Friday, August 1, 2025

 *రెండు అంటే రెండే కథలు .. చాలా చిన్నవి .. చెప్తాను ... అస్సలు మీ టైం వృధా కానివ్వను .. ఓపిక తో చదివేయండి ..*

*ఒక అమ్మాయి ఒక అబ్బాయి .. ఘాడంగా ప్రేమించుకున్నారు .... ఒక రోజు ఆ అబ్బాయి పెళ్లి చేసుకుందామా .. అని ఆ అమ్మాయి ని అడిగాడు .. దానికి తను .. అమ్మో మా ఇంట్లో ఒప్పుకొరు .. చంపేస్తారు .. అయిన నీకేముందని జాబ్ హ , ఆస్తుల , ఏం ఉన్నాయి అని నన్ను ఇచ్చి పెళ్లి చేస్తారు .. అని అడిగింది ...*
*అందుకు ఆ అబ్బాయి .. అవి అన్ని సంపాదించుకొని వచ్చి మీ ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకుంటాను .. అని చెప్పి  వెళ్లి...  రాత్రి పగలు కష్టపడి .. కోట్లు , పేరు సంపాధించి .. తన దగ్గరికి తిరిగి వస్తే .. తను ఇద్దరు పిల్లలతో ఎదురు వచ్చి పలకరించింది ... అంతే .*

*ఏముంది ఈ కథలో అని మీరు అడగచ్చు .. అవును ఏం లేదు ఈ కథలో .. వాడు సంపాదించి తిరిగి వస్తాడు .. అన్న నమ్మకం ఆ అమ్మాయికి లేదు ...*
*ఇంట్లో చెప్పి ఒప్పించే ధైర్యం లేదు ..*
*ఇష్టం లేకపోయిన .. పెళ్లి చేసుకొని .. ఇష్టం లేని జీవితాన్ని .. భయపడుతూ .. గడిపే భయం తప్ప ... ఇంకేం లేవు ..*

*ఇదే కథ వేరేలా .. చెప్తాను ...*
*ఒక అమ్మాయి .. ఒక.అబ్బాయి ఘాడంగా ప్రేమించుకున్నారు ... ఒక రోజు పెళ్లి చేసుకుందామా అని ఆ అబ్బాయి అడిగాడు .. అందుకు ఆ అమ్మాయి .. చేసుకుందాం .. అంది.*
*దానికి .. ఆ అబ్బాయి .. నాకు జాబ్ లేదు .. అంతస్థులు అస్సలే లేవు .. మీ ఇంట్లో ఒప్పుకుంటారు అంటావా .. అని అడిగాడు ..*
*అందుకు ఆ అమ్మాయి .. నీతో కలిసి బతకాల్సింది .. నేను .. నాకు ని అంతస్తులు అక్కర్లేదు .. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే నేను ఉంటా .. నువ్వు ఏది పెట్టిన ప్రేమ గా తింటా ..*
*ఏది ఏమైనా నీతోనే ఉంటా .. అని చెప్పి ..*
*ఇంట్లో ధైర్యంగా .. తన ప్రేమ విషయం చెప్పింది .. మొదట ఒప్పుకోలేదు ఇంట్లో వాళ్ళు ..*
*రెండో సారి చెప్పింది .. తిట్టారు ..*
*మూడో సారి చెప్పింది .. కొట్టారు ..*
*నాలుగోసారి .. పెళ్లి సంబంధం తెచ్చారు ..వచ్చిన వాడిని కాలితో తన్ని మరి తరిమింది ...*
*జాతర లో .. బొమ్మ కావాలి అని చిన్న పిల్లోడు మొండి కేసినట్టు ... వాడే కావాలి .. అని కూర్చుంది ...*
*చస్తాం అని బెదిరించారు ..* *అయిన జంక లేదు ..*
*చివరికి దిగి వచ్చారు .. వారి ప్రేమ కి తోడుగా నిలబడి .. పెళ్లి చేశారు ...*

*ఏ కథ చదువుతున్నప్పుడు .. మీకే అర్థం ఐఎంటుంది ... అవును ..ఈ కథ లో .. అన్ని ఉన్నాయి .. ధైర్యం , ఒప్పుకుంటారు అనే నమ్మకం ... సహనం .. అన్నిటికి మించి .. ప్రేమ .. ఉంది ఈ కథలో ...*

*మొదటి  కథలో .. వాడి దగ్గర ఇప్పుడు అన్ని ఉన్నాయి .. కోట్లు , కోటలు .. మనసులో వున్న అమ్మాయి తప్ప ...*

*రెండో కథలో .. వాడి దగ్గర ఏం లేవు .. మనసులో ఉన్న అమ్మాయి తోడు తప్ప ..అది చాలు .. వాడికి ఇంకేం అవసరం లేదు ..☺️*

*ఏంటి .. కథలు రెండు ..* *అమ్మాయిల `పాయింట్ అఫ్ వ్యూ` లో చెప్పావు . .అని మీరు అడగచ్చు ..*
*ఇక్కడ అబ్బాయిలకి వున్న .. స్వేచ్ఛ .. అమ్మాయిలకి లేదు కదా ...* 

*ఒక అమ్మాయి .. బయపడితే .. ఒకడి జీవితం నాశనం అయిపోయింది (లవర్) .. ఒకడు మోసపోయాడు ..(హస్బెండ్) ... తనని తానే ఒక అబద్దం అయిపోయింది ...*

*అదే ధైర్యంగా ఉంటే .. పైవి ఏవి జరగవు ..*

*అందుకే చెప్పేది .. అమ్మాయిలను .. భయంతో కాదు .. ప్రేమతో .. బాధ్యత గా పెంచాలి ..* 
*వాళ్ళు ఏ తప్పు చేసినా సరే .. మీకే వచ్చి చెప్పుకొనేలా .. మీరే ధైర్యం ఇవ్వాలి ... 😊*

No comments:

Post a Comment