*ఒకసారి ముగ్గురు మిత్రులు విహారంలో సముద్రయానం* *చేయసాగారు..ఆ ముగ్గురిలో ఓ టీచర్ , ఓ పోలీస్ అధికారి,* *మరో బ్యాంకు అధికారి ఈ ముగ్గురూ ఓ నౌకలో ప్రయాణిస్తున్నారు...*
*అలా..నౌక సముద్రం మధ్యకి చేరగానే ఒక సముద్రరాక్షసుడు వారి ముందు ప్రత్యక్ష మయ్యాడు. మిమల్ని తినేస్తానని పెద్దగా కేకలు పెడుతున్నాడు.*
*ముగ్గురూ భయంతో వణికిపోతున్నారు. వారు భయపడటం చూసిన రాక్షసుడికి కొద్దిగా జాలితో పాటుగా ఒక చిలిపి ఆలోచన వచ్చింది.*
*వాళ్ళతో ఇలా అన్నాడు:-*
*మీ ముగ్గురూ మీకు తోచింది, మీ దగ్గరున్నది ఈ సముద్రంలోకి విసిరేయండి.*
*వాటిని నేను వెతికి..మీకు తిరిగి తెచ్చి ఇస్తే గెలుపు నాదే.*
*ఒకవేళ ఆ వస్తువును నేను గనుక తేలేకపోతే గెలుపు మీదే ఆ వస్తువువాళ్ళని వదిలేస్తాను & వాళ్లకు నేను జీవితాంతం బానిసగా ఉంటా నన్నాడు.*
*సరేనని ముందుగా*
*బ్యాంక్ అధికారి తన చేతి వజ్రపుఉంగరం నీ సముద్రంలోకి విసిరేశాడు.*
*సముద్రంలో మునిగి కాసేపటికి రాక్షసుడు ఆ ఉంగరాన్ని తెచ్చి ఆ అధికారికి ఇచ్చి వాణ్ణి అమాంతం మింగేశాడు.*
*తరువాత పోలీసు తన చేతికున్న ఖరీదైన వాచీని నీళ్ళలోకి విసిరేశాడు.*
*రాక్షసుడు సముద్రంలోకి దూకి దాన్ని కూడా తెచ్చేసి అతన్నీ మింగేశాడు.*
*ఇంక ఈ సారి ఉపాధ్యాయుడి వంతు వచ్చింది.*
*టీచర్ కొంచెం యోచన చేసి తన దగ్గరవున్న వాటర్ బాటిల్ నీళ్ళ సీసా మూతతీసి అందులోని మంచినీళ్ళను ఆ సముద్రంలోకి ధారగా పోశాడు.*
*నేను ఇందులో పోసిన నా బాటిల్ లోని నీటిని మాత్రమే*
*నా మంచి నీళ్ళను నాకు తెచ్చి ఇవ్వు అన్నాడు.*
*ఆ దెబ్బకి రాక్షసుడికి దిమ్మ తిరిగిపోయింది.*
*ఉపాధ్యాయుడు దెబ్బ ఎలావుంది? అన్నాడు రాక్షసుడితో..*
*చేసేది లేక రాక్షసుడు తన ఓటమి ఒప్పుకొని అతనికి బానిస గా ఉండటానికి ఒప్పుకున్నాడు.*
*ఓ బానిసైన రాక్షసొత్తమా!..*
*నా స్నేహితుల నిద్దరినీ బ్రతికించు అని ఆజ్ఞాపించాడు ఆ ఉపాధ్యాయుడు.*
*వెంటనే..వాళ్లిద్దరినీ ఇదివరకే మింగిన రాక్షసుడు వాళ్ళనిద్దరినీ కక్కేశాడు.*
*మంచి పని చేశావు. ఇంక ఎవ్వరినీ యిలా బాధించకుండా ఉంటానంటే నిన్ను బానిసత్వంనుంచి విముక్తుడిని చేస్తానన్నాడు ఉపాధ్యాయుడు.*
*రాక్షసుడు అలా చెయ్యనని ప్రమాణం చేసి సముద్రంలోకి దూకి మాయమయ్యాడు.*
*ఎప్పుడైనా సరే..తనకు తన వాళ్లకు ఎంతటి ఆపద వచ్చినా ఆలోచించేవాడు గురు స్థానంలోని ఉపాధ్యాయుడు*
*సమాజానికి సమస్య వస్తే తగు పరిష్కారం సూచించగలిగేవాడు గురువు...🙏*
*మనవెంట వచ్చినవారు*
*మనోళ్లు స్వార్థ పరులైనా..అత్యాశ పరులైనా.. పక్కొన్ని పట్టించుకోక పోయినా సరే.*
*విచక్షణ గల ఉపాధ్యాయుడు అవతల ఉన్న రాక్షసజాతి బారినుండి మనోళ్లని వారి ఆపదలో రక్షించుకోవాలి.*
*ఆలోచన లేని పనులు మరోసారి చెయ్యొద్దని మంచిగా వారిని మందలించాలి..*
*వినకపోతే...మీ కర్మ అనీ వదిలేయాలి.*
No comments:
Post a Comment