Friday, March 20, 2026

ఒక నియంత చివరి 24 గంటలు || ప్రపంచాన్ని వణికించిన వ్యక్తి కథ || The Rise and Fall of Saddam Hussein

ఒక నియంత చివరి 24 గంటలు || ప్రపంచాన్ని వణికించిన వ్యక్తి కథ || The Rise and Fall of Saddam Hussein

Author Name:Telugu Knowledge Unfiltered

Youtube Channel Url:https://www.youtube.com/@TeluguKnowledgeUnfiltered

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1in32_0sY_E



Transcript:
(00:00) చరిత్ర ఎంతో మంది డిక్టేటర్లను పరిచయం చేసింది. హిట్లర్, ముసోలిని, స్టాలిన్, మావో జడాంగ్, ఇది అమీన్, గడాఫి ఇలా నియంతృత్వ పాలనతో నిరంకుశ విధానాలతో చరిత్రలో నిలిచిపోయిన నియంతలో చాలా మందే ఉన్నారు. వీళ్ళలో చాలా మంది గురించి కాస్తో కోస్తో మనకు అవగాహన ఉంది. కానీ మిడిల్ ఈస్ట్ ప్రస్తావన వచ్చినప్పుడు లేదా ఇరాక్ గురించి మాడకోల్సి వచ్చినప్పుడు సద్దాం హుసేన్ అనే నియంత పేరు వినిపిస్తూ ఉంటుంది.
(00:24) వరల్డ్ డిక్టేటర్స్ లిస్ట్ లో సద్దాం హుసేన్ పేరు కూడా ఉంటుంది. 24 ఏళ్ల పాటు ఇరాక్ ని ఏలి సద్దాం హుసేన్ ఇరాక్ లో అనేక మార్పులకు కారణమయ్యాడు. సున్నీషియా ముస్లింలతో రాజకీయాలు చేస్తూ అరబిక్ నేషనలిజం పేరుతో అరబ్ యూనిటీ అంటూ ఇరాన్ కువైట్ లాంటి దేశాల మీద యుద్ధాలు చేశాడు. ఒకవైపు దేశంలో నియంత్రతో పాలను అమలు చేస్తూనే మరోవైపు మిడిల్ ఈస్ట్ రీజియన్ కి మనశశాంతి లేకుండా చేశాడు.
(00:47) 1980 లో ఇరాక్ ఇరాన్ మీద దాడి చేయడానికి 1990 లో ఇరాక్ కువైట్ ను ఆక్రమించుకోవడానికి సద్దాం హుసేన్ యొక్క అరబ్ యూనిటీ అనే సిద్ధాంతమే కారణం. అరబ్ యూనిటీ పేరుతో అరబ్ దేశాలన్నిటిని కలిపి ఒకే ఇస్లామిక్ దేశంగా మార్చాలని సద్దాం హుసేన్ బలంగా ప్రయత్నించాడు. అయితే మిడిల్ ఈస్ట్ లో ఏం జరిగినా అమెరికా జోక్యం కూడా ఉంటుంది. సద్దాం హుసేన్ సమయంలో కూడా అమెరికా మిడిల్ ఈస్ట్ వ్యవహారాల్లో వేలుపెట్టింది.
(01:10) విచిత్రం ఏంటంటే సద్దాం హుసేన్ విధానాల్ని మొదట్లో అమెరికా సమర్ధించింది. సద్దాం హుసేన్ చర్యలకు అమెరికా మద్దతుగా కూడా ఉంది. కానీ సద్దాం హుసేన్ అమెరికా ఊహించిన దానికన్నా మరింత పవర్ఫుల్ గా మారడం అమెరికాను సైతం లెక్క చేయకుండా ప్రవర్తిస్తూండడంతో అమెరికా సద్దాం హుసేన్ ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు మొదలు పెట్టింది.
(01:30) దాంతో సద్దాం హుసేన్ భారీగా మారణయుదాలు సమకూర్చుకొని అమెరికాకే సవాలు విసిరాడు. దాంతో ఇరాక్లో సద్దాం హుసేన్ ని తప్పించేందుకు అమెరికా డైరెక్ట్ గా రంగంలోకి దిగింది. మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా అమెరికాకు సహకరించాయి. ప్రజల నుంచి కూడా తిరుగుబాటు ఎదురైంది. ఇలా నియంతృత్వంతో వ్యవస్థలని పొరుగు దేశాలని గడగడలాడించిన సద్దాం హుసేన్ ఆఖరికి ప్రాణాలు కాపాడుకోవడం కోసం బంకర్లో దాక్కోవాల్సి వచ్చింది.
(01:52) అయినా అమెరికా మాత్రం సద్దాం హుసేన్ ని ఉరితీసి చంపే వరకు ఆగలేదు. కాబట్టి ఈ పూర్తి విషయాలను తెలిపే ప్రయత్నమే ఈ వీడియో అసలు సద్దం హుసేన్ కథ ఏంటి? ఇరాక్ లో సద్దాం హుసేన్ పాలన ఎలా ఉండేది? జియో పొలిటికల్ గా సద్దాం హుసేన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిది? ఎందుకని సద్దాం హుసేన్ ని నియంతగా గుర్తిస్తారు? ఇరాక్ రాజకీయాల్లో అమెరికా ఎందుకు తలదూర్చింది? ఇరాక్కు కువైట్ ని ఆక్రమించుకునే ప్రయత్నం ఎందుకు చేసింది? ఉరి తీసి చంపేంత పెద్ద నేరం సద్దాం ఏం చేశడు? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఏది మిస్ కాకుండా చాలా లోతుగా వెళ్లి మరి మీకు చాలా స్పష్టంగా
(02:22) వివరించబోతున్నాం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది అదిరిపోతుంది మిమ్మల్ని కచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది మాది హామి కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇరాక్ లోని టిక్రిత్ కి దగ్గరలో చిన్న పల్లెటూరులో 1937 ఏప్రిల్ 28న సద్దాం హుసేన్ జన్మించాడు. సద్దాం తండ్రి పశువులు మేపేవాడు.
(02:50) అయితే సద్దం కడుపులో ఉన్నప్పుడే ఆయన చనిపోయారు. దాంతో సద్దాం పుట్టే సమయానికి అతనికి తండ్రి లేడు. ఇక సద్దాం హుసేన్ పూర్తి పేరు సద్దాం హుసేన్ అబ్ అల్ మజీద్ అల్ టిక్రిటీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఇస్లామిక్ నేమ్స్ ఇలానే ఉంటాయి. మనం మాత్రం మనకు తెలిసిన సద్దాం అనే మాట్లాడుకుందాం. ఇక సద్దాం పుట్టేనాటికి తండ్రి లేకపోవడంతో అతని తల్లి నానా కష్టాలు పడుతూ సద్దాం కి మూడేళ్ల వయసు వచ్చే వరకు పెంచి ఆ తర్వాత సద్దాం ని బాగ్దాలో ఉండే మేనమామ దగ్గరకు పంపి సద్దాం తల్లి మరో పెళ్లి చేసుకుంది.
(03:18) దాంతో సద్దాం తన మేనమామ కైరెల్లా తల్ఫా పెంపకంలోనే పెరిగాడు. అతని మేనమామ ఇరాక్ ఆర్మీలో పని చేసేవాడు. అతనిలో ఇస్లామిక్ యూనిటీ అనే కీలకమైన ఐడియాలజీ విపరీతంగా ఉండేది. ఈ విషయం గుర్తుంచుకోండి మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే 1940ల ప్రాంతంలో ఇరాక్ ని హష్మేట్ రాజవంశం పాలిస్తూ ఉండేది. ఇరాక్ పాలించేది హష్మేట్ రాజవంశమే అయిన మిలిటరీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అంతా బ్రిటిషర్స్ చేతిలో ఉండేది.
(03:41) ఇరాక్ లో విపరీతమైన క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ కాంట్రాక్ట్స్ ఎక్స్ట్రాక్షన్ ని వీటిని కూడా బ్రిటిషర్స్ే కంట్రోల్ చేసేవాళ్ళు. సింపుల్ గా చెప్పాలంటే హెష్మేట్ రాజు వంశం బ్రిటిషర్స్ కి పప్పెట్ గా పనిచేసేది. ప్రభుత్వం ఇలా బ్రిటిషర్స్ చేతిలో కీలు బొమ్మగా మారడాన్ని ఇరాక్ ఆర్మీలో పనిచేసే ఇరాక్ సైనికులకు నచ్చలేదు.
(03:59) బ్రిటిష్ ఇండైరెక్ట్ రూల్ కి వ్యతిరేకంగా ఇరాక్ ఆర్మీలో కొందరు టాప్ ఆఫీసర్స్ గోల్డెన్ స్క్వేర్ అనే గ్రూప్ ని ఏర్పాటు చేశారు. ఈ గోల్డెన్ స్క్వేర్ కి సద్దం హుసేన్ మేనమామ కైరెల్ల తల్ఫా కూడా సపోర్ట్ చేసేవాడు. ఈ గోల్డెన్ స్క్వేర్ ఎంత ఫాస్ట్ గా గ్రో అయిందంటే 1941 లో గోల్డెన్ స్క్వేర్ మెంబర్స్ అందరూ హాష్మెట్ డైనస్టీ మీద తిరుగుబాటు చేసి ఇరాక్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
(04:21) కానీ బ్రిటిషర్స్ తమ ఆర్మీని పంపి గోల్డెన్ స్క్వేర్ మెంబర్స్ తో ఫైట్ చేసి వాళ్ళని బందీగా జైల్లో పెట్టారు. బ్రిటిష్ ఆర్మీ ఇరాక్ ని మళ్ళీ హాష్మేట్ డైనస్టీకి అప్పగించింది. ఆ టైంలో గోల్డెన్ స్క్వేర్ కి సపోర్ట్ గా ఉన్న ఇరాక్ సైనికుల్ని ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా జైల్లో కూడా పెట్టారు. దాంతో సద్దాం హుసేన్ తిరిగి తన తల్లి వద్దకు రావల్సి వచ్చింది.
(04:40) కానీ సద్దాం హుసేన్ తన స్టెఫ్ ఫాదర్ నుంచి దారుణమైన అబ్యూజ్ ని ఎదుర్కొన్నాడు. 1941 నుంచి 1947 వరకు సద్దాం హుసేన్ మేనమామ జైల్ నుంచి రిలీజ్ అయ్యే వరకు సద్దాం హుసేన్ దారుణమైన అబ్యూజ్ ని ఫేస్ చేశాడు. ఇక సద్దాం మేనమామ జైల్ నుండి బయటిక వచ్చిన తర్వాత మరలా తిరిగి సద్దాం మేనమామ వద్దకు వెళ్ళిపోయాడు. ఇవన్నీ చెప్తున్నామ అంటే ఒక వ్యక్తి పెద్దయ్యాక అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయం బాల్యంలో అతను ఎదుర్కొన్న పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.
(05:07) ఇందుకు సద్దాం ఏమి మినహాయింపు కాదు. సద్దాం చిన్నప్పటి జీవితాన్ని ఒక్కసారి క్షుణణంగా గమనిస్తే సద్దాం తండ్రి పుట్టకముందే మరణించాడు. తల్లి మరో పెళ్లి చేసుకుంది. సౌతి తండ్రి చిత్ర హింసలు పెట్టేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో సద్దాం కి మేనమామ రూపంలో ఒక నమ్మకమైన వ్యక్తి దొరికాడు. ఎప్పుడైతే సద్దాం కి తన జీవితంలో మేనమామ తప్ప మరొకరు గొప్పగా అనిపించలేదో అప్పటి నుంచి మేనమామ చెప్పిన ప్రతి విషయం సద్దాం కి చాలా గొప్పగా అనిపించేది.
(05:32) అలా మేనమామ మీద నమ్మకం ప్రేమ ఇవన్నీ ఉండటం వల్ల తన మేనమామ బలంగా నమ్మే ఇస్లామిక్ సాలిడారిటీ, ఇస్లామిక్ యూనిటీ వీటితో పాటు సున్నీ ముస్లింల పట్ల అభిమానం, సున్నీ సుప్రమసీ, యాంటీ బ్రిటిష్ యాంటీ హాష్మెట్ రూలింగ్ ఇలా సద్దాంలో బలమైన ఇస్లామిక్ ఐడియాలజీని, యాంటీ బ్రిటిష్ ఐడియాలజీని తన మేనమామె ఇంజెక్ట్ చేయగలిగాడు. అలా సద్దాం తన మేనమామ ఆలోచనలకి పూర్తిగా ఇన్ఫ్లయెన్స్ అయ్యాడు.
(05:54) అలా సద్దాం పెరుగుతున్న కొద్ది ఎలా తయారయ్యాడు అంటే ఒక ఇరాక్ లో మాత్రమే కాదు మొత్తం అరబ్ దేశాల్లో ఎక్కడ వెస్టరన్ డామినేషన్ ఉండకూడదు. అరబ్ దేశాలన్నీ విడివిడిగా కాకుండా ఒకే దేశంగా ఉండాలి ఒకే జెండా ఉండాలి. అరబ్ యూనిటీ జరగాలి అని బలమైన అభిప్రాయాలు ఏర్పరచుకున్నాడు. ప్రపంచంలో ప్రతి నియంతకు ఒక భావజాలం ఉంటుంది.
(06:15) సద్దాంలో కూడా ఆ రకమైన భావజాలం చిన్నప్పుడే తన మేనమామ వల్ల ఏర్పడింది. యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ లో సద్దాం తన మేనమామతో కలిసి పార్టిసిపేట్ చేసేవాడు. అలా క్రమంగా యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ లో పాల్గొనడం వల్ల సద్దాం లో తిరుగుబాటు లక్షణాలు ధైర్యం ఇవన్నీ పెరుగుతూ వచ్చాయి. ఒకవైపు చదువుకుంటూనే ఇవన్నీ చేస్తూ వచ్చాడు.
(06:34) అయితే సద్దాం కూడా ఇరాక్ ఆర్మీలో చేరాలని బలంగా ప్రయత్నం చేశాడు. కానీ ఇరాక్ ఆర్మీలో చేరేందుకు రాసిన అన్ని ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వడంతో ఇరాక్ ఆర్మీలో చేరలేకపోయాడు. దాంతో లా చదవడం కోసం 1954 లో యూనివర్సిటీ ఆఫ్ బాగ్దాద్ లో చేరాడు. ఈ యూనివర్సిటీలో చేరిన కొంతకాలానికే సద్దాం ఒక స్టూడెంట్ లీడర్ గా మారిపోయాడు. కొందరు స్టూడెంట్స్ లోకల్ లీడర్స్ తో కలిసి యూనివర్సిటీ పాలిటిక్స్ చేసేవాడు.
(06:55) తన ఐడియాలజీతో ఫెలో స్టూడెంట్స్ ని కూడా ఇన్ఫ్లయెన్స్ చేసేవాడు. సద్దాం మేనమామ ఏదైతే భావజాలాన్ని సద్దాంలో నూరి పోసాడో అదే భావజాలంతో 1943 లో సిరియాలో అరబ్బా బాత్ పార్టీ అనే పార్టీ ఒకటి ఏర్పాటయింది. ఈ మొత్తం ఐడియాలజీనే బాతిసం అనేవారు. ఈ బాత్ పార్టీ ఇరాక్ లో కూడా మెంబర్షిప్ స్టార్ట్ చేయడంతో ఇక సద్దాం ఏకంగా యూనివర్సిటీలో చదువును మధ్యలోనే ఆపేసి ఆ పార్టీలో చేరాడు.
(07:20) ఆ పార్టీలో చాలా తక్కువ కాలంలోనే సద్దాం హై లెవెల్ పొజిషన్ కి చేరుకున్నాడు. 1955 నుంచి 1958 మధ్యలో ఇరాక్ లో మరోసారి ఆర్మీ తిరుగుబాటు జరిగింది. 1941 లో జరిగినట్టే 1958 లో కూడా అబ్దుల్ సలాం ఆరిఫ్ అబ్దుల్ కరీం కాసిం అనే ఇద్దరు ఆర్మీ ఆఫీసర్స్ నేతృత్వంలో ఒక ఫ్రీ ఆఫీసర్స్ గ్రూప్ ఏర్పాటయింది. ఇలా ఏర్పాటయిన ఈ గ్రూప్ 1958 జూలై లో ఏకంగా ఇరాక్ రాయల్ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి ఇరాక్ లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
(07:50) దాంతో 1958 లో ఇరాక్ లో జరిగిన ఆర్మీ తిరుగుబాటులో అక్కడి రాచిరకం పూర్తిగా అంతమైంది. ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఇద్దరు ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆరిఫ్ కాసిం వీళ్ళద్దరూ ఇరాక్ ని రూల్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో 1958 లో వీరిలో కాసిం ఇరాక్ కి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అలాగే ఆరిఫ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్నాడు.
(08:09) ఈ తిరుగుబాటు జరుగుతున్నప్పుడు సద్దాం చేరిన బాత్ పార్టీ కూడా ఈ తిరుగుబాటుకి పూర్తిగా మద్దతు ఇచ్చింది. దాంతో దేశంలో బ్రిటిష్ రూల్ అంతమవుతుంది భవిష్యత్తులో అరబ్ యూనిటీ సాధ్యమవుతుంది అని సద్దాం చాలా లెక్కలు వేసుకొని రెడీగా ఉన్నాడు. కానీ అధికారం చేపట్టాక ఇరాక్ ని రూల్ చేస్తున్న కాసిం సోవియట్ యూనియన్ తో ఒప్పందాలు చేసుకున్నాడు.
(08:27) ఆయిల్ ట్రేడ్ ఇలాంటి వాటికి సంబంధించి సోవియట్ యూనియన్ కి ఇరాక్ కి మధ్య అగ్రీమెంట్ జరిగింది. సోవియట్ యూనియన్ ని సపోర్ట్ చేసే కమ్యూనిస్ట్ సింపతైజర్ ని క్యాబినెట్ లోకి తీసుకున్నారు. ఇరాక్ పాలిటిక్స్ లో కమ్యూనిస్ట్ సపోర్టర్ ఉండటం అనేది బాత్ పార్టీకి ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే బాత్ పార్టీ భావజాలం కమ్యూనిస్ట్ భావజాలం రెండు పరస్పరం విరుద్ధంగా ఉంటాయి.
(08:46) దాంతో పాటు ఇరాక్ సోవియట్ యూనియన్ తో ఒప్పందాలు చేసుకోవడంతో ఇరాక్ లో జియో పొలిటికల్ షిఫ్ట్ జరగడం స్టార్ట్ అయింది. 1958 అంటే కోల్డ్ వార్ పీక్ లో ఉన్న టైం అలాంటి సమయంలో ఆయిల్ రిచ్ ఇరాక్ సోవియట్ యూనియన్ కి దగ్గర అవ్వడం అమెరికాకు నచ్చలేదు. అంతేకాదు ఈ విషయంలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆరిఫ్ కూడా ప్రభుత్వం మీద అసహనంతో ఉన్నాడు.
(09:06) ఈ మొత్తం విషయాలు గమనిస్తున్న అమెరికా ఇరాక్ ని సోవియట్ యూనియన్ వైపు వెళ్ళకుండా ఆపాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. దాంతో 1959 లో అమెరికన్ సిఐఏ ఇరాక్ లోని బాత్ పార్టీతో చర్చలు జరపడం స్టార్ట్ చేసింది. బాత్ పార్టీలో కీలకంగా ఉన్న సద్దాం నిసిఐఏ సెలెక్ట్ చేసుకుంది. డైరెక్ట్ గా ఇరాక్ ప్రైమ్ మినిస్టర్ కాసిం ని చంపాలని ప్లాన్ చేశారు.
(09:27) కాసిం కమ్యూనిస్ట్ సపోర్టర్ లాగా వ్యవహరిస్తున్నాడని సద్దాం కూడా విపరీతమైన అసహనంతో ఉన్నాడు. దాంతో సిఐఏ సపోర్ట్ తో 1959 అక్టోబర్ లో బాగ్దాద్ లో సద్దాం తన గ్యాంగ్ తో డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ మీద కాల్పులకు పాల్పడ్డాడు. సద్దాం గ్యాంగ్ జరిపిన ఆ కాల్పుల్లో ప్రైమ్ మినిస్టర్ కాసిం గాయపడ్డాడు కానీ మరణించలేదు. అతని సెక్యూరిటీ గార్డ్స్ ఇరాక్ పియం ని సేవ్ చేశారు.
(09:47) గాయపడిన ప్రైమ్ మినిస్టర్ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. ఆ దాడిలో ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ గార్డ్స్ జరిపిన కాల్పుల్లో సద్దాం కాలికి బుల్లెట్ తగిలింది. అయినా సద్దాం మాత్రం అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ప్రైమ్ మినిస్టర్ ని చంపే ప్రయత్నం చేయడంతో ఇరాక్ లో సద్దాం ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ గా మారిపోయాడు. అంతేకాదు సద్దాం పేరు ఇరాక్ దేశంఅంతా మారుమోగిపోయింది.
(10:07) అరబ్ యూనిటీ కోసం ప్రాణాలకు తెగించి ప్రైమ్ మినిస్టర్ ని చంపే ప్రయత్నం చేశాడని సద్దాం కి అభిమానులు కూడా తయారయ్యారు. అంతేకాదు ఈ సంఘటనతో బాతిస్ట్ ఐడియాలజీకి ఇరాక్ లో పాపులారిటీ కూడా వచ్చింది. ఈ అసోసియేషన్ అటెంప్ట్ తర్వాత సద్దాం కోసం ఇరాక్ ఆర్మీ వెతకడం స్టార్ట్ చేసింది. కానీ సద్దాం మాత్రం ఎవరికీ దొరక్కుండా దాక్కున్నాడు. కొంతకాలానికి బాత్ పార్టీ సపోర్ట్ తో సద్దాం ఇరాక్ నుంచి ఇల్లీగల్ రూట్లో సిరియాకు పారిపోయాడు.
(10:30) అక్కడి నుంచి ఫైనల్ గా ఈజిప్ట్ కి మకం మార్చాడు. సద్దాం ఈజిప్ట్ లో ఉన్నంత కాలం తన నెట్వర్క్ ని విపరీతంగా విస్తరించుకున్నాడు. బాతి స్ట్రైడియాలజీ కోసం ఏకంగా ఇరాక్ ప్రైమ్ మినిస్టర్ ని చంపేయబోయాడని అన్ని అరబ్ దేశాల్లో ఉన్న బాత్ పార్టీ బ్రాంచ్ల నుంచి సద్దాం కి మద్దతు లభించింది. ఈజిప్ట్ లో సద్దాం కి బాత్ పార్టీ అన్ని విధాలుగా లావిష్ ట్రీట్మెంట్ ఇస్తూ వఐపీ లా చూసుకునేది.
(10:52) అదే టైంలో సద్దాం సిఐఏ తో కూడా టచ్ లో ఉంటూ వచ్చాడు. అన్ఆఫీషియల్ మేటర్స్ ప్రకారం సిఐఏ సద్దాం కి సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఒకవైపు ఈజిప్ట్ లో ఉంటూ సద్దాం తన నెట్వర్క్ ని స్ట్రాంగ్ గా చేసుకుంటుంటే మరోవైపు 1963 లో ఇరాక్ లో మరోసారి ఆర్మీ తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటుని బాత్ పార్టీని లీడ్ చేసింది. ఈసారి ఇరాక్ ఆర్మీలో పని చేస్తున్న కొందరు సైనికులు ఇరాక్ ప్రైమ్ మినిస్టర్ కాసిం ని ఈసారి కాల్చి చంపారు.
(11:15) దాంతో బాత్ పార్టీకి చెందిన అహమ్మద్ హసన్ ఇరాక్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇక్కడే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. కాసిం ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన ఆరిఫ్ కి ఇరాక్ ఆర్మీ సపోర్ట్ ఉంది. కాబట్టి ఆరిఫ్ ఇరాక్ లో చాలా పవర్ఫుల్ గా మారాడు. ఇరాక్ కి ప్రెసిడెంట్ అయ్యాడు. కానీ ప్రైమ్ మినిస్టర్ పదవి మాత్రం బాత్ పార్టీకి ఇచ్చాడు.
(11:36) దాంతో బాత్ పార్టీ లీడర్ అహ్మద్ హసన్ ఇరాక్ కి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అహమద్ హసన్ ఇరాక్ బాత్ పార్టీలో మెయిన్ లీడర్ ఆర్మీలో కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఇరాక్ ప్రైమ్ మినిస్టర్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో అతను సద్దాం ఇద్దరూ ఒకే తెగకు చెందినవారు కాబట్టి సద్దాం తో అహ్మద్ కి మంచి సంబంధాలు ఉండేవి. దాంతో ఇన్నాళ్ళు ఈజిప్ట్ లో తలచుకున్న సద్దాం అహ్మద్ పీఎం అయిన వెంటనే ఇరాక్ కి వచ్చేసాడు.
(11:57) దాంతో అహ్మద్ సద్దాం ని ఇరాక్ ఇంటెలిజెన్స్ వింగ్ కి హెడ్ గా నియమించాడు. ఇంటెలిజెన్స్ వింగ్ కి హెడ్ గా పని చేయడం దేశంలో చాలా పెద్ద పదవి. సద్దాం ఆ పదవిలో చేయాల్సింది ఏంటంటే బాతిస్ట్ ఐడియాలజీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని గుర్తించి వాళ్ళని చంపేయాలి. అయితే అహ్మద్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కొన్ని రోజుల్లోనే అహ్మద్ కి ప్రెసిడెంట్ ఆరిఫ్ కి మధ్య విభేదాలు వచ్చాయి.
(12:18) దాంతో ఆరిఫ్ అహ్మద్ ని పదవి నుంచి తొలగించి తాహిర్ యాయా అనే వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ ని చేశాడు. ఆరిఫ్ బాత్ పార్టీకి ఇచ్చిన ప్రైమ్ మినిస్టర్ ని వెనక్కి తీసుకోవడమే కాకుండా బాత్ పార్టీని ఇరాక్ లో బ్యాన్ చేశాడు. అక్కడితో ఆగలేదు. బాత్ పార్టీ లీడర్స్ ని జైల్లో పెట్టించాడు. దాంతో సద్దాం తన ఇంటెలిజెన్స్ హెడ్ పదవిని కోల్పోవడమే కాకుండా జైలుకి కూడా వెళ్ళాల్సి వచ్చింది.
(12:37) 1963 లో జరిగిన ఈ పరిణామాల వల్ల బాత్ పార్టీకి అధికారం వచ్చినట్లే వచ్చి దూరమైంది. ఇక 1966 ఏప్రిల్ లో ఇరాక్ ఆర్మీని గుప్పిట్లో పెట్టుకొని ప్రెసిడెంట్ పదవి సంపాదించిన ఆరిఫ్ హెలికాప్టర్ లో ప్రమాదంలో మరణించాడు. దాంతో ఇరాక్ కి ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ లేకుండా పోయింది. అలా ఆరిఫ్ మరణించిన తర్వాత అతని తమ్ముడు ప్రెసిడెంట్ అయినా కూడా అతను అంత పవర్ఫుల్ గా ఇరాక్ పాలిటిక్స్ ని కంట్రోల్ చేయలేకపోయాడు.
(13:00) దాంతో ఇరాక్ లో ప్రభుత్వం వీక్ అయిపోయింది. దాంతో 1966 జూలైలో సద్దం జైల్ నుంచి తప్పించుకొని బయటిక వచ్చాడు. బయటక వచ్చిన తర్వాత ఇరాక్ లో దాదాపుగా కనుమరుగైన బాత్ పార్టీని మళ్ళీ తిరిగి నిర్మించడం స్టార్ట్ చేశాడు. పార్టీ వ్యవహారాలని మళ్ళీ యాక్టివ్ మోడ్ లోకి తీసుకొచ్చాడు. పార్టీలో యువతను రిక్రూట్ చేసుకున్నాడు.
(13:20) గతంలో సద్దాం ఈజిప్ట్ లో తలదాచుకున్న సమయంలో ఏర్పడిన పరిచయాలతో అమెరికన్ సిఐఏ తో టచ్ లోకి వెళ్ళాడు. రెండు సంవత్సరాల పాటు రహస్యంగా బాద్ పార్టీ నిర్మించాడు. గతంలో ఇరాక్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన అహ్మద్ కూడా సద్దాం తో కలిసి పని చేశాడు. అహ్మద్ సద్దాం వీళ్ళద్దరూ కలిసి మొత్తానికి 1968 లో ఇరాక్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి అహ్మద్ ఇరాక్ ప్రెసిడెంట్ అయ్యాడు.
(13:41) సద్దాం ని రెవల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ కి డిప్యూటీ చైర్మన్ చేశారు. దాంతో పాటు సద్దాం ఇరాక్ కి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యాడు. అప్పటికి సద్దాం హుసేన్ వయసు కేవలం 37 సంవత్సరాలు మాత్రమే. రెవల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ కి ఎవరైతే చైర్మన్ గా ఉంటారో వారే ఇరాక్ కి ప్రైమ్ మినిస్టర్ గా ఉంటారు. ఆ టైంలో రజాక్ అల్ నైఫ్ అనే మిలిటరీ ఆఫీసర్ ని ప్రైమ్ మినిస్టర్ ని చేశారు.
(14:03) ఎందుకంటే ముందున్న ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మిలిటరీ సహాయం చేసింది కాబట్టి మిలిటరీ ఆఫీసర్ కి ఈసారి ప్రధానికి అవకాశం ఇచ్చారు. అయితే బాత్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన టైంలో వెంటనే కొప్పుకొలింది. అధికారం నిలుపుకోవడంలో బాత్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. కాబట్టి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరిగిన పొరపాట్లు జరగకుండా సద్దాం గవర్నమెంట్ కంట్రోల్ ని పూర్తిగా తన చేతిలో తీసుకున్నాడు.
(14:24) ఎందుకంటే సద్దాం ఒక పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తి కానీ ప్రైమ్ మినిస్టర్ రజా కల్నైఫ్ కి పొలిటికల్ బేస్ లేదు. కాబట్టి ప్రభుత్వం పెత్తనం అంతా సద్దాం చేతిక వచ్చింది. దాంతో ప్రతి ఒక్కరి మీద కన్నేసి ఉంచేందుకు సద్దాం సొంతంగా ఒక ఇంటెలిజెన్స్ గ్రూప్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఇంటెలిజెన్స్ గ్రూప్ లో మొత్తం ఐదు సపరేట్ ఆర్గనైజేషన్స్ ని సెటప్ చేశాడు.
(14:42) ఇరాక్ ఆర్మీతో సహా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో స్పైలన్ ఏర్పాటు చేశాడు. దేశంలో సామాన్య ప్రజలు మాట్లాడుకునే విషయాలు సైతం తమకు తెలిసేలా ఇంటెలిజెన్స్ ని ట్రైన్ చేశాడు. ఏ ఒక్క గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న అలజడి జరిగిన వెంటనే సద్దాం ఆ డిపార్ట్మెంట్ హెడ్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాడు. ప్రభుత్వానికి ప్రమాదం ఉందని భావించిన ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టించాడు.
(15:03) ఇలా ప్రభుత్వంలో సద్దాం జోక్యం ఎక్కువ అవ్వడంతో సద్దాం కి రజాక్ అల్ నైఫ్ కి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దాంతో సద్దాం ఈసారి ఛాన్స్ తీసుకోవాలనుకోలేదు. రజాక్ కల్నైఫ్ ని బెదిరించి బలవంతంగా ప్రైమ్ మినిస్టర్ పదవి నుంచి దించేశడు. సద్దాం ఎక్కడ తనను చంపేస్తాడో అని రజాక్ ఏకంగా యూకే పారిపోయాడు. అయినా సద్దాం మాత్రం రజాక్ ని యూకే లోనే చంపించేశడు.
(15:25) ఇక 1972 లో రజాక్ తర్వాత ఆ ప్రైమ్ మినిస్టర్ పదవి సద్దం తీసుకోలేదు. ఇరాక్ ప్రెసిడెంట్ గా ఉన్న అహ్మద్ ని రెవల్యూషనరీ కమెంట్ కౌన్సిల్ కి చైర్మన్ చేశారు. దాంతో 1972 నుంచి ఇరాక్ ప్రెసిడెంట్ గా మరియు ప్రైమ్ మినిస్టర్ గా రెండు పదవుల్లో అహ్మద్ కొనసగుతూ వచ్చాడు. కానీ అధికారకంగా పదవుల్లో ఉంది అహ్మదే అయినా రూలింగ్ మాత్రం సద్దాం చెప్పినట్టే నడిచేది.
(15:46) అంటే ఇరాక్ లో డెసిషన్ మేకింగ్ అంతా సద్దాం కంట్రోల్ లోనే ఉండేది. అంతలా ఇరాక్ పాలిటిక్స్ లో సద్దాం పవర్ఫుల్ గా మారాడు. సద్దం ఇరాక్ పాలిటిక్స్ లో ఇంత స్ట్రాంగ్ పర్సనాలిటీగా రైజ్ అవ్వడంలో అమెరికన్ సిఐఏ హస్తం కూడా ఉంది. అయితే ఇరాక్ లో ఉన్న ఆయిల్ రిజర్వర్ల మీద వెస్టర్న్ కంపెనీల ఆధిపత్యమే నడిచేది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఈ దేశాల కంపెనీలు ఇరాక్ లోని ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసేవి.
(16:07) కానీ సద్దాం 1972 లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇరాక్ పెట్రోలియం కంపెనీ అని ఒక కన్సర్టియం ని ఏర్పాటు చేసి ఇరాక్ లో ఆయిల్ రిసోర్సెస్ ని నేషనలైజ్ చేశాడు. సద్దాం ఎప్పుడైతే ఆయిల్ రిజర్వ్ల నేషనలైజ్ చేశడో ఇరాక్ లో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్న వెస్టర్న్ ఆయిల్ కంపెనీలు ఇరాక్ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సద్దాం హుసేన్ ఆయిల్ రిజర్వ్లను నేషనలైజ్ చేసి అమెరికాకు షాక్ ఇచ్చాడు.
(16:30) కానీ అమెరికా మాత్రం పెద్దగా ఈ విషయం మీద రియాక్ట్ కాలేదు. ఇక ఆయిల్ రిజర్వ్లను నేషనలైజ్ చేసిన తర్వాత ఇరాక్ ప్రభుత్వం ప్రతిరోజు 3 మిలియన్ బ్యాలరల ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసేది. ఆయిల్ మీద వస్తున్న ఆదాయం అంతా దేశానికి దక్కడంతో ఇరాక్ ఎకనామికల్ గా డెవలప్ కావడం మొదలైంది. ఎప్పుడైతే ఎకనామిక్ గ్రోత్ కనిపించిందో ఇరాక్ లో సద్దాం పాపులారిటీ కూడా పెరిగింది.
(16:49) ప్రజల్లో సద్దాం హుసేన్ పట్ల పాజిటివ్ ఒపీనియన్ డెవలప్ అయింది. అయితే 1973 లో సద్దాం హుసేన్ సీక్రెట్ గా ఒక లా తయారు చేశాడు. ఆయిల్ మీద వచ్చే ఇన్కమ్ లో 5% ఇన్కమ్ ని సీక్రెట్ గా స్విస్ బ్యాంక్ లో దాచిపెట్టాలని ఆర్డర్ ఇచ్చాడు. ఫ్యూచర్ లో బాత్ పార్టీ యాక్టివిటీస్ కోసం ఈ ఫండ్ ఉపయోగపడుతుందని సద్దాం ఇలా వేల కోట్ల రూపాయలు సీక్రెట్ గా వెనకేసుకున్నాడు.
(17:09) అయితే 1979 లో ఇరాక్ లో అసలైన పొలిటికల్ డ్రామా మొదలైంది. సద్దాం పాపులారిటీ సద్దాం డామినెన్స్ ఇవన్నీ చూసి ఇరాక్ ప్రైమ్ మినిస్టర్ కం ప్రెసిడెంట్ గా ఉన్న అహ్మద్ తట్టుకోలేకపోయాడు. సద్దాం ని ఎలా అయినా పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కానీ సద్దాం కి ఈ విషయం ముందుగానే తెలిసిపోయింది. దాంతో సద్దాం తన మనుషులతో కలిసి అహమద్ తో చర్చలు జరిపి ఒత్తిడి పెంచి అతన్ని చివరికి రిజైన్ చేయించి సద్దామే ఈసారి ఇరాక్ ప్రెసిడెంట్ అయ్యాడు.
(17:37) ఇలా సద్దాం ప్రెసిడెంట్ అయిన తర్వాత అసలైన హర్రర్ ని స్టార్ట్ చేశాడు. ఎక్స్ ప్రెసిడెంట్ అహ్మద్ వద్ద సెక్రెటరీగా పనిచేసిన అబ్దుల్ హుసేన్ అనే ఆఫీసర్ ని అరెస్ట్ చేసి అతన్ని విపరీతంగా టార్చర్ చేశాడు. తనని పదవి నుంచి తప్పించే ప్రయత్నం చేసిన వారు ఎవరు ఎందుకు చేశారు? ఈ మొత్తం కుట్రలో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇలా ప్రతి ఒక్క సమాచారాన్ని సద్దం తెలుసుకున్నాడు.
(17:57) అలా మాజీ ప్రెసిడెంట్ అహ్మద్ తో పాటు మరో 68 మంది ఆర్సిసి మెంబర్స్ సద్దాం ని పదవి నుంచి తొలగించే ప్రయత్నంలో భాగం అయ్యారని తెలుసుకున్నాడు. దాంతో ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇరాక్ లో ఉన్న టాప్ లీడర్స్ రెవల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ మెంబర్స్ అందరితో సద్దాం ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఈ మీటింగ్స్ కి మొత్తం 400 మంది ఇరాక్ పొలిటీషియన్స్ అటెండ్ అయ్యారు.
(18:17) సద్దాం ప్రెసిడెంట్ హోదాలో ఆ మీటింగ్ కి అటెండ్ అయ్యాడు. సద్దాం తో పాటు అబ్దుల్ ని కూడా తీసుకొని వచ్చాడు. స్టేజ్ మీద అబ్దుల్ ని పిలిపించి సద్దాం మీద ఎలాంటి కుట్ర జరిగింది అనే విషయాన్ని అతని నోటితోన చెప్పించాడు. అబ్దుల్ కుట్ర గురించి కన్ఫ్యూషన్ ఇస్తుంటే సద్దం అదే స్టేజ్ మీద నవ్వుతూ కాలు మీద కాలు వేసుకొని చేతిలో సిగర్ తో సద్దం ప్రవర్తించిన తీరు ఆ మీటింగ్ హాల్ లో ఉన్న వారికి చెమటలు పట్టిచ్చేసింది.
(18:39) మీరు ఇక్కడ చూడొచ్చు సద్దం ఎలా ప్రవర్తించాడో అని అబ్దుల్ కన్ఫెషన్ పూర్తయిన తర్వాత ఇరాక్ సైనికులు అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇక అబ్దుల్ మాట్లాడడం అయిపోయిన వెంటనే సద్దం మైక్ ముందుకు వచ్చి మళ్ళీ అందరి ముందు స్టైల్ గా మరో సిగర వెలిగించి చేతిలో సిగర పట్టుకొని మాట్లాడడం మొదలు పెట్టాడు. ప్రపంచంలో ఏ దేశాధ్యక్షుడు ఇలా బహిరంగంగా పొగతాగుతూ మాట్లాడి ఉండడు.
(19:01) కాబట్టి సద్దం ఇరాక్ ని ఏ రేంజ్లో తన గుప్పిట్లో పెట్టుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇలా చేతిలో సిగారు పట్టుకొని ఎవరైతే తనను పదవి నుంచి తొలగించే ప్రయత్నం చేశారో వాళ్ళ పేర్లు ఒక్కొక్కటిగా చదవడం స్టార్ట్ చేశాడు. సద్దం ఎవరి పేరైతే చదువుతాడో వాళ్ళు ఆ మీటింగ్ హాల్ ని వదిలి పక్కనే ఉన్న మరో రూమ్లోకి వెళ్ళాలి. అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఇరాక్ అర్మి సిద్ధంగా ఉంచాడు.
(19:22) అలా సద్దాం పేర్లు చదువుతుండగా ఒక్కొక్కరు ఆ రూమ్లోకి వెళ్ళడం అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి మిలిటరీ ట్రక్ లో ఎక్కించారు. అలా 68 మంది టాప్ లీడర్స్ ని ఆర్సిసి మెంబర్స్ ని సద్దాం ఒకే రోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. సద్దాం పేర్లు చదవడం పూర్తయిన తర్వాత ఆ హాల్ లో ఉన్నవాళ్ళు డాన్స్ చేశారు. ఎందుకంటే ఆ లిస్ట్ లో తమ పేరు లేదు తమ ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదు అన్న ఆనందంలో అంటే అర్థం చేసుకోండి సద్దం ఆ రోజున ఆ 400 మందికి ఎలా గుండెలో రైలు పరిగెత్తించాడో అరెస్ట్ అయిన 68 మీద ఇరాకు కోర్టులో ట్రైల్ జరిగింది.
(19:52) వీరిలో 22 మందికి ఇరాకు కోర్టులో ఉరిశిక్ష వేయించాడు. ఉరిశిక్ష పడిన వారిని ప్రజల ముందు బహిరంగంగా ఉరితీసి చంపాడు. మిగిలిన వారిని సద్దం జైల్లో పెట్టి నరకం చూపించాడు. ఇలా 1979 నుంచి సద్దాం నియంతృత్వానికి పూర్తిగా రెక్కలు వచ్చాయి. ఇరాక్ లో సద్దం నియంతృత్వానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. దాంతో పాటు సద్దాం ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇరాక్ లో అతన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టడం చంపించడం లాంటివి చేసేవాడు.
(20:16) అయితే సద్దాం ని శత్రువుల భయం చావు భయం వెంటాడుతూ ఉండేది. సద్దాం ని కలిసేందుకు వచ్చే ప్రతి ఒక్కరిని బట్టలు విప్పించి తనికి చేసిన తర్వాతే సద్దాంని కలవనిచ్చేవారు. ఇరక్ కార్మీ జనరల్ ని కూడా సద్దాం కలవాలంటే బట్టలు లేకుండా తనకీ చేయాల్సిందే. సద్దాం తినే ప్రతి ఆహార పదార్థాన్ని సద్దం కన్నా ముందు దాన్ని ప్రిపేర్ చేసిన షెఫ్ కొడుకు కూడా తినాలి.
(20:36) ఎవరైనా తాను తినే ఆహారంలో విషం కలుపుతారని భయపడేవాడు. సద్దాం బాడీ డబుల్స్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇరాక్ లో అచ్చం సద్దాం హుసేన్ లాగా కనిపించే వ్యక్తులను తీసుకొచ్చి వారికి సద్దాం బాడీ లాంగ్వేజ్ ని ట్రైన్ చేసేవారు. సద్దాం ఐడెంటిటీ అర్థం కాకుండా ఉండేందుకు ఇలా బాడీ డబుల్ టెక్నిక్స్ ఫాలో అయ్యాడు.
(20:53) ఏదైనా ప్రమాదకర ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తే సద్దాం బదులుగా అతని డూప్ వెళ్ళేవాడు. ఎనిమీస్ కి అసలు సద్దాం ఎవరు అనే విషయం అర్థమయ్యేది కాదు. అయితే 1979లో ఇరాక్ కి పక్కనే ఉండే ఇరాన్ దేశంలో తిరుగుబాటు జరిగింది. పహలావి రాజవంశాన్ని దించేసి అయతుల్ల రోహల్ల కొమీని అనే వ్యక్తి ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యాడు. ఇరాన్ అనేది షియా ముస్లిం కంట్రీ.
(21:15) ఇరాక్ లో కూడా షియా ముస్లిం జనాభాన ఎక్కువ. కానీ సద్దం మాత్రం సున్నీ ముస్లిం తెగకు చెందినవాడు. ఇరాన్ ఎప్పుడైతే షియా డామినెంట్ కంట్రీగా మారిందో మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ తో బార్డర్ షేర్ చేసుకునే ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా ఈ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఎందుకంటే ఇస్లాంలో షియా సున్నీ తెగలు ఒకరినొకరు శత్రువులుగా భావిస్తారు. షియా సున్నీల మధ్య ఉన్న వివాదానికి వందల ఏళ్ల నాటి మతపరమైన చరిత్ర ఉంది.
(21:37) ఇరాక్ లో మెజారిటీ ముస్లింలు షియా కమ్యూనిటీ వారే ఉంటారు. కాబట్టి షియా కమ్యూనిటీ తిరుగుబాటు చేస్తే సద్దాం కి అధికారం దూరమవుతుంది. కాబట్టి పక్కనే ఉన్న ఇరాన్ సుప్రీం లీడర్ షియా కమ్యూనిటీని తిరుగుబాటు చేసేలా రెచ్చగొట్టడంతో సద్దాం కి ఇరాన్ పట్ల కోపం పెరిగిపోయింది. ముందుగా సద్దాం తన దేశమైన ఇరాక్ లో ఉండే షియా ముస్లింల మీద ప్రత్యేకమైన విజిలెన్స్ ఏర్పాటు చేశాడు.
(21:58) షియా కమ్యూనిటీకి చెందిన రాజకీయ నాయకుల్ని అధికారుల్ని కీలక పదవుల నుంచి తొలగించి తనకు అనుకూలంగా ఉండే వారిని నియమించుకున్నాడు. ఇలా ఇరాన్ లో జరిగిన తిరుగుబాటు ఇరాక్ ని ఏలుతున్న సద్దాం ని కంగారు పెట్టింది. ఒక సద్దాం ని మాత్రమే కాదు ఇరాక్ పక్కన ఉన్న సౌదీ అరేబియా కువైట్ దేశాల్లో కూడా ఇదే తరహ కంగారు మొదలైంది. ఆ టైంలో మిడిల్ ఈస్ట్ లో మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీ సద్దాం కాబట్టి సౌదీ అరేబియా కువైట్ ఈ రెండు దేశాలు సద్దాం ని మరింత రెచ్చగొట్టాయి.
(22:24) దాంతో ఎలాగైనా ఇరాక్ ని అడ్డుకోవాలి అని సద్దాం ఒక ప్లాన్ వేశడు. 1975 లో ఇరాన్ ఇరాక్ మధ్య ఉండే షట్ అల్ అరబ్ అనే వాటర్ వే కి సంబంధించి ఒక ఒప్పందం జరిగింది. దాంతో పాటు ఇరాన్ కి కొంత భూభాగం కూడా బదిలీ అయింది. దీన్నే అల్జియర్స్ ఒప్పందం అంటారు. ఈ అల్జియర్స్ ఒప్పందం వల్ల వాటర్ వే మీద ఇరాన్ కి ఎక్కువ అధికారాలు ఉండేవి.
(22:44) కానీ ఇరాన్ లో అధికారం చేంజ్ కావడంతో సద్దాం హుసేన్ ఆ ఒప్పందాన్ని ఉల్లంగించి వాటర్ వే మీద కంట్రోల్ తీసుకున్నాడు. ఇరాన్ కి ఇచ్చిన భూమిని కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశాడు. దాంతో ఇరాక్ ఇరాన్ మధ్య వివాదం మొదలైంది. ఈ వివాదం ఇరాన్ ఇరాక్ మధ్య యుద్ధానికి దారి తీసింది. అలా 1980 సెప్టెంబర్ 2న ఇరాన్ ఇరాక్ మధ్య యుద్ధం మొదలైంది.
(23:04) ఈ యుద్ధంలో సౌదీ అరేబియా కువైట్ లో ఇరాక్ కి ఫైనాన్షియల్ గా మాత్రమే సపోర్ట్ ఇచ్చాయి. ఎందుకంటే సౌదీ కువైట్ ఈ దేశాలకి సొంతంగా మిలిటరీ ఉండేది కాదు కానీ ఈ యుద్ధం అనుకున్న దానికంటే మరింత ముందుకు వెళ్ళింది. ఇరాన్ సైన్యంతో ఇరాక్ సైన్యం గెలవలేకపోయింది. 1988 వరకు అంటే ఎనిమిది సంవత్సరాల పాటు ఈ యుద్ధం కొనసాగింది. ఇంత సుదీర్ఘంగా యుద్ధం జరిగిన సద్దం సాధించింది ఏదీ లేదు.
(23:26) ఈ యుద్ధం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఈ యుద్ధంలో అమెరికా ఇండైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. సద్దాం ఇరాక్ లో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మీద ఆంక్షలు పెట్టడం వల్ల అమెరికాకు నష్టం జరిగినా కూడా అమెరికా మాత్రం సద్దాంకే సపోర్ట్ చేసింది. ఎందుకంటే ఇరాన్ లో జరిగిన ఇస్లామిక్ విప్లవం మిడిల్ ఈస్ట్ దేశాలని ఇన్ఫ్లయెన్స్ చేస్తే ఆ దేశాల మీద అమెరికన్ డామినేషన్ లేకుండా పోతుంది.
(23:46) కాబట్టి అమెరికన్ ఆయిల్ మార్కెట్ కి ఇది చాలా పెద్ద నష్టం కలిగిస్తుంది. కాబట్టి అమెరికా సద్దాం హుసేన్ తో చేతులు కలిపింది. నిజానికి ఈ యుద్ధంలో అమెరికా సద్దాం హుసేన్ కి ఓపెన్ గా సపోర్ట్ చేయలేదు. బ్యాక్ డోర్ నుంచి రహస్యంగా సపోర్ట్ చేయడం మొదలు పెట్టింది. ఇరాక్ కి ఆయుధాలు సప్లై చేయడం ఇరాన్ మిలిటరీ కి సంబంధించిన సాాటిలైట్ ఇమేజెస్ ని సద్దం హుసేన్ కి ఇవ్వడం ఇలాంటివి చేసింది.
(24:05) యుద్ధం జరిగితే దానిలో ఏదో ఒక రకంగా ఇన్వాల్వ్ అవ్వడం ఆయుధాలు సప్లై చేయడం ద్వారా భారీగా సంపాదించడం అమెరికాకు బాగా అలవాటు. ఆయుధాలు సాటిలైట్ ఇమేజెస్ తో పాటు వార్ టైంలో ఇరాక్ కి అమెరికా లోన్స్ ప్రొవైడ్ చేసి ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేసింది. కానీ ఇదంతా కొంతకాలం మాత్రమే జరిగింది. ఇక క్రమంగా యుద్ధంలో ఇరాక్ విషయంలో అందరి అంచనాలు తప్పాయి.
(24:25) ఇరాక్ ఇరాన్ ఆర్మీకి చుక్కలు చూపించడం మొదలైంది. దాంతో ఇరాక్ బలం అర్థం కావడంతో అమెరికా సౌదీ అరేబియా కువైట్ ఈ దేశాలన్నీ ఆలోచనలు పడ్డాయి. సౌదీ అరేబియా కువైట్ లు సద్దాం కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం ఆపేసాయి. దాంతో యుద్ధభారం అంతా ఇరాక్ మీదే పడింది. కొంతకాలానికి అమెరికా కూడా సద్దాం కి ఫైనాన్షియల్ సపోర్ట్ నిలిపి వేసింది.
(24:44) ఇక ఈ యుద్ధం వల్ల ఆర్థికంగా ఇరాన్ ఇరాక్ రెండు దేశాలు నష్టపోవడం మొదలైంది. అయినా సద్దాం మాత్రం వెనక తగ్గలేదు. అయితే 1982 లో ఈ యుద్ధం అనేది రెండు దేశాల మధ్య అన్నట్టుగా కాకుండా షియా సున్ని తెగల మధ్య అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇరాక్ లో దుజైల్ అనే చిన్న గ్రామంలో షియా ముస్లింలు ఎక్కువగా ఉంటారు. ఈ గ్రామాన్ని సందర్శించడానికి సద్దాం వెళ్ళినప్పుడు సద్దాం మీద షియా ముస్లింలు కాల్పులు జరిపారు.
(25:10) కానీ ఆ గన్ ఫైరింగ్ నుంచి సద్దాం తప్పించుకున్నాడు. దాంతో దుజైల్ అనే గ్రామాన్ని సద్దాం వదిలి పెట్టలేదు. ఆ గ్రామంలో ఉండే పెద్దలు, పిల్లలు, మహిళలు మొత్తం కలిపి 750 మందిని జైల్లో పెట్టాడు. వీళ్ళలో 148 మందికి కోర్ట్లో ఉరిశిక్ష పడేలా చేసి చంపించాడు. ఆ మొత్తం గ్రామంలో ఉన్న ఇళ్లను కూల్చి పడేశడు. సద్దాం హుసేన్ జీవితంలో ఇది చాలా ముఖ్యమైన విద్వాంసం. సద్దాం హుసేన్ చావుకు బీజం పడింది కూడా ఇక్కడే అందుకే ఈ సంఘటన గుర్తుంచుకోండి.
(25:33) మరోవైపు ఇరాక్ నుంచి ఆయిల్ కొనకుండా అమెరికాకు అనుకూలంగా ఉండే దేశాలు బ్యాన్ విధించాయి. అమెరికా ఆయిల్ బ్యాన్ కు భయపడి సౌదీ అరేబియా కువైట్ లు సద్దాం ని ఈ యుద్ధంలో వంటరం చేశాయి. అయినా కూడా సద్దాం మాత్రం యుద్ధంలో వెనక తగ్గలేదు. ఈ క్రమంలోనే సద్దాం ప్రాజెక్ట్ 922 పేరుతో కెమికల్ వెపన్స్ తయారు చేయడం మీద దృష్టి పెట్టాడు.
(25:54) అత్యంత ప్రమాదకర ఈ కెమికల్ వెపన్స్ తయారు చేయడంలో సద్దాం సక్సెస్ అయ్యాడు. అయితే యుద్ధం అనుకున్న దానికన్నా మరింత ముందుకు వెళ్తుండడంతో సద్దాం కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవైపు భారీగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది. అమెరికా, సౌదీ అరేబియా, కువైట్ లాంటి దేశాల్లో సహాయం నిలిపి వేస్తున్నాయి. ఇలాంటి సమయంలో సద్దాం కొంతమంది మంత్రులతో సమావేశం అయ్యాడు.
(26:14) ఆ సమావేశంలో యుద్ధం గురించి చర్చ జరిగింది. ఇరాక్ హెల్త్ మినిస్టర్ సీస్ ఫైర్ చేయాలని సలహా ఇచ్చాడు. కానీ సీస్ ఫైర్ కి సద్దాం ఒప్పుకోలేదు. ఈ విషయం మీద సద్దాం కి హెల్త్ మినిస్టర్ కి మధ్య చిన్న బేదభిప్రాయం వచ్చింది. దాంతో వెంటనే సద్దాం తన వద్ద ఉన్న గన్ తో హెల్త్ మినిస్టర్ ని అక్కడికక్కడే కాల్చి చంపాడు. ఈ సంఘటన తర్వాత సద్దాం కి సలహా ఇవ్వాలన్నా కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది.
(26:34) దాంతో సద్దాం ఆలోచనలకి అడ్డు చెప్పే వాళ్ళు లేకుండా పోయారు. ప్రతి ఒక్కరు అంగీకరించడం మొదలు పెట్టారు. దాంతో సద్దాం యుద్ధంలో మారణ హోమానికి తెరలేపాడు. ఇరాన్ బార్డర్ మీద కెమికల్ వెపన్స్ ప్రయోగించడం స్టార్ట్ చేశాడు. ఈ కెమికల్ వెపన్స్ వల్ల ప్రాణనష్టం తక్కువగానే ఉన్న ప్రజలు మాత్రం లాంగ్ టర్మ్ హెల్త్ డిసీసెస్ తో ఇబ్బంది పడేవారు.
(26:53) ఇరాకు బోర్డర్ లో ఉన్న సర్దస్త్ అనే గ్రామం మీద కెమికల్ వెపన్స్ ప్రయోగించడం వల్ల 150 మంది మరణిస్తే 8000 కన్నా ఎక్కువ మంది ఆరోగ్య సమస్యలతో జీవితకాలం బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా మొత్తం ఈ యుద్ధంలో సద్దం 350 కెమికల్ వెపన్స్ ప్రయోగించాడు. అయితే యుద్ధం జరిగితే శత్రువు భూభాగం మీద దాళ్లు చేయడం సహజమే. కానీ సద్దం మేకంగా ఇరాక్కు భూభాగం మీద కూడా దాళ్లు చేశాడు.
(27:16) 1988లో ఇరాక్ లోని హల్బజా అనే బోర్డర్ టౌన్ లో షియా ముస్లింలే ఉంటారు. వీరంతా ఇరాన్ కి మద్దతు ఇస్తున్నారని సద్దాం సొంత ప్రజల మీద కెమికల్ వెపన్స్ తో దాడులు చేశాడు. దాంతో హల్బజా టౌన్ పూర్తిగా ద్వంసమైింది. వేల మంది షియా ముస్లింలు మరణించారు. 10 వేల కన్నా ఎక్కువ మంది వికలాంగులు అయ్యారు. హల్బజా టౌన్ లో జరిగిన విద్వంసానికి సంబంధించిన ఫోటోలు విపరీతంగా వైరల్ కావడంతో సద్దాం అరాజ్కం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.
(27:41) UNO, యూనిసెఫ్, WTO ఇలాంటి సంస్థలు సద్దాంని ఆపాలని ప్రపంచ దేశాలతో చర్చలు జరపడం మొదలు పెట్టాయి. కానీ అప్పటికే ఇరాన్, ఇరాక్ రెండు తీవ్రంగా ద్వం అయ్యాయి. అఫీషియల్ గా ఈ యుద్ధం వల్ల రెండు దేశాల్లో లక్ష మంది మరణించారు. అన్ఆఫీషియల్ గా ఈ లెక్క రెండు మూడు రెట్లు ఎక్కువగానే ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
(28:02) ఈ యుద్ధంలో ఇరాక్ లో సద్దాం షియా ముస్లింలను ఊచకోత కోసాడు. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఎలాగైతే జ్యూస్ ని ఊచకోత కోసాడో సద్దాం కూడా షియా ముస్లింల పట్ల అంతే దారుణంగా ప్రవర్తించాడు. ఇక 1988 లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ యుద్ధాన్ని ఆపేయాల్సిందే అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టగా రెండు దేశాలు కూడా చివరికి అంగీకరించాయి. దాంతో 19 88లో ఈ యుద్ధం ముగిసింది.
(28:24) ఈ యుద్ధం ద్వారా సద్దాం కాస్త కూడా సాధించింది ఏమీ లేదు. పైగా ఈ యుద్ధంలో ఇరాక్ 130 బిలియన్ డాలర్లు నష్టపోయింది. ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఆర్థిక నష్టం ఇలా అన్ని రకాలుగా సద్దాం ఇరాక్ ని సర్వనాశనం చేశాడు. దాంతో ఇరాక్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమైంది. దాంతో సద్దాం ఇరాక్ ఆర్థిక వ్యవస్థను తిరిగి నిర్మించడం ఎలా అని ఆలోచిస్తే సద్దాం హుసేన్ కి కనిపించిన ఒకే ఒక్క మార్గం అధిక ధరకి ఆయిల్ నమ్మటం.
(28:50) అలా ఇరాక్ ఒక్కటే అధిక ధరకి అమ్మితే ఎవ్వరు కొనరు. అదే ఆయిల్ అమ్మే ప్రతి దేశం రేట్లు పెంచితే అందరికీ వ్యాపారం పెరిగిద్దని భావించి ఇలా పెట్రోల్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ తో సద్దాం మాట్లాడాడు. అయితే ఇలా అనవసరంగా ధరలను పెంచి అమ్మడం అనేది ఇరాక్ కి అవసరమే కానీ మిగతా దేశాలకు కాదు. ఇలా చేస్తే మిగతా దేశాలకి అమెరికా యూకే లాంటి దేశాలతో తిప్పలు తప్పవు.
(29:12) కాబట్టి ఆ దేశాలు సద్దాం హుసేన్ చెప్పినట్టు చేయడానికి ఒప్పుకోలేదు. ఈ విషయంలో సౌదీ అరేబియా కువైట్ లో కూడా సద్దాం కి సహాయం చేయలేదు. దాంతో సౌదీ అరేబియా కువైట్ దేశాల మీద సద్దం విమర్శలు చేశాడు. అదే సమయంలో కువైట్ సౌదీ అరేబియా ఈ రెండు దేశాలు ఇరాన్ ఇరాక్ యుద్ధ సమయంలో ఇరాక్ కి ఇచ్చిన అప్పుని తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టాయి.
(29:32) కువైట్ 14 బిలియన్ డాలర్లను ఇరాక్ అప్పుగా ఇచ్చింది. సౌదీ అరేబియా 25 బిలియన్ డాలర్లను ఇరాక్ అప్పుగా ఇచ్చింది. అప్పుడున్న పరిస్థితిలో ఇంత డబ్బు తిరిగి చెల్లించడం అనేది ఇరాక్ కి అసాధ్యం. అలాంటి సమయంలో ఎవరైనా కువైట్ సౌదీ అరేబియా లాంటి దేశాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకుంటారు. కానీ అక్కడ ఉంది సద్దం కాబట్టి కువైట్ ని విమర్శించడం మొదలు పెట్టాడు.
(29:52) కువైట్ అవసరానికి మించి ఆయిల్ ని ఉత్పత్తి చేస్తుందని దానివల్ల ఆయిల్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడి ఆయిల్ ధరలు తగ్గుతున్నాయని ఆయిల్ ధరలు తగ్గడం వల్ల ఇరాక్ పోస్ట్ వార్ ఎకనామీ దెబ్బ తింటుందని సద్దాం హుసేన్ ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. దాంతో ఇరాక్ కువైట్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. మరోవైపు సద్దం చెల్లించాల్సిన 14 బిలియన్ డాలర్ల కోసం కువైట్ ఇరాక్ ను ఒత్తిడి చేయడం మొదలు పెట్టింది.
(30:14) 1990 నాటికి ఇరాక్ ఇరాన్ యుద్ధం ముగిసి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ఇరాక్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనం అయింది. కాబట్టి కువైట్ ని ఆక్రమించుకోవడం ద్వారా కువైట్ లో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ఇరాక్ ఎకనామికి ఉపయోగపడతాయని సద్దం భావించాడు. దాంతో పాటు కువైట్ అనేది స్ట్రాటజికల్ గా ఇరాక్ ని పర్షియన్ గల్ఫ్ తో మరింత ఎక్కువగా కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది.
(30:33) కాబట్టి కువైట్ ని ఆక్రమించుకుంటే అన్ని రకాలుగా లాభం అని ఆలోచించి కువైట్ ని ఆక్రమించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ విషయం అమెరికన్ సిఐ కి తెలిసిపోయింది. ఇరాక్ కువైట్ ని ఆక్రమించకముందే మిడిల్ ఈస్ట్ దేశాలకి ఈ విషయం తెలిసిపోయింది. దాంతో అమెరికా జోక్యం చేసుకొని సద్దాం కి నచ్చ చేపే ప్రయత్నం చేసింది. అయినా సద్దాం అమెరికా మాట లెక్క చేయకుండా 1990 ఆగస్టు 2న సద్దాం కువైట్ మీద యుద్ధం ప్రకటించాడు.
(30:55) నిజానికి కువైట్ కి యూకే కి మధ్య రక్షణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం కువైట్ ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే యూకే తో కూడా తలపడాల్సి ఉంటుంది. ఇంత ఒత్తిడి ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా సద్దాం అవేం పట్టించుకోలేదు. 1990 ఆగస్టు 8న ఇరాక్ దలాలు కువైట్ ని పూర్తిగా హస్తగతం చేసుకున్నాయి. దాంతో అమెరికా యునైటెడ్ నేషన్స్ లో ఇరాక్ కి వ్యతిరేకంగా రిజల్యూషన్ పాస్ చేయించింది.
(31:19) unూన్ ఇరాక్ కి వార్నింగ్ ఇచ్చింది. వెంటనే కువైట్ నుంచి బయటికి రావాలని హెచ్చరించింది. హెచ్చరికలతో పాటు ఇరాక్ నుంచి ఎవర ఆయిల్ కొనకూడదని ఆంక్షలు కూడా పెట్టారు. దాంతో ఇరాక్ నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ భారీగా పడిపోయాయి. అప్పటికే పతనమైన ఇరాక్ ఆర్థిక వ్యవస్థకి ఈ ఆంక్షలు పెద్ద గుదిబండల తయారయ్యాయి. అయినా కూడా శబ్దం వెనక తగ్గలేదు.
(31:39) ఓటమన్ ఎంపైర్ ఉన్నప్పుడు కువైట్ భూభాగం ఇరాక్ లో భాగంగా ఉండేదని ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. మరోవైపు కువైట్ ను పాలిస్తున్న రాజవంశం సద్దాం కి భయపడి సౌదీ అరేబియాలో తలదాచుకుంది. 1990 ఆగస్టులో మొదలైన ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కువైట్ ని ఇరాక్ ఆక్రమం నుంచి బయట పడేసేందుకు అమెరికా ఒక భారీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని సిద్ధం చేసి ఆపరేషన్ డెసర్ట్ స్ట్రోమ్ అని పేరు పెట్టింది.
(32:01) 1991 జనవరి 17న అమెరికాతో పాటు యూకే ఫ్రాన్స్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, కెనడా, ఇటలీ, ఆస్ట్రేలియా ఇలా మొత్తం 42 దేశాలు ఈ ఆపరేషన్ లో భాగమయ్యాయి. అమెరికా నేతృత్వంలో 42 దేశాలు ఒకవైపు ఉంటే సద్దాం హుసేన్ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. దాంతో 42 దేశాలను ఎదుర్కోవడం అనేది దాదాపుగా అసాధ్యం అన్న విషయం సద్దాంకి అర్థమైంది. దాంతో ఇస్లామిక్ లెజిటిమసీ పేరుతో ఇరాక్ ప్రజల్ని రెచ్చగొట్టడం స్టార్ట్ చేశాడు.
(32:26) ఎంత రెచ్చగొట్టిన సరిగ్గా ఆరు వారాల్లో కువైట్ మీద అమెరికా కంట్రోల్ సాధించింది. ఇరాక్ సైనికుల్ని అమెరికా యుద్ధ ఖైదీలుగా పట్టుకుంది. వేల మంది ఇరాక్ సైనికులు ఆయుధాలు వదిలి పారిపోయారు. దాంతో 1991 ఫిబ్రవరి 28న ఆపరేషన్ డెసర్ట్ స్ట్రో ముగిసింది. సద్దాం కి దారుణమైన పరాభవం ఎదురైంది. ఈ యుద్ధం వల్ల సద్దాం మూట కట్టుకుంది ఏదీ లేదు.
(32:49) కువైట్ దక్కకపోగా ఇరాక్ మీద భారీగా ఆంక్షలు ఆయిల్ కొనేవారు లేకపోవడం ఆ దేశానికి మందులు సహాయం చేసేందుకు కూడా ఎవర ముందుకు రాలేదు. అయితే సద్దాం దారుణమైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటాడని అమెరికా ఇరాక్ మీద కన్నేసి ఉంచింది. దాంతో పాటు ఇరాక్ లో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ని కొల్లగొట్టాలి అంటే సద్దాం ని ఇరాక్ పీఠం నుంచి దించేయాలి.
(33:09) కాబట్టి అమెరికా సద్దాం కి వివిధ రూపాల్లో చెక్ పెట్టడం స్టార్ట్ చేసింది. అమెరికా డైరెక్ట్ గా కాకుండా యునైటెడ్ నేషన్స్ ద్వారా ఇరాక్ మీద విపరీతమైన ఆంక్షలు విధించేలా చేసింది. ఇలా అమెరికా ఇరాక్ ని టార్గెట్ చేయడాన్ని సద్దాం హుసేన్ సహించలేకపోయాడు. దాంతో అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ను చంపాలని ప్లాన్ చేశాడు.
(33:29) 1993 ఏప్రిల్ లో జార్జ్ బుష్ రెండు రోజుల పాటు కువైట్ లో పర్యటించేందుకు వస్తున్నాడన్న విషయం తెలియడంతో బుష్ ను చంపించేందుకు సద్దాం హుసేన్ ఇద్దరు వ్యక్తుల్ని కువైట్ కి రహస్యంగా పంపించాడు. కానీ అమెరికా ఈ విషయాన్ని ముందే గుర్తించి సద్దాం పంపిన ఇద్దరిని అమెరికన్ సిఐఏ అరెస్ట్ చేసింది. దాంతో సద్దాం అమెరికన్ ప్రెసిడెంట్ ని చంపాలని వేసిన ప్లాన్ బట్టబయలయింది.
(33:49) దాంతో అమెరికా ఇరాక్ మీద ఏరియల్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడుల్లో కూడా ఇరాక్ భారీగా నష్టపోయింది. ఇలా సద్దాం నిర్ణయాల వల్ల ఇరాక్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. దాంతో ఇరాక్ లో ఆకలి కేకలు, చిన్న పిల్లల మరణాలు, విపరీతమైన కరువు, వ్యాధులు, యుద్ధం వల్ల సిధిలమైన భవనాలు, ధ్వంసమైన ఆస్తులు ఇవి తప్ప ఇరాక్ కి మిగిలింది ఏమీ లేదు.
(34:10) ప్రపంచంలోనే ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇరాక్ టాప్ ఫైవ్ లో ఉంటుంది. కానీ ఆ దేశాల్ని కొనేవారు లేకపోవడంతో బ్లాక్ లో తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 1995 లో ఇరాక్ లో ఆకలితో 5 లక్షల మంది పిల్లలు మరణించారని యూనిసెఫ్ లాంటి సంస్థలు నివేదికలు ఇవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఇరాక్ గురించి చర్చ జరిగింది.
(34:29) సద్దాంని ప్రపంచవ్యాప్తంగా ఒక నరూప రాక్షసుడు అన్నట్టుగా అమెరికా ముద్ర వేసింది. కానీ ఇరాక్ లో ఉన్న దారుణమైన పరిస్థితుల పట్ల మానవత దృక్పదంతో 1995 లో ఇరాక్ కి సహాయం చేయాలని యునైటెడ్ నేషన్స్ కూడా కాస్త కనికరం చూపించి ఫుడ్ ఫర్ ఆయిల్ అని ఒక స్కీమ్ ను లాంచ్ చేశారు. ఇరాక్ నుంచి ఆయిల్ కొనేందుకు అందరూ ఒప్పుకున్నారు. కానీ ఇరాక్ నుంచి ఆయిల్ కొన్నందుకు డబ్బు ఇవ్వకుండా ఫుడ్ గ్రైన్స్ మాత్రమే ఇవ్వాలి.
(34:53) అంటే కేవలం ఇరాక్ లో ఆకలి చావులు లేకుండా ఉండేందుకు మాత్రమే ఆంక్షల్ని కాస్త సడలించారు. ఆఖరికి సద్దం నాయకత్వంలో ఇరాక్ పరిస్థితి ఎంతలా దిగజారిందో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. అయితే యునైటెడ్ నేషన్స్ అమెరికా అనుమానించినట్లే సద్దాం మాస్ డిస్ట్రక్షన్ ని ప్లాన్ చేసి రహస్యంగా భారీ కెమికల్ వెపన్ ని తయారు చేయడం మొదలు పెట్టాడు.
(35:13) కానీ ఎట్టగెలకు ఈ రహస్యాన్ని అమెరికా ఛేదించి వాటిని నాశనం చేసింది. సద్దాం మాస్ డిస్ట్రక్షన్ కోసం ఇలా కెమికల్ రీసెర్చ్ ఫెసిలిటీ ఏర్పాటు చేశాడన్న నిజం ప్రపంచం మొత్తానికి తెలియడంతో ప్రపంచం ఒక్కసారిగా అవక్క అయింది. ఒకవైపు దేశంలో ఆకలి కేకలతో మరణాల పరంపర కొనసాగుతుంటే సద్దాం మాత్రం కెమికల్ వెపన్స్ తయారు చేయడం మీద దృష్టి పెట్టాడు. దాంతో 1998 అక్టోబర్ లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఇక డైరెక్ట్ గా ఇరాక్ లిబరేషన్ యాక్ట్ ని తయారు చేశాడు.
(35:39) సద్దం హుసేన్ నుంచి ఇరాక్ ని లిబరేట్ చేసేందుకు అమెరికా ఓపెన్ గానే ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో సద్దాం ని గద్దెదించి ఇరాక్ లో రెజూమ్ చేంజ్ చేసేందుకు అమెరికా ప్లాన్ చేసిందన్న వాస్తవం ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. అయితే 1998 అక్టోబర్ లో ఇరాక్ లిబరేషన్ యాక్ట్ ని తీసుకొచ్చినా కూడా అమెరికా ఇరాక్ విషయంలో అంత దూకుడుగా ప్రవర్తించలేదు.
(36:00) ఇంతలో 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద జరిగిన భారి ఉగ్రదాడితో అమెరికా ఉలిక్కిపడింది. అల్కైదా ఈ దాడికి కారణమని ప్రకటించారు. ఒసామా బిన్ లాడెన్ ఈ దాడికి మాస్టర్ మైండ్ అన్న విషయం తెలిసింది. కానీ ఒసమా బిన్ లాడెన్ ఒక్కడే ఇంత పెద్ద దాడి ఎలా ప్లాన్ చేస్తాడు? ఒసమా వెనక ఇంకా ఎవరున్నారన్న విషయాన్ని ఆలోచిస్తే సద్దాం ఉన్నాడేమో అన్న అనుమానం కలిగింది.
(36:22) ఈ దాడి జరిగిన వెంటనే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద భారీగా బాంబుల వర్షం కురిపించి ఆఫ్ఘనిస్తాన్ ని సిధిలాల దిబ్బగా మార్చేసింది. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వాన్ని పడగొట్టి అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ని కంట్రోల్ లోకి తీసుకుంది. అయితే సద్దాం 9/1 దాడి వెనక ఉన్నాడన్న ఆధారం ఒక్కటి కూడా లేదు. కానీ సద్దం భవిష్యత్తులో ఇలాంటి దాడి చేసే అవకాశం ఉందని అమెరికా భావించింది.
(36:43) ఆఫ్టర్ ఆల్ ఒసామా బిన్ లాడనే ఇంత భారీ దాడి చేసినప్పుడు ఒక దేశాన్ని పాలిస్తున్న సద్దాం హుసేన్ ఇలాంటి దాడి చేయడని ఎందుకు అనుకోవాలి ఒకవేళ సద్దాం హుసేన్ అల్కైదాతో చేతులు కలిపితే ఎంత భయంకరంగా పరిస్థితులు మారతాయని అమెరికా ఊహించింది. ఇలా అమెరికా సద్దాం చుట్టూ ప్రాబబిలిటీ థియరీని డెవలప్ చేసి పాసిబుల్ లెన్స్ నుంచి సద్దాం ని గమనించింది.
(37:03) అలాగే అమెరికా చేసిన ఇన్వెస్టిగేషన్ లో 1994 లో సుడాన్ లో ఒసామా బిన్ లాడెన్ ని ఇరాక్ ఇంటెలిజెన్స్ అధికారులు కలిసి కెమికల్ వెపన్ ఆఫర్ చేశారని అమెరికాకు చిన్న అనుమానం కలిగింది. నిజానికి సద్దాం హుసేన్ ఈ దాడి వెనక లేడు అనేదానికి ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. కానీ సద్దం హుసేన్ ని చంపాలి అంటే ఏదో ఒక ఆధారం చూపాలి. కాబట్టి చిన్న అనుమానంతో అమెరికా ఫైనల్ గా సద్దం హుసేన్ చుట్టూ ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ని క్రియేట్ చేసింది.
(37:27) ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని ఎందుకు అంటున్నాం అంటే స్వయంగా 9/1 దాడి మీద జరిపిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో కూడా సద్దాం హుసేన్ అస్తం ఉన్నట్లు ప్రూఫ్ చూపించలేకపోయారు. అందుకే సద్దం హుసేన్ ఉన్నాడన్నది నిజం కాకపోవచ్చు. కానీ సద్దం హుసేన్ ని టార్గెట్ చేయాలంటే ఏదో ఒక విధంగా సద్దం హుసేన్ కి ఈ 9/1 దాడికి సంబంధం ఉందని చూపించాలి. ఇక్కడ అదే జరిగింది.
(37:48) అదే కాకుండా 9/1 దాడికి కారణమైన ఒసామా బిన్ లాడెన్ ని అమెరికా పట్టుకోలేకపోయింది. కాబట్టి కనీసం సద్దాం హుసేన్ అయినా చంపేస్తే ప్రజలకు కాస్త సమాధానం చెప్పుకోవచ్చు. కాబట్టి 2003 లో సద్దాం హుసేన్ మీద అమెరికా డైరెక్ట్ వార్ అనౌన్స్ చేసింది. 48 గంటల్లో ఇరాక్ ని అమెరికా హస్తగతం చేసుకుంటుంది. సద్దాం హుసేన్ 48 గంటల్లో ఇరాక్ ని వదిలి పెట్టాలి అని ప్రకటించారు.
(38:09) కానీ సద్దాం హుసేన్ మాత్రం జార్జ్ బుష్ మాటల్ని లెక్క చేయలేదు. అయితే ఇక్కడే ఒక విషయం చెప్పాలి 1993 లో సద్దాం హుసేన్ చంపాలి అనుకున్న జార్జ్ బుష్ వేరు 2003 లో సద్దం హుసేన్ కి అల్టిమేటం జారీ చేసిన జార్జ్ బుష్ వేరు. వీరిద్దరు తండ్రి కొడుకులు. అమెరికా 41వ ప్రెసిడెంట్ జార్జ్ హెర్బర్ట్ వాకర్ బుష్ కొడుకే అమెరికా 43వ ప్రెసిడెంట్ జార్జ్ వాకర్బుష్ ఇద్దరి పేర్లు మాత్రమే కాదు పోలికల పరంగా కూడా ఇద్దరు ఒకేలాగా ఉంటారు.
(38:33) అయితే కొడుకు జార్జ్ బుష్ మాటల్ని సద్దాం హుసేన్ లెక్క చేయలేదు. దాంతో 2003 మార్చ్ 9న అమెరికా బాగ్దాద్ మీద స్టెల్త్ బాంబర్ తో దాడులు చేయడం స్టార్ట్ చేసింది. అమెరికా ఒకే ఒక్క రోజులో సద్దాం హుసేన్ ని చంపొచ్చు అనుకుంది. కానీ సద్దాం హుసేన్ మాత్రం ముందుగానే స్ట్రాంగ్ అండర్ గ్రౌండ్ బంకర్లను ఏర్పాటు చేసుకున్నాడు.
(38:51) అనుబంు వేసినా ఏం కాకుండా అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ ఏర్పాటు చేసుకొని తలదాచుకున్నాడు. అమెరికా ఇరాక్ లో నేరుగా ఎంటర్ కాలేదు. సద్దాం హుసేన్ బయటికి వస్తాడని ఎదురు చూసింది. మరోవైపు ఇరాక్ ఆర్మీ కూడా ఆయుధాలు వదిలేసి పోరాటం విరమించింది. అంటే దేశ ఆర్మీ కూడా సద్దాంని ఏదైనా చేసుకోండి మేమెందుకు ప్రాణాలకు తెగించి పోరాడాలి అన్న ఆలోచనకు వచ్చారు.
(39:10) ప్రభుత్వ అధికారులు కూడా ఉద్యోగాలకు దూరంగా ఉన్నారు. ఒక రకంగా దేశంలో అందరూ సద్దామని తొందరగా తీసుకెళ్ళండిని అమెరికాకు అన్ని అధికారాలు ఇచ్చారు. అలాంటి పరిస్థితిలో నెల రోజుల తర్వాత బంకర్ నుంచి బయటకు వచ్చి బాగ్దాద్ నుంచి రమాది అనే టౌన్ కి సద్దాం పారిపోయాడు. ఈ విషయం తెలిసిన వెంటనే అమెరికా రమాది టౌన్ మీద బాంబింగ్ మొదలు పెట్టింది.
(39:31) అయితే సద్దాం అక్కడి నుంచి కూడా తప్పించుకున్నాడు. దాంతో అమెరికా సైన్యం ఇరాక్ లో కూమింగ్ మొదలు పెట్టింది. సద్దాం తో క్లోజ్ గా ఉండే బాత్ పార్టీ మెంబర్స్ ని ఇన్వెస్టిగేట్ చేశారు. సద్దాం టిక్రీ అనే ప్రాంతంలో తలదాచుకున్నాడని తెలియడంతో అమెరికన్ ఫోర్సెస్ అక్కడికి కూడా వెళ్ళాయి. కానీ సద్దాం అక్కడి నుంచి కూడా తప్పించుకున్నాడు. సద్దాం అతని ఇద్దరు కొడుకులు వీళ్ళు ముగ్గురు కలిసి నాలుగు నెలల పాటు రహస్యంగా తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు.
(39:54) ఆ క్రమంలో 2003 జూలై 22న సద్దాం కొడుకుల్ని అమెరికన్ ఫోర్సెస్ కాల్చి చంపాయి. కానీ సద్దాం మాత్రం తప్పించుకున్నాడు. అలా సద్దాం అమెరికన్ ఫోర్సెస్ ని నెలల తరబడి తన గురించి వెతికెల చేశాడు. నెలల పాటు సాగుతున్న సద్దాం హంట్ కి ముగింపు పలకాలని అమెరికా బలంగా ఫిక్స్ అయింది. సద్దాం ని పట్టుకోవాలంటే పార్టీ మెంబర్స్ ని కాకుండా చిన్నప్పటి స్నేహితులు అతని వద్ద డ్రైవర్ గా పని చేసిన వాళ్ళు వంటవాళ్ళు ఇలా సాధారణ వ్యక్తులని అరెస్ట్ చేసి ఇంట్రగేట్ అల్ ముస్లిత్ అనే ముగ్గురు బ్రదర్స్ సద్దాం కి సహాయం చేస్తున్నట్టు తెలిసింది.
(40:24) ఆ అల్ ముస్లిత్ బ్రదర్స్ లో ఒకరిని అరెస్ట్ చేసి ఇంట్రగేట్ చేస్తే సద్దాం ఆచుకి తెలిసింది. టిక్రీ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న పల్లెటూరులో ఉన్న రెండు ఫార్మ్ హౌసుల్లో సద్దం తలదాచుకున్నట్టు తెలిసింది. ఫార్మ్ హౌస్ లు అంటే సకల సౌకర్యాల్లో ఉన్న లగ్జరీ విల్లాలు కాదు పశువులు కోళ్ళు తిరిగే ఒక చిన్న కొట్టంలో సద్దం తలదాచుకున్నాడు.
(40:45) 2003 డిసెంబర్ 12న అమెరికన్ ఫోర్సెస్ ఈ విషయాన్ని తెలుసుకున్నాయి. అంటే ఈ ఆపరేషన్ మార్చ్ లో మొదలైతే తొమ్మిది నెలలకు గాని అమెరికా సద్దాం కి సంబంధించిన జాడ తెలుసుకుంది. తొమ్మిది నెలల పాటు అమెరికాను ముప్పు తిప్పలు పెట్టాడంటే సద్దాం కన్నింగ్ నేచర్ అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ విషయం అమెరికాకు తెలిసిందనే విషయం సద్దాం కి తెలిస్తే అక్కడి నుంచి కూడా పారిపోతాడు.
(41:03) కాబట్టి అమెరికా 2003 డిసెంబర్ 12న రాత్రి ఆపరేషన్ రెడ్ డౌన్ ని లాంచ్ చేసింది. సద్దాంని పట్టుకోవడం కోసం ఏకంగా 600 మంది అమెరికన్ సోల్జర్స్ మిలిటరీ హెలికాప్టర్లతో బయల్దేరారు. డిసెంబర్ 13న అర్ధరాత్రి ఆ ప్రాంతంలో కరెంట్ కట్ చేసి మొత్తం ఏరియాని రౌండ్ అప్ చేశారు. ఆ సమయంలో ఆ ఫార్మ్ హౌస్ నుంచి ఇద్దరు వ్యక్తులు పారిపోతూ కనిపించారు.
(41:25) వాళ్ళని పట్టుకొని ఇంటగ్రేట్ చేస్తే ఆ ఫార్మ్ హౌస్ కి దగ్గరలో ఒక చిన్న గది వద్ద సద్దాం ఉన్నట్టు చెప్పారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఆ గదిలో 7న్నర లక్షల అమెరికన్ డాలర్లు దొరికాయి. కానీ సద్దం మాత్రం కనిపించలేదు. దాంతో సద్దాం ఆచుకి చెప్పిన వ్యక్తిని అక్కడికి తీసుకొచ్చి ప్రశ్నిస్తే ఆ పక్కనే ఒక పాత మ్యాట్ ఒకటి పరిచి ఉంది.
(41:44) ఆ మ్యాట్ కింద ఒక బంకర్ నిర్మించుకొని సద్దాం ఆ బంకర్లో తలదాచుకున్నాడు. ఆ బంకర్ ని చాలా పగటిబందీగా ప్యాక్ చేసుకొని లోపలే ఉన్నాడు. ఎప్పుడైతే రహస్యం బయటపడిందో సద్దాం కి ఆ బంకర్ నుంచి బయటకి రావడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. అర్ధరాత్రి ఆపరేషన్ మొదలైతే ఉదయం 8ది గంటల తర్వాత సద్దాం ఆ బంకర్ నుంచి బయటక వచ్చాడు. బయటక వచ్చిన వెంటనే సద్దాం ని అమెరికా చంపేయలేదు.
(42:05) ప్రాణాలతో పట్టుకోవాలి అనేది అమెరికా వ్యోహం. అనుకున్నట్టే అమెరికా సద్దాం ని ప్రాణాలతో పట్టుకుంది. ఇరాక్ ని గడగడలాడించిన వ్యక్తి ఆఖరికి ప్రాణాలు కాపాడుకోవడం కోసం కలుగులో ఎలకల బంకర్లో దాక్కుంటే బయటకి లాక్ రావాల్సి వచ్చింది. సద్దాం ని అనగబెట్టి కింద పండబెట్టిన ఫోటో విపరీతంగా వైరల్ అయింది. ఆ టైంలో సద్దాం ని అమెరికన్ సోల్జర్స్ విపరీతంగా కొట్టారు. నోటి నుంచి రక్తం కనిపించింది.
(42:26) సద్దాం ని పట్టుకున్న తర్వాత వి గాట్ హిమ అనే మెసేజ్ వైట్ హౌస్ కి వెళ్ళింది. దాంతో వి గాట్ హిమ్ అనే వార్త వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ అయింది. సద్దం హుసేన్ చేసిన గోరాలకు గాను అతని మీద ఇరాక్ లో విచారణ మొదలైంది. 1982 లో దుజైల్ అనే ప్రాంతం మీద కెమికల్ వెపన్ను ప్రయోగించినందుకు ఇతర యుద్ధ నేరాలకు పాలపడినందుకు సద్దాం హుసేన్ కి ఇరాక్కు కోర్ట్ 2006 నవంబర్ 5న ఉరిశిక్ష వేసింది.
(42:51) 2006 డిసెంబర్ 31న సద్దాం హుసేన్ ని ఇరాక్ లో బహిరంగంగా ఉరితీసి చంపేశారు. అలా సద్దాం హుసేన్ నియంతృత్వం అక్కడితో ముగిసింది. సద్దాం హుసేన్ అనే నియంత చరిత్రలో కలిసిపోయాడు. ఇరాక్ నాశనం కావడానికి సద్దాం హుసేన్ నియంత పోకలే కారణం కానీ సద్దాం హుసేన్ మరణించిన తర్వాత ఇరాక్ ఏమైనా బాగుపడిందా అంటే సమాధానం దొరకదు. సద్దాం హుసేన్ మరణించిన తర్వాత ఇరాక్ ఆయిల్ రిజర్వ్స్ లోకి అమెరికన్ కంపెనీలు మళ్ళీ ఎంట్రీ ఇచ్చాయి.
(43:17) ఇరాక్ కాయిల్ ని అమెరికా హాయిగా కొల్లగొట్టడం స్టార్ట్ చేసింది.

No comments:

Post a Comment