Saturday, January 10, 2026

*****ప్రేమ ఒక భ్రమ, కామోన్మాదం, మద పిచ్చి (westernization tho love became ఇంగ్లీష్ లవ్ , ఇండియా లవ్) ఇంగ్లీష్ లవ్ vs ఇండియా లవ్

 ప్రేమ ఒక భ్రమ

వయసు వచ్చీరాగానే బాల బాలికలు ప్రేమ అనే వ్యామోహానికిలోనై పోతున్నారు. నిజానికి వారిలో ఉన్నది ప్రేమకాదు, తొలకరి కామం, కారుకొవ్వు మాత్రమే. కామవాంఛ తీర్చుకోవాలనెడి ప్రబలమైన కోరికతో బాలబాలికలు పరస్పరాకర్షణలకు లోనై పొందుకోసం పడే తపన, ఆరాటాన్నే ప్రేమ అనుకొంటున్నారు. అది కేవలం ఆకర్షణ మాత్రమేనని తెలుసుకోలేకున్నారు.

ఆకర్షణలకు లోనై 'ఐ లవ్యూ' 'వన్ఫోర్ త్రీ' (1, 4, 3) అనో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనో, ఎంతో స్పష్టంగా, మరెంతో ఇష్టంగా గట్టిగా అరచి చెప్పేస్తే, అదే ప్రేమ అయిపోయినట్లుగా భావిస్తున్నారు. లేకపోతే ఏదో ఒక విధంగా చంపుతాం, లేదా మేమూ చస్తాం అంటున్నారు - అనడమే కాదు చేస్తూ ఉన్నారు, చస్తూ ఉన్నారు. ఏదో ఒక కోణం (యాంగిల్) లో కనిపించిన (Beauty spots) శారీరక వంపు సొంపులపై ఇష్టం కలగడం, ఆ ఇష్టాన్ని అనుభవించాలనుకోవడం ప్రేమ కానేకాదు. అదొక సహజ శారీరక అవసరం. ఆకలిలాంటి ప్రాథమిక శారీరక అవసరం. ప్రేమ ఒక దివ్యమైనగుణం. ప్రేమంటే త్యాగం, ఈనాటి బాల బాలికలలో యవ్వనపు పొంగులో కామం అనే ఆకలిని తీర్చుకునేటందుకు పడే తపననే ప్రేమనుకుంటున్నారు.

243


ఈ విధమైన మనోవికారం కలగడానికి ఎన్నో కారణాలున్నాయి. పాపం పిల్లలు సహజంగా ప్రకృతి ప్రకోపింపచేసే దానికి లోనుకాకుండా ఎలా నిగ్రహించుకోగలరు?

పిల్లల్లో భయంకానీ, భక్తిగానీ, శ్రద్దగానీ లేని వాతావరణాన్ని పరిపాలకులు, పెద్దలు సృష్టించి, వారిని నిగ్రహ సంపన్నులుగా ఉండాలని కోరుకోవడం సమంజసమా ?

చదువులో నీతిని తీసివేశాము, నైతికత లేని సాంకేతిక శాస్త్రాన్ని బోధిస్తున్నాము. చదువైపోయాక, వయసొచ్చాక ఎన్నడో తెలియాల్సిన కామశాస్త్రాన్ని "ఎయిడ్స్పై లో అవగాహన" పేరుతో శరీర అంగాలను బహిరంగ పరిస్తే, ఉద్రేకానికి లోనుగాకుండా వుండగలరా? మన సామాజిక వ్యవస్థను బట్టి స్త్రీకి పద్దెనిమిదేండ్లు, పురుషునికి ఇరవై ఒక్క సంవత్సరాలు వివాహ వయస్సుగా నిర్ణయించారు. స్త్రీకి వయస్సు వస్తే చాలు ఆమెలో వయసు తెచ్చే మార్పులు, శారీరకంగానూ, మానసికంగానూ, బౌద్ధికంగానూ, సహజంగా సంతానోత్పత్తికి, అనగా జతకట్టడానికి యోగ్యురాలవుతుంది. కానీ పురుషుని విషయంలో అలాకాదు. వయసు ఇరవై ఒక్క సంవత్సరాలుగా నిర్థారించుకున్నప్పటికీ, అతనిలో శారీరక దారుఢ్యం, మానసిక ఎదుగుదల, బుద్ధికుశలత, సంసారాన్ని నెట్టుకురాగలిగిన నైపుణ్యం, సంపాదన, భార్యను అర్థం చేసుకునే యోగ్యతలు తప్పనిసరిగా ఉండాలి. ఈ అంశాలలో ఏది లోపించినా ఆ సంసారంలో సంతోషం ఉండదు. స్త్రీతో పోల్చి చూస్తే స్త్రీ కంటే పురుషునికే అధిక అర్హతలుండాలి. అందుకే పెళ్ళిలో పురోహితుడు మంత్రాలను వరునిచేతనే పలికిస్తాడు. అర్ధ, కామాలను ధర్మమార్గంలోనే సాధించాలని బోధిస్తారు. జీవితంలో తప్పటడుగు వేయకుండా, బాధ్యతగా జీవితాంతం కలిసుండాలని ప్రమాణం చేయిస్తారు. సత్సంతానాన్ని సమాజానికి ప్రసాదించండని దీవిస్తారు.

ఈనాడు సామాజిక వాతావరణం, వెస్ట్రనైజేషన్ (వలన నాగరికత) అయిపోయినందున ప్రేమ రెండు రకాలుగా వుంది.

ఇంగ్లీష్ లవ్ : బాహ్యాకర్షణకులోనై, నిగ్రహాన్ని కోల్పోయి, కామోద్రేక భారాన్ని దించుకొని, ఎవరిదోవన వారు వెళ్ళిపోవడం. ఇది తాత్కాలిక సుఖం కోసం వెంపర్లాడటం మాత్రమే.

ఇండియా లవ్ : ఏవిధమైన ఆకర్షణలకు లోనైనా, నిగ్రహాన్ని కోల్పోయినా జీవితాంతం కలసి ఉండాలను కోవడం, బాధ్యతగా జీవించడం.

ఏదైనా సరే! తను ఇష్టపడినది తనకే దక్కాలి, అనుకోవడం, మరొకరి జోక్యం, మరొకరి భాగస్వామ్యం సహించలేకపోవడం, ఆశ, అసూయ, ఆగ్రహం, ఆవేశం, పగ ప్రతీకార వాంఛతో రగిలిపోవడం అనేది ప్రేమ స్వభావంకాదు. ఇలాంటి దుష్ట భావాలుండేది కేవలం స్వార్థంలోనే. దీనినే కామోన్మాదం అంటారు. కొన్ని సందర్భాలలో 'మద పిచ్చి' అని కూడా అంటారు.

244

* ప్రేమ-త్యాగానికి ప్రతిరూపం. జాలి, దయ, బాధ్యత, సేవ అనేవి ప్రేమలో నిండుగా, దండిగా ఉంటాయి.

* ప్రేమ రెండు మనసుల కలయిక. పెళ్ళి రెండు కుటుంబాల కలయిక.

* ప్రేమ ఎన్నడూ ద్వేషించలేదు ద్వేషం ఎన్నడూ ప్రేమించలేదు.

* నువ్వు వలచినది నిన్ను తొలుచును. నిన్ను వలచినది నిన్ను కొలుచును.

* ప్రేమవివాహాలు సుఖాంతమూ అవుతున్నాయి. దుఃఖాంతమూ అవుతున్నాయి. ఇప్పటి యువతరంలో మాత్రం జాలీగా గడపడానికీ, టైంపాస్ కోసం గర్లు బాయ్ఫ్రెండ్, బాయ్కి గర్ల్ఫ్రెండ్ను వెదుక్కుంటున్నారు.

* వివాహానికి ముందే స్త్రీ-పురుషుల కలయికలోని మాధుర్యాన్ని చవిచూస్తే వివాహానంతరం అనుభవించే అనుభూతి ఏముంటుంది? ఆ కారణంగానే ప్రేమ వివాహాలు కొన్ని ఆటుపోటులకు తట్టుకోలేక చిన్నాభిన్నమవుతున్నాయి.

* పెద్దలు నిర్ణయించిన వారితో వివాహం జరిగితే అదొక అనుభూతి కలిగిస్తుంది. జీవితంలో ఎదురయ్యే సుఖ దుఃఖాలలో పాలుపంచుకునే టందుకు ఒక ఆసరా, భరోసా పెద్దల నుండి, కుటుంబ సభ్యులనుండి లభిస్తుంది.

* ఇంటి మొగుడు చెమట వాసన. పొరిగింటి మొగుడు పూలవాసన.

* ఈత చెట్టు ఇల్లూకాదు, తగులుకున్నోడు మొగుడూ కాదు.

* చేసుకున్న దానికి మూసుకోను లేదు. కానీ ఉంచుకున్న దానికి ఉభయరాగాల చీర కావాలన్నాడట.

* ఆలు అరటిపండు, తల్లి తలపుండు, చెల్లి చేదుకాయ, లంజ లవంగమొగ్గ.

* కలిమి ఉన్నంతసేపు బలగము, కండ ఉన్నంతసేపూ మిండడు.

* మీద మెరుగులు - లోన పురుగులు.

* ఒకసారి మనని ఇష్టపడిన వ్యక్తి మనల్ని మరచిపోవడానికి కారణం మనలోని లోపమే.

* అయ్యకు వణుకు ప్రాయం, అమ్మకు కులుకు ప్రాయం.

* పగలు కన్నుగీటితే రానిది. రాత్రి చెయ్యి ఊపితే వస్తుందా ?

* స్త్రీ చిత్తం పురుషుని భాగ్యం.

* రతిలో సిగ్గు - రణంలో భీతి పనికిరావు.

* వైశ్యుడు కరువును కోరు- వేశ్య విటులను కోరు.

* చక్రవర్తి చేస్తే శృంగారం, చాకలి చేస్తే వ్యభిచారం.

* మనిషి - మనిషిని మనిషిగా ఎప్పుడూ ప్రేమించలేడు. మనిషి మనీషిగా, మహనీయుడుగా ఎదిగినపుడు మాత్రమే సకల జీవరాశిపట్ల, విశ్వ ప్రేమ భావన చూపించగలడు. అంతేకానీ సంసారిగా, ఒక మానవమాత్రునిగా స్వార్థంతో మాత్రమే బ్రతుకుతాడు.

245

* తనకు లోబడిన స్త్రీని... ఆమెకెంతటి ఘనత ఉన్నా పురుషుడు గౌరవించడు.

* అందమైనది ఆదర్శం కాకపోవచ్చు. కానీ ఆదర్శవంతమైనది సదా అందంగానే  ఉంటుంది.

* శృంగార సాహిత్యానికి సంబంధించిన పుస్తకానికి ఎప్పుడూ దుమ్ము పట్టి ఉండదు. .

* గారాబం గారెలకేడిస్తే - వీపు దెబ్బలకేడ్చిందట

* సాయంత్రం ఆ అమ్మాయితో మళ్లా షికారుకెళ్లావా ? ప్రశ్నించాడు తండ్రి.

వెళ్ళాను చెప్పాడు మదన్.

మొత్తం ఎంత ఖర్చయింది?

రెండువేలే!

రెండువేలా! ఆశ్చర్యపోయాడు తండ్రి.

'ఆ అమ్మాయి దగ్గర అంతకంటే ఎక్కువ లేదుమరి. బదులిచ్చాడు మదన్.


Book reference - Manavatha Viluvalu Page No 243, 244, 245, 246.

Manavatha Viluvalu book is uploaded to archive.org web and book link - https://archive.org/details/manavatha-viluvalu




No comments:

Post a Comment