Chaganti's harsh words about women's attire, what will happen to women's culture? The greatness o...
https://youtu.be/fiDFeMbZgZQ?si=MNDn1tKS45gb1e5u
https://www.youtube.com/watch?v=fiDFeMbZgZQ
Transcript:
(00:00) కళ్ళ ముందు కనపడకూడనివన్నీ వీధుల్లో కనబడుతుంటాయా పిల్లలకి స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఏది చూడాలంటే అది చూసే అధికారమా వినపడకూడని మాటలన్నీ వినపడుతుంటాయా మాధ్యమాల్లో పిల్లలు మాత్రం సంస్కారయుతంగా ఉండాలా రామాయణం చెప్పకూడదా భాగవతం చెప్పకూడదా పోతన గారి గురించి చెప్పకూడదా సుందరకాండం వాళ్ళు వినకూడదా పిల్లలు మంచివాళ్ళు కమ్మంటే ఎలా అవుతారు నీకు ఎందుకన్ని మెసేజ్లు నీకు ఎందుకు సెల్ ఫోన్ ఒకటి దగ్గర ఉంటే అందులో లో ఇవ్వాళ యావత్ ప్రపంచాన్ని చూడొచ్చు ఇంకా పరిణితి పొంది ఏది చూడవచ్చో ఏది చూడకూడదో ఏది వినొచ్చో ఏది వినకూడదో ఏది మాట్లాడొచ్చో
(00:41) ఏది మాట్లాడకూడదో ఎవరితో అంట కాగచ్చో ఎవరితో కూడకూడదో తగినంత పరిణితితో నిర్ణయం చేసుకోవడం చేతకాని విద్యార్థి చేతిలో సెల్ ఫోన్ లాంటి వస్తూ ఉంటే అది శీల భ్రంశానికి దారి తీస్తుంది తప్ప ఎక్కడో ఎవరో ఆ నిగ్రహ శక్తి ఉన్నవాడు తప్ప కోట్ల కోట్ల మందిలో ఏ ఒక్కడు దాన్ని సక్రమంగా వినియోగించుకోగలుగుతాడు జుట్టు చివర ముడి లేకుండా జుట్టు విప్పుకొని ఉందనుకోండి శోకము దరిద్రము ఆవహిస్తాయి ఆ ఇంటిని మీరు నన్ను మన్నించగలిగితే ఒక్క మాట చెప్తాను ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది లోకంలో ఉండేటటువంటి జాజ్యములన్నీ అంకురించడం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని చెప్పారంటే
(01:24) స్త్రీ కేశపాశం జట కింద వేసుకోవడం కబరీ బంధం వేసుకోవడం మానేసి మగవాడిలా కత్తిరించుకొని విరజిమ్ముకు తెరవడం మొదలు పెట్టిన తర్వాత లోకాలకి ఉపద్రవాలు మొదలవుతాయి అని చెప్పారు పరిలక్షణం బాహ్య సౌచ్యం అనేటటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటి విశేషం ఆ బాహ్య సౌచ్యం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అనేది చేత కాకపోతే భగవంతుడు ఇచ్చినటువంటి ఇంత అపూర్వమైనటువంటి శరీర నిర్మాణ వ్యవస్థ నిరుపయోగం అయిపోతుంది.
(01:59) చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్తి, శుక్ల, మేధా, అనబడేటటువంటి ఏడు పదార్థాలతో భగవంతుడు ఇంత దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి శరీరాన్ని మనకి ఇచ్చాడు. ఈ శరీరానికి నిజమైన అందం ఏది అంటే శుభ్రంగా ఉండడం. అందము అన్న మాటకి ప్రత్యేకమైన నిర్వచనం లేదు ఒకరికి అందంగా కనపడిన వస్తువు వేరొకరికి కూడా అందంగా కనపడాలి అని లేదు. ఒక వయసులో అందంగా కనపడినది వేరొక వయసులో అందంగా ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాదు ఒక స్త్రీ సౌందర్యాన్ని ఎవడు మెచ్చుకోవాలో వాడు మెచ్చుకోవాలి తప్ప నిష్కారణంగా ఒక ఆడదాని అందాన్ని అర్థం లేకుండా అధికారం లేకుండా పొగడడం కూడా ఎంత తప్పో రామాయణం చదువుకొని అర్థమైన జాతి
(02:46) జాతి అది అర్థమైతే అసలు వేరొక స్త్రీని నిష్కారణంగా పొగడడం అన్న జోలికి వెళ్ళాలి అంటే మీరు ఒక్కటి గమనించండి నోరు ఉంది కదా అని వదరి ఒక ఆడపిల్లతో మాట్లాడడం తేలిక కానీ ఆ పిల్ల మనసులో ఎంత పరివేదన పడుతుందో ఎంత భయపడుతుందో వీడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని తల్లిదండ్రులకు చెప్పుకోలేక అన్నదమ్ములకు చెప్పుకోలేక స్నేహితులకు చెప్పుకోలేక చదువు మీద దృష్టి పెట్టలేక ఎంత పరివేదన పొందుతుందో ఆ హింస మనని కట్టి కుడపదా అలా మాట్లాడొచ్చా ఆడపిల్లని చూస్తే లక్ష్మీదేవిని చూసిన నీ మనసుని ఎందుకు మరల్చుకోలేవు రాముడిగా ఎందుకు బ్రతకలేవు రామాయణ ప్రబోధం జరగకుండా పిల్లల్లో
(03:30) సంస్కృతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది మృగుడు కాల్వలో నీరు త్రాగించి పాచిపోయిన అన్నం పెట్టి ఆరోగ్యంగా ఉండమంటే ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి ఆరోగ్యంగా ఉంటారు ఈ జాతిలో స్త్రీ వైశిష్ట్యం ఏమిటంటే కొంతమంది ధూర్తులైన పురుషులు ఉంటారు రాత్రి మాదక ద్రవ్యం సేవించి ఉన్మత్తత కలిగించే పదార్థాన్ని సేవించి వచ్చి పశువుని కొట్టినట్టు భార్యని కొట్టేటటువంటి దూర్తులైనటువంటి పురుషులు ఉంటారు అలా కొట్టి నిద్రపోతే ఆమె మాత్రం నిద్ర లేచి మంగళ సూత్రాలు కళ్ళకత్తుకొని ఆఖరిన ఆయన చేతిలో ప్రాణం వదలాలని కోరుకుంటుంది అంతకన్నా ఆర్ద్రత కలిగినటువంటి మనసున్న ప్రాణి ఈ సృష్టిలో
(04:12) ఇంకొకరు ఉంటారా అటువంటి స్త్రీ మీద చెయ్యి చేసుకున్న పురుషుడు ఎంతటి అధమాధముడు అవుతాడు అది నేర్చుకోవలసిన విధానం అది స్త్రీల యొక్క గొప్పతనం అది తెలుసుకున్ననాడు సమాజంలో శాంతి పరిడవిందులుతుంది ఎందుకు గౌరవించాలో తెలుస్తుంది. నిద్ర లేచినది మొదలు తన తోబుట్టువల కోసం అని చెప్పి వాళ్ళ అభ్యున్నతి కోసంఅని ప్రవర్తించడం ఆ పిల్లకి సహజంగా అలవాటుగా వచ్చింది.
(04:41) వీడికి అలా వస్తుందని నమ్మకం లేదు. వీడికి సంధ్యావందనం పెట్టలేదు అనుకోండి వీడు ఎక్కడో కూర్చుని అక్కర్లేని విషయాన్ని దీన్నో ఎంచుకుంటాడు తప్ప తాను కూడా అలా చేయడానికి సిద్ధపడతాడు అని చెప్పడం అంత తేలికైన విషయం మాత్రం కాదు అందరూ అలా ఉండకపోవచ్చు కానీ అందరూ అలా ఉంటారని చెప్పడం మాత్రం తేలిక కాదు అంత కష్టపడి నిద్ర లేచినప్పటినుంచి సంస్కారవంతమైనటువంటి మనసుతో ఆ పిల్ల తల్లి గురించి ఆలోచిస్తోంది తండ్రి గురించి ఆలోచిస్తోంది అన్నదమ్ముల గురించి ఆలోచిస్తోంది అక్క చెల్లెళ్ల గురించి ఆలోచిస్తోంది ఇంటి శుభ్రత గురించి ఆలోచిస్తోంది తాను కష్టపడి
(05:19) ఇతరులకు సౌకర్యం చేయాలని చూస్తోంది సంస్కారమును పొంది ఉండలేదా సంస్కారమును పొంది ఉన్న పిల్లకి ఇంకా మళ్ళీ ఉపనయన సంస్కారం చేసి గాయత్రి చేసుకో అని చెప్పవలసిన అవసరం ఎక్కడఉంది ఇంకా అందుకే ఈశ్వరుడు ఉపనయనాన్ని విధించలేదు నేను పరమ సత్యాన్ని మనవి చేస్తున్నా మీకు ఇక ఉపనయనం చేసి ఆ పిల్లని గాయత్రి చేయమని చెప్పవలసిన అవసరం లేదని చెప్పాడు అదే పురుషుడు అనుకోండి మనసుని సంస్కరించడానికి యజ్ఞోపవీతం వేసి వాడిని ప్రతిరోజు మూడు పూట్ల సంధ్యావందనం చేసి గాయత్రి చెయ్ సూర్యుని స్తోత్రం చెయ్ అని నిబంధన విధించారు. అసలు ఆడపిల్ల అనడంలోనే ఆ గౌరవం
(06:01) ఉంటుంది అందులో తెలుగులో మనం ఆడపిల్ల ఆడపిల్ల ఆడది అంటూ ఉంటాం. ఆడది అన్న మాట కానీ ఆడపిల్ల అన్న మాట కానీ తక్కువ చేయడం కాదు ఎవరో ఎక్కడో తక్కువతనానికి వాడితే ఆ మాట తక్కువ అవుతుందా ఎవడో ధూర్తుడు గోవుని నింద చేశాడు ఒక ధూర్తుడు గోవుని నింద చేసి మాట్లాడితే గోవు అన్న మాటకు గౌరవం తగ్గుతుందా ఆడది అన్న మాటని ఎవడో చులకనగా వాడినంత మాత్రం చేత ఆ మాటకు గౌరవం తగ్గుతుందా ఆ మాట గౌరవం ఏమిటో అర్థం చేసుకోవాలి ఆడపిల్ల అన్న మాటకు అర్థం ఏమిటో ఏటంటే ఈడ పిల్ల కాదు అని అర్థం ఈమె ఇక్కడ ఉండదు ఇక్కడే ఉండిపోయేవాడు అనుకోండి మగపిల్లవాడు ఇక్కడ ఉండడు ఇక్కడ ఉండదు ఈ
(06:47) పిల్ల ఇక్కడ పుట్టింది అక్కడికి వెళ్ళిపోతుంది ఆడ అంటే తెలుగులో అక్కడ ఆడపిల్ల ఈ పిల్ల ఇక్కడ ఉండదు ఆడ అక్కడ ఉంటుంది. అక్కడ నా స్వస్థానం అని చెప్తుంది అది నా ఇల్లు అంటుంది ఇది నీ ఇల్లు అంటుంది ఒక రోజున అలా అనగలిగిన త్యాగమూర్తి అంటే ఇక్కడ పుట్టి అక్కడ కిందకి వెళ్ళిపోతుంది ఆమె లక్ష్మి ఆమె నారాయణుని వెతుక్కుంటుంది విత్యానపాయిని ఆమె నారాయణమూర్తి ఎక్కడున్నాడో చూసుకుంటుంది అందుకే కన్యాదానం చేసేటప్పుడు తన బిడ్డని లక్ష్మీ స్వరూపంగా భావన చేసి పద్మంలో కూర్చోపెడతారు గుట్టలో ధాన్యం పోసి కూర్చోపెట్టారు అంటే పద్మంలో లక్ష్మీదేవి ని కూర్చోపెట్టినట్టు
(07:28) వరుడు పీటల మీదకి నడిచి వస్తాడు వధువు నడిచి రాకూడదు ఎందుకంటే ఆమె లక్ష్మి కనుక బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు ఎత్తి తీసుకొస్తారు ఎందుకు తీసుకొస్తారు అంటే తెలుగునాట ఒక ఆచారం ఉంది అక్క చెల్లెలకి ఆడపిల్ల పుట్టింది అనుకోండి ఆమె యొక్క అన్నదమ్ములకి సహజంగా కూడా వరస అవుతుంది అందుకని ఒరేయ్ నీకు భార్య పుట్టిందిరా అంటారు.
(07:54) ఈమెని లక్ష్మిగా చూశం ఈమె నారాయణుని చేరుతోంది నేను మేనమామని కదా అని ఎప్పుడూ కూడా ఈమెని నా భార్య అన్న భావనతో నేను చూడలేదు అని చెప్పడానికి మేనమామ పంచ కట్టుకొని ఉత్తరీయం వేసుకొని లక్ష్మిని నారాయణుడికి చేరిస్తున్నానని బుట్టలో ఎత్తి పీటల మీద తీసుకొస్తారు. అంత పవిత్ర భావనతో తీసుకొచ్చాడు కనుక మగపెళ్లివారు బట్టలు పెడతారు బట్టలు పెట్టడం అంటే అంచు కలిగినటువంటి పంచల చాపిస్తారు అది ఆయుర్దాయ కారకం నీవంటి ఉత్తమ సంస్కారవంతుడు దీర్ఘాయుద్దాయాన్ని పొందాలని బట్టలు పెట్టి పంపిస్తూ ఉంటారు అదిగో ఆ ప్రక్రియ ఎంత పవిత్రమైనదో మీరు ఆలోచించండి అందుకే ఆ పిల్ల ఆడపిల్ల
(08:38) ఆడపిల్ల అంటే ఆ పిల్ల లక్ష్మి ఆమె నారాయణ మూర్తిని వెతుక్కు ని వెళ్ళిపోతుంది అసలు లోకంలో సహజంగా పురుషుడి యందు ఎప్పుడూ ఒక భావన ఉంటుంది. తాను ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉండాలని తాను అక్కడ మేడ కట్టాలని తాను తన తల్లిదండ్రులతో ఉంటాడు అక్క చెల్లెళ్ల దగ్గరికి వెళతాడు ఇంటికి పిలిపించుకుంటాడు అన్నదమ్ములతో ఉంటాడు కానీ ఒక స్త్రీ జీవితాన్ని చూడండి ఒక ఆడపిల్లని చూడండి ఆమె కూడా మగపిల్లవాడు ఎలా పుట్టాడో అలాగే పుట్టింది.
(09:11) ఆమె కూడా పిల్లవాడితోటే కలిసి పెరిగింది. నిజానికి అసలు చాలా ఆర్ద్రత కలిగిన మనసు ఎవరిది అంటే మగపిల్లవాడి కన్నా ఆడపిల్ల వాళ్ళ ప్రేమ వేరు వాళ్ళ తృప్తి వేరు వాళ్ళ సంతోషం వేరు అందుకే మీరు చూడండి ఎప్పుడైనా పేరు పెట్టి మగపిల్లవాడు చెల్లిని పిలుస్తాడు లక్ష్మీ ఇలారా అంటాడు వల్లి ఇలారా అంటాడు చెల్లెలు సాధారణంగా అన్నయ్యని పేరు పెట్టి పిలవదు అన్నయ్య అన్నయ్య అన్నయ్య అంటున్నారు చెల్లెల్ని చెల్లెలా చెల్లెలా పెద్ద చెల్లెలా చిన్న చెల్లెలా అని ఎప్పుడు పిలవడం తక్కువగా ఉంటుంది.
(09:47) పేరు పెట్టి పిలుస్తారు. ఆమె మాత్రం అన్నయ్య అన్నయ అన్నయ్య అంటుంది అసలు ఆ అన్నయ్య అన్న సంబోధనలో అన్నయ్య అన్న పిలుపులో ఎంత మాధుర్యం ఉంటుందో ఎంత కఠినమైన హృదయమై ఉన్నవాడు కానివ్వండి ఒకటికి పది మాటలు ఆడపిల్ల పక్కన కూర్చుని అన్నయ్యగారు అన్నా అన్నా అన్నయ్య అన్నయ్య అందనుకోండి మెల్లిగా మనసు కరిగిపోతుంది. ఆ సంబోధనలో అంత ప్రేమ ఉంటుంది.
(10:19) అంత ప్రేమగా పిలిచేటప్పుడు అందుకే పోతనగారి భాగవతం దశమ స్కంధంలో అన్న శిమింపు మన్నతగల్లుడు కాడిది మేనకోడల మన్నన చేయుమన్న వినుమానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనకదన్న మహాత్ములు పోవత్రోవు పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్న అనిపిస్తారు ఆ దేవకీ దేవి చేత ఒకటికి పది మాటలు అన్నయ అన్నయ అన్నయ అని పిలిచినంత మాత్రం చేత ఎంత కఠిన హృదయుడు కూడా ఆర్ధ్రతని పొందుతాడు మనసులో కౌసుడు అంతటివాడు పునరాలోచించాడు అంతటి మెత్తనం కలిగిన పిల్ల మరి ఆ పిల్ల ఇక్కడే పుట్టింది ఆ పిల్ల ఇక్కడే పెరిగింది ఇక్కడ పుట్టిన అక్కడ ఉద్ధరింపచేస్తాం ఆ పిల్ల యందు ఆ భావన లేదనుకోండి అసలు ఈ
(11:08) సృష్టి నిలబడుతుందా అసలు ఏ కుటుంబంలోనైనా మనశశాంతి ఉంటుందా నన్ను కట్టుకున్న నా ఇల్లాలు నా ఇంటికి వచ్చి తన పుట్టింటినే జ్ఞాపకం పెట్టుకొని నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉండలేను నాకు కొత్తగా ఉంద అందనుకోండి అసలు నాకు జీవితం ఉందా అలా లోకంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ఆడపిల్లయనా అంటుందా ఎంత అలవోకగా ఇవిడిపోతారు అంటే బాతుని తీసుకెళ్లి నీళ్ళలోకి విసిరేస్తే ఎంత తేలికగా నీటి మీద తాను నడిచి వెళ్ళిపోతుందో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి అదే తమ ఇల్లన్నట్టు అక్కడే పుట్టినట్టు అక్కడి వారందరూ తనవారన్నట్టు అల్లుకుపోతుంది అంతే అది అది పురుషుడికి
(11:47) ఉంటుందా ఒక్కనాటికి ఉండదు మీరు ఏమనుకున్నా సరే అది ఒక్క స్త్రీకే సత్తు అది పరమేశ్వరుడి సృష్టిలో ఉన్నటువంటి అద్భుతం అలా ఆమె రాకపోతే అసలు ఈ సృష్టి లేదు అందుకే ఆమెది మహాత్యాగం అటువంటి స్థితి కాబట్టే యత్ర నార్యస్తు పూజ్యంతే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ ఇక్కడ తత్ర రమంతే సర్వదేవతాః అటువంటి ప్రదేశంలో దేవతలందరూ కూడా సంతోషిస్తారు పుట్టుక చేత ఆప్యాయతకి మారు పేరు ఆడపిల్ల పుట్టుక చేత మహాత్యాగానికి మారుపేరు ఆడపిల్ల పుట్టుకతోని ఎక్కడ పుట్టిందో ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ముక్కు ముఖం తెలియని వాడితో జీవితాన్ని పంచుకోవడానికి వెళ్ళిపోవడానికి
(12:41) సిద్ధపడుతున్నది ఆడపిల్ల తనని కన్న తల్లిదండ్రులు పొగడనివ్వండి తనతో కలిసి పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్లు పొగడనివ్వండి లోకమంతా పొగడనివ్వండి కట్టుకున్నవాడు కసురుకున్నంత మాత్రం చేత కన్నుల నీరు పెట్టకుండు ఎంతమంది తెగనాడనివ్వండి నువ్వు నా ఐశ్వర్యానివే అని భర్త అన్న ఒక్క మాటకి పొంగిపోతుంది అటువంటి ఆర్ద్రత కలిగినటువంటి హృదయం లోకంలో పురుషుడికి ఉండదు అది స్త్రీకి సహజం అసలు ఆమె లేనినాడు ఈ సృష్టి నడవదు ఆమె ఉన్నది కాబట్టి ఈ సృష్టి నడుస్తోంది.
(13:23) అందుకే పరమేశ్వరుడు అంతటి వాడు కూడా ఎంత మర్యాదను ఇచ్చాడో తెలుసా ఆడపిల్ల విషయంలో ఎంత గౌరవాన్ని ఇచ్చాడంటే పురుషుడు భగవంతుని దగ్గరికి వెళితే వెనక ఏమి ఉపాలయాలు లేకపోతే కాళ్ళు భగవంతుని వైపుకి ఇంకొక గుడి వైపుకు వెళ్ళటం లేదు అని నిర్ధారించుకుంటే సాష్టాంగ నమస్కారం చేయాలి అంటే నేల మీద పడి నమస్కారం చేయాలి అదే ఒక స్త్రీ వెళితే ఎంత ప్రశాంతమైన మైన వాతావరణము కానివ్వండి సాష్టాంగ నమస్కారం నిషేధింపబడింది.
(13:57) ఈశ్వరుడు కూడా సాష్టాంగ నమస్కారం స్త్రీలకు నిర్దేశించలేదు ఆయన కూడా పుచ్చుకోడు అందుకే స్త్రీల యొక్క నమస్కార ప్రక్రియ యందు వక్షస్థలం కానీ నడుము యొక్క తిండి భాగం మోకాళ్ళ పై భాగం కానీ భూమిని తాకకూడదు ఎందుకు తాకకూడదు అని చెప్తారు అంటే చిన్న పుచ్చడానికి కాదు ఏ శరీరము యొక్క పైన ఉన్నటువంటి పైకి ఉబికినటువంటి ఆ రెండు వక్షోజములు సృష్టింపబడినటువంటి ప్రతి ప్రాణి బ్రతకడానికి కారణం అవుతున్నాయో విష్ణు తత్వమై పోషణకు కారణం అవుతున్నాయో ఏవి లేనినాడు అసలు ఈ సృష్టి మనుగడలేదో అవి కానీ ఏ రంధ్రము గుండా సమస్త ప్రాణులు ఉత్పత్తి అవుతున్నాయో ఆ అవయవం
(14:49) కానీ భూమికి తగలవలసిన అవసరం లేదు అవి లేనినాడు అసలు ఈ సృష్టి లేదు నీ మాతృత్వానికి కారణమైనటువంటి సూచన లేనటువంటి ఆ అవయవములు భూమికి తాకవలసిన అవసరం లేదు నా ముందు పంచాంగ నమస్కారం చేస్తే చాలని సర్వేశ్వరుడు అంతటి వాడు స్త్రీ విషయంలో అంత మినహాయింపు ఒక మగపిల్లవాడు ఉన్నాడు అనుకోండి అతడు ఏ వంశంలో పుట్టాడో ఆ ఒక్క వంశాన్ని ధరింప చేయగలడు లేదా ఏడు తరాల్లో పది తరాల్లో 11 తరాల్లో ధరింపచేస్తాడు అదే ఒక స్త్రీ ఉందనుకోండి ఒక మంచి స్త్రీ అంటే మంచి స్త్రీ అంటే నా ఉద్దేశ్యంలో నేను ఏదో పొగుడుతున్నానా పొగడడానికి అంటున్నాను అనుకోవద్దు నా దృష్టిలో అయితే
(15:39) అందరూ పరదేవతా స్వరూపులే ఈ లక్షణం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి భర్తని నమ్ముకొని పుట్టింటిని విడిచిపెట్టి వెళ్ళిపోని స్త్రీ ఎవరు ఈ లోకంలో అయినప్పుడు వాళ్ళందరి యందు ఆ ఉదాత్తమైనటువంటి లక్షణం ఉన్నప్పుడు ప్పుడు అన్నదమ్ముడిని చూసేటప్పటికి పొంగిపోయే లక్షణం ఉంటే పుట్టింటికి వచ్చి తల్లిని తండ్రిని అన్నదమ్ముల్ని చూస్తే పరవసించిపోయి కరిగిపోయే మనసున్న ఆడపిల్లలు ఎక్కడ ఉన్నా పరదేవతా స్వరూపమే అయినప్పుడు అందులో కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ అని నేను వర్గీకరించట్లేదు అందరూ ఒక్కటే శాస్త్రం ఎలా చెప్పిందో నేను అలాగే మాట్లాడవలసి
(16:20) ఉంటుంది వాళ్ళు రెండు వంశములను ఉద్ధరించగలరు ఎందుకు చేత అంటే వాళ్ళ ఉత్తమమైన నడవడి కారణంగా అటువంటి పిల్లని కన్నందుకు గాను తల్లిదండ్రులు వాళ్ళ వంశం ధరిస్తుంది. మెట్టింటికి వెళ్లి ఆ వంశాన్ని తరింపచేసింది కాబట్టి వాళ్ళ వంశం ధరిస్తోంది రెండు వంశములను ధరింప చేయగలిగినది ఆడపిల్ల ఒక్కటే మగపిల్లవాడు రెండు వంశములను తరింప చేయడు.
(16:47) ఒక్క వంశాన్ని మాత్రమే పురుషుడు ధరింప చేయగలడు. ఆ కోణంలో చూసిన పురుషుడి కన్నా స్త్రీయే ఎక్కువ అసలు పురుషుడి యొక్క ధర్మమంతా ఎవరి మీద ఆధారపడింది అంటే స్త్రీ మీదనే ఆధారపడింది అందుకే ఆర్ష ధర్మంలో పత్ని అన్న మాట వాడతారు పత్ని అన్న మాటకు అర్థం ఏమిటంటే తనతో కలిసి యజ్ఞయాగాది క్రతువులలో పీఠ మీద కూర్చునేటటువంటి అధికారమును పొందినటువంటి స్త్రీ ఆమెని పత్ని అంటారు భార్య అన్న మాట ఎక్కువగా ఉపయోగించారు ఎందుచేత అంటే భార్య అంటే తన చేత భరింపబడునది అని అర్థం పత్ని అంటాం అందుకే మీరు ఎక్కడైనా ఒక దేవాలయానికి వెళ్ళినా ఒక పూజ చేసినా హోమం చేసినా యజ్ఞం చేసినా ధర్మపత్నీ సమేతస్య
(17:37) అంటారు ఆమెయే ధర్మమునకు మారు పేరు ఆమెకి అందుకే ఇక వేరు పూజ పెట్టలేదు ఆమె లేనినాడు పూజ లేదు నేను అన్న మాటలో ఎవ్వరిని పొగడడానికి కి కానీ పక్షపాతంతో కానీ నేను చెప్తున్నవి కావు నేను చెప్తున్నది శాస్త్రాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాను. శాస్త్రం అంటుంది ప్రతి ఇంట గంట మోగాలి ప్రతి ఇంట గంట మోగాలంటే పూజ జరగాలి ప్రతి ఇంటా గంట మోగడం ఇప్పుడు సాధ్యం ధర్మపత్ని ఉంటేనే సాధ్యం.
(18:07) ధర్మపత్ని లేదు ఏది ప్రతిరోజు వాడిని తెల్లవారికట్ట లేచి వాడి వంటవాడిని చేసుకొని వాడి పిల్లల్ని వాడిని సాకి వాడి పూజ వాడిని చేసుకోమనండి చూస్తాను వేళ పట్టులు చేయగలడేమో సాధ్యం కాదు ఆమె ధర్మపత్ని అంటే ధర్మమే రాశీ భూతమై స్త్రీ స్వరూపంగా వస్తుంది ఆమెకి పూజ లేదు ఎందుచేత అంటే ఆమె లేనినాడు పురుషుడికి పూజ లేదు ఆమె ఇక వేరుగా పూజ చేసిందా చేయలేదా అన్న దానితో సంబంధం లేదు ఆయన పూజ చేశాడు అంటే ఆయన కన్నా ముందు ఆమె నిద్రలేచింది అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగం కాళహస్తీశ్వరుడి కన్నా ముందు జ్ఞానప్రసోనామకి అభిషేకం ఆమె ముందు స్నానం చేస్తుంది ఆయన స్నానం చేసి వచ్చేటప్పటికి
(18:48) పూజ గది గురుస్తోంది ఆయన పూజ చేసుకోవడానికి సంబారాలు అక్కడ పెడుతోంది ఆయన మహానైవేద్యం దగ్గరికి వచ్చేటప్పటికి వంట తీసుకొచ్చి అక్కడ పెడుతోంది ఆయన బిడ్డలకి చదువు చెప్తోంది బిడ్డల్ని సిద్ధం చేస్తోంది తాను మహా సంస్కారవంతురాలై నిలబడుతోంది ఇంత ఉదాత చరిత్రకలి కలిగినటువంటి స్త్రీకి ఇక మళ్ళీ వేరే పూజ చేయవలసిన అవసరం ఏముంది అందుకే ధర్మపతి సమేతస్య అన్న మాట లేదు ధర్మ పత్నీ సమేతస్య ఆమె పక్కన కూర్చోవక్కర్లేదు ఆమె లేనినాడు పురుషుడు చేసిన పూజ దూష్యం అవుతుంది ఎందుకు చేతనో తెలుసా పూజ ప్రారంభంలో మీరు ఎడం చేతితో దేన్నైనా ముట్టుకుంటే ఆ పూజ
(19:30) దూష్యమే ఉపనయనం చేశారు అనుకోండి బ్రహ్మచారిగా ఉంటాడు ఏదో సంధ్యావందనం చేసుకోవాలి సంధ్యావందనం చేయాలంటే ఆచమనం చేయాలా ఆచమనం చేయాలంటే ఇలా ఎడం చేతితో తీసుకొని కుడి చేతిలో వేసుకొని ఓం కేశవాయ స్వాహా అనావా అన్నాడు అంటే ఎడం చేతితో నీళ్ళఎత్తాడు అంటే వెంటనే దూష్యం అయిందా లేదా తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు మహాపురుషుడు మీకు చాలా దగ్గరేగా తెనాలి అవిని చెందూరు గ్రామంలో ఉండేవారు ఆయన తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారికి వివాహం జరిగిన రోజు రాత్రి వారి అరుగు మీద కూర్చుని ఉన్నారు వాళ్ళ మామగారు వచ్చి ఒక మాట అడిగారు ఏమోయ్ ఎందుకు పెళ్లి చేసుకున్నావు
(20:10) అన్నారు ఆయనకి చాలా కోపం వచ్చింది ఎందుకు పెళ్లి చేసుకున్నావ అని పిల్లని ఇచ్చిన మామగారు అడుగుతారు పైగా ఇంతమందిలో అసహ్యంగా లేదు అని ఆయనకి చీకాకు కలిగింది కలిగి వెంటనే మామగారు ప్రాజ్ఞుడు విద్వాంసుడు ఎందుకు అడిగాడు ఈ మాట అని ఆయనకి ఉపాసన ఉంది బాలాదేవి ఆయనకి పలికేది ఆయన వెంటనే కళ్ళు మూసుకొని బాలాదేవిని మనసులో ప్రార్థన చేశారు వెంటనే నే అమ్మవారండి కుడి చేత ఆచమనం చేయడానికి అని చెప్పు కుడి చేతితో ఆచమనం చేయడానికి అన్నారు ఆయన ఆ మామగారు పొంగిపోయారు ఎంత ధర్మం మాట్లాడావయ్యా అన్నారు నాకు వివాహం అయిపోయిన తర్వాత పూజలో నేను వేసుకోకూడదు
(20:52) ఆచమనం ఇవాళ అదఒక అర్థం లేని ఆచారం అయిపోయింది పూజ చేయించేటప్పుడు కూడా పురుషుడు స్త్రీకి వేస్తాడు కానీ తన ఆచమనం తాను చేస్తాడు అలా చేయకూడదు తానే కానీ ఎడం చేతితో వేసుకుంటే ఇంకా ధర్మపత్ని ఎందుకు అవుతుంది తన ధర్మమునకు ఉపకరణం బ్రహ్మచర్యం దాటాడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు పూజ ప్రారంభంలో ఆమె వచ్చి తన ఎడమ వైపు నిలబడి ఆచమనీయం చేస్తుంది ఆచమనం పుచ్చుకున్నాడు ఆవిడ పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది ఇక పూజ అంతా ఆమె పక్కన కూర్చుని ఉన్నట్టే అందుకే దేశకాల సంకీర్తనంలో ధర్మపత్నీ సమేతస్య అని చెప్పేస్తాడు పైగా ఆమె ఉన్నది కనుక కామము ధర్మ ముచేత ముడిపడుతోంది అది ఏదో కామము
(21:38) విశంకరత్వాన్ని పొందింది అనుకోండి అసలు లోకమునందు ధార్మికమైనటువంటి సంతానోత్పత్తి ఉండదు వామివరసలు ఉండవు కానీ తన యొక్క కామాన్ని ధర్మంతో ముడివేస్తున్నాడు నాతిచరామి నేను ఈమెను అతిక్రమించాలి అని ఉందను అంగీకారం చేసుకొని తన కామాన్ని ధర్మంతో ముడివేస్తే ధర్మమే రాశీభూతమై పత్నీ స్వరూపంతో పక్కకు వచ్చింది ఇప్పుడు ఆయన తేజస్సుని ఆమె భరిస్తోంది భరిస్తే అర్థము ఆయన యొక్క ధర్మము కామము ముడిపడ్డాయి ఆయన కామము ధర్మము చేత ముడిపడింది ధర్మపత్ని యందు కామాన్ని ఉంచాడు ఇప్పుడు ఒక గొప్ప అర్థం వచ్చింది అర్థము అంటే సమస్తమైనటువంటి సుఖములకు సాధనములను అర్థము అని పిలుస్తారు డబ్బు
(22:27) ఒక్కటే కాదు అర్థం అంటే కామం అంటే అన్ని వేళ స్త్రీ పురుష సంబంధమే కాదు నాకు ఏదో ఒక మంచి పంచ కట్టుకుందాం అనిపించింది అనుకోండి అటువంటి అంచున్న పంచ పట్టుకోవాలన్న కోరిక కూడా కామమే కాబట్టి కామము అర్థంతో కామము ధర్మంతో ముడిపడింది ఇప్పుడు ధర్మపత్ని అయింది ఆమె వలన గొప్ప అర్థం వచ్చింది సుఖ సాధనములు వచ్చాయి ఏమిటి ఒక కొడుకు పుట్టాడు ఒక కూతురు పుట్టింది ఇప్పుడు ఈ కూతురిని కన్యాదానం చేశడు దశపూర్వేషాం దశాపరేషాం 10 తరాలు ముందు 10 తరాలు వెనక తనతో కలిపి ఒక తరం 21 తరాలు ధరించాయి మీరు ఒక్క మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి లోకంలో ఏ వస్తువునైనా దానం చేస్తే చతుర్థి విభక్తి
(23:16) వేస్తారు అంటే ఇక ఆ వస్తువు మీద నాకు యాజమాన్య హక్కు ఉండదు దాన్ని చూసినా నేను ఇచ్చానన్న భావన నాకు రాకూడదు నేను ఎవరికో ఒక మంచి గండబేరుండ అంచున్న పంచని ఇచ్చాను ఆయన ఆ పంచె పట్టుకొని మరనాడు వచ్చారు నేను చూసి నేను ఇచ్చిన పంచే బాగుందా ఆయనకి అనకూడదు నేను ఇచ్చేసాను వదిలి పెట్టేయాలి అంతే దాన్ని ఇంకా నేను ఇచ్చాను అన్న భావన ఉండకూడదు.
(23:42) ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు వ్యవహారం రీచా కన్యాదానం అంటారు కానీ ఆడపిల్లని దానం చేయడం అంటే చతుర్థి విభక్తి వెయ్యదు అందుకే ఆడపిల్ల మీద ధార్మికమైనటువంటి హక్కు ఆ కుటుంబంలో సభ్యత్వం పుట్టినింటి యందు ఆడపిల్లకి ఎప్పుడూ ఉంటుంది. నాకు చూడాలని ఉందయ్యా ఒక 10 రోజులు నా కూతుర్ని తీసుకెళ్తాను అని అడిగే అధికారము కన్న తండ్రికి ఉన్నది వద్దు అని అనే అధికారం భర్తకి కానీ అత్తమామలకి కానీ ఎవ్వరికీ శాస్త్రంలో లేదు తండ్రికి తల్లికి తోబుట్టువులకు ఆ అధికారం ఉంటుంది.
(24:22) ఇంకా నేను యదార్థం చెప్పవలసి వస్తే తండ్రి ఇంట శోధన కార్యం అవుతోంది అనుకోండి ఒక మంగళప్రదమైన కార్యం ఏదో అవుతోంది. అల్లుడి గారి మీద ఉన్న గౌరవం చేత ఆహ్వానం చేస్తారు తప్ప ఆహ్వానం చేయకపోయినా సరే కూతురు అల్లుడు వెళ్ళవలసిందే ఎందుకో తెలుసా నేను చెప్పట్లేదు ఈ మాట దక్షయజ్ఞం విషయంలో పార్వతీదేవి పరమశివుడితో చెప్పింది ఏమి శంకరా మీకు తెలియని విషయమా మీకు తెలుసు కదా అనయము పిలుమకయుండన్ చన అనుచితమందువేని జనక గురు రాజ సుహు గేహములకు చనుచుందును పిలవకున్న సజ్జనులదిపా అంది కొందరి కొందరి ఇళ్లకి పిలవకపోయినా వెళ్ళాలి ఎవరింటికి వెళ్ళాలి అంటే జనక ఓ శివ మా నాన్న దక్ష
(25:12) ప్రజాపతి పిలవలేదని అలక పిలవకపోయినా ఆడపిల్ల అల్లుని వెళ్ళాలిగా మీకు తెలియని ధర్మమా ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మశివోమే అస్తు సదాశివో అటువంటివి మీకు తెలియదా వెళ్ళాలి కదా జనక జననాయక రాజ్య పరిపాలన చేసేటటువంటి రాజు యొక్క ఇంట్లో శుభకార్యం జరిగితే పిలుపక్కర్లేదు వెళ్ళాలి సు మంచి స్నేహితుడు మనసరిగిన స్నేహితుడు ఆ స్నేహితుడు పిలవక్కర్లేదు ఆయన ఇంట్లో శుభకార్యం వెళ్ళాలి గురు గురువుగారి ఇంట్లో ఉత్సవం జరుగుతోంది పిలవక్కర్లేదు వెళ్ళాలి చనుచుందురు పిలవకున్న సజ్జనులదిప పిలవకపోయినా వెళతారు
(25:58) కదా శంకర్ కరా మీకు తెలియదా అని అడిగింది అందుకే చతుర్థి విభక్తి వెయ్యను కాబట్టే ఆడపిల్లని కన్యాదానం చేసిన ఆమె యొక్క ఉత్తమమైన నడవడి చేత ఆమె కన్నా తల్లిదండ్రులు కూడా అభ్యున్నతిని పొందుతున్నారు రెండు వంశాలు ధరిస్తున్నాయి కన్యాదాన సమయంలో 21 తరాలు ధరిస్తున్నాయి ఇంత పుణ్యాన్ని మూటకట్టి పెట్టి ఇవ్వగలిగినటువంటిది ఆప్యాయితకి రాశీభూతమైనటువంటిది లోకంలో ఎవరు అంటే ఒక్క స్త్రీ మాత్రమే అందుకు అంటుంది అనసూయమ్మ నాతో విశిష్టం పస్యామి పాంధవం వినుసంచహం అమ్మ భర్త తాను చేసిన పుణ్యంలో సగం భార్యకి ఇస్తున్నాడు ఆయన ఐశ్వర్యం అంతా ఆమెదే ఆయన
(26:43) ఆయుర్దాయమునకు నేను కర్త విశేషించి నేను లేనినాడు ఆయనకి ధర్మం లేదు నేను తల్లినై అమ్మా అని పిలిపించుకొని అపారమైన ఆనందాన్ని పొందానఅంటే ధార్మికమైన సంతానాన్ని ఆయన వలన పొందాను కాబట్టి పసుపు కుంకాలు ఉన్నదాన్ని అని 30 రూపాయలు చీర కట్టుకున్న ఎదురొచ్చేటప్పటికి సువాసిని అని గౌరవించి వెడుతున్నారంటే ఆయన ఉండబట్టి లోకంలో ఇంకా ఎవరి వలన ఇన్ని సంభవించమమ్మా ఒక్క భర్త వలన సంభవిస్తాయి అందుకే కులకాంతలు ఉత్తములైనటువంటి స్త్రీలు భర్త గౌరవించి ప్రవర్తిస్తారమ్మా శాస్త్రం ఎరిగినవారు కనుక అన్నది అనసూయ అటువంటి మహా పతివ్రతలైనటువంటి స్త్రీలు అనితర సాధ్యమైనటువంటి విషయం
(27:28) సాధించడం మీకు ఈ భూమి మీద ఎక్కడా కనపడవు భారతదేశంలోనే సంభవం ఒక్కొక్క మహా పతివ్రత సూర్యోదయ సూర్యాస్తమయాలని శాసించింది. రేపు తెల్లవారితే నీ భర్త మరణిస్తాడు అంటే సుమతి సూర్యోదయం అవ్వకుండు గాక అంది ధర్మ చక్రం నిలబడిపోయింది అది ఎన్ని యజ్ఞ యాగాదికవులు చేసిన పురుషులు సాధించగలరో సాధించలేరో కానీ పతివ్రతా ధర్మం చేత స్త్రీ సాధించింది అది ఈ జాతి గొప్పతనం అటువంటి చరిత్ర కలిగినటువంటి స్త్రీలు ఈ ఒక్క దేశంలోనే కనపడతారు అందుకే ఈ దేశంలో స్త్రీ అనేటప్పటికీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జనులు రెండు చేత చేతులఎత్తి నమస్కరిస్తారు ఆ జాతి అంత గొప్పది ఆ దేశంలో ఉన్న స్త్రీల
(28:13) యొక్క వైశిష్ట్యం అంత గొప్పది కాబట్టి నాతో విశిష్టం పశ్యాయామి ఒక్క అనసూయమే కాదు నిజంగా ఈ లోకంలో పురాణాల్ని కావ్యాల్ని పరిశీలిస్తే ఎంత గొప్ప గొప్ప గుణములు కలిగినటువంటి స్త్రీలు కనపడతారో వాళ్ళతో పోలిస్తే నిజంగా ఇంత ఔదార్యం ఇంత గొప్ప స్థితిని పురుషుడు పొందాడా అని అనిపిస్తుంది. మీరు మహాభారతంలో గాంధారినే చూడండి ఆమె గాంధారరాజు యొక్క కుమార్తె సుబలుని యొక్క కుమార్తె గాంధారరాజ కుమార్తె కనుక ఆమెకి గాంధారి అని పేరు వచ్చింది.
(28:51) ఆమె మహా సౌందర్యరాసి చిన్నతనంలో పరమశివుని గురించి తపస్సు చేసి పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందింది. ఆమెకి సంతానాపేక్ష ఎక్కువమంది సంతానానికి తల్లి కావాలి అని వరం పొందింది. అపారమైన అందగత్తి మహారాజు యొక్క కుమార్తె సకల సుగుణములకు పిన్నిధి అటువంటి స్త్రీ ఎప్పటినుంచో కురువంశానికి ఒక ఇబ్బంది ఎప్పుడు సంతానం లేక బాధపడుతూ ఉంటారు చిత్రాంగదు విచిత్రవీర్యుడి దగ్గర నుంచి ఇదే సమస్య అందుకని కనీసంలో కనీసం ఆ కురువంశానికి వారసుల విషయంలో ఇబ్బంది రాకూడదని ఈమెకి బహుసంతానవతి అని వరం ఉంది కాబట్టి ఈమెని తీసుకొచ్చే ధృతరాష్ట్రుడికి వివాహం చేస్తే ధృతరాష్ట్రుడు సంతానాన్ని
(29:37) పొందుతాడు కురువంశం అవిచ్చిన్నంగా కొనసాగుతుందని భీష్మాచార్యుల వారు ఆ గాంధారిని తీసుకొచ్చి భీష్మా ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు సుమరుడు అడిగాడు మా ధృతరాష్ట్రుని వివాహం చేసుకుంటావా అని అడిగాడు ఆమె మామూలుగా అంగీకరించడం కాదు ఎంత ఔదార్యంతో అంగీకరించిందో తెలుసా ధృతరాష్ట్రుడు జాత్యంధువు పుట్టుకతో కళ్ళు లేనివాడు ఎంత బలం ఉన్నవాడు కానివ్వండి పాండురాజు లేక ఎంత రాజ్య పరిపాలన చేస్తున్నవాడు కానివ్వండి జాత్యంధుడైనటువంటి వ్యక్తిని అంతటి సౌందర్య రాసి ఎందుకు వివాహం చేసుకోవాలి కానీ తన వలన అవతలవారి వంశం నిలబడితే జాత్యంధుడైనవాడు
(30:23) బిడ్డల్ని పొందానని సంతోషిస్తే అంతకన్నా తన జన్మకి సుకృతి ఏముంటుందని అంగీకరించింది అంగీకరించడం కాదు త్యాగమై మహాతల్లి గాంధారి మహాపతివ్రత నా భర్త ఏవి చూసి సంతోషించట్లేదో అవి చూసి నేను సంతోషించను అని ఆమె కూడా అంధత్వాన్ని పొందింది. అందుకే కన్నులకు గుడ్డ కట్టేసుకుంది. నేను ఒక గుడి గోపురాన్ని చూస్తే సంతోషిస్తాను నా భర్త సంతోషించలేడు నేను ఒక పెద్ద మర్రి చెట్టు చూసి సంతోషిస్తాను నా భర్త సంతోషించలేడు.
(30:56) నేను ఒక మంచి పక్షిని చూసి సంతోషిస్తాను నా భర్త సంతోషించలేడు. నా భర్త ఏవి చూసి సంతోషించలేడో అవి చూసిన సంతోషం నాకు అక్కర్లేదని కళ్ళకి గుడ్డ కట్టుకుంది. మీరు ఆలోచించండి ఆమె పుట్టినది గాంధార రాజ్యం ఆమె కుమార్తె అయింది సుమలుడికి ఆమె తోడ పుట్టినటువంటి వాడు దుశాసనుడు భర్త జాత్యంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు పెనువేప విత్తు పరమ దుష్టమైన ఆలోచనలు ఉన్నవాడు పెద్ద కొడుకు దుర్యోధనుడు మిగిలినవాళ్ళు దుశాసనాధుడు నూర్గురు కొడుకులు అల్లుడు అంతటి నీచుడు సైంధవుడు ఇటువంటి వాళ్ళందరూ ఆమెకి బంధువులు ఆమె ఆమె ఉన్నది ఇటువంటి దుష్కృత్యాలు జరిగేటటువంటి చోట ఇంతమంది
(31:42) మధ్యలో ఆమె మాత్రం పుతం పెట్టినటువంటి బంగార ఎంతటి మహోద విశేషమైనటువంటి ఔదార్యము కనబడుతుందో ఆ తల్లిలో ఒకప్పుడు ధృతరాష్ట్రుడు భార్యని పిలిచి అడిగాడు పాండవులకి రాజ్యం ఇవ్వకుండా నా కొడుక్కి రాజ్యం ఇవ్వాలఅనుకుంటున్నాను పాండవులు రాజ్యం అడుగుతున్నారు నువ్వు మహిషివి కాదు పట్టమహి నీ అభిప్రాయం ఏమిటని అడిగాడు ఎంత కుండ బద్దలు కొట్టి చెప్పిందో తెలుసా ఆవిడ ఆవిడ ఒక మాట చెప్పింది ఆవిడ అంది నీ తనుూజుడు అవినీతుడగుట ఎరిగి ఎరిగి అతనికి వశపడి ఏల పోయది పాండవులకీవు ఏమిచ్చితే అడ్డు అడ్డు పడగలవారు ఎవరు విభుడ చెప్పుమా అంది ఆవిడ ఆవిడ అంది నీ
(32:35) కడుపున పుట్టినటువంటి దుర్యోధ పరమ నీచుడు అన్న విషయం మహారాజా మీకు తెలుసు వాడు నీచుడని తెలిసి వాడికి రాజ్యం రాదని తెలిసి పాండురాజు కొడుకైన ధర్మరాజుకి వెడుతుందని తెలిసి ఎందుకు కుట్ర చేస్తావు నీ తమ్ముడి బిడ్డలు నీ బిడ్డలు కారా ఆ ధర్మరాజుకి రావలసిన రాజ్యం ధర్మరాజుకి ఇవ్వలేవా నీ పుత్రుడు అవినీతుడగుట ఎరిగి ఎరిగి అతనికి వశపడి నీవు ఏలపోకు ఎందుకు నీ కొడుకు కొడుకు అన్న పుత్ర మమకారంతో వాడి వెంట పరిగెడుతుంటావు నువ్వు చక్రవర్తి నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు నువ్వు ఈ కురు సామ్రాజ్యాన్న అంతటిని ధర్మరాజుకి దారాదత్తం చేస్తే ఎదురుపడి అడగగలిగిన
(33:18) వాళ్ళు ఉన్నారా నువ్వు ఇచ్చిననాడు ధర్మరాజాదులు నీ బిడ్డలు తారా భీష్మ ద్రోణాదులు ధర్మ పక్షాన నిలబడరా దుర్యోధనుడు నిన్ను చెలకగలడా ధర్మరాజు దగ్గర పెడితే వశవర్తిఅై బ్రతకడా ఇప్పటికైనా బుద్ధి మార్చుకోడా నీ కొడుకుల యొక్క దీర్ఘాయు యుర్దాయం అంతా నీ చేతిలో ఉన్నది మహారాజా ధర్మం తప్పవద్దు నీ బిడ్డలు అని పుత్ర పాశములకు వశపడవద్దు నువ్వు రాజ్యాన్ని పట్టికెళ్లి ధర్మరాజుకి ఆయన తమ్ముళ్ళకి ఇచ్చేసేయ్ అని కుండ బద్దల కొట్టినట్లు మాట్లాడినటువంటిది ఆ మహాభారతంలో గాంధారి ఉంటుందా తోడ పుట్టినవాడు అటువంటివాడా భర్త అటువంటివాడా బిడ్డలు అటువంటి వాళ్ళా ఆవిడ మాత్రం
(34:02) మెరుపు తీగా నిజంగా ఎటువంటి ఆలోచన నా తల్లిది అలా నిలబడగలిగిన వాళ్ళు లోకంలో ఉంటారా ఆవిడే సామాన్యమైన స్త్రీయా ఒక్కసారి జీవితంలో అసూయ పొందింది గర్భతాళనం చేసుకుంది. ఆ కడుపులోనుంచి పిండం జారిపోయింది అది వేరు విషయం కానీ ఆమె యొక్క ఉదాత్త చరిత్ర పరిశీలిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. నూరుగురు కొడుకులు కడుపున పుట్టిన వాళ్ళు చచ్చిపోయినప్పటికీ కూడా అమ్మా అని వచ్చి ధర్మరాజు ఆమె కాళ్ళ దగ్గర నిలబడి ఒక్క మాట అన్నాడు చిట్టచివర కురుక్షేత్రం అయిపోయిన తర్వాత అమ్మ నీ బిడ్డలందరినీ చంపేసిన పాపిష్టి వాడిని నేనేనమ్మా నన్ను నీ శాపంతో కాల్చేయమ్మా
(34:46) అన్నాడు ఆయన కూడా కొడుకేగా అమ్మ ధర్మం కోసం చంపాను కానీ నా అంత నేను చంపలేదమ్మా నీ బిడ్డల్ని చంపడం తప్పయితే నన్ను కాల్చేయ్ అని ధర్మరాజు వస్తే ఒక్క మాట అనలా కళ్ళంబట నీళ్లు కార్చి ధర్మరాజుని కౌగలించుకుంది కానీ ఒక్క బిడ్డ కూడా బ్రతకలేదన్న బాధతో ఆమె చూసినప్పుడు కొద్దిగా కళ్ళకి కట్టుకున్న బట్ట జారి ఆమె దృష్టి పడినందుకు ధర్మరాజు అంతటి వాడికి కాళ్ళు బొబ్బలెక్కాయి అంటే అంతటి పతివ్రత కానీ యుద్ధభూమిలోకి వెళ్లి చూసినప్పుడు కొడుకులందరూ మరణించి ఉంటే అందునా దుశాసన భయంకరంగా వక్షస్థలం బద్దలైపోయి పడిపోతే ఆమె కోపం అటు తిరిగి ఇటు తిరిగి ఎవరి మీద
(35:32) నిలబడాలో తెలియక అంతటి గాంధారి కూడా పుత్రవ్యామోహాన్ని పొంది కృష్ణుడి వంక చూసింది అన్నీ నీకు తెలుసు వీళ్ళందరూ మరణిస్తారని తెలుసు నువ్వే పూనికిని ఉంటే నా కొడుకులు ఇలా చనిపోయేవారు కాదు దీనికంతటికీ కారణం కృష్ణ నువ్వే నీ అన్నదమ్ములు కూడా ఇలాగే కొట్టుకొని యదువంశం ఒకరితో ఒకరు కొట్టుకొని నశించిపోవు గాక కొన్ని సంవత్సరముల తర్వాత నువ్వు కూడా దిక్కు లేని చావు చచ్చదవు గాక కృష్ణుడు నవ్వి అన్నాడు అమ్మ ధర్మానికి వంతపాడినందుకు నువ్వు నాకు ఇచ్చిన కానుక అన్నాడు ఇంతటి గాంధారి కుంచించుకుపోయింది నూర్గురు కొడుకులు పోయినా చిట్టచివరికి
(36:15) ధృతరాష్ట్ర మహారాజుతో కలిసి వానప్రస్తం చేసి దావాగ్ని యందు శరీరాన్ని విడిచిపెట్టేసింది నిజంగా మీరు గాంధారి దేవి యొక్క జీవిత చరిత్రని పరిశీలనం చేస్తే అంత శక్తివంతురాలై ఉండి అటువంటి ప్రదేశంలో ఉండి కూడా ఆమె ధర్మం తప్పకుండా ప్రవర్తించింది ఒకసారి దుర్యోధనుడు వచ్చి ఆమె కాళ్ళకు నమస్కారం చేసి నాకు విజయం కలగాలని ఆశీర్వచనం చేయమంటే నిర్మొహమాటంగా చెప్పింది ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే విజయం నీకు విజయం కావాలనుకుంటే ధర్మాన్ని నిరంతరం పట్టుకునే ధర్మరాజు యొక్క పాదములను ఆశ్రయించు ఆయనకి వశవర్తివై ప్రవర్తించు అప్పుడు ధర్మాన్ని నువ్వు
(36:57) పొందుతావు దాని వలన విజయాన్ని పొందుతావు తప్ప నువ్వు అధర్మాన్ని పట్టుకొని గెలవలేవు దుర్యోధన అని చెప్పి అంతటి ధర్మ పక్షపాతి అయ తన బిడ్డలతో కానీ భర్తతో కానీ ధర్మం విషయంలో అసలు వెనుకంజవేయకుండా మాట్లాడగలిగినటువంటి స్థితిని పొందినటువంటి స్త్రీత్నం గాంధారిదేవి ఈ దేశంలో కొంతమంది స్త్రీల యొక్క త్యాగం వాళ్ళ యొక్క జీవనం చదువుతుంటే నిజంగా ఎంతటి మెరుపులో అర్థంఅవుతుంది.
(37:32) అందంగా పుట్టింది కాబట్టి వశురాలు అయితే నాకు అవ్వాలి లేకపోతే అందం ఉండకూడదు యాసిడ్ పోస్తాను అన్న వాళ్ళది ఎంత రాక్షస సంస్కృతి అది మీరు మార్చడం కుదరదు ప్రతి కాలేజీలో ప్రతి విద్యార్థి పక్కన ఇద్దరు పోలీసుల దగ్గర మీరు ఆ సంఘటన జరగకుండా చేయలేరు మనసులు మారాలి మనసు మారి ఇది రాక్షసత్వం అందంగా ఉన్నది నాది కావాలని నేను కోరకూడదు తప్పది ఆమె అభ్యున్నతిని కోరుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కోరుకునే వాళ్ళలోకి నేను యోగ్యతను పొందిన వాడిని కావాలి.
(38:07) అది గొప్పతనం నేను ఆ తల్లిదండ్రులు కోరుకున్న వాళ్ళలో నేను ఒకడిని కావాలి ఆ అర్హతను సంపాదించుకొని ఆ మెడలో తాళి కట్టాలి అన్న సంస్కృతి పిల్లలలో వస్తే మీరు ఏ చట్టాలు అక్కర్లేదు ఏ పోలీసులు అక్కర్లేదు తప్ప ఈ సంస్కృతిని నశింపచేసేవన్నీ మీరు పిల్లలకి చూపించి అవి జరగకముందే ఆపుతాను అంటే ఎలా ఆపగలను అసలు తప్పేమి అలా పిల్లల సంస్కారం నశించిపోయేటట్టు తయారు చేసి అన్నీ చూపించినవాడు ఎవరు వాడు ఈ తప్పుకి కారకుడు కాదా కాదా మీరు గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి నేను ధైర్యంగా అంటాను మీరు అనుభవం అంతే తేడా సమాజం అంతః పరిశీలనం చేసుకోవలసినటువంటి సమయం ఆసన్నం
(38:44) కాలేదా ఏవి అందించాలో అవి అందించడం సమాజంలో పెద్దల కర్తవ్యం కాదా ఇది తెలిసాక కూడా నీ మనసు [సంగీతం]
No comments:
Post a Comment