Friday, March 20, 2026

అనంత ఆనందం — మీ స్వరూపం

అనంత ఆనందం — మీ స్వరూపం

Author Name:Antharyami - Neeku Theliyani Neeve

Youtube Channel Url:https://www.youtube.com/@antharyami123

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gP3ZzpFzpM0



Transcript:
(00:08) ఒక్క క్షణం ఆగి జీవితం వైపు లోతుగా చూడండి. ప్రతి మనిషి తెలుసుకున్నా తెలియకున్నా ఒకే ఒక కోరికతో జీవిస్తున్నాడు. ఆనందంగా ఉండాలి. ఈ కోరిక సార్వత్రికం దేశం మతం వయస్సు సంస్కృతి ఏది దీనిని మార్చదు బొమ్మలతో ఆడే పిల్లవాడి నుంచి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకునే వృద్ధుడి వరకు అందరూ ఆనందాన్నే కోరుకుంటున్నారు. కానీ నిజంగా మనం కోరుకునే ఆనందం ఏది? కొన్ని సందర్భాలలో మాత్రమే వచ్చే ఆనందం కాదు.
(00:52) ఒకే ఒక ప్రదేశంలో మాత్రమే దొరికే ఆనందం కాదు. కొంతమందితో మాత్రమే అనుభవించగల ఆనందం కాదు. మనిషి కోరుకునేది ఎప్పుడైనా ఎక్కడైనా అందరితో ఆనందంగా ఉండాలి. మీరు నిజాయితీగా మీ అంతరంగాన్ని చూసుకుంటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. మీ హృదయం ప్రతి ప్రతి నిమిషం కోరుకునేది అంతము లేని ఆనందం. పరిస్థితులపై ఆధారపడని ఆనందం సుఖంలోనూ దుఃఖంలోనూ ఒకేలా ఉండే ఆనందం అది పరిమితి లేని ఆనందం కానీ మన ప్రస్తుత అనుభవం ఏమిటి వచ్చి వెళ్ళిపోయే ఆనందం మనసు మనుషులు వాతావరణం విజయం వైఫల్యం మీద ఆధారపడే ఆనందం కోరిక తీరితే
(01:42) సంతోషం తీరకపోతే బాధ ఇది పరిమిత ఆనందం ఒక సందర్భంలో సంతోషం మరొక సందర్భంలో అసంతృప్తి ఒకరితో ప్రేమ ఇంకొకరితో సంఘర్షణ ఈరోజు శాంతి రేపు అశాంతి అయినా మన హృదయం ఆగదు లోపల నుంచి పిలుపు వస్తూనే ఉంటుంది. అవిచ్చిన్నమైన శాశ్వితమైన సంపూర్ణమైన ఆనందం కావాలని ఇప్పుడు మీకు మీరే ప్రశ్న వేసుకోండి. పరిమితమైన మనిషి ఎలా అనంతమైన ఆనందాన్ని కోరుకుంటున్నాడు కాలం స్థలం పరిస్థితులకు బంధించబడి ఉన్న ఒక జీవి అంతులేని ఆనందాన్ని ఎలా ఊహించగలడు దానికి ఒకే ఒక్క సమాధానం ఉంది. అనంతమైన
(02:30) ఆనందం మీ అసలైన స్వభావం కాబట్టే ఆనందాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు దాన్ని సంపాదించాల్సిన అవసరం లేదు దాన్ని కప్పి పుచ్చిన తెరను మాత్రమే తొలగించాలి. ఇది గమనించండి. ఎవరూ దుఃఖాన్ని కోరరు. పిల్లవాడికి ఆనందాన్ని నేర్పించాల్సిన అవసరం లేదు. అది సహజం. బాధను మనం సహజంగానే దూరంగా ఉంచుతాం. ఎందుకంటే అది మన స్వభావం కాదు. కానీ ఈ ఆనందాన్ని మనం వెతుకుతాం.
(03:02) ఎందుకంటే అదే మన స్వరూపమే సముద్రంలో అలా ఎగసి పడుతుంది. కానీ అది ఎప్పుడూ సముద్రం నుండి వేరుపడదు. అదేవిధంగా మీరు వ్యక్తిగా పుట్టి జీవించి నిద్రలో లయమవుతారు. కానీ మీ సహజ స్థితి మారదు. నిశశబ్దం సంపూర్ణత అనంతత్వం మీరు వ్యక్తిగా పరిమితులైనవారు ఒకే సమయానికి ఒకే చోట ఉంటారు. వయస్సుతో ఆలోచనలతో భావోద్వేగాలతో మారుతారు.
(03:35) శరీరం పుడుతుంది చనిపోతుంది. మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. కానీ ఈ మార్పులన్నింటిని గమనిస్తున్నది ఎవరు? శరీరాన్ని మనసుని చూస్తున్న ఆ సాక్షే పరిమితుడు కాదు ఆ సాక్షే మీరు మీకు మీరే పరిమిత వ్యక్తినని నమ్మినంత కాలం మీ ఆనందం కూడా పరిమితంగానే ఉంటుంది. కానీ మీకు మీరే అనంతమైన ఆనందం అని గుర్తించిన క్షణం ఇక మీరు ఆనందాన్ని వెతకాల్సిన అవసరం లేదు.
(04:08) అది మీ స్వభావంగా స్వయంగా వెలుగుతుంది. అనంత ఆనందం అనేది అనంత స్వరూపానికే చెందుతుంది. వ్యక్తి దాన్ని పొందలేడు కానీ వ్యక్తి దానిలో లయం అవ్వగలడు నిద్రలోకి జారుకున్నట్లుగా ఇదే అన్ని ఆధ్యాత్మిక మార్గాల సారం మీరు నిజంగా ఎవరో తెలుసుకోండి. అనంత ఆనందాన్ని కోరుకునేవాడు అనంతుడే కావాలి. కాబట్టి ఈ ప్రయాణం బయటి దిశగా కాదు లోపలికి కొత్తదాన్ని వెతకడం కాదు ఎప్పటి నుంచో ఉన్నదాన్ని గుర్తించడం మారే దాని నుంచి మారని దానికి దృష్టిని మళ్ళంచండి.
(04:47) ప్రపంచం నుంచి సాక్షికి ఆలోచన నుంచి అవగాహనకు ఆ సులభమైన గుర్తింపులో ఆనందం ఇక మీ లక్ష్యం కాదు అది మీ స్వరూపం అనంతం మీకు ఇలాంటి విషయాలు మీలో మార్పు కలిగిస్తుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి

No comments:

Post a Comment