Tuesday, October 21, 2025

 254వ భాగం 
🕉️ అష్టావక్ర గీత🕉️
అధ్యాయము 18 
శ్లోకం 42

భావస్య భావకః కశ్చిత్ నీ 
కించిధ్బావకో$పరః|
ఉభయాభావకః కశ్చిత్ ఏవమేవ నిరాకులః||

కొందరు ఆధారమైన సత్యము ఉందని నమ్ముతారు .మరికొందరు శూన్యం మాత్రమే ఉందని అనుకుంటారు .ఇలా దేనిని భావించని జ్ఞాని చాలా అరుదుగా కనిపిస్తాడు. అతడు సర్వభావ సంచనాల నుండి ముక్తుడై సదాశాంతంగా ఉండగలుగుతాడు.

చార్వాకులు అనే పిలువబడే భౌతిక వాదుల దృష్టిలో ప్రపంచపు ఉనికికి సత్యత్వం ఉంది. కనిపించే భౌతిక ప్రపంచం నిత్యము సత్తంగా ఉందని వారు అంటారు. మాధ్యమికులు అని పిలవబడే కొందరు బౌద్ధులకు శూన్యము మాత్రమే సత్యం ,కనిపించేదంతా అసత్యము. సాధన దృష్ట్యా కూడా కొంతమంది ఆత్మను సచ్చిదానందంగా ధ్యానించాలని అందువల్ల ఆత్మానుభవం లభ్యమవుతుందని నమ్ముతారు. మరికొందరు మనసు నిశ్శబ్దమైనప్పుడు మాత్రమే ఆత్మ తత్వం అనుభవంలోనికి వస్తుందని అంటారు. వారి దృష్టిలో వస్తువుగా గుర్తింపబడటం అంటే వస్తు విషయమైన జ్ఞానము అని అర్థం. ఈ విషయ జ్ఞాన రహితమైన చైతన్యమే శుద్ధము అనంతము ఆయన ఆత్మగా వారు భావిస్తారు.

మనసు మామూలుగా ఇంద్రియాలను తృప్తిపరిచే విషయభోగాల వైపు ఆకర్షింపబడి పని చేస్తూ ఉంటుంది. అట్టి మనసును ఆ దృష్టి నుండి మళ్లించటానికి ఈ విభిన్న విధానాలన్నీ ఉపయోగపడతాయి. విషయ వాసనలు నుండి విముక్తమైన మనసు ధ్యానా అనుకూలంగా శాంతంగా సౌమ్యంగా తయారవుతుంది. ఆత్మానుభవంలోనికి జాగృతమైన తర్వాత ఆత్మను సత్యమైన ఉనికి కలిగి ఉన్నట్టుగానీ,ఉనికి లేదని కానీ నిర్వచించలేము. పరస్పర ఆధారంగా ప్రమాతచే తెలియబడే ప్రపంచం ఉన్నంతసేపే ఈ మాటలన్నిటికీ అర్థము ఉంటుంది. తెలుసుకునే ప్రమాత లేనప్పుడు అన్ని మాటలు అర్థరహితలే. ద్వందాతీతము భావాతీతము అయిన అట్టి స్థితిలో నిలువగలిగిన మహాత్ములు నిజముగా చాలా ఆరుదే. 

అందుకే అష్టావక్ర మహర్షి ఆశ్చర్య ఆనందాలతో అంటున్నారు .అలా దేనిని భావించని జ్ఞాని చాలా ఆరుదు .శాంతమైన ఆత్మ చైతన్యము ,సర్వచరాచర ప్రపంచపు ఉనికికి తెలియజేసే మనసును ప్రకాశింప చేసే ఉనికి సత్యము అనిపిస్తుంది. అదే చైతన్యములో మనసు లేకపోవడం సంభవించినప్పుడు శూన్యమే సత్యముగా భావింపబడుతుంది. ప్రపంచం ఉందని గాని లేదని గాని తెలుసుకునే మనోబుద్ధులకు ఆధారమే శాంతమైన శుద్ధ చైతన్యము, అదే ఆత్మ. 

ఆత్మ నిత్యము శాంతస్వరూపమే. ఇందులో ప్రపంచం నిజంగా ఎప్పుడు లేదు, ప్రపంచము పుట్టి నశించిందని  కూడా అనలేము. స్తంభము స్తంభంగా ఎప్పుడూ ఉంది ,భూతమే భ్రమగా భావింపబడింది. భూతము కనిపించడంతో కానీ అదృశ్యం అవ్వడంతో గాని స్తంభానికి ఎటువంటి సంబంధం లేదు.🙏🙏🙏

No comments:

Post a Comment