Thursday, January 8, 2026

“ఒంటిపైకి బట్టలు ఎందుకు వచ్చాయి? | మన culture & social norms | History Explained | Ram C Vision”

“ఒంటిపైకి బట్టలు ఎందుకు వచ్చాయి? | మన culture & social norms | History Explained | Ram C Vision”

https://m.youtube.com/watch?v=DTAUHZRKx8E


https://www.youtube.com/watch?v=DTAUHZRKx8E

Transcript:
(00:02) నా చిన్నప్పటి నుంచి నేను బట్టల విషయంలో విన్నదాని ప్రకారం ఇప్పేయమంటే తప్పు గాని నిండుగా కప్పుకోమంటే తప్పేమి కాదు. కానీ ఈ రోజుల్లో ఇప్పటి పరిస్థితులలో బట్టల మీద జరుగుతున్న డిబేట్స్ గాని కాంట్రవర్సీస్ గాని అన్ని ఇన్ని కాదు అయినా ఈ వీడియోలో నేను కాంట్రవర్సీస్ గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ బట్టల గురించి ఫాక్ట్స్ మాట్లాడదలుచుకున్నాను.
(00:26) అసలు మొదటిగా మన ఒంటి మీదకి బట్టలు ఎలా వచ్చాయి ఎందుకు వచ్చాయి సంస్కృతి కోసమా సిగ్గు కోసమా లేక తన శరీరాన్ని రక్షించుకోవడం కోసమా బట్టలు వేసుకోమని చెప్పింది ఎవరు ఇలానే ఉండాలి అని నిర్ణయించింది ఎవరు అసలు బట్టలు ఏ విధంగా ట్రాన్స్ఫామ్ అవుతూ వచ్చాయి హ్యూమన్ ఎవల్యూషన్ లాగా ఈరోజు మనం దుస్తుల ఎవల్యూషన్ గురించి మాట్లాడుకుంటాం.
(00:50) ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీరే కామెంట్స్ లో చెప్తారు ఇప్పటి పరిస్థితులలో బట్టలు ఎలా వేసుకోవాలి అని దీనికంటే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మనిషి ఒంటి మీదకి బట్టలు వచ్చినప్పుడు సిగ్గు అనేదే లేదు వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా ఆదిమానవుల కాలంలో ఆకులతో తన శరీరాన్ని కవర్ చేసుకోవడం మొదలు పెట్టాడు మనిషి ఇది సిగ్గు కోసం కాదు సంస్కృతి కోసము కాదు ఏ దేవుడో చెప్పాడను కాదు ఈ వాతావరణంలో ఉండే ఎండ చలి వాన వేటకు వెళ్ళినప్పుడు గుచ్చుకునే ముల్లులు గాని కరిసేటటువంటి పురుగులు గాని వీటి నుంచి తన
(01:34) శరీరాన్ని రక్షించుకోవడం కోసం మొదటిగా ఆకులతో తన శరీరాన్ని కవర్ చేసుకోవడం మొదలు పెట్టాడు. ఇక్కడ సిగ్ అనేది లేదు సెక్స్ అనేది అనిమల్స్ లాగానే విచ్చలవేడిగానే ఉండేది. అయితే మనిషి ఆలోచన సామర్థ్యంతో ఇప్పటివరకు ఎవాల్వ్ అవుతూ వచ్చాడు కాబట్టి ఆ ఆలోచనతోనే వేట గాని లేదా వ్యవసాయం గాని ఏదైనా సరే ఒకరితో చేయడం అనేది కష్టతరం కాబట్టి చిన్నపాటి గుంపులుగా వ్యవసాయము వేట అనేది కొనసాగించేవారు అదేవిధంగా మానవజాతి కూడా వృద్ధి చెందుతూ ఎక్కువవుతూ వచ్చింది.
(02:12) ఈ ఎక్కువైన కారణంగా కొన్ని రకాల గ్రూపులు కొంచెం పెద్ద గ్రూపులుగా మారుతూ వచ్చాయి. ఇక్కడే అప్పటికే భూములంట ఆస్తులంట ఇలాంటి వాటిని మా తర్వాత ఎవరికి అనేది ఒక ప్రశ్న తల్లి సంరక్షణ బేబీ సంరక్షణ ఎవరు తీసుకోవాలి అనేది ఒక ప్రశ్న మొదలయింది. అంటే ఒక మనిషి బేబీ ఒక సంవత్సరం పాటు తల్లి వెంట వెళ్ళలేడు కదా మిగతా ఏ జీవుల్లో బిడ్డలైనా సరే పుట్టిన మూడు నాలుగు రోజులకే వెళ్ళిపోతాయి తల్లి వెంట.
(02:38) ఇక్కడ అలా జరగదు కాబట్టి తల్లి బిడ్డ వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడే వచ్చింది ఒక ప్రశ్న. ఈ బేబీ జన్మకు కారణమైన తండ్రి ఎవరు అనే ప్రశ్న అప్పటికే మెల్లమెల్లగా సెక్స్ చేయడం ద్వారానే బేబీ పుడుతుంది అనేది కూడా మనిషి అర్థం చేసుకోవడం మొదలు పెట్టాడు అంతకుముందు తెలిసేది కాదు పిల్లలు శృంగారం వల్లే పుట్టారు అనేది ఆ తర్వాత ఆలోచనతో స్త్రీ పురుషుల కలయక వల్లే బేబీ జన్మిస్తారని అర్థం చేసుకున్నారో కాబట్టి ఎవరి కారణం వల్ల అయితే జన్మించారో వారే ఈ తల్లి సంరక్షణ బేబీ సంరక్షణ అనేది తీసుకోవాలనేది ఒకటి పెట్టుకున్నారు. ఇక్కడ
(03:19) పెళ్లి అనే కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఒక స్త్రీ గాని ఒక పురుషుడు గాని ఒకరితోనే ఉండాలి ఒకరితోనే పిల్లల్ని కనాలి అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ ఈ నియమాలు పెట్టుకున్నప్పటికీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఒక అనిమల్ లాగానే శృంగారపరంగా ఎటాక్స్ అనేటివి జరుగుతూ వచ్చాయి. అంటే ఎవరో ఒకరి ఒకరికి సొంతమైన స్త్రీ మీద ఇంకా పరాయి పురుషులు అటాక్ చేయడము సెక్సువల్ గా ఇలా జరుగుతూ వచ్చాయి.
(03:49) ఇలా జరుగుతూ వచ్చిన కారణంగా మనిషికి ఏ కారణం చేత ఈ సెక్సువల్ అటాక్స్ జరుగుతున్నాయి అనేది కూడా ఆలోచించి అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. మనిషిని సెక్సువల్ గా ప్రేరేపించే శరీర భాగాలు ఏవో కూడా అర్థం చేసుకోవడం మొదలు పెట్టి అలాంటి భాగాలని కవర్ చేసుకుంటూ రావడం మొదలు పెట్టారు. అప్పుడు కూడా సిగ్ అనే కాన్సెప్ట్ ఇంకా మొదలవ్వలేదు. ఎప్పుడైతే తన ప్రైవేట్ పార్ట్స్ ని స్త్రీ అయినా పురుషుడైనా కవర్ చేసుకోవడం మొదలు పెట్టారో కాలక్రమేన తర్వాత సిగ్గు అనేది వచ్చింది అది ఎలా వచ్చిందో చెప్తాను కానీ అప్పటివరకు సంస్కృతి పరంగా గాని పాత కాలాలలో చరిత్రలలో శరీరాన్ని బూతులా
(04:31) కాకుండా ఇది ప్రకృతి నుంచి వచ్చిందని రెస్పెక్ట్ చేసేవారు బూతులా భావించేవారు కాదు దీని కారణంగానే మన పురాణాల్లో గాని కొన్ని గుళ్ళల్లో గాని నగ్నంగా బట్టలు లేకుండా ఉండేటటువంటి శిల్పాలు మనం చూడగలుగుతాం. అంత పవిత్రంగా భావించేవారు ఆ రోజుల్లో ఆ తర్వాత ఈ సెక్సువల్ అటాక్స్ దేని కారణంగా జరుగుతున్నాయి అనేది అర్థం చేసుకొని బట్టలని ఏ ఏ ప్రదేశాలలో కవర్ చేయాలి అనే ఉద్దేశంతో ఆలోచించేసి వాటిని కవర్ చేసుకుంటూ రావడం మొదలుపెట్టారు.
(05:03) అయితే ఎలా కవర్ చేయాలి ఎంతవరకు కవర్ చేయాలి అనేది ఎవరు పెట్టారు? అది ఒకరు పెట్టింది కాదు ఒకో ప్రాంతంలో వాళ్ళ వాళ్ళ థాట్ ప్రాసెస్ ను బట్టి వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి ఎలా ఉండాలో వాళ్లే నిర్ణయించుకున్నారు గానీ ఏ దేవుడు కాదు ఏ సంస్కృతులు కాదు ఏ సాంప్రదాయాలు కాదు ఈ పద్ధతి ఏదైతే ఉందో ఈ నియమాలతో మనిషి జీవించాలని జనరేషన్స్ కి పాస్ చేసుకుంటూ వచ్చే క్రమంలో తన శరీరాన్ని చిన్నప్పటి నుండి ఎవరికీ చూపించకుండా కప్పుకొని జీవించడం మొదలుపెట్టిన మనిషి ఒక్కసారిగా గా ఎవరైనా అప్పటివరకు కప్పుకొని ఉన్నటువంటి శరీరం ఇంకెవరైనా చూస్తున్నారు అంటే
(05:42) ఆ ఆలోచన ఏదైతే ఉందో అదే సిగ్గు అయింది. అక్కడే సిగ్గు అనేది మొదలయింది. అంటే ఇక్కడ హ్యూమన్ బ్రెయిన్ అర్థం చేసుకుందాం హ్యూమన్ బ్రెయిన్ ఎప్పుడూ కూడా కొత్తదనాన్ని చూసినప్పుడు గాని కొత్తదనాన్ని ఆలోచించినప్పుడు ఊహించినప్పుడు గానీ ఎక్సైట్మెంట్ అనేది క్యురియాసిటీ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఇది మన బ్రెయిన్ విషయంలో బేసిక్ సైన్స్ అనే ఫాక్ట్ అయితే ఈ విధంగా నా శరీరాన్ని నేను ఇన్ని రోజులు కప్పుకొనే ఉన్నాను ఏ ఇతరులు చూడలేదు ఇప్పుడే చూస్తున్నారా వాళ్ళు చూస్తారా వాళ్ళకి ఏదైనా నా శరీరం నుంచి కనిపిస్తుందా అన్న థాటే సిగ్గును క్రియేట్ చేస్తుంది. మరి ఇంకా ఫీలింగ్స్
(06:21) ని ఏది క్రియేట్ చేస్తుంది అలాగే చిన్నప్పటి నుంచి శరీరాలు ఆ సమాజంలో ఏవైతే ఉన్నాయో మనుషులందరూ పూర్తిగా శరీరాలను చూడలేదు కాబట్టి ఆ బట్టలు తీసేస్తే ఆ శరీరాలు ఎలా ఉంటాయి దీని వెనక ఏముంది ఎలా ఉంటుంది అనే ఆలోచన మొదలైనప్పుడు బ్రెయిన్ అది కొత్తదనాన్ని కోరుకుంటుంది కాబట్టి క్యూరియాసిటీ అనేది పెరుగుతుంది. సో ఇక్కడి నుంచినే సిగ్ అనేది నగ్నంగా చూసినప్పుడు త్రిల్ అనేది డెవలప్ అవ్వడం మొదలయ్యాయి.
(06:52) మరి బట్టలు ఇలానే వేసుకోవాలి వీటికి చట్టాలను ఎప్పుడు అంటగంటారు బట్టలు ఇలా వేసుకుంటే తప్పు ఇలా వేసుకుంటే కరెక్టు ఈ బట్టల ప్రభావం సమాజం మీద ఎంతవరకు పడుతుంది ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఎలా వచ్చాయి అంటే సమూహాలు ఏవైతే ఉన్నాయో గ్రూపులు అవన్నీ పెరగడం మొదలయ్యాయి. ఆ తర్వాత మనిషి ఆలోచనతో పరికరాలను కనుక్కుంటూ ముందుకు వెళ్తున్నాడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సరుకులు లాంటివి ఎక్స్పోర్ట్ చేయడమో చిన్న చిన్న వ్యాపారాలు ఇలాంటివి తెలివిగా ఆలోచించి మొదలుపెట్టాడు అలా మొదలుపెట్టిన కారణంగా ఒక ప్రాంతంలోకి ఇంకో ప్రాంతం ప్రజలు రావాల్సిన పరిస్థితి రావడం అదేవిధంగా ఒకరి కల్చర్ ని ఇంకొకరు అర్థం
(07:34) చేసుకొని ఆలోచించి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడం ఈ విధంగా రకరకాల మార్పులు కూడా జరుగుతాయి రావడం జరిగింది. ఇది ఏ ఒక్కరి ప్రభావం కాదు దేవుడు పెట్టినది అంతకంటే కాదు. అయితే ఈ బట్టల విషయంలో స్త్రీకి మాత్రమే ఎందుకు ఇంత నియమ నిబద్ధనలు ఉన్నాయి అని అంటే ఎప్పుడైతే పెళ్లి అని కాన్సెప్ట్ వచ్చిందో అప్పుడే స్త్రీ యొక్క శరీరాన్ని కుటుంబ గౌరవంతో ముడి పెట్టేశారు. లింక్ చేశారు.
(08:02) స్త్రీ ఎప్పుడూ కూడా తన అందంతోనే తన శరీర నియమాలతోనే పురుషుని ఆకర్షిస్తుంది. కానీ స్త్రీ పురుషునికి ఎప్పుడు పడుతుంది అందంతో కాదు తన బలంతో తన తెలివితో తనకున్న స్కిల్ తో అట్రాక్ట్ అవుతుంది ఎందుకు ఎందుకంటే ఇప్పటి రోజులలో అంటే ఇలా సాగుతుంది కానీ ఆ రోజుల్లో స్త్రీని పోషించడానికి బలం అవసరం వేట సంపాదించడం బయటిక వెళ్లి ఫుడ్డు ను సంపాదించి తీసుకురావడం అనే విషయంలో బలము శత్రువులతో తలబెడేటటువంటి దమ్ము లాంటివి అవసరం కాబట్టి స్త్రీ పురుషునిలో బలాన్ని దమ్ముని స్కిల్ ని చూసి అట్రాక్ట్ అయ్యేది అందువల్లనే ఇక్కడ స్త్రీ నుంచి తన అందం అనేది ది ముఖ్యమైనదిగా భావించి ఆ అందానికే
(08:49) ఇతరులు అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఆ అందాన్ని కవర్ చేసుకోవాలి భర్త మాత్రమే చూడాలి ఇతరులకు చూపించకూడదు అనే విషయం నుండి స్త్రీ యొక్క అందాన్ని కుటుంబ గౌరవంగా భావించి వాళ్ళకే కొంచెం ఎక్కువగా నిబంధనలు పెట్టారు. అయితే ఇక్కడ స్త్రీ అనిచివేత జరగలేదా అంటే డెఫినెట్ గా జరిగింది బట్టల విషయంలో అనేదే కాదు గానీ చాలా కాలం పాటే స్త్రీ అనిచివేతకు గురైంది ఇది మనందరం ఒప్పుకోవాల్సిన విషయం అదంతా వేరే సబ్జెక్టు గాని అలా అనిచివేతకు గురైన సమయంలో బట్టల గురించి కూడా నియమాలు అనవసరమైనటివి వారికి ఇష్టం లేకుండా తగిలిచ్చినటువంటివి ఖచ్చితంగా ఉండే ఉంటాయి దాన్ని పూర్తిగా
(09:30) కాదనడానికి లేదు ఈ రోజుల్లో స్త్రీ కూడా స్వేచ్ఛ కోరుకోవడం తప్పేమీ కాదు కానీ ఒక విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి స్వేచ్ఛ అంటే ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు నిన్ను వదిలేయడమా నా ఇష్టానికి నన్ను వదిలేయడమా కాదు మనం సమాజంలో బతుకుతున్నాం మనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకొని నియమాలు నిబంధనలు పెట్టుకొని బతుకుతున్నాం.
(09:52) వాటిని గౌరవిస్తూ వాటిని రెస్పెక్ట్ చేస్తూనే మన స్వేచ్ఛని మనం అనుభవించాలి అదే సరైన విధానం హ్యూమన్ లైఫ్ మొత్తము సెక్స్ చుట్టూ డబ్బు చుట్టూనే తిరుగుతుంది కాబట్టి మనిషి తన దగ్గర ఉన్న డబ్బును దొంగల నుంచి కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే కొంతమంది కామాందుల నుంచి స్త్రీ అయినా సరే తన శరీరాన్ని రక్షించుకోవడానికి కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే మరి ఎంతవరకు తీసుకోవాలి ఈ నియమాలు ఎవరు పెడతారు ఎవరు పెడతారు అంటే ఉదాహరణకి చెప్తా నా ఇంటికి వాకిలి లేదు నా ఇంట్లో కొంత డబ్బు ఉంది.
(10:32) అనేది ఒకటి నా డబ్బులు తీసుకెళ్లి నేను ఒక బ్యాంకులో భద్రపరిచాను జమ చేశాను అనేది ఒకటి ఈ రెండు చోట్ల నేను ఎక్కువగా ఎక్కడ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు బ్యాంకులో అయితే సేఫ్ ఎందుకంటే దానికి ఒక సెక్యూరిటీ మన డబ్బులకు గ్యారెంటీ లాంటివి ఇస్తారు కాబట్టి నేను రిలాక్స్ అవ్వచ్చు బ్యాంకులో డబ్బు పెట్టినప్పుడు అదే నేను ఇంట్లో పెట్టినప్పుడు నా ఇంటికి తలుపులు కూడా సరిగా లేవు నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు దొంగలు పడి దోచుకునే అవకాశం ఉంది.
(10:59) సో ఇప్పుడు నేను ఎప్పుడు ఎలా ఉండాలి? బ్యాంకులో నా డబ్బులు ఉన్నప్పుడు నేను కొంచెం ఎలా ఉన్నా పర్వాలేదు కానీ నా స్వేచ్ఛతో నేను అంత జాగ్రత్తగా ఉండకపోయినా నా ఇంట్లో డబ్బులు పెట్టుకొని ఉన్నప్పుడు మాత్రం నేను జాగ్రత్తగా ఉండాలి ఎందుకు దొంగలపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇంతే మనం ఉన్న సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రజల యొక్క మైండ్సెట్స్ ఎలా ఉన్నాయి మన చట్టాలు ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మన డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఉండడం అవసరం.
(11:27) కొన్ని ప్రదేశాలలో వెస్టర్న్ కల్చర్ కొంచెం బాగా అలవాట అయినప్పుడు స్త్రీలు కొంచెం అర్ధనగ్నంగా బయటిక వచ్చినా సరే పురుషులు రెచ్చిపోరు ఎందుకు వాళ్ళ మైండ్లు అలా ప్రిపేర్ అయిపోయి ఉంటాయి ఇది కామన్ అని వాళ్ళంత ఎక్సైట్ అవ్వరు. అలా కాకుండా కొన్ని ప్రదేశాలలో నిండుగా బట్టలు వేసుకొని ఉన్న స్త్రీల మధ్యలో పెరిగిన పురుషులు కొంతమంది అర్ధనగ్నంగా ఎవరినైనా చూసినప్పుడు వీళ్ళు రెచ్చిపోతారు.
(11:51) ఇది సైకాలజీ ఇది బ్రెయిన్ చేసే విధానం వాళ్ళ ఆలోచన విధానం లేదు నాకు స్వేచ్ఛ ఉందనేసి అర్ధనగ్నంగా వాళ్ళలోకి వెళ్తే వాళ్ళ దృష్టి ఆబవియస్లీ మన వైపే మలుతుంది. ఇది మినిమం కామన్ సెన్స్ అని నా ఉద్దేశం. అంతేగానీ ఎవరి స్వేచ్ఛను హరించడం ఎవరి ఉద్దేశము కాదు ఏ మనిషికైనా సరే బట్టల విషయంలోనే కాదు దేంట్లో అయినా సరే స్వేచ్ఛ అనేది చాలా అవసరం బట్టలు వేసుకోవడం అనేది స్వేచ్ఛ సాంప్రదాయాలను ఫాలో అవ్వడం అనేది స్వేచ్ఛ అభిప్రాయాలను తెలియజేయొచ్చు ఏదైనా సరే అనేది స్వేచ్ఛ ఈ మూడు స్వేచ్ఛలు ఇచ్చేది ఉదాహరణకి ప్రభుత్వాలే అనుకుందాం చట్టాలే అనుకుందాం ఇవన్నీ కల్పించినప్పుడు
(12:32) వారు వాళ్ళ స్వేచ్ఛ ఆధారంగానే అనే జీవిస్తున్నప్పుడు ఈ రోజుల్లో మన సమాజంలో జరుగుతున్న రేప్స్ అత్యాచారాలు ఇలాంటివి జరుగుతున్నాయని మనం వింటున్నాము. ఇలా చేయడం తప్పు అనే కొన్ని నిబంధనలు చట్ట ప్రకారం ఉన్నప్పుడు జనాలలో ఎందుకు భయం కలగడం లేదు అనేది కూడా ఒక ముఖ్యమైన పాయింటే ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి ఎవరైతే చట్టాలు పెట్టారో వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ చట్టాలను కఠినంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే జనాలలో ఎందుకు ఇంకా రేపు లాంటివి జరుగుతూనే ఉన్నాయి వాళ్ళు ఎందుకు భయపడడం లేదు అనేది కొన్ని ఫ్యాక్టర్స్ అయితే
(13:12) మానసిక స్థితి కూడా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. అంతేగానీ అర్ధనగ్నంగా వస్తే మేము రెచ్చిపోతాం మీ మీద పడి ఏమైనా చేసేస్తామ అనేదానికి లేదు అది తప్పు అలాగే మేము మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాము మీ మైండ్ సెట్లు మీరు మార్చుకోవాలి అనేదానికి కూడా లేదు. అది కూడా తప్పే ఎందుకు ఒక ఈరోజు మానవుడు అంతరిక్షంలోకి ఎంతో దూరం వెళ్ళగలుగుతున్నాడేమో గానీ తన బ్రెయిన్ లో ఎగజాక్ట్ గా ఏం జరుగుతుంది అనేది ప్రాపర్ గా 1% కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు.
(13:43) అలాంటిది మైండ్ సెట్ లని మార్చడం అంత ఈజీనా రకరకాల ప్రాంతాలలో నివసించే వారి మీద రకరకాల ప్రభావాలు పడి ఉంటాయి. వాటి కారణంగా రకరకాలుగా బిహేవ్ చేస్తారు మనుషులు అదేమో అంత ఈజీ కాదు. అలాగే అర్ధనజ్ఞంతో చూసిన ఏ పురుషులైనా సరే మేము రెచ్చిపోతాం అనేది కూడా చాలా చాలా పెద్ద తప్పు మనం సమాజంలో ఉంటున్నాం మన సమాజంలో కొన్ని నియమాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి వాటిని ఫాలో అవ్వాల్సిందే విచ్చలవిడతనం అనేది స్త్రీలకైనా పనికి రాదు పురుషులకైనా పనికి రాదు మనకు స్వేచ్ఛ అనేది కచ్చితంగా కావాలి అలాగే సంప్రదాయాలు కావాలి ఇవి రెండు కూడా హెల్తీ గా ఉండాలి మన
(14:22) పరిస్థితులను బట్టి మనం మార్చుకుంటూ వెళ్ళాలి అనేది ఇది నా అభిప్రాయం సో ఈ మధ్యకాలంలో జరుగుతున్న కాంట్రవర్సీస్ మీద ఈ వీడియో చూసిన తర్వాత మీ ఆలోచన ఏంటి అనేది ఖచ్చితంగా కింద కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఫాక్ట్స్ సైన్స్ ఫిక్షన్ లాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు రావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment