🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(250వ రోజు):--
ఎటువంటి ధ్యానాన్ని బోధిస్తార నే దలైలామా ప్రశ్నకు స్వామీజీ చక్కని సమాధానమిచ్చారు : "భగ వంతుని నామాన్ని పదేపదే స్మరించ డంద్వారా మనసులోని అన్యాలోచ న లన్నిటినీ పారద్రోలి, ధ్యానంచేస్తు న్న స్వరూపంతోనే తాదాత్మ్యం కావటం "
బౌద్ధమతానికి సంబంధించిన కొన్ని విషయాలపై చర్చ, తర్వాత టీ ముగించిన తర్వాత, "సరే, మీరు ఏదైనా ఏర్పాటుచేస్తే, నేను వచ్చి మాట్లాడతాను" అని దలైలామా స్వామీజీ ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. స్వామీజీ ఆహ్వానంపై ఆయన 1979 జనవరి 25న ప్రయాగ వచ్చి విశ్వహిందూపరిషద్ సమ్మేళ నానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సమ్మేళనంలో సుమారు 25 దేశాల నుంచివచ్చిన హిందువులు పాల్గొన్నారు.
1979 వసంతకాలంలో బెంగు ళూరులో మా ఆనందమయి 83 వ జన్మదిన సమారంభం జరిగింది. ఆనాటి సభలో మాట్లాడిన ప్రముఖు ల్లో స్వామీజీ ఒకరు. ఆ యోగిని యెడల తనకున్న గౌరవాభిమానాల్ని వ్యక్తంచేస్తూ మాట్లాడారాయన. మాత కూడా ఆయనను అదేవిధం గా మెచ్చుకున్నారు. ఆమె 1975 లో సాందీపని సాధనాలయానికి అతిథి గా వచ్చారు. ఆవిధంగా వారిరువురి కీ పూర్వపరిచయం ఉంది. వారి ప్రథమపరిచయం ఎప్పుడో తెలియ దు కాని, ఆనందకుటీరంలో వేదాంత విద్యార్థిగా చేరకమునుపు ఆయనకు ప్రాణాయామం చేయటం లో ఏదో సమస్య వచ్చిందనీ, దాని పరిష్కారానికి ఆయనను స్వామి శివానంద మా ఆనందమయి వద్ద కు పంపారనీ ఒక బలమైన వదంతి ప్రచారంలో ఉంది.
స్వామీజీ క్రైస్తవమతస్థులతో చర్చలు జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1963లో క్రైస్తవమత ప్రాబల్యమున్న గోవా దర్శించారు. ఆ ప్రాంతం 1961 వరకూ పోర్చుగీసుల ఆధిపత్యంలోనే ఉంది. ఒక హిందూ మత ధర్మకర్త అక్కడకు వెళ్లి, వారికి తమ ప్రాచీన సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వాల గురించి వివరించటం వారికి చాలా కొత్త విషయం. ఐనప్ప టికీ, ప్రారంభోపన్యాసం చేసిన గోవా రాష్ట్ర ప్రధానకార్యదర్శి వల్ల, ఒక్క ప్రభుత్వాధికారికైనా మతాన్ని గురించి సరైన అవగాహన ఉందనే అనిపించింది. అన్ని జాతులవారినీ ఒకే మట్టినుంచి భగవంతుడు సృష్టిo చాడని ప్రకటించి, స్వామీజీ తన ఉప న్యాసాన్ని ఈవిధంగా కొనసాగించారు:
మీ బైబిలుకూడా ఇదే చెపుతుంది. మట్టినుంచే మానవు డు పుట్టాడని బైబిలు ప్రవచించడం లో అంతరార్థం మనమందరమూ ఒకే దేవుని బిడ్డలమని నిర్ద్వంద్వం గా తెలియజేయటమే. ఈవిషయా న్ని విస్మరించి, మనం మన కులాల గురించి, మతాలగురించి గడబిడ చేస్తున్నాం ; చిన్నచిన్న కారణాలకు కూడా మనలో మనం పోట్లాడుకుం టున్నాం. జీసస్,కృష్ణుడు, బుద్ధుడు, మహమ్మదు వీరంతా ఒకే శాశ్వత సత్యాన్ని గ్రహించటానికి వేరువేరు మార్గాలు సూచించారు. కాని, అసలు విషయాన్ని వదలి, మనం నీడలవెంట పడుతున్నాం. మన శాస్త్ర పరిజ్ఞానాన్ని మానవజాతి అభ్యున్నతికి వినియోగించే వివేకం మనకు లేకుండాపోయింది. దేవుని మీద నమ్మికలేని వారందరూ కలిసి కట్టుగా ఉన్నారు; దేవునిమీద నమ్మ కమున్న వారందరం కూడా ఐక్యత తో పనిచేద్దాం !
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment