🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(248వ రోజు):--
ఇప్పుడు (1971లో)వెనుకకు వచ్చి తనజ్ఞానాన్ని వినియోగించే సమ యం ఆసన్నమైందని స్వామీజీ ఆయనకు జాబువ్రాశారు. సాందీపని సాధనాలయంలో ప్రధానాచార్యుని గా ఆయనను నియమించారు. స్వామి దయానంద సంస్కృతభాష లోనూ, వేదాంతశాస్త్రంలోనూ నిష్ణా తుడు కావటంచేత, ఆపని ఆయనకు తగినదే. దీనివల్ల సాందీపని అక్కడే ఎప్పుడూ ఉండి పనిచేసే అధ్యాపకు డు లభ్యమయ్యాడు ; ధనసంపాదన కు అతడు బయటకు పోనవసరం లేదు. అంతేకాక, ఇప్పుడు ఆశ్రమ వాతావరణంలో ఆవశ్యకమైన గురు శిష్యుల సాంప్రదాయసిద్ధమైన అను బంధానికి ఎక్కువ అవకాశముం టుంది. వ్యాపారంలో మంచి అనుభ వం గడించి, ఉద్యోగవిరమణ చేసిన జగదీశ్ ప్రసాద్, హనుమంతరావు లను కూడా స్వామీజీ బొంబాయికి రప్పించి వారిద్దరికీ కేంద్ర చిన్మయ మిషన్, సాందీపనిల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కార్య క్రమాలు నిర్వహించడానికీ, ఆర్థిక వనరులను సమకూర్చడానికీ బృందాలను ఏర్పాటుచేశారు.
1972 వసంతకాలంలో తపోవన్ కుటీరంలో విశ్రాంతితర్వాత స్వామీజీ దేశవిదేశాలలో యజ్ఞకార్యక్రమాల ను మళ్ళీ పూర్తిస్థాయిలో చేపట్టారు. తన జన్మస్థలమైన కేరళలో కూడా ఆయన వేదాంతిగా గుర్తించబడి, గౌరవించబడ్డారు. 1973 జనవరిలో తిరువనంతపురంలో జరిగిన అఖిల భారత రామాయణ మహాసభకు ఆయనను గౌరవఅతిథిగా ఆహ్వానిం చి, సప్తర్షులలో ఒకరుగా ఆయనను సత్కరించారు. ఇటీవలికాలంలో అంతటి ఘనమైన గౌరవం కాంచీ పురం శంకరాచార్యులు, స్వామి అభేదానంద, శ్రీ నటరాజగురులకు మాత్రమే దక్కింది - మానవజాతి పరిణతికి వారుచేసిన సేవలకు గుర్తింపుగా.
1975లో స్వామీజీ శృంగేరీ మఠా నికి వెళ్లి ఆనాటి శంకరాచార్యులైన అభినవవిద్యాతీర్థ మహాస్వామిగారి ని దర్శించారు. ఆయన స్వామీజీకి బంగారంలో పొదిగిన రుద్రాక్ష యుగ్మాన్ని బహూకరించారు. రుద్రాక్షబీజాలతో మాలకట్టి జపానికి వినియోగించటం పరిపాటి. రుద్రాక్ష ల జోడు మాత్రం చాలా అరుదుగా లభిస్తుంది. వీటిని శివపార్వతుల, ఆత్మ -జడపదార్థాల చిహ్నంగా పరి గణిస్తారు. సనాతనధర్మ ప్రచారం ద్వారా స్వామీజీ మానవజాతికి చేస్తు న్న సేవకు గుర్తింపుగా ఆయనకు ఈ బహుమతి లభించింది.
హిందూమతంలో భాగాలైన అన్ని అంశాలనూ, అన్ని సంస్కృతు లనూ ఆకళింపుచేసుకొని అభిమా నించిన స్వామీజీ వాటన్నిటినీ ఒకటి గానే భావించేవారు. 1973లో బెంగు ళూరులో జరిగిన యజ్ఞానికి మొదటి రోజున అధ్యక్షత వహించమని సత్య సాయిబాబాను స్వయంగావెళ్లి ఆహ్వానించారు. ఆ కార్యక్రమం పూర్తైన తర్వాత చాలామంది కార్య కర్తలు స్వామీజీ నివాసానికి గుంపు గా వచ్చారు. వారి మనసులో ఏముందో స్వామీజీకి తెలుసు. "ప్రారంభోత్సవానికి పూర్తిగా వేదాంతి కాని స్వామిని చిన్మయ మిషన్ ఎందుకు ఆహ్వానించిందని మీ ప్రశ్న అని నాకు తెలుసు. సాయి బాబా బోధిస్తున్నది అద్వైతసత్యాన్నే అంతేకాదు, జనులకు ఆయన ఎంత ప్రేమనిచ్చారో చూడండి. చిన్మయ మిషన్ ఒక అభిమానసంఘం కాదు; ఇది హిందూమతాన్ని ఉద్ధరించ డానికి స్థాపించబడిన సంస్థ. ఈపని చేస్తున్నది ఎవరైనా, దానిని వారు ఏ విధంగా చేస్తున్నా, అట్టివారికి మన సమర్ధన ఉంటుంది."
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment