Saturday, January 10, 2026

 🌺 జ్ఞాన ప్రసూనాలు 🌺

1) అనంతమైన జీవాన్ని మనం ఈ దేహం వఱకే పరిమితం చేశాం. ఇదే జీవసమాధి.

2) తన మూలంతో తాను కనెక్ట్ అవడమే నిజమైన సత్సంగం.

3) పిల్లవాడికి అన్నం ఎప్పుడు పెట్టాలో తల్లికి తెలుసు. ఆలస్యంగా పెట్టడానికి కారణం కూడా అమ్మకే తెలుస్తుంది. భగవంతుడి అనుగ్రహం విషయం కూడా అంతే.

4) నిజమైన సమాధానం" వాచా దొరకదు. మౌనంలోనే వేదాంత రహస్యం దాగి ఉంది.

5) మనస్సు
స్వస్థితికి చేరు ప్రయాణానికే 'ఆత్మ విచారణ' అని పేరు.

6) “నేను” స్మరణ తప్ప ఇంకే స్మరణ చేసినా ప్రయోజనం లేదు.

7) నీవు భగవంతుని ముందు 'ఖాళీ' గా నిలబడు. నీవు ఋషివే.

8) ఇచ్చిన అప్పు తిరిగి వస్తే తీసుకున్నవాని బాకీ తీరినట్టు.
ఇచ్చిన అప్పు తిరిగి రాకుంటే మన బాకీ తీరినట్టు.

9) ఉన్నదానికి ఒక లెక్క కూడా ఉండదు.
లేనిదానికే 84 లక్షల లెక్కలున్నాయి.

10) సకలాన్ని మీరు ఏ భావంతో చూస్తే సకలమూ మిమ్మల్ని ఆ భావంతోనే చూస్తుంది.

11) అ తల్లి కేవలం శిశువునే కాదు శిశువుకు సంబంధించిన యావత్తు జీవితాన్ని ప్రసవిస్తుంది.

🌹🙏

No comments:

Post a Comment