How Mobile Phones Are Trapping Our Brain | The Dopamine Addiction Explained in Telugu | Ram C VISION
https://youtu.be/A87vPH_Z2vw?si=szJHKL61A0CnywAT
https://www.youtube.com/watch?v=A87vPH_Z2vw
Transcript:
(00:00) ఈ ఫోన్ ఉంది చూశారా దీన్ని వాడినా సమస్య వాడకపోయినా కూడా సమస్య ఈ ఫోన్ ద్వారా వచ్చే ఒక చిన్న మెసేజ్ నోటిఫికేషన్ నుండి పెద్ద పెద్ద కంటెంట్ల వరకు మీకు ఎవరైతే పంపిస్తున్నారో వారిందరి లక్ష్యము ఒకటే మీ బ్రెయిన్ కి చిన్న ఆశ చూపించి దాన్ని హుక్ చేసి పట్టుకొని దాని కారణంగా మీరు ఫోన్ లో గడుపుతున్న సమయాన్ని వాళ్ళ సొమ్ము చేసుకోవడం ఈ నిజాన్ని అర్థం చేసుకోలేని మీ బ్రెయిన్ చిన్న ఆనందం కోసం పోయి పోయి మీ సమయం మొత్తాన్ని అందులోనే గడిపేలా చేసి ఒక స్టేజ్ లో స్ట్రెస్ ఫీల్ అయ్యి మీకే అర్థం కానీ మెంటల్ టార్చర్ లోకి తీసుకెళ్తుంది.
(00:39) ఇది మనలో చాలా మందికి అర్థం కాని ఒక నిజం. మన డైరెక్టర్ ఆర్జీవి ఉన్నారు చూసారా ఆయనకు బాగా తెలుసు ఈ మైండ్ ప్రక్రియ ఏంటో అందుకే ఏ సందర్భంలో అయినా మేము మీ సినిమా చూడము అంటే చూడకు దొబ్బేయ్ నేను చెప్తే నువ్వు చూస్తావా అనే విధంగా మాట్లాడతారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆడియన్స్ బ్రెయిన్ ని ఎలా హుక్ చేయాలో కాబట్టి ఈ లూప్ లో ఇరుక్కుంటే మనకు స్ట్రెస్ తప్పదు డిప్రెషన్ తప్పదు మెంటల్ టార్చర్ తప్పదు మనకు అర్థం అవ్వకుండానే జరుగుతున్న ఒక ప్రక్రియ ఇది.
(01:13) ఫోన్ అడిక్షన్ గురించి ఫోన్ లూప్ గురించి మీరు ఎన్నో రకాలుగా వీడియోలు చూసే ఉండొచ్చు కానీ ఇది మాత్రం నేను కొత్త కోణంలో చెప్పబోతున్నాను మీకు ఈజీగా అర్థంవుతుంది సింపుల్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫోన్ వాడితే వచ్చే సమస్య ఏంటి? వాడకపోవడం వల్ల వచ్చే సమస్య ఏంటి? మన బ్రెయిన్ ఎలా లూప్ లో ఇరుక్కొని డిప్రెషన్ లోకి వెళ్తుంది దాని నుంచి ఎలా బయట పడాలి అనేది వన్ బై వన్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
(01:52) ఫోన్ పూర్తిగా వాడటం పక్కన పెట్టేస్తే మనం ముందుగా ఈ సొసైటీతో కనెక్షన్ కోల్పోతాం. ఎందుకంటే మన కళ్ళ ముందుకు ఈ ఫోన్ ద్వారానే ఈ సొసైటీలో ఏం జరుగుతుంది దేశంలో ఏం జరుగుతుంది మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది మనకు అర్థంవుతుంది తెలుస్తుంది. అదే ఈ ఫోన్ లేదనుకో మనము అవేర్నెస్ కోల్పోతాం. అసలే ఈ సొసైటీతో పోటీ పడుతూ బతుకుతున్న జీవితాలు ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకోకుంటే మనం వెనకపడే అవకాశం ఉంది.
(02:20) కాబట్టి ఫోన్ ని పూర్తిగా మనం అవాయిడ్ చేయకూడదు. ఇప్పుడు ఫోన్ వాడితే వచ్చే సమస్య ఏంటో చూద్దాం. ఫోన్ వాడడం కారణంగా మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి మనల్ని డిప్రెషన్ లోకి తీసుకెళ్తుంది. ఏవైతే మన లైఫ్ లో ముఖ్యంగా చేయవలసిన పనులు ఉంటాయో వాటి మీద ఏకాగ్రతను కోల్పోయేలా చేస్తుంది. ఈ ఫోన్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ అన్నిటికంటే అతి ముఖ్యమైనది మన ఆరోగ్యం కాబట్టి ఈ ఫోన్ ని ఎక్కువగా వాడి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడంలో అర్థం లేదు.
(02:55) ఇప్పుడు మనం ఈ సొసైటీతో డిస్కనెక్ట్ అవ్వకుండా మన ఆరోగ్యాన్ని కోల్పోకుండా సమస్యల్లోకి రాకుండా బ్యాలెన్స్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఈ బ్యాలెన్స్ చేయడం ఎలాగో మనకు అర్థం అవ్వాలంటే ముందుగా మనలో మన బ్రెయిన్ లో ఏం జరుగుతుందో మనకు అర్థం అవ్వాలి. ఇది అర్థమైతే మీకే తెలుస్తుంది ఏ విధంగా బయట పడాలి అనేది ఇది అర్థం చేసుకోకుంటే నేను నోటి మాటలతో ఇది చేయండి అది చేయండి అని ఎన్ని చెప్పినా సరే చేయలేని పరిస్థితిలోనే ఉండిపోతారు.
(03:23) కాబట్టి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైఫ్ లో ఫోన్ వాడటం మొదలు మనకు వచ్చే చిన్న మెసేజ్ నుంచి నోటిఫికేషన్ నుంచి పెద్ద పెద్ద కంటెంట్ల వరకు ఏదైనా సరే మన బ్రెయిన్ ని హుక్ చేసేదానికి ప్రయత్నమే చేస్తారు అని చెప్పాను కదా అది ఎలాగంటే ఇప్పుడు ఈ వీడియోలో స్టార్టింగ్ లో నేను మిమ్మల్ని హుక్ చేసేదానికే ప్రయత్నం చేశాను.
(03:47) అది ఎంతవరకు నా సక్సెస్ కాదా అనేది పక్కన పెట్టేస్తే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకూడదు చివరిదాకా చూడాలని మీకు మీలో క్యూరియస్ ని పెంచేటటువంటి కొన్ని పాయింట్స్ ని నేను ముందుగా మాట్లాడే ప్రయత్నం చేశాను. అయి విన్న మీకు మీ బ్రెయిన్ లో అదిఏంటో తెలుసుకోవాలన్న ఎక్సైట్మెంట్ పెరుగుతుంది దాని ద్వారా ఆనందాన్ని పొందాలనే ఫీల్ మీ బ్రెయిన్ కి వస్తుంది.
(04:11) ఆనందం మీకు రావాలంటే మీ బ్రెయిన్ లో ఏం జరగాలి డోపమైన్ అనే ఆనంద రసాయనం అది ఒక కెమికల్ అది స్పైక్ అవ్వాలి. అది స్పైక్ అయిన కారణంగానే ఇప్పుడు మీరు ఇంతవరకు వచ్చారు ఈ వీడియో చూస్తూ ఇలాంటి క్యూరియస్ని చిన్న నోటిఫికేషన్ దగ్గర నుండి ఆ నోటిఫికేషన్ ఆ ఫీల్ మీకు తెలియదు మీలో డోపమైన్ స్పైక్ అవుతుందని మీ బ్రెయిన్ ఏదో చిన్న ఆనందం కోసం వెతుకుతుందని ఇదంతా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది.
(04:38) అలాంటిది ఒక మొబైల్ లో మీరు ఎంత కంటెంట్ చూస్తూ ఉంటారో ఆ కంటెంట్ ఇవ్వడానికి ఎంత మంది ప్రయత్నిస్తూ ఉంటారో అంత మంది హుక్కు ఒక్క మీ ఫోన్ ద్వారా వచ్చి మీ బ్రెయిన్ ని పట్టుకునేదానికి ప్రయత్నం చేస్తుంది. నీ బ్రెయిన్ కి లక్ష్యాలు రెండే ఉంటాయి ఫస్ట్ లక్ష్యం ఏంటంటే సర్వైవల్ లో నిన్ను జీవించి ఉండేలా చేయడం నిన్ను బ్రతికిస్తూ ఉండడం నిన్ను కాపాడుకోవడం సెకండ్ లక్ష్యం ఏంటంటే నిన్ను ఆనందంగా ఉంచేయడానికి ట్రై చేయడం సో ఫోన్ వాడడం ద్వారా డైరెక్ట్ నీకు త్రెట్ లేదు అంటే నీ ప్రాణాలక ఏం ప్రమాదం లేదు.
(05:10) కాబట్టి సర్వైవల్ గురించి అది ఆలోచించదు. నెక్స్ట్ మిగిలింది ఆనందం. ఈ ఆనందం ఎక్కడైతే సులభంగా దొరుకుతుందో అటువైపే నిన్ను అట్రాక్ట్ అయ్యేలా నీ బ్రెయిన్ ప్రేరేపిస్తుంది. ఆబవియస్లీ మనిషికి ఆలోచించే శక్తి ఉంది కాబట్టి ఒక క్యూరియస్ని ఆనందాన్ని వెతుక్కోగలగడు కాబట్టి ఆ సామర్థ్యం బయోలాజికల్లీ తనలో ఉంది కాబట్టి చిన్న నోటిఫికేషన్ వచ్చినా సరే అందులో ఏముంది అన్న క్యూరియాసిటీతో నీ బ్రెయిన్ నీకు తెలియకుండానే ఫోన్ ని అన్లాక్ చేసే ప్రయత్నం చేస్తుంది.
(05:41) అందుకే మీరు మీకు తెలియకుండానే చాలా సార్లు ఫోన్ ని లాక్ అన్లాక్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆనందం కోసం మీ బ్రెయిన్ తపన పడినప్పుడు మీలో ప్రతిసారి డోపమైన్ అనేది స్పైక్ అవుతూనే ఉంటుంది. అట్ ది సేమ్ టైం అదే బయోలాజికల్లీ డోపమైన్ అనేది ఎక్కువ స్పైక్ అయితే ఎక్కువగా రిలీజ్ అయితే మన బ్రెయిన్ పని చేయడం మందగిస్తుంది.
(06:04) అలాంటి సిచువేషన్ లోనే మనం ముఖ్యంగా చేయాల్సిన పనుల మీద ఏకాగ్రత తగ్గుతుంది. మళ్ళీ ఇదే ఆనందం కోసం మళ్ళీ డోపమైన్ ఎక్కువ స్పైక్ చేసి ఇదే లూప్లోకి వెళ్ళేందుకు ప్రేరేపిస్తుంది. దీని కారణంగా మనిషి ఏ స్థితికి వెళ్ళిపోతాడు అంటే ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం అందులో వాహనాలు వస్తాయని మనకు తెలుసు కానీ ఆ క్షణాలలో మనకు అర్థం కాదు.
(06:29) ఎందుకు ఆ మొబైల్ లూప్ లో ఉన్నప్పుడు ఫోన్ చూసుకుంటూ ఆపరేట్ చేసుకుంటూ ఆ కొద్ది క్షణాలు మనం నిర్లాక్షన్ చేసి రోడ్డు గన క్రాస్ చేస్తే ఎన్నో వెహికల్స్ వచ్చి డీ కొట్టి వెళ్ళిపోవడం మనం చూసాం అక్కడే ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం కూడా మనం ఎన్నో వార్తలలో చూస్తూనే ఉంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్లాట్ఫామల దగ్గర సెల్ఫీలు అంటూ వీడియోలు అంటూ కానీ మీ బ్రెయిన్ యొక్క ముఖ్య పని ఏంటి ముందుగా మిమ్మల్ని సర్వైవ్ అయ్యేలా చేయడం అంటే జీవించి ఉండేలా చేయడం ఈ లూపులో పడి అది స్ట్రెస్ లోకి వెళ్ళిపోయి నీ బ్రెయిన్ యొక్క అసలు పనినే మర్చిపోయేంత దీన
(07:06) స్థితిలోకి వెళ్ళిపోతుంది. సర్వైవల్ లో భాగంగా నిన్ను కాపాడాల్సింది నీ బ్రెయిన్ ని లూపులో ఇరుక్కునేస్తే లాజిక్ ని వదిలేస్తే ఈ ప్రపంచంలో ప్రమాదాలు ఒక రకంగా కాదు ఎన్నో రకాలుగా మనల్ని చుట్టూ ముడుతూ ఉంటాయి అందులో కూడా ఇదొకటి అందుకే మీకు తెలియకుండానే మీరు అప్పుడప్పుడు తలనొప్పి అని స్ట్రెస్ అని ఏదో తెలియని ఒక ఇరిటేటింగ్ అనే ఫీలింగ్ అనేది కలుగుతుంది చాలామంది అబ్సర్వ్ చేస్తూ ఉంటారు.
(07:31) మనం గమనించకుండానే ఈ ఫోన్ ద్వారానే చాలా విషయాలు మనలో మానసికంగా కృంగదీసే పనులు చేయిస్తూ ఉంటాయి మన బ్రెయిన్ ద్వారానే సో ఈ వీడియో ఇక్కడిదాకా వచ్చారంటే మనలో అందరము ఈ ఊబిలో ఉన్నట్టే అది ఒక స్కేల్ ఈ ఊబిలో నుంచి బయట పడడం చాలా అవసరం. ఇవి రెండు గొయ్యలే నువ్వు ఫోన్ వాడకన్నా ఉంటే నువ్వు సొసైటీ గురించి తెలుసుకోలేవు అది ఒక గోయి ఫోన్ ఎక్కువ వాడితే ఊబిలో పడిపోతావ్ అది ఒక గోయి నేనేమంటానఅంటే రెండు గోవులలో పడొద్దు సెంటర్ లో ఉండు అంతేగాని ఒక్క దానిలో మునిగిపోవద్దు ఇప్పుడు ఈ ఊబిలో నుంచి బయట పడడం ఎలా బయట పడాల్సింది నువ్వు కాదు నీ బ్రెయిన్ నీ
(08:11) బ్రెయిన్ బయట పడితే నువ్వు పడినట్టే దయచేసి ఇంట్లో ఉన్నప్పుడైనా ఏదైనా వర్క్ లో ఉన్నప్పుడైనా లేదా ఆఫీస్ లో ఉన్నప్పుడైనా సరే మీ ఫోన్ ని జేబిలో పెట్టుకోవడం చేత లో పెట్టుకోవడం వదిలేయండి. అయితే లాకర్ లోనో లేదా టేబుల్ మీద పెట్టే ప్రయత్నం చేయండి. మీకు అనవసరమైన ఉపయోగకరంగా లేని యాప్స్ యొక్క నోటిఫికేషన్స్ ని ఆఫ్ చేయండి.
(08:33) మీకు ఇష్టమైన పనిలో మీకు నచ్చిన పనిలో బిజీ అవ్వడానికి ప్రయత్నించండి. నడవడము, ఫిజికల్ యాక్టివిటీస్ చేయడము వ్యాయామాలు లాంటివి చేసే వాటిల్లో టైం ని స్పెండ్ చేయండి. మరీ ముఖ్యంగా మనుషులతో నేరుగా డైరెక్ట్ గా మాట్లాడేదానికి టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఇవన్నీ మాక్సిమం వీలైనంత ఎక్కువగా రోజులో మీరు చేసిన తర్వాతే మిగిలిన టైం ఏదైనా ఉంటే అప్పుడు మొబైల్ లోకి వెళ్లి మీరు సోషల్ అవేర్నెస్ ని పెంచుకునే ప్రయత్నం చేయండి.
(09:04) ఇలా చేసిన కారణంగా మీ బ్రెయిన్ నెమ్మదిగా అలవాటు పడుతుంది. ఎలా అయితే ఫోన్ లూప్లోకి వెళ్ళిందో ఆ వెళ్ళిన కారణం దానికి చిన్న ఆనందం కావాలి. మీకు ఇష్టమైన పనిలోనూ మీకు ఇష్టమైన వారితో నేరుగా మాట్లాడడంలోనూ మీకు ఇష్టమైన పని చేసే దాంట్లోనూ ఆనందం ఉంటుంది కాబట్టి ఇలా మీరు రోజు చేస్తూ ఉండగా మీ బ్రెయిన్ ఈ రకంగా డైవర్ట్ అవుతుంది.
(09:26) ఇలా బ్యాలెన్స్ చేయడం కారణంగా ఇది మీ మానసిక పరిస్థితికి ఎంతో మంచిగా పనిచేస్తుంది. సొసైటీ నుంచి కావలసిన అవేర్నెస్ ని మీరు కోల్పోకుండా ఉంటారు. గాయస్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి. ఈ టాపిక్ మీద మీ ఉద్దేశం ఏదైనా గన కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోలు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ ముందుకు రావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment