్తే ఎంత
బాగుంటుంది...అనుకున్నాడా బాటసారి
ఎజియా బుఫా అనే పాత్రని సృష్టించి తానే బాటసారిగా
మారి జాఁ జియానో రాసిన 'ద మ్యాన్ హూ ప్లాంటెడ్
హోప్ అండ్ గ్ర్యూ హ్యాపీనెస్' అనే పుస్తకంలోని
కథ ఇది
పలు భాషల్లోకి అనువాదమై ప్రపంచవ్యాప్తంగా అడవుల పునరుద్ధరణకు కృషిచేస్తున్న ఎందరికో దశాబ్దాలుగా స్ఫూర్తినిస్తోందీ
పుస్తకం పచ్చదనం లేని పక్షంలో భూమి మరుభూమిగా
మారుతుందని భయపడి తనవంతు కృషిచేసిన ఎజియా బుఫా
నిజంగానే ఉన్నాడని నమ్మేవారెందరో మనిషి శక్తిసామర్థ్యాల
మీద, మానవత్వం మీద అపారమైన గౌరవాన్ని పెంచేందుకే
ఈ పుస్తకం రాశానని చెబుతారు జియానో...*

No comments:

Post a Comment