*ॐ సంత్ తులసీదాస్ జయంతి శుభాకాంక్షలు*
*గోస్వామి తులసీదాసు ఉత్తరప్రదేశ్ బాండా జిల్లా రాజ్ పూర్లో 1532లో ఆత్మారాం దుబే , హుల్సీ దేవి దంపతులకు జన్మించారు.*
*రామాయణాన్ని సంస్కృతంలో విరచించిన వాల్మీకి యొక్క అవతారమే తులసీదాసు అని అంటారు.*
*తులసీదాసు తన జీవితాన్ని రామభక్తికి అంకితం చేశారు.*
*గోస్వామి తులసీదాసు అవధ ప్రాంత కవి , తత్వవేత్త.*
*ఉత్తరప్రదేశ్లోని లక్నో సమీప ప్రాంతాలను అప్పట్లో అవధ దేశంగా పిలిచేవారు.*
*ఆయన బార్హస్పత్యమాన శ్రావణ బహుళ (చాంద్రమాన శ్రావణ శుక్ల) సప్తమినాడు జన్మించినారు.*
*కాశీలో పురాణ కాలక్షేపం చేస్తున్న సమయంలో హనుమ దర్శనం పొందిన మహనీయుడు.*
*హనుమ ద్వారా శ్రీరామ దర్శనం పొందారు.*
*ఉత్తర భారతంలో సాధారణ ప్రజల్లో బహుళ ప్రచారం పొందిన "రామచరిత మానస్" రచించారు*
*సుందరకాండతో సమానమై, సులువుగా హనుమని స్తుతించే శక్తివంతమైన "హనుమాన్ చాలీసా" ఆయన సృష్టే.*
*గోవిందా హరి గోవిందా*
*జై శ్రీరామ్ జై జై శ్రీరామ్*
*జై హనుమాన్ జై జై హనుమాన్*
No comments:
Post a Comment