అమ్మాయిలు తృప్తి పడరు
ఓ సంస్థ వినూత్నంగా స్వయం వరం ఏర్పాటు చేసింది. అయిదంతస్తుల భవనంలో ఐదు రకాలుగా పురుషులను విభజించి, అంతస్తుకు కొందరి చొప్పున ఉంచారు. అమ్మాయిలు వచ్చి, వాళ్ళకు నచ్చిన వరుడిని ఎంపిక చేసుకోవచ్చు. కాకపోతే ఒకసారి ఓ అంతస్తు దాటి వెళ్లాక, మళ్లీ కిందికి దిగడానికి వీల్లేదు. అదీ షరతు.
ఆ కార్యక్రమానికి సుచరిత కూడ వెళ్ళింది. మొదటి అంతస్తులో-వీళ్ళందరూ అందగాళ్ళు. బోర్డు కనిపించింది. అక్కడ చూస్తే ఒకరిని మించి ఒకరు అందంగా ఉన్నారు.
సరే, రెండో అంతస్తులో ఎవరున్నారో చూద్దామన్న కుతూహలంతో-పైకి వెళ్ళింది వీళ్ళందరూ అందగాళ్ళు, మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. బోర్డు కనిపించింది.
మూడో అంతస్తుకు చేరుకుంది. వీళ్ళందరికీ ఉద్యోగాలున్నాయి. మంచి అందగాళ్ళు. ఇంటి పనిలో కూడా సాయం చేస్తారు. అన్న బోర్డు కనిపించింది. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నాలుగో అంతస్తులో ఇంకా మంచి వాళ్ళుంటారేమోనని అక్కడికి చేరుకుంది. అక్కడ వీళ్ళు అందగాళ్లూ, మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఇంటిపనుల్లో సాయం చేస్తారు. భార్యను ప్రేమగా చూచుకుంటారు రాసుంది బోర్డుమీద. అయినా సుచరితకు ఐదో అంతస్తులో ఎలాంటి వారున్నారో చూడాలనిపించి ఎక్కింది.
గమనిక:- ఇక్కడికి వచ్చిన వారిలో మీరు తొమ్మిది వేల నూటా ఎనిమిదవ వారు. ఇక్కడ అబ్బాయిలు ఎవరూ లేరు. "ఆడవాళ్ళను సంతృప్తిపరచడం కష్టం". బోర్డు వ్రాసుందక్కడ.
246
Book reference - Manavatha Viluvalu Page No: 246.
Manavatha Viluvalu book is uploaded to archive.org web and book link - https://archive.org/details/manavatha-viluvalu
Manavatha Viluvalu book Pdf download link - https://archive.org/download/manavatha-viluvalu/Manavatha%20Viluvalu.pdf
No comments:
Post a Comment