9 things you should never tell anyone #9 #secrets #dont #share #astrology #religion #telugu #vira...
https://youtube.com/shorts/9wFIPf5lGYM?si=UhyPoNDIXlhaS_hS
https://www.youtube.com/watch?v=9wFIPf5lGYM
Transcript:
(00:00) జై శ్రీరామ్! మానవుని జీవితంలో కొన్ని విషయాలని రహస్యంగా, గోప్యంగా ఉంచుకోవాలి అని చెప్పి ముఖ్యమైనవిగా తొమ్మిది తీసుకొని ఆ తొమ్మిది రహస్యాలు ఎవరికీ చెప్పకూడదు అని చెప్పి శాస్త్రం చెప్పి ఉన్నది అవి ఏంటో తెలుసుకుందాం. మొదటిది ఆయువు అంటే వయస్సు వయసు ఎవరికీ చెప్పకూడదు. దృష్టి దోషాలు తగిలి ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
(00:20) దాని వల్ల వయస్సు ఎవరికీ చెప్పకూడదు. రెండవది ధనం. మన ధనం గురించి ఎవరికీ చెప్పకూడదు. ధనం ఎక్కువగా ఉందనుకోండి అప్పులు అడుగుతూ ఉంటారు ఆ అప్పులు ఇవ్వడం ద్వారా శత్రువులను కొని తెచ్చుకుంటాం లేదు ధనం లేదనుకోండి అసలు మనకు విలువ అనేది ఉండదు అన్నమాట ఈ కలియుగంలో ధనం మూలం మిధు ధనం తోటే ఇదంతా కూడా నడుస్తూ ఉంది కాబట్టి ధనం గురించి ఎవరికీ చెప్పకూడదు మూడవది ఇంటి గుట్టు అంటే ఇంట్లోని విషయాలు ఎవరికీ బయట వాళ్ళకి చెప్పకూడదు కొంతమంది ఉంటారు ఇంట్లో విషయాలన్నీ కూడా బయటకి చెప్తూ ఉంటారు అది చుట్టాలైనా సరే స్నేహితులైనా సరే ఇంట్లోని గుట్టు ఎవరికీ చెప్పకూడదు
(00:50) ఎవరి ఇంట్లోది వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. ఇక నాలుగవది మంత్రం గురువుగారు ఉపదేశించిన మంత్రం ప్రతినిత్యం అనుష్టించే మంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు. ఇప్పుడు చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో ఆ ఉపాసకుడు ఈ ఉపాసకుడు హనుమాన్ ఉపాసకుడు అని చెప్పుకుంటూ ఉంటారు అవి ఏవి చెప్పకూడదు. తను అనుష్టించే మంత్రం ఎప్పుడూ కూడా గోప్యంగా ఉండాలి.
(01:06) బయట వాళ్ళకి ఎవరికీ ఇయాల్సిన అవసరం లేదు అనుష్టానపరుడు అని చెప్పేసి తనకి తాను చేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా నేను ఈ ఉపాసన చేస్తాను ఈ మంత్రం ఉంది ఇది ఉంది అని చెప్తే వాళ్ళు చేసే అనుష్టానం మొత్తం వ్యర్థమైపోయినట్లే అవేవి డిగ్రీలు కాదు పక్కన పేరు పక్కన తగిలించుకోవడానికి అలా చెప్పారు అంటే వాడికి ఏమీ రాదు అని అర్థం అన్నమాట కాబట్టి మనం అనుష్టించే మంత్రం మనం చేసే పూజ ఎవరికీ బయట వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు చెప్పకూడదు.
(01:26) ఇక ఐదవది ఔషధం అంటే మనం రోజు వేసుకునే మాత్రలు మనం తీసుకునే ఔషధాలు అవి కూడా ఎవరికీ చెప్పకూడదు. నాకు ఈ జబ్బు ఉంది లేదా ఈ జబ్బు చేసింది నేను ఈ టాబ్లెట్స్ వాడుతున్నాను అవి వాడుతున్నాను అని చెప్పి ఎవరికీ చెప్పకూడదు. చెప్పడం వల్ల మనలో ఉన్న రోగాలన్నీ కూడా బయట వాళ్ళకి తెలిసిపోయి చులకన అయిపోతాం. ఇప్పుడు రోగాలు లేని వాళ్ళు ఎవరూ లేరు అనుకోండి కానీ ఔషధాల గురించి మాత్రల గురించి బయట ఎవరికీ చెప్పకూడదు అని చెప్పి శాస్త్రం.
(01:47) ఇక ఆరో దానికి వస్తే సంగమం అంటే శృంగారం భార్య భర్తలు ఇద్దరు కలిసిన విషయాన్ని బయట వాళ్ళకి ఎంత స్నేహితులైనా గాని లేదా ఎంత చుట్టాలైనా గాని భార్యాభర్తల ఇద్దరి మధ్య జరిగే శృంగారాన్ని మాటల్ని ఎవరికీ చెప్పకూడదు ఎవరితో పంచుకోకూడదు అని శాస్త్రం చెబుతుంది. తర్వాత ఏడవది దానం మనం చేసే దానం ఎడం చేతికి కూడా తెలియకుండా చేయాలి అని చెప్పి శాస్త్రం కొంతమంది ఒక పది రూపాయలు వేసి నేను ఆ దానం చేశాను ఈ దానం చేశాను అందరికీ చెప్పుకుంటూ ఉంటారు.
(02:12) ఆ చెప్పడం వల్ల ఆ చేసిన దానం పుణ్యం రాకపోగా పాపం వస్తుంది. కాబట్టి మనం చేసే దానం ఎవరికీ చెప్పకూడదు ఎవరికీ చెప్పకుండా గోప్యంగా చేయాలి తర్వాత ఎనిమిదవది మన శరీరం మన శరీరాన్ని బహిర్గతం చేయకూడదు అంటే బట్టలు లేకుండా చిన్న చిన్న బట్టలు వేసుకుంటూ అలాగ ఎవరికీ కనిపించే విధంగా ఉండకూడదు మన శరీరాన్ని వీలైనంత వరకు దుస్తులతోటి కప్పి ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక తొమ్మిదవది అవమానం మీకు జరిగిన అవమానం ఎక్కడా చెప్పకూడదు ఒకవేళ మనిషి అన్నవాడు తప్పులు చేస్తూ ఉంటాడు పొరపాట్లు చేస్తూ ఉంటాడు అది మానవ సహజం మానవ నైజం కాబట్టి ఆ విషయాన్నీ బయట ఎక్కడా
(02:42) చెప్పుకోకూడదు ఒకవేళ చెప్పామంటే చులకన అయిపోతాం కాబట్టి కాబట్టి ఈ తొమ్మిది విషయాలు రహస్యంగా గోప్యంగా ఉంచాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది.
No comments:
Post a Comment