Wednesday, August 27, 2025

 *అనేకమూర్తుల ఆదిదేవుడు.....* 

*సిద్ధిబుద్ధిప్రదం నృణాం ధర్మార్థకామమోక్షదం*
*బ్రహ్మరుద్రరవీంద్రాద్యైః సంస్తుతం పరమర్షిఖిః*

*వేదప్రతిపాద్యమైన ఒకే పరబ్రహ్మను ఆరు రూపాలుగా ప్రధానంగా ఆరాధించడమనేది మన సనాతన వైదిక ధర్మం. అవి-గణపతి, విష్ణువు, శివుడు, సూర్యుడు, శక్తి(అమ్మవారు), సుబ్రహ్మణ్యస్వామి. 'ఏకం సత్ విప్రా బహుధా వదంతి' అన్నట్లుగా ఉన్న ఒకే సత్ ఈ రూపాలుగా మార్పు చెందింది. గణపతిని కొలిచినప్పుడు కూడా ఆ 'ఏకం నత్' అయి సృష్టిస్థితిలయలకు కారణమైన పరబ్రహ్మగా ఆరాధించాలి. అలా ఆరాధిస్తే అదే గాణాపత్యమనే వేదసమ్మతమైన షణ్మతాలలో ఒకటి. 'గణేశో వై సదజాయత తద్ వై పరంబ్రహ్మా' అని ఉపనిషత్తులు కూడా గణేశుని పరబ్రహ్మగా నిర్ధారించాయి.*

*సమామి పరమాత్మానం సచ్చిదానందవిగ్రహం*
*చరాచరగురుం సర్వకారణానాం చ కారణం*
*త్రితనుం చ త్రయీమూర్తిం బ్రహ్మవిష్ణుశివాత్మకం*

- *అని గణపతిని శాస్త్రాలు* *కీర్తించాయి. 'సర్వదేవమయః సాక్షాత్ సర్వమంగళదాయకః' అని సర్వదేవమయునిగా గణపతిని దర్శించాలి.*

*ఈ ఆరింటిలో దేనికదే పరబ్రహ్మప్రాప్తిని కలిగించేదిగా ఉన్నా గణపతిది ఒక ప్రత్యేకం. ముందుగా అతనిని ఆరాధించనిదే మరి ఏ దైవం కూడా ప్రసన్నులు కారు. అందుకే ఏ వ్రతమాచరించినా, పూజాడులు చేసినా ముందుగా గణపతినే ఆరాధిస్తాం. అలా ముందుగా ఆరాధింపబడేవాడు కనుక 'ఆది'దేవుడు, ఏ మంత్రానికైనా ప్రణవం ఎలా ఆదిగా ఉంటేనే మంత్రం శక్తిమంతం అవుతుందో, ఆ ప్రణవమే వదనంగా కలిగిన (ప్రణవాకారం వక్రతుండం) గణపతి 'ఆదిదేవుడు. 'ఓమిత్యేకాక్షరం బ్రహ్మా' అని చెప్పినట్లుగా ఓంకారాకారుడైన విఘ్నేశ్వరుడే పరబ్రహ్మ అనేది స్పష్టమవుతోంది. సృష్ట్యాదిలో బ్రహ్మకు కలిగిన విఘ్నాలు తొలగించి సృష్టి జరగడానికి అది దేవుడయ్యాడు. ఏ కావ్యసృష్టికైనా సరే ఋషులనుండి నేటి కవుల వరకు ఎవరైనా ఆ 'ఆది'దేవుడే ఆదిగా ప్రార్ధిస్తున్నారు. వాక్కు వెలువడడానికి కారణాలైన పరా-పశ్యంతి-మధ్యమ-వైఖరులలో మొదటిదైన పరావాక్కు జనించే స్థానం మూలాధారం, ఈ విధంగా వాక్కులకు కూడా 'అది'దేవుడై అక్షరగణపతిగా అనుగ్రహిస్తున్నాడు.*

*సృష్టిస్థితిలయాది పంచకృత్యాలకు మూలమైనవానిగా గణపతి ఎప్పుడు అవతరించినా గజవదనుడే. ఎందుచేతనంటే ఆ గజవదనమే బ్రహ్మతత్త్వాన్ని తెలియజేసేది అని శాస్త్రవచనం. ఏకం సత్గా పసుపుతో చేసిన లింగాకారంగా నిర్గుణబ్రహ్మగా పూజలందుకునే గణేశుడే భక్తుల అభీష్టాలు నెరవేర్చి అనుగ్రహించడా (భక్తానుగ్రహవిగ్రహం)నికి అనేక అవతారాలు దాల్చాడు. భూలోకవాసులకే కాక దేవతలను సైతం అనుగ్రహించే మూర్తి.*

*ఇహలోకజీవితంలో కూడా మానవులకు ఏ ప్రయోజనం సిద్ధించాలన్నా ఆ ప్రయోజనానికి తగిన విధంగా గణపతి రూపాలను ఆగమాలు వర్ణించాయి. విద్య కావాలంటే 'విద్యాగణపతి', 'అక్షరగణపతి' సంపదకు 'సంపత్ గణపతి', నంతానానికి 'సంతానగణపతి', 'ఋణహరగణవతి', 'సంకష్టనివారకగణపతి', ఏ కార్యానికైనా సిద్ధిని కలిగించే 'సిద్దిగణపతి', 'శక్తిగణపతి', 'లక్ష్మీగణపతి', 'విజయగణపతి'. ఇవే కాక వంచపదనాలతో 'హేరంబగణవతి', 'ఉచ్ఛిష్టగణపతి'... ఇలా వేలకొద్ది నామాలు, ప్రతినామానికి ఒక రూపం, యంత్రం, శాస్త్రం ఉన్నాయి. సరైన ఋజుజీవితానికి, పరబ్రహ్మప్రాప్తికి ఆటంకాలుగా ఉందే కానుక్రోధాది ఎనిమిది దోషాలను అదుపుచేసే గణనాయక, మోరేశ్వర ఇత్యాది ఎనిమిది అవతారాలు కూడా ప్రసిద్ధిగా ఉన్నాయి.*

*సృష్టిలో ప్రతిదీ గణములుగా ఉంటాయి. ప్రతి గణానికి పతి కనుక గణపతికి కూడా అనేక రూపాలు ఉన్నాయి. వేదం ప్రకారంగా విశ్వానికి ఆధార ప్రాణశక్తిగా ఉన్నవాడు గణపతి. ఈ ప్రాణశక్తియే కూర్మ, శేష, గంధ, రస, రూప, స్పర్శ, శబ్ద మొదలైన అన్ని ప్రాణశక్తులకు ఆధారమైనది.*

*యోగపరంగా చూసినా ఆదిచక్రమే కాక ఆధారచక్రమైన మూలాధారం గణపతి నివాస స్థానం. అక్కడ కుండలినీ కదలనిదే ఊర్ధ్వగమనం సాగదు. యోగగమనానికి కూడా గణపతియే ఆదిదేవుడు. కాబట్టి గణపతి ప్రసన్నుడవడం యోగమార్గంలో కూడా అత్యంతావశ్యకం. పశువులలో వాటి దేహమధ్యస్థానమైన హృదయమునందు, పక్షులలో ఉదరభాగమందు, వృక్షములకు మూలమునందు గణపతి ఆవాసమై ఉంటాదు అనేది శాస్త్రం తెలిపిన విషయం.*

*ఇన్ని రూపాలుగానున్న గణపతి యొక్క శ్రేష్టత్వాన్ని తెలుసుకుని ఐహికాముష్మిక వలితాలు సిద్ధించడానికి నిర్దేశింపబడినదే వరసిద్ధి వినాయక వ్రతం, వర అనే మాటే శ్రేష్టత్వాన్ని సూచిస్తోంది. అంతే కాక అనేక వరాలను ఇచ్చేవాడు కనుక వరదుడు కూడా (వరాన్ దదాతీతి వరదః), గణపతికి సంబంధించిన అనేక మంత్రాలలో కూడా వర, వరద అనే పదాలు గోచరిస్తుంటాయి.*

*భాద్రపద శుద్ధ చవితినాడు వరసిద్ధి వినాయకుడు అనే పేరుతో పార్థివ(మట్టి)మూర్తిగా, నాలుగు చేతులవానిగా పూజించాలి. పన్నెండు మాసాలలో వివిధ నామాలతో, రూపాలతో గణపతి ఆరాధన, ఆ సమయంలో కొలుచుకునే దేవతాగణాల వివరాలు కూడా పురాణాలలో వర్ణించబడింది.*

*గణపతిని ప్రధానదైవంగా ఆరాధించేవారు ప్రతి మాసంలో చవితి నాడు ఆ యా పేర్లతో పూజించుకోవచ్చు. చైత్రం-ధూమ్రవర్ణగణపతి, వైశాఖం - హేరంబుడు, జ్యేష్ఠం- వినాయకుడు, ఆషాధం-గజాననుడు/ఢుంఢిరాజు, శ్రావణం-గణేశుడు భాద్రపదం- వరసిద్ధివినాయకుడు/మయూరేశుడు. ఆశ్వయుజం-విఘ్నేశ్వరుడు, కార్తికం-వక్రతుండుడు, మార్గశీర్షం-వికట వినాయకుడు, పుష్యం-లంబోదరుడు, మాఘం- సంకష్టహరుడు, ఫాల్గుణం-గణేశుడు. అంతేకాక మంగళవారం చతుర్థి కలిసినది అంగారక చతుర్థిగా గణపతి ఆరాధనకు ప్రత్యేకం. ఆదివారం చవితి కలిసిన రోజున చేసే ఆరాధన విశేష ఫలితాలను కలుగజేస్తుంది.*

*పన్నెండు చతుర్థీవ్రతాలు చెయ్యలేకపోయినా భాద్రపదశుద్ధ చతుర్థి నాడు శ్రద్ధాభక్తులతో చేసే వ్రతం వల్ల అన్ని చతుర్థీవ్రతాలు చేసిన ఫలితం కలుగుతుంది. ఈ చవితి చాలా ప్రత్యేకమవడానికి కారణం అనేక సందర్భాలలో ఈ తిథినాడే గణేశప్రాదుర్భావం జరిగింది. పార్వతీదేవి మేని (వంటి) వనుపుతో ఒక కల్పంలో ఆవిర్భవించగా, బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం శివ-పార్వతులకు శ్రీకృష్ణుడే గణపతి (పుత్రుని)గా ఈ తిథినాడే అవతరించాడు.*

*సకల గణాలకు అధిపతిగా ఈ “తిథినాడే పట్టాభిషేకం కూడా జరిగింది. మానవుల జీవనగమనం అనేక గణాలతో కలిసే సాగుతుంటుంది. మన దేహంలోనే ఇంద్రియములు, బుద్ధి మొదలైనవి ఎన్నో గణాలు, కుటుంబసభ్యులు, బంధువులు -ఇదంతా ఒక గణం. మనం ఇంద్రియాల ద్వారా గ్రహించే ఆహారాదులన్నీ కూడా గణసమూహాలే, మన జీవితంపై ప్రభావం చూపించేవి గ్రహగణాలు. ఆ గణాలన్నిటికీ అధిపతిగా మన హృదయంలోనే గణపతిని రాజుగా పట్టాభిషేకం చేసి మనలను పాలించమని వేడుకుంటే సకల విఘ్నాలు తొలగి చతుర్విధ పురుషార్థాలు సిద్ధించి, జీవితలక్ష్యమైన గణేశ బ్రహ్మమును పొందగలం.*

*దీననాథ! దయాసింధో! యోగిహృత్పద్మసుస్థిత!*
*అనాదిమధ్యరహితస్వరూపాయ నమో॥, స్తుతే.*

*┈┉┅━❀꧁శివోహం꧂❀━┅┉┈*
           *ఆధ్యాత్మిక అన్వేషకులు*
📿⚜️📿 🙏🕉️🙏 📿⚜️📿

No comments:

Post a Comment