చిన్న వయసులోని లైంగిక సాన్నిహిత్యం మీపై ప్రభావం చూపుతుందా? Does Early Sexual Intimacy Affect You
https://youtu.be/wnF5Hj8Q1_4?si=UT31uT-H9za0SArc
https://www.youtube.com/watch?v=wnF5Hj8Q1_4
Transcript:
(00:02) [సంగీతం] 15 ఏళ్ల వయసులో మీరు భావోద్వేగపరంగా ఇరుక్కుపోతే అది మీ మనసును పూర్తిగా ఆక్రమిస్తుంది. పాతికేళ్ళ వచ్చేసరికి రెండు డజన్ల మంది భాగస్వాములను మార్చడం అది మిమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తుంది. మీరు శరీరాన్ని [సంగీతం] తెరిచిన క్షణం అది మీ మనసుకు అందని రీతిలో గుర్తుంచుకుంటుంది. మీ జీవితపు పూర్తి సామర్థ్యం వ్యక్తమవ్వదు.
(00:25) మీరు ఈ వ్యవస్థను గందరగోళానికి గురి చేస్తే నమస్కారం సద్గురు కౌమార దశలో త్వరగా లైంగిక అనుభవాలకు సంబంధాలకు లోనవడం వల్ల కలిగే ప్రభావం ఏమిటి? తల్లిదండ్రులు దీని గురించి ఏమి చేయగలరు. చూడండి జీవితంపై ఇతర ప్రభావాలు ఉదాహరణకు వాళ్ళు విద్య కోసం స్కూల్ లేదా కాలేజీకి వెళ్తారు. కానీ ఒకసారి ఈ దృష్టి వచ్చాక 15 ఏళ్ల వయసులో భావోద్వేగపరంగా ముడిపడితే లేదా శారీరకంగా ఏదో విధంగా ఎరుక్కుంటే అది మీ మనసును పూర్తిగా శాసిస్తుంది.
(01:04) దాన్ని మీ జీవితంలో ఒక భాగంగా నిర్వహించుకోలేరు. అదే మొత్తం అయిపోతుంది. మిమ్మల్ని మీరు నిర్మించుకోవాల్సిన సమయంలో అప్పుడే మీ శక్తులను హరించేసుకుంటున్నారు తెలుసా ఇది మిమ్మల్ని మీరు నిర్మించుకోవలసిన సమయం ఒక నిర్దిష్ట వయసు వచ్చేవరకు తద్వారా మీరు జీవితంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆ తర్వాత జీవితం మరోలా ఉంటుంది.
(01:28) కేవలం పూర్తిగా భౌతిక పరంగా మాట్లాడుతున్నాను. ఆధ్యాత్మిక ప్రక్రియ కాదు నేను చెప్పేది కేవలం ఒక సామాన్య మానవుడిగా ఉండే విషయంలో కూడా నైపుణ్యాలు సామర్థ్యాలు సంపాదించుకొని కనీసం ఒక మోస్తర జీవనం గడపాలనుకునే వ్యక్తిగా జీవిత ప్రయాణాన్ని సులభతరం చేసుకోవడానికి చూసే వ్యక్తి ఈ విషయాల్లోకి వెళ్తే చాలా తక్కువ మంది ఉంటారు. ఆ పనులు చేసి కూడా వాళ్ళ చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా కొనసాగించగలిగేవారు.
(01:52) మిగతా వాళ్ళు కుదేలు అవుతారు. అమెరికాలో స్కూల్ కి వెళ్లే పిల్లల్లో యూనివర్సిటీకి చేరుకుంటున్న వారి శాతం ఎంత అది గొప్పగా ఏమీ లేదనుకుంటాను వెరీ లో చాలా తక్కువ ఆ సంఖ్య ఎంతో నాకు తెలియదు కానీ అది తక్కువేనని నాకు తెలుసు ఎందుకంటే ఎంతమంది యువకులు ఎలా ఉన్నారో చూస్తే వాళ్ళ శాతం భారీగా పెరిగింది. వాళ్ళు కేవలం తెలుసా కొందరు బడి ఎగ్గొట్టే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు ఎక్కడైనా వాళ్ళ టీనేజ్ జీవితం యొక్క తిరుగుబాటు ధోరణి అది ఎప్పుడూ ఉంటుంది.
(02:26) టీనేజ్ లైఫ్ ఒక విభాగం ఉంటుంది కానీ ఆ విభాగం పెద్దదిగా అయినప్పుడు అది కచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. ఒక సమాజానికి ఒక దేశానికి అది ఒక ఆందోళన. ఆ విషయంపై శ్రద్ధ పెట్టకపోతే దేశం విలసిల్లదు. నాకు ఖచ్చితమైన సంఖ్యలు తెలియదు కానీ చాలా విధాలుగా అమెరికా స్థానానికి చేరుకుంటుంది. మీరు బయట దేశం నుండి అర్హులైన వారిని తెచ్చుకుంటే తప్ప మీకు ఏ పనికి అర్హులైన వారు ఉండరు.
(02:52) మరో పాతికేళ్ళలో మీకు రాప్ సంగీతకారులు బాస్కెట్ బాల్ క్రీడాకారులే ఉంటారు. మీకు ఇంకెవ్వరూ ఉండరు. ఇప్పటికే అది ఆ దిశగా వెళ్తోంది. మీరు ఒక దేశాన్ని బాస్కెట్ బాల్ క్రీడాకారులు రాప్ సంగీతకారులు ఇంకా ఏవో మసాజ్ థెరపిస్ట్లు అలాంటి వాళ్ళతో నిర్మించలేరు. నాకు వాళ్ళతో ఏ సమస్య లేదు విషయం ఏమిటంటే జనాభాలో వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్న వారి శాతాలు అది గణనీయంగా ఓ వైపుకు మొగ్గితే సుఖం వైపు మొగ్గితే ఆ దేశం ఆ సమాజం కచ్చితంగా నష్టపోతుంది.
(03:26) దురదృష్టవశాత్తు అమెరికా అటువైపే వెళ్తోంది. కొన్ని తరాలు ఒక గొప్ప దేశాన్ని నిర్మించాయి. ఇప్పుడు ఇది ఎటో వెళ్తుంది. సరే అది మళ్ళీ పుంజుకుంటుందని ఆశిద్దాం అది వేరే విషయం ఇక ఇది ఒకరి శక్తిపై చూపే ప్రభావం విషయానికి వస్తే దీని గురించి కొన్నిసార్లు మాట్లాడామ అనుకుంటాను. మీ శరీరం మీ మనసు మధ్యన వాటిని రెండు వేరు వేరు అస్తిత్వాలుగా చూడాలనుకుంటే చాలామంది వాటిని రెండు వేరు వేరు అస్తిత్వాలుగానే అనుభూతి చెందుతారు అవి కానప్పటికీ వీటిలో దేనికి ఎక్కువ జ్ఞాపక శక్తి ఉందని మీరు అనుకుంటున్నారు మీ శరీరానికా మనసుకా మీ మనసు కంటే మీ శరీరానికి ట్రిలియన్ రెట్లు
(04:04) ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంది చూడండి మీ ముత్తవ్వ ముక్కు ఇక్కడ మీ ముఖంపై ఉంది. మీ ముత్తవ్వ మీకు మానసికంగా గుర్తుందా లేదు మీ పూర్వీకులు లక్ష సంవత్సరాల క్రితం ఎలా ఉండేవారో గుర్తుందా అదంతా ఇక్కడే శరీరంలో ఉంది శరీరం ఈరోజుకే గుర్తుంచుకుంది. శరీరానికి అపారమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. కాబట్టి శరీరం యొక్క కొన్ని అంశాలు ప్రస్తుతం స్పర్శ యోగ అని ఒకటి ఉంది.
(04:37) స్పర్శ యోగ అంటే స్పర్శ యొక్క యోగ అర్థమైందా ద యోగ ఆఫ్ టచ్ నేను దీన్ని తాకితే ఇప్పుడు నిజానికి మీకు కూడా గుర్తుంటుంది మీరు దాన్ని యోగగా చేయలేదు దాన్ని వేరే ప్రక్రియగా చేశారు. మీరు ఈ ఫర్నిచర్ ని తాకితే మిమ్మల్ని మీ కళ్ళకు గంతలు కట్టి ఒక సంవత్సరం తర్వాత ఈ ఫర్నిచర్ ని తాకమంటే మీరు గుర్తించగలరు. ఇది అదే ఫర్నిచర్ అని అవునా అవునా కాదా గుర్తించలేరా గుర్తించగలరా లేదా అవును గుర్తించగలరు స్పర్శకు ఒక జ్ఞాపకం ఉంది కాబట్టి ఒక పూర్తి యోగ వ్యవస్థ ఉంది స్పర్శ జ్ఞాపక శక్తిని ఉపయోగించేది వాళ్ళు చేసేదల్లా వెళ్లి ఓ రాయిని తాకడం వెళ్లి ఓ చెట్టును తాకడం చెట్టును
(05:30) ప్రేమించడం కాదు దయచేసి అర్థం చేసుకోండి అవన్నీ భావోద్వేగాలు కేవ కేవలం చెట్టును తాకడం మేము భావస్పందన ఇంకా ఇతర ప్రోగ్రాముల్లో ఇలాంటిది చేస్తాం. మనం స్పర్శను చాలా శక్తిమంతమైన పద్ధతిలో ఉపయోగిస్తున్నాం. కేవలం తాకడం కేవలం స్పృహతో ఉండి గుర్తుంచుకోవడం ఆ స్పర్శ అనుభూతిని ఇంకా స్పర్శ యొక్క శక్తిని గుర్తుంచుకోవడం వల్ల భూమ్ ప్రజలు ఉప్పొంగిపోయి ఏడ్చి దొర్లి పాలు మొత్తం గెంతుతుంటారు వాళ్ళు కేవలం స్పర్శ వల్ల ఇది స్పర్శ యోగ యోగాలో ఈ అంశంపై ఒక సంపూర్ణ పార్శ్వం ఉంది కాబట్టి శరీరానికి గుర్తుంచుకునే అద్భుతమైన సామర్థ్యం ఉంది.
(06:08) ముఖ్యంగా అది తెరుచుకుంటే ఒక నిర్దిష్ట పద్ధతిలో తెరుచుకుంటే ఒక విధంగా చాలా సులభంగా చెప్పాలంటే లైంగికత అనేది మీ శరీరాన్ని తెరవడం లాంటిది వేరే దేనికో వేరే అవకాశానికి కాబట్టి అది అలా తెరుచుకున్నప్పుడు అది గుర్తుంచుకునేది అసాధారణ స్థాయిలో ఉంటుంది. వీధిలో నడిచేటప్పటికంటే కాబట్టి ఇదే కారణం భారతదేశంలో సంస్కృతి ప్రధానంగా దాని వైపే ఉండేది ఇప్పుడు కాదు ఇప్పుడు ఇదంతా మేము మీ అంత అస్తవ్యస్తంగా అవుతున్నాం.
(06:43) [నవ్వు] కానీ ప్రాథమికంగా సంస్కృతి ఆధ్యాత్మిక విముక్తి వైపు ఉండేది. ప్రతీది. గత తరంలో ఇది చాలా స్థిరంగా ఉండేది. మాకు నిరంతరం చెప్పేవారు ఈ తరం మర్చిపోయింది. ముఖ్యంగా తెరిచిన శరీరంతో చేసే ఏ పనైనా తినడం లైంగికత వంటివి వీటిని ఎక్కడ పడితే అక్కడ చేయరు. టు ద మినిమంపబుల్ లెవల్ మీ స్పర్శని సాధ్యమైనంత తక్కువకు పరిమితం చేస్తారు.
(07:13) ఎందుకంటే మీరు శరీరాన్ని తెరిచిన క్షణం అది మీ మనసుకు అర్థం కాని విధాలుగా గుర్తుంచుకుంటుంది. అది దాని ప్రతి అంశాన్ని గుర్తుంచుకుంటుంది. చూడండి ఈరోజుకి నాతో కూడా నేను ఇంట్లో తిన్నప్పుడు మేము ఎప్పుడూ ఒకే రకమైన ఆహారం తింటాం. అర్థమైందా 10 రకాల పదార్థాలు తినం. ఎందుకంటే ఇది మాకు ఎప్పుడూ నేర్పించబడింది. మీరు తినేటప్పుడు మీకు నచ్చిన ఒక్కదాన్నే తినాలి.
(07:37) ఆ ఒక పదార్థంలో రెండు మూడు కలయకలు ఉంటాయి కానీ అదంతా ఒకటే పదార్థం మీది ఇది ఇది ఇది ఇది తినరు ఈ రోజంతా బఫే డిన్నర్లు పాతిక రకాలు కొంచెం కొంచెం కొంచెం కొంచెం వేసుకొని తింటారు. మీరు ఒకసారి పరిశీలించి చూడండి మనం పాతిక రకాలువి చేద్దాం ఓకే మీరు తినండి ఆ రాత్రి ధ్యానం చేయండి మరుసటి రోజు ఉదయం ధ్యానం చేయండి ఎలా అనిపిస్తుందో చూడండి రేపు ఏదైనా సాదా ఆహారం తీసుకోండి వండిన దాని నుండి పచ్చిగా మార్చక్కర్లేదు వండిన ఆహారమే కేవలం ఒకటే తినండి ఎలా అనిపిస్తుందో చూడండి చాలా పెద్ద తేడా ఉంటుంది వ్యవస్థ పని చేసే విధానంలో దీనికి జీర్ణక్రియకు సంబంధించిన
(08:15) విషయాలు ఉన్నాయి అంతేకాదు దాని శక్తి అంశం చాలా చాలా భిన్నంగా అనిపిస్తుంది. కేవలం వివిధ రకాల ఆహారాలు తినడమే ఈ వ్యవస్థపై ఇంత పెద్ద ప్రభావం చూపుతుంటే పాతికేళ్ళు వచ్చేసరికి రెండు డదల మంది భాగస్వాములను మార్చడం శారీరకంగా మీ శరీరాన్ని ఆ పార్శ్వానికి తెరవడం అది మీ పై ఎంతటి జ్ఞాపక శక్తి ముద్ర వేస్తుందంటే ఈ జ్ఞాపక శక్తి మిమ్మల్ని ఒక స్థితిలోకి నడుతుంది ఎంతలా అంటే ఆ గొయ్యి నుండి బయట పడటానికి చాలా కష్టపడాలి అది కొన్ని రకాల మానసిక కలతలకు కొన్ని రకాల అలజోళ్లకు దారి తీస్తుంది.
(08:53) భౌతిక, మానసిక, భావోద్వేగ పరంగా వ్యక్తి వ్యక్తికి అది ఏ మేరకు వ్యక్తమవుతుంది అనేది వివిధ ఇతర కారకాలపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తిలో సహజ సిద్ధమైన బలం అని ఒకటి ఉంటుంది. అది వివిధ పార్శ్వాల నుండి వస్తుంది. ఒకే స్థాయి ప్రేరేపణకు వేరు వేరు వ్యక్తులు వేరు వేరుగా బాధపడతారు అవునా అవునా ఒక దోమ కుడితే ఇప్పుడు 100 దోమలు వచ్చి ఒక్కోటి మీలో ఒక్కొక్కరిని కుడితే మీలో ప్రతి ఒక్కరు వేరు వేరు స్థాయిలో బాధపడతారు.
(09:31) అదే దోమకాటుకు అవునా కాదా ఇది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒక దోమకాటుకు మీరు ఎలా స్పందిస్తారో చూస్తే నాకు తెలిసిపోతుంది. మీ తాత ముత్తాతలు ఎవరో మీ పూర్వీకులు ఎవరో మీరు ఎలా జీవించారో మీరు ఎలా పుట్టారో ఎలా చనిపోతారో నిజంగా జోక్ చేయట్లేదు. ఒక దోమకాటుకు మీరు మీ పక్కనఉన్న వ్యక్తి కన్నా భిన్నంగా ఎలా స్పందిస్తారో అర్థం చేసుకుంటే చాలు ఎందుకంటే ఇది మీకున్న కర్మ జ్ఞాపకాలపై ఆధారపడి ఉంటుంది.
(09:57) దానికి ఎలా స్పందిస్తారు అనేది. ఈ స్పందన కేవలం మీ శారీరక స్పందన కాకపోవచ్చు. అసలు శరీరమే వేరు వేరు స్థాయిల్లో స్పందిస్తుంది. ఒకే దోమ కుడితే ఒకో వ్యక్తి శరీరం ఒకోలా స్పందించదా దాన్ని తక్కువ చేసి చూస్తారు సరే నాకు దోమకాట అంటే అలర్జీ అనేస్తారు. ఇది జీవితాన్ని చాలా పైపైన చూసే పద్ధతి. దానిలోని ప్రతి పార్శ్వం ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉండొచ్చు.
(10:25) ఒకరు ఓ నేను ఇవన్నీ పడ్డాను బాగానే బతుకుతున్నాను అనొచ్చు. సాధ్యమే ఒక స్థాయిలో మీరు బాగానే బతుకుతున్నారేమో కానీ అందరూ దాన్ని అదే స్థాయిలో తీసుకోలేరు. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు అలా ఉండి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇలా చేసుకున్నారు కానీ ఇంకొకరి కన్నా కాస్త మెరుగ్గా ఉన్నారని సంతోషంగా ఉన్నారు అది మీ సమస్య. కొబ్బరి చెట్టో, టేకు చెట్టో అంత ఎత్తు పెరగాలి.
(10:51) ఈ పొద కన్నా కొంచెం ఎత్తుండి గొప్పవాళ్ళు అనుకుంటారు. మిమ్మల్ని ఏమనాలి? సో ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ నాట్ బి రియలైజడ్ కాబట్టి మీ జీవిత పూర్తి సామర్థ్యం సహకారం కాదు అనవసరమైన జ్ఞాపకాల స్థాయిలతో వ్యవస్థని గందరగోళ పరిస్తే వాళ్ళు చాలా సున్నితంగా ఉన్నప్పుడు ఈ కారణంగానే వ్యవస్థను ఇలా ఏర్పాటు చేస్తాం. 12 ఏళ్ళ వచ్చేదాకా నిజానికి ఏ బోధన ఉండదు సంప్రదాయపరంగా ఈ రోజు అలా కుదరదు చదువు తప్పనిసరి ప్రభుత్వ నియమం ఆరేళ్లకి విద్య మొదలు పెట్టాలి లేదంటే వాళ్ళు తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేయగలరు.
(11:26) ఇండియాలో ఇప్పుడు ఎడ్యుకేషన్ కంపల్సరీ మీ పిల్లాడిని ఐదేళ్ల 10 నెలల వయసు వచ్చేసరికి స్కూల్ కి పంపకపోతే మీరు జైలుకి వెళ్లొచ్చు మీ పిల్లాడిని స్కూల్ కి పంపనందుకు ఓకే కానీ సంప్రదాయపరంగా 12 ఏళ్ల వయసు వచ్చేదాకా వాళ్ళకు ఏమీ నేర్పించరు. మీరు వాళ్ళ జ్ఞాపక వ్యవస్థలో తల దూర్చాలనుకోరు దాని మానాన్న దాన్ని వదిలేయాలనుకుంటారు వాళ్ళ శరీరం పెరగాలి వాళ్ళ మెదడు పెరగాలి జ్ఞాన సమూపార్జన తర్వాత వస్తుంది.
(12:00) ఒకవేళ మనం మన పిల్లల్ని స్పృహతో పెంచాలనుకుంటే మనం ఒక నిర్దిష్టమైన మార్పు తీసుకురావాలనుకుంటే అప్పుడు మనం సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాలి అది సాధ్యం కాదు ఎందుకంటే ప్రపంచం ఎటో వెళ్ళిపోయింది. ముఖ్యంగా పాశ్చాత్య సమాజాలు పూర్తిగా జీవ వ్యతిరేకంగా మారాయి. ఇక మిగతా వాళ్ళంతా చాలా తొందరగా వాళ్ళని అనుసరిస్తున్నారు. భారతీయ నగరాలు ఏవి మెరుగ్గా లేవు.
(12:24) దేశం మొత్తం అలా కాలేదు కానీ పట్టణ కేంద్రాలు అమెరికన్ల కన్నా అమెరికన్లుగా ఉన్నాయి. వాళ్ళు మక్డోనాల్డ్స్ లో తింటున్నారు కూడా. [నవ్వు] ఎందుకంటే ఇది ప్రపంచంలో ఒక ఆదర్శంగా మారింది. ఇది ఆదర్శంగా మారింది అందరూ వేగంగా అదే స్థాయికి చేరాలని చూస్తున్నారు. అలాగే వాళ్ళు అక్కడికి చేరుతారు కూడా దురదృష్టవసాత్తు వాళ్ళు ఆ స్థితికి చేరుకుంటారు.
(12:49) కానీ తమ పిల్లల గురించి ఏం చేయగలమా అని ఆందోళన చెందే వాళ్ళ విషయానికి వస్తే మీరు చేయగలిగింది అంతవరకే. ఎందుకంటే మీ బిడ్డను ప్రభావితం చేస్తున్నది మీరు ఒక్కరే కాదు. మీ ప్రభావం బహుశా 10 శాతమే. 90% ప్రభావం వేరే చోటు నుండి వస్తుంది. ఆ ప్రభావాన్ని మీరు నియంత్రించలేరు. మీరు దాన్ని కొంచెం పరిమితం చేయొచ్చు. మీరు తెలుసా మీ సాన్నిధ్యం మీ ఉనికి కొంచెం గొప్పగా అయితే వాళ్ళను బహుశా ఇంకొంచెం ప్రభావితం చేయొచ్చు.
(13:15) ప్రజలు ఎక్కువ సమయం గడపడం ద్వారా వాళ్ళను ప్రభావితం చేయొచ్చు అనుకుంటారు. ఎప్పటికీ కాదు నేను చెప్తున్నాను. ఇఫ్ పేరెంట్స్ టెంట్ మీరు మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తే బహుశా వాళ్ళు మీ శత్రువులు అవుతారు. అవును ఇది ఎక్కువ సమయం గురించి కాదు మిమ్మల్ని మీరు ఎలాంటి వ్యక్తిగా మలుచుకున్నారు. మీరు వాళ్ళకు నచ్చితే వాళ్ళపై మీ ప్రభావం ఉండొచ్చు.
(13:44) లేదంటే మీరు ఎక్కువ సమయం గడిపి వాళ్ళకు మీరు నచ్చకపోతే అయిష్టత పెరుగుతుంది. మీరు ఎక్కువ సమయం గడిపితే అవునా చాలా సంబంధాలు నిలబడడానికి కారణం తెలుసా వాళ్ళలో ఒకరు ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి [నవ్వు] నేను చేదు విషయాలు చెప్తున్నానా [నవ్వు] కాబట్టి ఎక్కువ సమయం సమాధానం కాదు మిమ్మల్ని మీరు మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడమే వాళ్ళు మీ వ్యక్తిత్వానికి ఆకర్షితులయ్యేలా మీరు ఉన్న తీరు చూసి ముగ్ధులు అవ్వాలి.
(14:19) అప్పుడు మీరు ఇంకొంచెం ప్రభావం చూపొచ్చు లేదంటే వాళ్ళు వీధిలో స్నేహితులచే ప్రభావితులు అవుతారు. వాళ్ళు ఆ ప్రభావానికి లోనవుతారు. కాబట్టి విద్యా వ్యవస్థలు ఇంకా తెలుసా ఈ ప్రభావం ఒక చోట నుండి రాదు. తెలుసా నేను ఏదో వెతుకుతున్నాను. ఇవి ఇవి ఇంటర్నెట్ లో చిన్న చిన్న యడ్స్ నేను ఒక పనిముట్టు కోసం వెతుకుతున్నాను సరేనా అదొక మెకానికల్ పనిముట్టు స్పానర్ కన్నా కొంచెం పెద్దది సరేనా కానీ ఒక బికినీ ధరించిన స్త్రీ ఇలా నిలిచి ఉంటుంది ఆ స్పానర్ పక్కన ఆమెకు నా వెధవ స్పానర్ తో ఏం పనో నాకు తెలియదు.
(15:05) [నవ్వు] ఆమె బికినీ వేసుకుంది బహుశా చట్ట ప్రకారం బికినీ తీసేయడానికి ఒప్పుకోరేమో లేదంటే ఆమె బికినీ తీసేసి అక్కడ నిలిచి ఉంటుంది సరేనా ఒక స్పానర్ అమ్మడానికి దేనికి ఒక స్పానర్ అమ్మడానికి ఒక నగ్నస్త్రీ ఎందుకు సెల్లింగ్ ఏ స్పానర్ ఏ విధంగా అది అమ్మకాలను పెంచుతుందో నాకు తెలిీదు. కానీ జరుగుతున్నది అది ఇంకా ఇది కేవలం ఎవరినో భౌతికంగా ప్రదర్శించడం గురించి కాదు శ్రేయస్సు అనే ఆలోచన ఇది ఇప్పుడే కాదు ఇది అకస్మాతుగా ఇప్పుడు జరిగింది అనుకోకండి శ్రేయస్సు అనే ఆలోచన ఇప్పుడు కాదు నేను అంటున్నది 50 60ల సినిమాలు చూస్తే వాళ్ళు సాధించే అంతిమ విషయం ఏమిటి ఒక పురుషుడు స్త్రీ చేతులు
(15:50) పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ తర్వాత సంతోషంగా జీవించారు. ఎలా జీవించారో మీకు తెలీదు సినిమా చివరి సీన్లో చేతిలో చెయ్యి వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతారు అదే జీవితానికి ఆదర్శం అనేలా చూపుతారు. ఇది మారాలి ఈ ప్రాథమిక ఆలోచన అవును సంబంధాలు పెట్టుకుంటాం అవును మనకి అవసరాలన్నీ ఉంటాయి కానీ ఇది మన జీవిత లక్ష్యం కాదు. ఆ పార్శ్వం కనుక సమాజంలోకి పెద్దగా ఇంకకపోతే అది దగ్గరలో లేదు అది ఆ దాన్ని సాధించడం అనేది దగ్గరలో కూడా లేదు సరేనా కానీ ఒక ఆదర్శం కోసం పాటుపడడంలో తప్పు లేదు అందుకు లక్షల సంవత్సరాలు పట్టొచ్చు కానీ కనీసం మన జీవితాల్లోకైనా దాన్ని తీసుకురాగలం.
(16:33) సోదిస్నీడ్స్ టుహపెన్ కాబట్టి ఇది స్పృహతో జరగాలి అన్ని విషయాలు స్పానర్ అమ్మడం నుండి మీ ఇంట్లో మీరు ఎలా ప్రవర్తిస్తారు అన్నదాని వరకు ఇంకా ఒక వ్యక్తిగా మీరు ఎలా ఉంటారు అనేది కూడా మీరే ఒక తెలుసా హార్మోన్ల విస్ఫోటనంలా ఉండి మీ టీనేజ్ కొడుకు కూతురికి చెప్తే ఇలా ఉండు అలా ఉండు అని చెప్తే అది పని చేయదు.
(17:03) ఎందుకంటే చూడండి ఒక వ్యక్తిపై సంస్కృతి ప్రభావం చాలా పెద్దది చాలా కొద్దిమంది మాత్రమే దాని నుండి విముక్తులుగా ఉండగలరు.వెరీఫ్యూ వెరీ ఫ్యూ పీపుల్ కెన్ కీప్ దమసెల్స్ ఫ్రీ ఆఫ్ దట్ చాలా కొద్దిమంది మిగతా వాళ్ళంతా వాళ్ళు పుట్టిన సంస్కృతి చేత మలచబడతారు చాలా కొద్దిమంది మాత్రమే కొత్త సంస్కృతిని స్థాపిస్తారు మిగతా వాళ్ళంతా బాధితులు తమ చుట్టూ ఉన్నదానికి అవునా కాబట్టి దాన్ని మార్చడం ఒక్కరోజు వ్యవహారం లేదా ఒక తరం వ్యవహారం కాదు కానీ దానికోసం పాటుపడడంలో తప్పేమీ లేదు.
(17:34) దానికోసం పాటు పడగలం అంతే ఇప్పుడే పెద్ద ఫలితాలను ఆశించలేం. కానీ చాలా విధాలుగా చూడండి ఇది ప్రతి చోట ఉంది ఒక్క దేశంలోనే కాదు అమెరికాలో ఇది ఆ ఒక స్థాయిలో పచ్చిగా మొరటుగా జరుగుతుంది కానీ ఇది ప్రతి చోటా జరుగుతుంది. ఎందుకంటే శరీరానికి సహజ ప్రవృత్తులు ఉంటాయి. వాటిని అణచలేం అణచకూడదు కూడా దాన్ని సంస్కరించాలంతే మనం మాట్లాడుతున్నది అణచడం గురించి కాదు శరీరం యొక్క సహజ ప్రవృత్తులను మానవ అవసరాలను అణచడం కాదు అది సంస్కరించబడాలి అది మీరు వెళ్లే ప్రతి చోట మరటుగా వ్యక్తం కానక్కర్లేదు.
(18:23) అవునా కాబట్టి ఆ మొరటు వ్యక్తీకరణను తొలగిస్తే లైంగికత మీ జీవితంలో ఒక భాగంగా మారుతుంది. ప్రస్తుతం మీ జీవితం మీ లైంగికతలో భాగంగా ఉంది. అది మీ జీవితంలో ఒక చిన్న భాగంగా ఉంటే ఏ సమస్య లేదు కానీ అదే మీ మొత్తం జీవితం అయితే అది అనారోగ్యం డబ్బయనా లైంగికత అయినా మరేదైనా ఏదైనా సరే ఒక భాగం మొత్తంగా మారితే దాన్నే అనారోగ్యం అంటారు అవునా
No comments:
Post a Comment