🎈పరాంతకాలం(మోక్షకాలగణన)🎈
🍀చతుర్యుగ కాలగణన🍀
**కృత యుగము:17,28,000.
**త్రేత యుగము: 12,96,000.
**ద్వాపర యుగము: 8,64,000.
**కలియుగము : 4,32,000.
——————————————-
చతుర్యుగ పరిమితి:43,20,000.
————————————————
ఇటువంటి చతుర్యుగములు (71)
మార్లు మారిన ఒక మన్వంతరము.
1 మన్వంతరము: 30,67,20,000.
ఇటువంటివి 14 మన్వంతరములు: 14 x 30,67,20,000=
429,4080000 సంవత్సరములు.
14 మన్వంతరముల కాలమును చతుర్యుగములలోకి మార్చినట్లయితే:
994 చతుర్యుగములగును.
ప్రతి మన్వంతరమునకు కృతయుగ మునకు సమానమైన సంధికాల ముండును.
మొదటి మన్వంతర ఆరంభమునను
ఒక సంధికాలముండును.వెఱసి 15 సంధికాలములు:
15 x 17,28000=2,59,20,000
సంవత్సరములగును.వీటిని చతు ర్యుగములలోకి మార్చిన(6)చతుర్యుగ
ములగును.994+6=1000 చతు ర్యుగములగును.
1000 చతుర్యుగములు బ్రహ్మకు ఒక దినము.రాత్రి-ప్రళయము, 1000 చతుర్యుగముల కాలము.
2000 చతుర్యుగములు ఒక అహెూరాత్రము: బ్రహ్మకు ఒక రోజు.ఇటువంటి (30)రోజులు ఒక నెల.ఇటువంటి పండ్రెండు మాస ములు ఒక సంవత్సరము.ఇటువంటి వంద సంవత్స రములు పరాంతకా లము.
360x100=36,000చతుర్యుగములు.36,000 పర్యాయములు సృష్టి ప్రళయములకు యెంత సమయము
పట్టునో అంత సమయము ముక్త జీ
వుడు ముక్తి సుఖముననుభవిం చును.
🍀తే బ్రహ్మలోకే హ పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే॥
(ముండకోపనిషత్తు.2-6)
ముక్తజీవులు ముక్తిని పొంది బ్రహ్మ యందు ఆనందమును పరాంతకా లమువరకు అనుభవించి మహాకల్ప
మునకు పిమ్మట ముక్తి సుఖమును
వదలి మరల సంసారమునకు వచ్చు
చున్నారు.పరాంతకాలమనగా:-నలు
బదిమూడులక్షల యిరువదివేల వర్ష ములొక చతుర్యుగము;రెండు వేల చతుర్యుగములొక అహోరాత్రము; అట్టి ముప్పది అహెూరాత్రములొక మాసము;అట్టి పండ్రెండు మాసము లొక వర్షము;అట్టి నూఱువర్షము లొక పరాంతకాలము.
(సత్యార్థప్రకాశము.నవమ సముల్లా
సము)
[ఈ ముక్తిని సాధించుటకు అష్టాం గయోగమే శరణ్యము.అందునను
యమనియమములను Entrance test/ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడు కాదగును.పిదప ఆసన సిద్ధిని బడసి ప్రాణాయామముతో చక్షురాది ఇంద్రియములను మనస్సునేకాగ్రపర చుకొని,ఇంద్రియములను జయించ వలయును.ఇంద్రియములను విష యములనుండి మరల్చి ప్రత్యాహా రమును సాధించవలయును. చిత్త ము నేకాగ్రమొనర్చి ధారణను;విష య రహితమొనర్చి ధ్యానమును; చివరిది ఆత్మపరమాత్మల నెరుగు స్థితియే సమాధి.ఇదియే జీవన్ము క్తి.”ఉర్వారుకమివ బంధనాన్”శరీర విసర్జించడమే తడవుగ బ్రహ్మలోక మున అడుగిడుటయే ముక్తి.
ఒక యోగి సూక్ష్మంగా ముక్తికి రెండు ముఖ్యమార్గములన్నాడు.1.జిహ్వ,2.ఉపస్థలను జయించుట.
1.జిహ్వ-నాలుకను జయించుట.రాజ
సిక,తామసికాహారముల విసర్జన.
2.ఉపస్థ-జననేంద్రియము:విషయ
వాసనలనుండి నిరోధన.
వీటిని జయించిన ముక్తిద్వారములు
తెఱచుకొంటాయని కాల్వా గురుకుల
అధినేత ఆచార్య బలదేవ్ జీ మహా రాజ్ అన్నారు.ప్రపంచమంతా వీటిని
జయించలేక కొట్టుమిట్టాడుతున్నది.
…….ప్రభాకరశర్మ.
No comments:
Post a Comment