Saturday, October 18, 2025

 *సుమతీ శతకము*

*బంగారు కుదువ బెట్టకు, సంగరమున బాఱిపోకు సరసుడవైతే, నంగడి వెచ్చము వాడకు, వెంగలితో జెలిమి వలదు వినరా సుమతీ!*

భావం: బంగారు నగలను తాకట్టు పెట్టకుము. యుధ్ధభూమినుండి వెన్నిచ్చి పారిపోకుము. దుకాణము నుండి సరుకులు అరువు తెచ్చుకొనకుము, మూఢునితో స్నేహము చేయకుము.

*బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా; బలవంత మైన సర్పము చలి చీమల చేత జిక్కి చావదె సుమతీ!*

భావం: నేను బలవంతుడను నాకేమి భయమున్నది అని చాలా మందితో నిర్లక్ష్యము చేసి పలికి విరోధము తెచ్చుకొనుట మంచిదికాదు. అది యెప్పుడూ హానిని కలిగించును. మిక్కిలి బలము కలిగిన సర్పము కూడా చలి చీమలకు లోబడి చచ్చుటలేదా?   

No comments:

Post a Comment