*🔥🧘♂️ఆత్మజ్యోతి🧘♀️🔥*
🔥🔥🧘🧘♂️🧘♀️🔥🔥
*"🔥🔥🔥మనలో ఉన్న ఆత్మజ్యోతిని వెలిగించుకోవటమే అసలైన దీపావళి పండగ🪷💫
*🔥🧘♂️ఆత్మజ్యోతి🧘♀️🔥*
*మానవుడు క్షణక్షణం విచారమనే చీకటిలో మునుగు తున్నాడు. చీకటిలో ప్రవేశించినప్పుడు జ్యోతిని వెలిగించు కోవాలి. అదే విధంగా, విచారమనే చీకటి దూరం కావాలంటే నీవు నీలో ఉన్న జ్యోతిని వెలిగించుకోవాలి.* *ఎక్కడికి వెళ్ళినా ఆ జ్యోతియే నీకు దారి చూపిస్తుంది. మనము జ్యోతిని వెలిగించాలంటే ఒక ప్రమిద కావాలి, దాని లోపల తైలం 'పోయాలి. దానిలో ఒక వత్తిని పెట్టాలి. ఒక నిప్పుపెట్టెకూడా ఉండాలి. ఈ నాలుగూ ఉండినప్పుడే మనము జ్యోతిని వెలిగించగలము. ఈ జ్యోతి బాహ్యమైన చీకటిని దూరం గావిస్తుంది. వత్తి వెలిగే కొలదీ తైలం తరిగిపోతుంది. తైలం అయిపోయేటప్పటికి దీపం ఆరిపోతుంది. అట్లే, మన అంతరంగమునందు గల చీకటిని దూరం గావించుకోవాలంటే, దానికి ఒక ప్రమిద, వత్తి, నూనె, అగ్గిపెట్టె కావాలి. మన హృదయమే ఒక ప్రమిద. మన మనస్సే ఒక వత్తి. ప్రేమయే తైలం, వైరాగ్యమే నిప్పుపెట్టె. ఈ నాలుగూ చేరినప్పుడే 🔥ఆత్మజ్యోతి🔥 ప్రకాశిస్తుంది. అప్పుడే అజ్ఞానమనే అంధకారము దూరమవుతుంది.*
🔥🔥🧘🧘♂️🧘♀️🔥🔥
No comments:
Post a Comment