Wednesday, October 22, 2025

శ్రీ రమణ మహర్షి ::::::: నమస్కారము

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

  శ్రీ రమణ మహర్షి  :::::::  నమస్కారము

   నమస్కారాన్ని గురించి మొట్టమొదట ఋషులు భగవంతుని శరణాగతి చిహ్నంగా ఎంచుకున్నారు. ఆచరణ ప్రాయంగా అది ఇప్పుడుకూడా ఉందిగాని దాని అర్థమే ఇప్పుడు మారిపోయింది.

     నమస్కరించేవారు తన ఆచరణలో నమస్కరింపబడేవారిని(ఎదుటివారిని) మోసగించాలని చూస్తారు. ఆ నమస్కారము చాలవరకు కపటము, మోసము కూడ. అది లెక్కలేని పాపాలను దాచేందుకైన ఒక తెరలాంటిది. 

    భగవంతుడిని మనం మోసగించగలమా! తను పెట్టిన నమస్కారం భగవంతుడు స్వీకరించాడని, మళ్ళీ ఇంతకుముందులాగే తన ఇష్టం వచ్చినట్లు జీవితం సాగించవచ్చనీ వారి ఉద్దేశ్యం.

    అలాంటివారు ఇక్కడికి రావటం ఎందుకు? వారి నమస్కారాలు నాకు ఎటువంటి తృప్తినీ ఇవ్వవు. వారు తమ మనస్సులను నిర్మలంగా ఉంచుకోగలిగితే చాలు. అంతకంటే ఇంకేమి కావాలి? అది చేయకుండా నా వద్ద వంగి లేక సాష్టాంగపడి లాభం ఏమి? అలాంటి వారితో నేను మోసపోయేది లేదు.

No comments:

Post a Comment