Saturday, January 10, 2026

ఇంద్రియ నిగ్రహం

 ఇంద్రియ నిగ్రహం

పూర్వం అష్టావక్రుడు అనే బ్రహ్మచారి గురువు వద్ద విద్యలన్నీ నేర్చుకొని గృహ స్థాశ్రమం పొందేటందుకు సిద్ధమయ్యాడు. అతడలా కన్య కోసం అన్వేషణ జరుపుతుండగా వదాన్యుడు అనే ఒక తాపసోత్తముని కుమార్తె సుప్రభ అతనికి ఎదురుపడింది. అష్టావక్రుడు తొలిచూపులోనే ఆమెను ఇష్టపడి తన అర్ధాంగిగా స్వీకరించేందుకు నిశ్చయించుకున్నాడు. వదాన్యుడి వద్దకు వెళ్ళి వినయంగా విషయం చెప్పాడు.

తన కుమార్తెను వివాహమాడటానికి అష్టావక్రుడు ఎంత వరకు యోగ్యుడో తెలుసు కోవాలనుకున్నాడు. అందుకు వదాన్యుడు ఒక పరీక్ష పెట్టాలనుకుని అష్టావక్రునితో ఇలా అన్నాడు. తన కుమార్తెనిచ్చి వివాహం చేయటానికి తనకు అభ్యంతరమేమీ లేదనీ, అయితే అందుకు ఒకసారి ఉత్తరదిశగా వెళ్ళి రావలసి ఉంటుంది అన్నాడు.

అష్టావక్రుడు ఆ దిక్కుగా వెళ్ళి తాను ఏం చేయాలో సెలవివ్వవలసిందిగా కోరాడు. మొదట కుబేరుని రాజధానికి వెళ్లమనీ, ఆ తర్వాత హిమాలయాలలో పార్వతీదేవి తపమాచరించిన ప్రదేశానికి వెళ్లిరమ్మని వదాన్యుడు చెప్పాడు. అష్టావక్రుడు అందుకంగీకరించి ఉత్తర దిశగా వెళ్ళి మొదట కుబేరుని రాజధాని హిమగిరిని చేరుకున్నాడు. పార్వతీ పరమేశ్వరుల క్రీడాస్థలిని దర్శించి భక్తితో నమస్కరించాడు. అక్కడి నుండి ముందుకు సాగగా ఒక అరణ్యం చేరుకున్నాడు. అక్కడ ఒక గొప్ప భవనం కనిపించింది. ఆ భవనం వద్ద ఉన్న అందమైన యువతులు అతడిని లోపలికి ఆహ్వానించి సాదరంగా తీసుకెళ్లారు. అక్కడొక స్త్రీ అందాలొలికిస్తూ ఠీవిగా ఆసీనురాలై ఉంది. ఆమె అక్కడున్న వారందరిని పంపించివేసి, ఏకాంతంలో అష్టావక్రుడి సరసన చేరి, అతడిని సరసానికి ప్రేరేపించింది. అవకావశం దొరికినా ఏ మాత్రం చలించక నిబ్బరంగా ఉండిపోయాడు. చలించని అతడిని చూచి పట్టుదలతో మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసేసరికి అష్టావక్రుడు ఇక లాభం లేదని "అమ్మా నీవెవరివో కానీ నన్ను నీ అందచందాలతో, హావ భావాలతో రెచ్చగొట్టి చలించేటట్టు చేస్తున్నావు. కానీ నేను ఇపుడే బ్రహ్మ చర్య దీక్షను పూర్తి చేసి గృహస్థాశ్రమంలోకి అడుగిడబోతున్న వాడిని. సుప్రభ అనే యువతిని వివాహమాడాలని, తన జీవిత భాగస్వామినిగా చేసుకోవాలని మానసికంగా నిశ్చయించుకున్నాను. కావున నీవు ఎంతగా ప్రయత్నించి, ప్రేరేపించినా నాలో చలనం కలగలేదు. కలగదు కూడా" అని వినయంగా చెప్పాడు.

అష్టావక్రుడి బ్రహ్మచర్యదీక్షకు ఆ స్త్రీ ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత అమె తాను దేవతలు నిన్ను పరీక్షించుటకు పంపగా వచ్చిన మాయా కన్యకను. కఠిసమైన ఈ పరీక్షలో అద్వితీయమైన బ్రహ్మచర్యవ్రత నిష్టను పాటించి నెగ్గావు. నిష్టాగరిష్టుడవైన నీకు ఇవే నా నమస్సులు అని చెప్పి వెళ్ళిపోయింది.

మానవతా విలువలు Manavatha viluvalu book page no- 254



* ఎప్పుడైనా ఏ కాలానికైనా గృహస్థాశ్రమానికి ఇంద్రియ నిగ్రహం ఉన్న యువతీ యువకులే అర్హులు.

ఈనాడు యువతీ యువకులు చాలా సులభంగా ఇంద్రియ లోలత్వానికి గురైపోతున్నారు. దానికి కారణం 'శీలం' అనే మాటను పూర్తిగా మరచిపోవడమే. ఆరోగ్యాన్ని, పరువు ప్రతిష్టలను, తల్లిదండ్రుల ఆశలను, తమ జీవిత ఆశయాలను పూర్తిగా విస్మరించడమే.

* తమకున్న రూపలావణ్యాలు, వంపు సొంపులు మగవారికి చూపించడానికి, వారిని ఆకర్షించడానికే కదా ఉండేది అని, యువతులు బరితెగించిపోతున్నారు.

సహజంగా స్త్రీలు, తమ అందచందాలను ప్రశంసించే వారికీ, మెత్తగా, సున్నితంగా, నెమ్మదిగా బ్రతిమాలుతూ- వెంటపడే వారికీ ఒక వైపు తిరస్కరిస్తూనే, నిదానంగా లొంగిపోతున్నారు. స్త్రీల స్వభావాన్ని గుర్తెరిగి ఆ మాత్రం సహనం, ఓర్పు-నేర్పును చూపిస్తే చాలు తమ వాంఛ తీరిపోతుంది అనే విశ్వాసంతో ప్రయత్నించి యువకులు సఫలమవుతున్నారు.

* పురుషుడు కేవలం స్త్రీ అందచందాలకు దాసుడైపోతాడు. స్త్రీ పురుషుని లోని వ్యక్తిత్వాన్ని మాత్రమే చూచేది. మగవాడు స్త్రీ యొక్క అందాన్ని మాత్రమే ప్రేమిస్తాడు, వాంఛిస్తాడు. కానీ స్త్రీ మగవారిలో వ్యక్తిత్వాన్ని, శారీరక, మానసిక దృఢత్వాన్ని, తమ యొక్క భద్రతకు ప్రాధాన్యతను చూస్తారు. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు కామం - ఆకలిని తీర్చుకోవడంలాంటిదేనన్న తేలిక భావం స్త్రీ పురుషులలో బాగా నాటుకొనిపోయింది.


Book reference - Manavatha Viluvalu Page No: 254, 255.

Manavatha Viluvalu book is uploaded to archive.org web and book link - https://archive.org/details/manavatha-viluvalu

No comments:

Post a Comment