Saturday, October 18, 2025

 🙏🏻 *రమణోదయం* 🙏🏻

*తీవ్ర ఆత్మసాధకులు తమ మనస్సాక్షి ప్రకారం నడుచుకొంటారు. మంచివారని ఎంచి మొదట వారు కొందరితో స్నేహం చేయవచ్చు. తరువాత ఆ స్నేహ భావన చెదరిపోవచ్చు. అటువంటప్పుడు అట్టివారితో స్నేహం కొనసాగించటం కంటే, తమ అంతరాత్మ ప్రబోధానుసారం వారి నుండి తప్పుకోవటమే మంచిది.*

"నేను" వైపుకు తప్ప
మిగతా అన్ని వైపులకూ
తిరుగుతుంది మనసు.
దానికి బాగా తెలుసు
"నేను" వైపుకు తిరిగితే
తన ఉనికినే కోల్పోతానని!

 భగవంతునికి - భక్తుని
మద్యదూరం ఉంటేనే భక్తి, అనుగ్రహం
అనే మాటలు వస్తాయి.
ఇద్దరూ దగ్గరయ్యే కొద్దీ ఏకత్వం ఆవహిస్తుంది!

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏🏻🌹

🌹🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ🙏🏻🌹

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.819)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
                 
🪷🙏🏻🪷🙏🏻🪷🙏🏻

No comments:

Post a Comment