☘️🌿🔔🌿☘️
*జీవి... ఉనికి.....!*
*మన కళ్ళు ఉన్నట్లు మనకి తెలియాలంటే అద్దం కావాలా.. ?*
*’మనం ఉన్నట్లు మనకి తెలియటానికి ఏ ఆధారం కావాలి..?’ అని భగవాన్ శ్రీ రమణమహర్షి వారు ఒక సారి ప్రశ్నించారు.*
*ఆత్మను తెలుసుకోవటం అంటే ఆత్మగా మనం ఉండటమేనని మహర్షి చెపుతారు.*
*బాహ్య వస్తువులు అన్నిటినీ ఇంద్రియాల ద్వారా తెలుసుకోవటానికి అలవాటుపడి ఆత్మని, దైవాన్ని కూడా అలాగే తెలుసుకోవాలని చూస్తున్నాం. దీన్నే సాపేక్ష జ్ఞానం అంటారు.*
*మనని మనం ఇప్పుడు దేహం అనుకుంటున్నాం. అందుకే ఆత్మను గురించి ప్రశ్నిస్తున్నాం, వెదుకుతున్నాం.*
*’దేహాన్ని నడిపే మనసుగా, మనసును నడిపే చైతన్యంగా, చైతన్యానికి మూలమైన ఆత్మగా మనని మనం తెలుసుకున్న రోజు ఈ ప్రశ్నరాదు!’*
*మన ఉనికి మనకి తెలుస్తుంది. మనని (శరీరాన్ని) జీవింపజేసేది, మరణింప జేసేది ఎవరో అదే మన ఉనికి. ఈ సృష్టిలోని ప్రతిప్రాణి నిజ స్వరూపం ఆ ఉనికే..!*✍️
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment