స్త్రీ స్వేచ్చ గురించి సనాతన ధర్మం లోని గొప్ప రహస్యం - sagar sindhuri video on women dressing
https://youtu.be/8StUfXiA4sw?si=abhiZ33QajIri3nL
https://www.youtube.com/watch?v=8StUfXiA4sw
Transcript:
(00:03) [సంగీతం] [సంగీతం] అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాగర్ సింధూరి YouTube ఛానల్ చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి విషయంతో నేను మీ ముందుకు వస్తున్నాను ప్రస్తుతం సమాజంలో చాలా అనేక వివాదాస్పదమైనటువంటి సంఘటనలు సందర్భాలు నడుస్తూ ఉన్నాయి. స్త్రీల యొక్క స్వేచ్ఛ గురించి వారి యొక్క వస్త్రధారణ గురించి అలాగే హైందవ సనాతన ధర్మం అని సనాతన ధర్మ కట్టుబాట్లని సనాతన ధర్మాన్ని అందులోని దేవీ దేవతలను కించపరుస్తున్నారని అనేక విధమైనటువంటి అంశాలు నిత్యం సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి.
(01:03) నేను మొదట ఈ సున్నితమైనటువంటి విషయం గురించి మాట్లాడాలనుకోలేదు ఎందుకంటే సాగర్ సింధూరి YouTube ఛానల్ లో కేవలం జ్ఞానం బోధించబడుతుంది తప్ప వివాదాస్పదమైనటువంటి ఎటువంటి కాంట్రవర్షియల్ వీడియోలు నేను చేయాలనుకోలేదు ఎప్పుడు కూడా కానీ ఇప్పుడు ప్రజలు దేన్నైతే ఎక్కువగా చూస్తూ ఉన్నారో అది వారి యొక్క మనోభావాల పైన మనోఫలకం పైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్త స్తుంది మరి చాలామందికి స్త్రీకి తనకు నచ్చిన విధమైనటువంటి వస్త్రధారణ చేసుకునే స్వేచ్ఛ లేదా మగవాడితో పాటు సమానమైనటువంటి స్వేచ్ఛ లేదా అదేవిధంగా సనాతన ధర్మం అని చెప్పి జరుగుతున్నటువంటి
(01:49) అనేక వివాదాల పైన మనం మొదట ఒక అవగాహన తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒక శాస్త్ర బద్ధమైనటువంటి అవగాహన అంటే మరి స్త్రీల వసధారణ గురించి సనాతన ధర్మం హైందవ ధర్మం గురించి మనకు ప్రమాణం ఏంటంటే వేదంలో ఉపనిషత్తుల్లో మన యొక్క మత గ్రంథాల్లో ఏదైతే చెప్పబడి ఉందో అదే మనకు ప్రమాణం. మరి వేద ప్రామాణికంగా ఏది తప్పు ఏది సరైనది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అదే విషయాన్ని అందరికీ అవగాహన కలిగించాలి.
(02:28) ముఖ్యంగా భగవద్గీత ఒక విషయం చెప్తుంది ఎవరైతే నాయకులై ఉంటారో జ్ఞానులై ఉంటారో మహాత్ములై ఉంటారో లీడర్స్ అయి ఉంటారో ఎవరికైతే జనాకర్షణ ఎక్కువగా ఉంటుందో వారు ఏ ప్రమాణాలను ఏ స్టాండర్డ్స్ అయితే నిలుపుతారో వాటినే మిగిలిన వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అంటే మహాత్ములు గొప్పవారు ఏదైతే ప్రమాణాన్ని నిలుపుతారో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో సమాజంలో అటువంటి ప్రవర్తనని మిగిలిన వాళ్ళు కూడా అనుసరిస్తారు.
(03:02) ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మన యొక్క సనాతన ధర్మం నేను చెప్తున్నది హిందూ ధర్మం అని కాదండి సనాతన ధర్మం ఈ సనాతన ధర్మానికి హిందూ మతానికి చాలా తేడా ఉంది అది మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. మరి సనాతన ధర్మంలో స్త్రీ యొక్క స్వేచ్ఛ గురించి ఏం చెప్పింది అంటే చూడండి ధర్మం ఎప్పుడూ కూడా పురుషుడికి ఒక రకంగాను స్త్రీకి ఒక రకంగాను ఎక్కడా బోధించబడలేదు.
(03:38) కేవలం ధర్మం ఏం చెప్తుందంటే ఒక మనిషి అది ఆడ గాని మగ గాని వారి యొక్క నైతిక ప్రవర్తన గురించి మాత్రమే బోధిస్తుంది. ఈ ధర్మం మరిక ఏం చెప్తూ ఉంది ఈ యొక్క స్త్రీల వస్త్రధారణ గురించి చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు పెద్ద పెద్ద మూవీ స్టార్స్ కావచ్చు లేదా బాగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఈ సభలో సమావేశాల్లో జరిగినప్పుడు వారు చేసుకుంటున్నటువంటి వస్త్రధారణ వివాదాస్పదం అయిపోతుంది.
(04:14) ప్రస్తుతం మన దేశంలో మన రాష్ట్రంలో మన చుట్టూ సమాజం చుట్టూ ఉన్నటువంటి అనేకానేక విపరీత సమస్యలన్నిటిని పక్కన పెట్టి ఇదే సమస్యల పైన నెలలుగా వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. మరి గొప్ప గొప్ప సమస్యలన్నీ నిజమైనటువంటి సమస్యలన్నీ కూడా మసగపారిపోతున్నాయి ఈ యొక్క వివాదాల వలన అందుకనే మనం ధర్మబద్ధంగా ఈ యొక్క విషయం గురించి సున్నితమైన విషయం గురించి మాట్లాడుకుందాం.
(04:45) మొదట స్త్రీ స్వేచ్ఛ చూడండి స్వ ఇచ్చ అంటే తన సొంత కోరిక స్వేచ్ఛ అంటే మరి స్వేచ్ఛ స్త్రీకి పురుషుడికి సమానంగా ఉంటుందా అంటే ఉంటుంది కానీ ఎక్కడి వరకు అంటే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా పర్సనల్ గా అంటే నాలుగు గోడల మధ్య వరకు స్త్రీ ఎలా ఉన్నా తన వసధారణ ఎలా ఉన్నా పురుషుడు ఎలా ఉన్నా ఎవరు అబ్జెక్షన్ చెప్ చెప్పరు కానీ ఈ వ్యక్తిగత స్వేచ్ఛ సమాజంలోకి వచ్చేసరికి బయటకి వచ్చేసరికి కొన్ని కట్టుబాట్లను కోరుకుంటుంది.
(05:25) చూడండి ఒక గాలిపటం ఉంటుంది ఆ గాలిపటానికి అది దారానికి అతుక్కొని ఉన్నంత కాలము కూడా ఎలాగైనా గింగిరాలు కొట్టొచ్చు ఆకాశంలో ఎంత వేగంగా అయినా తిరగొచ్చు ఎలాగైనా స్వేచ్ఛగా కదలొచ్చు. కానీ ఎప్పుడైతే గాలిపటం తన దారాన్ని తెంచేసుకుంటుందో స్వేచ్ఛ పేరుతో అప్పుడు ఆ యొక్క నష్టం ఆ గాలిపటానికి ఉంటుంది. ఇక్కడ కూడా స్వేచ్ఛ మనిషికి ఇవ్వబడింది తాను సౌఖ్యంగా ఉండటానికి కానీ సమాజం యొక్క సౌఖ్యాన్ని సమాజం యొక్క కట్టుబాటలను గంధ్రగోళంలో పడేటట్టుగా ఉండకూడదు.
(06:02) చూడండి ఎందుకు స్త్రీ యొక్క వస్త్రధారణ గురించి కేవలం ఈ యొక్క హైందవ మతంలో కొన్ని కట్టుబాట్లు పెట్టడం జరిగింది అంటే దీనికి నిజానికి ఇది తప్పా కాదా అన్నటువంటి విషయం కంటే స్త్రీ యొక్క భద్రత విషయం గురించి మాత్రమే శాస్త్రం మాట్లాడుతుంది ధర్మం మాట్లాడుతుంది. ధర్మం ఎప్పుడు చెప్తుంది స్త్రీ అణువణువున ఒక అపురూపమైనటువంటి అమూల్యమైనటువంటి ఒక వస్తువు ఒక ఎంటిటీ ఒక సంపద ఈ యొక్క సృష్టికి మూలము తనే సృష్టి యొక్క అభివృద్ధికి మూలం తనే జాతిని జాగృతం చేసే శక్తి కూడా తనే మరి అంతటి అపురూపమైనటువంటి ఆ సంపదను ఆ వస్తువును లేదా ఆ యొక్క శక్తిని మనం ప్రతి ఒక్కళ్ళు
(06:53) కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. స్త్రీలు కూడా తమ యొక్క రక్షణ యొక్క ఆ బాధ్యతను మొట్టమొదటగా తానే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకని మన ధర్మంలో కూడా స్త్రీ చక్కగా శరీరమంతా కప్పి ఉండేటట్టుగా వస్త్రధారణ చేసుకోవాలి అదేవిధంగా బొట్టు పెట్టుకోవాలి గాజులు వేసుకోవాలి అని ఎందుకు చెప్పబడింది అంటే చూడండి మామూలుగా స్త్రీ యొక్క శరీరము ప్రతి అవయవము ప్రతి భాగము కూడా నిజానికి ప్రపంచానికి ఆకర్షణీయంగాను అదేవిధంగా సౌందర్యాన్ని ఇనుముడింపు చేసే విధంగానే ఉంటుంది వారి యొక్క కోమలమైనటువంటి శరీరము సున్నితమైనటువంటి శరీరము ఎప్పుడూ కూడా ఎదుటి వారి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.
(07:44) మరి ఇక్కడ ఇక్కడే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఉంది అందరికీ కనపడినటువంటి విషయం చూడండి మనకు ఒక పసిబిడ్డ ఉంటుంది ఆ పసిబిడ్డ చాలా బాగా ముస్తాబు చేసి అలాగ వీధుల్లో తిప్పుతున్నప్పుడు చాలామంది ఆ బిడ్డను చూసి ఆ మురిసిపోతూ ఉంటారు. దాని వల్ల వారికి దిష్టి తగులుతూ ఉంటుంది. వాళ్ళు చాలా నీరసపడిపోతూ ఉంటారు జ్వరం తెచ్చుకుంటూ ఉంటారు వాంతులు విరేచనాలు తెచ్చుకుంటూ ఉంటారు.
(08:14) వాళ్ళు శక్తిహీనులు అయిపోతూ ఉంటారు. కారణం ఏమంటంటే ఎవరైతే చెడు దృక్పతం చేత చెడు దృష్టి చేత అసూయ చేత వారిని చూసినప్పుడల్లా అందమైన వస్తువు లేదా విషయాన్ని చూసినప్పుడల్లా మనుషుల యొక్క మనోభావాల్లో అనేక రకాల ఆలోచనలు వస్తాయి. మరి ఆలోచన అంటే కేవలం ఆలోచన కాదు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూస్తున్నాడు అంటే అర్థము తన యొక్క థాట్ ఎనర్జీని వారికి పంపిస్తూ ఉన్నాడు అని అర్థం చూడండి ఒక అందమైన వస్తువును నిరంతరం మనం చూస్తాం అది చెడు దృష్టితో చూస్తే గనుక మన యొక్క నెగిటివ్ ఎనర్జీ వాటికి తగులుతుంది అవి తమ శక్తిని కోల్పోతాయి.
(08:55) మరి స్త్రీకి స్త్రీ యొక్క అన్ని భాగాలు ఆకర్షణీయంగానే ఉండాలనటువంటి ఉద్దేశంతో వారు అలా వస్తధారణ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కళలో కూడా సహజంగానే వారిని చూస్తూ ఉండడం జరుగుతుంది. మరి తను ఏటువంటి వస్త్రధారణలో ఉంటుందో అటువంటి భావాలు ఇతరుల మనసుల్లో చోటు చేసుకుంటాయి. లోకం ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మనుషుల యొక్క విషం నిన్నటువంటి ఆలోచనల్లో పవిత్రమైనటువంటి దైవీకమైనటువంటి మంచి భావాల కంటే కూడా చెడు భావాలే ఎక్కువగా ఉంటున్నాయి అనేది నగ్నసత్యం అది మరి ఒక స్త్రీ చాలా ఆకర్షణీయంగా తన యొక్క అవయవాలు కనిపించేలాగా వసధారణ చేసుకున్నప్పుడు అనేకమంది విపరీతమైనటువంటి దృష్టి చేత ఏమికా
(09:46) కామపూరితమైనటువంటి దృష్టి చేత చెడు దృష్టి చేత వాళ్ళని చూడడం జరుగుతుంది. వాళ్ళు చూస్తున్నారంటే మీకు శక్తిని పంపిస్తున్నారు అని అర్థం. మరి ఆ శక్తి మీ యొక్క క్షేత్ర శక్తిని దెబ్బదిస్తుంది మీ యొక్క ఆరోగ్యాన్ని దెబ్బదిస్తుంది మీ యొక్క కీర్తిని దెబ్బదిస్తుంది మీ యొక్క చరిష్మను దెబ్బదిస్తుంది. అందుకే ఏ భాగాలనైతే భాగాల వైపు అయితే అవయవాల వైపు అయితే ఒక పురుషుని యొక్క దృష్టి పడుతుందో ఆ భాగాలను కప్పుకునే విధంగా మన ధర్మం ఒక వస్త్రధారణ నియమాన్ని ఉంచడం జరిగింది.
(10:21) మరి బొట్టు ఎందుకు పెట్టుకుంటారు చూడండి బొట్టు పెట్టుకోవడం వల్ల ఇది ఒక సాంప్రదాయము కాదు ఒక కట్టుబాటు కాదు దానికంటే ముఖ్యంగా మనకు కనపడినటువంటి శక్తి రహస్యం ఒక ఆధ్యాత్మిక రహస్యం ఇక్కడ దాగి ఉంటుంది. ఏంటంటే ఒకవేళ ఎదుటి ప్రపంచం బాహ్యమైనటువంటి వ్యక్తులు తమ వైపుకు శక్తిని ప్రసరింపజేస్తే తమ యొక్క దృష్టి ద్వారా అన్నిటికంటే వేగంగా శక్తిని లోపలికి తీసుకునే భాగం ఏదంటే ఈ యొక్క బ్రో మధ్య భాగం అక్కడ ఆజ్ఞ చక్రం ఉంటుంది.
(11:00) మనం శక్తిని బయటికి పోగొట్టుకునేది ఈ ద్వారం ద్వారానే బయట నుంచి లోపలికి తీసుకునేది కూడా ఈ ద్వారం ద్వారానే అంటే ఒక స్త్రీ తనను ఒక చిన్న లేయర్ లో ఒక బొట్టు పెట్టుకున్నట్లయితే గనుక బయట నుంచి వచ్చే అనేక చెడు శక్తులను చెడు దృష్టిని అక్కడికే ఆపేయగలుగుతుంది. లేదంటే అవన్నీ కూడా తన లోపలికి ప్రవహిస్తాయి. అదేవిధంగా పురుషుడితో పోల్చుకుంటే స్త్రీకి మానసికమైనటువంటి ఆ ఫ్లక్చువేషన్స్ స్త్రీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది అనేక అనేక ఆలోచనలు చేస్తుంది అనేక విషయాల గురించి ఆలోచిస్తుంది.
(11:42) చెప్పాలంటే పురుషుడి కంటే స్త్రీకి మనసు కొంచెం చంచలంగా ఉంటుంది ఎందుకంటే అది తమ యొక్క ప్రకృతి తమ యొక్క బాడీ మెకానిజం స్త్రీ ఆ విధంగా తయారు చేయబడి ఉంది. మరి స్త్రీ తమ యొక్క అనేక అనేక మానసిక చంచలత్వమైనటువంటి ఆలోచనల ద్వారా అనేక శక్తిని కోల్పోతుంది. ఎంతో శక్తిని కోల్పోతుంది. ఏ ద్వారం గుండా అంటే ఈ భ్రూమధ్య ద్వారం గుండా మరి తనలో ఉన్న శక్తిని కోల్పోకుండా బయట నుంచి వచ్చే చెడు శక్తిని లోనికి తీసుకోకుండా ఒక రక్షణ ద్వారాన్ని మన ధర్మం ఏర్పాటు చేసింది దాన్నే మనం సింధూరం బొట్టు అంటాం.
(12:20) ఇది పురుషుడికి కూడా వర్తిస్తుంది. కాకపోతే స్త్రీ పురుషుడి పై కంటే స్త్రీ పైన ప్రపంచం యొక్క దృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్త్రీకి తప్పనిసరి బొట్టు పెట్టుకోవడం ఆ బొట్టు పెట్టుకోవడం ద్వారా చెడు శక్తి నుంచి తాను రక్షించబడుతుంది. అదేవిధంగా ఒక పురుషుడు నిండుగా విభోది పెట్టుకొని బొట్టు పెట్టుకొని బయట సమాజంలో నడుస్తున్నప్పుడు అతను మొదటగా తాను తప్పు చేయలేడు.
(12:52) ఒక చెడు ప్రదేశానికి వెళ్ళలేడు. ఒక మనుషులు అసహించుకునే ప్రదేశానికి వెళ్ళలేడు. మనుషులకు వికారం కలిగించే మాటలు మాట్లాడలేడు అదేవిధంగా తన ప్రవర్తనను ఎప్పుడు తను కంట్రోల్ లో పెట్టుకుంటాడు కేవలం ఆ విభోది ధారణ లేదా ఆ బొట్టును ధారణ చేయడం చేత అంటే చెప్పకనే చెప్తున్నాడు నేను ఒక సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నాను ఒక దైవిక జీవనానికి కట్టుబడి ఉన్నాను ఎదుటివారు కూడా నాతో అలాగే ప్రవర్తించండి అన్నటువంటి ఇండికేషన్ే బొట్టు పెట్టుకోవడం మరి స్త్రీ కూడా అంతే మగవాడు ఒకవేళ స్త్రీ బొట్టు పెట్టుకున్నట్లయితే గనుక కేవలం మగవాడి యొక్క చూపు ముఖం దగ్గర వరకే
(13:31) ఆగిపోతుంది. ఎందుకంటే ఆ యొక్క బొట్టు పెట్టుకోవడం అని చేత ఆ ముఖం అంతలాగా ఆకర్షింపజేస్తుంది. మరి ఎప్పుడైతే బొట్టు పెట్టుకోలేదో ఆ చూపులు శరీరం మొత్తాన్ని స్కాన్ చేస్తాయి. మరి ఈ యొక్క బొట్టు ఎలా అంటే ఒక ట్రాఫిక్ సిగ్నల్ లాగా పనిచేస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది నిజానికి అది అన్ని ట్రాఫిక్ రూల్స్ తెలిసిన వాళ్ళకి అందరూ తెలుసుకునే ఉంటారు కదా మరి ట్రాఫిక్ సిగ్నల్ ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు.
(14:02) తెలిసినా తెలియకపోయినా ట్రాఫిక్ సవ్యంగా ఉండేద్దు అని సిగ్నల్ పెడతారు. అంటే అక్కడికి వచ్చిన తర్వాత వేగం నియంత్రించబడుతుంది. అదేవిధంగా ఒక రాష్ డ్రైవింగ్ నియంత్రించబడుతుంది. ఒక కట్టుబాటు మొదలవుతుంది అక్కడి నుంచి కూడా అదేవిధంగా బొట్టు పెట్టుకోవడం చేత స్త్రీ ఆ బొట్టు పెట్టుకోవడం చేత ఎదుటివారు తనను ఏ దృష్టితో చూడాలో ఆమె చెప్పకనే చెబుతుంది.
(14:28) అత్యంత ముఖ్యంగా తాను ఒక ఆ గృహస్తు ధర్మంలో ఉన్నానో లేదంటే ఒక సాంప్రదాయంలో ఒక కట్టుబాటుకు కట్టుబడి ఉన్నాననో ఒక ధర్మం కింద నడుస్తూ ఉన్నానో తనను ప్రపంచం ఎలా చూడాలో తాను ఇండికేషన్ ఇస్తుంది బొట్టు పెట్టుకోవడం ద్వారా పోలీసులు సివిల్ డ్రస్ లో ఉన్నప్పుడు కాకుండా యూనిఫామ్ వేసుకోంగానే వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది. ఒక స్టూడెంట్ యూనిఫామ్ వేసుకోంగానే క్రమశిక్షణ వచ్చేస్తుంది అంటే మన వేషధారణ చేత ప్రపంచం ఏమనుకుంటుంది అనేదాని కంటే కూడా మన యొక్క బిహేవియర్ మారిపోతూ ఉంటుంది.
(15:01) అదేవిధంగా స్త్రీ బొట్టు పెట్టుకోవడం చేత తన సౌందర్యము వినవడిస్తుంది తన యొక్క గౌరవం కూడా వినవడిస్తుంది. మరి అర్ధనగ్నంగా శరీర అవయవాలు కనిపించేలాగా ఒక వ్యక్తి వస్త్రధారణ చేసుకుని వస్తున్నాడు లేదా వస్తుంది అంటే వారు ప్రపంచం తనను ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నారు వారి ఇంటెన్షన్ లోపల ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి అనేది జాగ్రత్తగా గమనించుకోవాల్సి ఉంటుంది.
(15:27) మీరు ఏ యత్ భావం తద్భవతి మీరు ఏ భావంతో అయితే కనిపిస్తారో అనుకుంటారో ఆలోచిస్తారో బయట నుంచి అదే ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఒక స్త్రీ నిండుగా చీర కట్టుకొనో లేదా సాంప్రదాయం ప్రకారం నిండైన వస్త్రాలు ధరించి ముఖాన బొట్టు పెట్టుకొని కనిపించినప్పుడు వారు అనుకుంటారు ప్రపంచం అంతా తమని గౌరవించాలని తమని తక్కువగా చూడకూడదని తమను వేరే ఉద్దేశంతో చూడకూడదు అని ప్రపంచం కూడా అలాగే ప్రవర్తిస్తుంది.
(16:00) అదే స్త్రీ మరి తన శరీరం కనిపించేటట్టుగా వసదానం చేసుకుంటుంది ఉంటుంది అంటే ప్రపంచమంతా తనను చూసి ఆకర్షింపబడాలని అనుకుంటూ ఉంటుంది. మరి స్వేచ్ఛ మాకు స్వేచ్ఛ లేదా అంటే స్వేచ్ఛ ఉంటుంది తలుపు వెనకాల ఒక గదిలో ఉన్నప్పుడు నీ వసధారణ ఇలా ఉన్నా పర్వాలేదు కానీ సమాజంలోకి వచ్చిన తర్వాత సమాజానికి యొక్క సామాజిక స్వేచ్ఛ ఉంటుంది దీనికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి ఎందుకంటే మీ యొక్క అపీయరిన్స్ ఎదుటివాడి హృదయాన్ని ఎదుటివాడి మనసును గందరగోళం చేయకూడదు ఎందుకంటే ఒక వాక్యం ఉంది మన వేదనలో మనం విగ్రహాన్ని విగ్రహాన్ని కి దండం పెడితే ఆత్మకు దండం పెడుతున్నాం అనేటువంటి అర్థం
(16:41) అది ఇక్కడ కూడా అంతే మన విగ్రహం అనేది ఎదుటివాడి మనసులో అనేక రకాల ముద్రలను వేస్తుంది. మరి చూడండి దేవతా విగ్రహాల కూడా నిండుగా బట్టలు పెట్టి బొట్టు పెడతారు. ఆ బొట్టు చేత దైవత్వం ఒట్టిపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా స్త్రీలు ఒక గొప్ప సెలబ్రిటీలు కావచ్చు లేదా చాలా మంది ఫాలోవయర్స్ ఉన్నవాళ్ళు కావచ్చు మీరు ఎలాంటి పద్ధతిలో 10 మందిలో ప్రవర్తిస్తారో ఎలాంటి వస్త్రధారంతో వేషధారణతో హావభావాలతో కనిపిస్తారో అలాంటి బిహేవియర్ నే ఆడపిల్లలందరూ కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది.
(17:20) ఇలాంటి బట్టలు వేసుకోవడం తప్పేమీ కాదు అన్నటువంటి భావన వారిలో కలుగుతుంది. ఇక్కడ తప్పప్పుల గురించి నేను మాట్లాడటం లేదు కేవలం స్త్రీ యొక్క భద్రత గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఒక సెలబ్రిటీ ఎలా ఉన్నా కూడా వారికి బాడీగార్డ్స్ ఉంటారు వారికి రక్షణ వలయం ఉంటుంది. మరి ఒక సాధారణ ఆడపిల్లకి బాడీగార్డ్స్ ఉండరు వారిని రక్షించేవారు అందుబాటులో ఉండరు.
(17:44) తమను తామే రక్షించుకోవాల్సి ఉంటుంది. మరి ఆ వస్త్రధారణ చేత కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడు దృష్టి సరిగా లేనటువంటి మనుషులు ఇక్కడ నేను కేవలం ఎలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను అంటే దృష్టిలో అశుద్ధత ఉన్న వాళ్ళ గురించి దృష్టి దోషం ఉన్నవాళ్ళ గురించి స్త్రీని దోష దృష్టి చూసే మగవాళ్ళ గురించి మాట్లాడ వాళ్ళ నుంచి రక్షణ పొందడం స్త్రీకి మొదటి కర్తవ్యం.
(18:09) మరి సెలబ్రిటీలను చూసి స్త్రీలందరూ లేదా పడు పిల్లలందరూ కూడా అదే విధమైనటువంటి ఆచరణ మీరు చేస్తే అనుసరిస్తే గనుక మీ యొక్క భద్రత మీ యొక్క ఆరోగ్యము మీ యొక్క శక్తి ఇది దెబ్బతింటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళళ కూడా సమాజాన్ని కలవర పెట్టకుండా సమాజంలో అనేక రకాల వివాద వివాదాలు జరగకుండా చూడండి చిన్న రెండు మూడు సంఘటనల్లో రెండు నెలల నుంచి కూడా ఇదే విధమైన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి ప్రజలు మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తేనే ఏం కనిపిస్తుంది అంటే కేవలం ఇదే విషయాలు కనిపిస్తున్నాయి.
(18:51) మరి ఇవైనా సమస్యలు ఉన్నాయి ప్రపంచంలో మన భారతదేశంలో ఎన్ని అనేక రకాల ఆకలి చావులు అనేక రకాల వైద్యం అందక చావులు అనేక రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈ సమకాలీన సమస్యలన్నీ వీటి చేత మరుగున విడిపోయి జనానికి అశాంతి మిగులుతుంది దుఃఖం మిగులుతుంది. కాబట్టి బాధ్యతగా ప్రవర్తించడం అంటే తమను తాము రక్షించుకోవడంతో పాటు తాము ధర్మానికి కట్టుబడి ఉన్నాము తమతో సరిగా ప్రవర్తించండి అన్నటువంటి బాధ్యత ఆ ఇండికేషన్ మనం తెలియజేసినట్టు కాబట్టి స్థిర్ యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత స్త్రీలు ఎక్కడ దైవీక భావన చేత దోష దృష్టి లేకుండా పూజించబడతారో గౌరవించబడతారో
(19:36) అక్కడ దేవతలు కూడా పూజించబడతారు. మరి స్త్రీ పూజించబడే స్థాయిలో నమస్కరించే స్థాయిలో గౌరవించే స్థాయిలో తనని తాను రిప్రజెంట్ చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక కొంతమంది పెద్దవారు సినీ ప్రముఖులు కావచ్చు రాజకీయ ప్రముఖులు కావచ్చు అనేకమంది కావచ్చు స్త్రీ తనకు స్వేచ్ఛ ఉంది మగవాడితో పాటు ఆ తను ఎలాగైనా మగవాడితో సమానంగా బ్రతకొచ్చు తనకు నచ్చిన వసధారణ చేసే హక్కు తనకు ఉంది.
(20:09) ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి. ఒక మగవాడు షర్టు విప్పి ఇంట్లోనూ ఉండగలుగుతాడు బయట కూడా వచ్చి వీధిలో కూడా తిరగగలుగుతాడు. అంటే అతనికి స్వేచ్ఛకు కొంచెం పరిమితి పెరిగింది కానీ సొంత స్త్రీ తన సొంత కుటుంబ సభ్యుల మధ్య అయిన తన బెడ్రూమ్లో నుంచో ఆ విధంగా ఆ వస్త్రధారణ సరిగా లేకుండా హాల్లో వచ్చి కుటుంబంలో హాల్లో వచ్చి నిలబడుకోలేదు తలుపు తీసుకొని బయటక వచ్చి నిలబడుకోలేదు.
(20:41) ఎప్పుడైతే మరి వ్యక్తిగతమైన స్వేచ్ఛ సమాజానికి పాకిపోతుందో అప్పుడు వారు అపకీర్తి పాలవుతారు వారు అంతవరకు సంపాదించినటువంటి గొప్ప శక్తిని పేరును కూడా పోగొట్టుకుంటారు సమాజాన్ని అల్లకల్లలం చేసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా తమను చూసి ఫాలో అవుతూ తమని అభిమానించే ఎంతోమందికి వారు మిస్లీడ్ చేసినట్టు వారికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీలు సామాజిక బాధ్యతను అనుసరించి తమ భద్రతను అనుసరించి తమ యొక్క వేషధారణను మన యొక్క ధర్మం ఆధారంగా మన ధర్మానికి కట్టుబడి వారు సరిదిద్దుకోవాల్సి ఉంటుంది.
(21:23) ధర్మం అంటే ఏం చెప్తుంది ఏ స్థలంలో ఏ కాలంలో ఏ దేశకాల మాన పరిస్థితుల్లో మనిషి ప్రపంచంతో ఎలా ప్రవర్తించాలో అదే చెప్తుంది దాన్నే ధర్మం అంటారు. చూడండి కొంతమంది ఆ ధర్మాన్ని తప్పారు వెంటనే ధర్మము శిక్షిస్తుంది. మీరు ధర్మాన్ని తప్పితే ధర్మమే మిమ్మల్ని శిక్షిస్తుంది. మీరు ధర్మానికి కట్టుబడి ధర్మాన్ని రక్షిస్తే ధర్మం ప్రకారం ప్రవర్తిస్తే అది ఆ ధర్మమే మిమ్మల్ని రక్షించి మీకు మిమ్మల్ని పూజనీయులు చేస్తుంది.
(21:57) కాబట్టి స్త్రీ మూర్తులందరికీ అమ్మలందరికీ చెల్లెలందరికీ అక్కలందరికీ కూడా ముందుగా మీ రక్షణ బాధ్యతను మీరు తీసుకోండి మీ ప్రవర్తన హుందాగా ఉండేటట్టుగా మీ వస్త్రధారణ లోకానికి ఒక ప్రమాణంగా ఉండేటట్టుగా మిమ్మల్ని ఎటువంటి సందేహం లేకుండా నిర్భయంగా మిమ్మల్ని అనుసరించేటట్టుగా మీరు రిప్రజెంటేటివ్స్ గా స్త్రీ లోకానికి అంబాసిడర్స్ గా ఉండండి.
(22:23) కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ అర్థం చేసుకుని ఈ వివాదాలను పక్కన పెట్టి మరి సమకాలీనటువంటి సమస్యలపైన దృష్టి పెడతారని మన ప్రవర్తనని మనం చక్కదిద్దుకోవడమే ధర్మంగా నడుచుకోవడం అంటే నమస్తే థాంక్యూ వెరీ మచ్ ఓం [సంగీతం]
No comments:
Post a Comment