Friday, March 20, 2026

******మీ ఇల్లు, మీ బాడీ ఏదీ మీది కాదు | The Rental House Mindset Explained | Satyagrahi

మీ ఇల్లు, మీ బాడీ ఏదీ మీది కాదు | The Rental House Mindset Explained | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=UtlUA983VKc



Transcript:
(00:00) మీ ఇల్లు మీ ఉద్యోగం మీ బ్యాంక్ బాలెన్స్ చివరికి ఇప్పుడు మీరు ఈ ఊపిరి తీసుకుంటున్న శరీరం కూడా మీది కాదు ఏంటి నమ్ముద్ది కావట్లేదా ఒకసారి ఆలోచించండి నిజంగా ఇవి మీవే అయితే మీ పర్మిషన్ లేకుండా ఇవి మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాయి జాబ్ ఎందుకు పోతుంది వయసు ఎందుకు పోతుంది ఆరోగ్యం ఎందుకు పాడైపోతుంది నిజం చెప్పాలంటే మనం ఏది ఓన్ చేసుకోవడానికి రాలేదు కేవలం అనుభవించడానికి మాత్రమే వచ్చాం.
(00:24) కానీ ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి అనవసరమైన బాధ్యతలని నెత్తి మీద పెట్టుకొని బ్రతుకుని నరకం చేసుకుంటున్నాం. అసలు ఈ బాధలన్నిటికీ చెక్ పెట్టే ఒక సొల్యూషన్ ఈ వీడియోని పూర్తిగా వినండి కచ్చితంగా మీ జీవితంలో ఒక పెనురపు అయితే వస్తుంది. ఈ రోజుల్లో మనందరినీ పట్టి పీడుస్తున్న అతి భయంకరమైన దెయ్యం ఏంటో తెలుసా భయం పొద్దులు లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో తెలియని ఒక భయం అన్నమాట నా జాబ్ ఉంటుందో పోతుందో నేను ఎంతో కష్టపడి ఉన్న బైక్ మీద గీత పడుతుందేమో నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో నా హెయిర్ ఫాలో అయిపోతుందేమో అని చెప్పేసి ఒకవేళ అందం
(00:56) తగ్గిపోతుందేమో అని చెప్పేసి ప్రతిదానికి మనం భయపడుతూనే ఉంటాం. ప్రతి లైఫ్ లోనూ నాది నాది నాది అనే పదం ఎంత గట్టిగా అనిపిస్తుంది కదా సమస్య అంతా అక్కడే ఉంది. మనం బ్రతుకుతున్న ఈ మోడరన్ సొసైటీ మనకి చిన్నప్పటి నుంచి ఒక విషయాన్ని నూరిపోస్తుంది. అదేంటంటే నువ్వు ఎంత ఎక్కువగా సంపాదిస్తే అంత ఎక్కువ వస్తువులను పోగేసుకుంటే నువ్వు అంత గొప్పవాడివి అని చెప్పేసి.
(01:18) దీంతో మనం ఏం చేస్తాం మన చుట్టూ ఉన్న ప్రతి దాన్ని గట్టిగా పట్టుకుంటాం. ఓ కొత్త ఫోన్ కొంటాం. దానికి ఎంత ప్రాణంగా చూసుకుంటాం అంటే దానికి చిన్న స్క్రాచ్ పడినా సరే మన గుండె మీద గీత పడినంత విలువెలాడిపోతాం. ఒక రిలేషన్షిప్ లోకి వెళ్తాం. అవతలి మనిషిని ప్రేమించడం కంటే వాళ్ళని సొంతం చేసుకోవడం మీద వాళ్ళని కంట్రోల్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ పెడతాం.
(01:38) ఇది నాది ఇది శాశ్వతంగా నా దగ్గరే ఉండాలనే ఈ మొండి పట్టుదలే మన అసలు సమస్య. దీనివల్ల ఏమవుతుందంటే మన ప్రశాంతత గాలిలో కలిసిపోతుంది. ఎప్పుడైతే మీరు ఒకదాన్ని నాది అనుకొని ఓన్ చేసుకుంటారో అప్పుడే దానిని కోల్పోతాము అన్న భయం మొదలవుతుంది. ఆలోచించండి ఫ్రెండ్స్ మనం పుట్టినప్పుడు ఏం తీసుకురాలేదు. పోయేటప్పుడు ఏం పట్టుకుపోలేం అనే వేదాంతం చెప్పడం నా ఉద్దేశం కాదు.
(01:58) కానీ బ్రతుకున్నంత కాలం ఈ ఓనర్షిప్ అనే భ్రమలో పరదడం వల్ల మనం ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నామో గమనించండి. మన ఐడెంటిటీని తీసుకెళ్ళే వస్తువులకు మనుషులకు పొజిషన్లకి లింక్ చేసుకుంటాం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని అని జాబ్ ని తగిలించుకుంటాం. నేను ఫలానా వాళ్ళ భర్తని లేకపోతే భార్యని అని చెప్పేసి రిలేషన్షిప్ ని మనం తగిలించుకొని తిరుగుతూ ఉంటాం.
(02:18) ఈ అటాచ్మెంట్ ఎంతలా పెరిగిపోతుంది అంటే ఆ జాబ్ పోతే మనమే పోయినట్లు ఆ మనిషి దూరమైతే మన జీవితమే అయిపోయినట్లు ఫీల్ అయిపోతున్నాం. అంటే మనకంటూ ఒక విలువ లేకుండా చేసుకొని బయట ఉన్న వాటి మీద మన విలువని ఆధారపడేలా చేసుకుంటున్నాం. ఇదే ఈ జనరేషన్ ఫేస్ చేస్తున్న అతి పెద్ద ఎమోషనల్ ట్రాప్. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీని రూట్ కాజ్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే శాశ్వతం కాని వాటిని శాశ్వతం అనుకోవటం. మనం ఒక ఇల్లు కట్టుకుంటాం.
(02:43) దానికి నా ఇల్లు అని చెప్పేసి పేరు పెడతాం. కానీ నిజానికి ఆ ఇల్లు అక్కడ 100 ఏళ్ళు ఉండొచ్చు. కానీ అందులో మనం ఉండేది మహా అయితే ఒక 60 నుంచి 70 ఏళ్ళు కానీ ఆ గోడలు ఆ రంగులు ఆ స్థలం మనతోనే ఎప్పటికీ ఉండిపోవాలని చెప్పేసి కోరుకుంటాం. ఈ నాది అనే భావన ఎందుకు డేంజర్ అంటే ఇది మనల్ని రియాలిటీకి దూరం చేస్తుంది.
(03:02) జీవితం అంటేనే మార్పు చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్ కానీ మనం మార్పుని అంగీకరించం. చిన్న ఉదాహరణ చెప్తాను మీరు ఒక ఖరీదైన గాజు గ్లాస్ కొన్నారు. అది చాలా అందంగా ఉంది. దాన్ని మీరు ఎంతగా ఓన్ చేసుకున్నారంటే రోజు దాన్ని చూసుకొని మురిసిపోతున్నారు. ఒకరోజు పొరపాటున అది కింద పడి ముక్కలయింది. ఏం చేస్తారు ఏడుస్తారు బాధపడతారు.
(03:20) ఆ రోజు మొత్తం మూడఫ్ అయిపోతుంది. అదే గ్లాసు నీ పక్కింటి వాళ్ళదో లేక ఏదో హోటల్ లో అయి ఉంటే అయ్యో పగిలిందా అని చెప్పేసి జాలి పడతారు తప్ప గుండెలు బాధుకోరు కదా వస్తువు అదే పగలటం అదే కానీ రియాక్షన్ ఎందుకు మారింది? ఎందుకంటే మొదటి కేసు లో అక్కడ అటాచ్మెంట్ ఉంది కాబట్టి రెండో కేసులో జస్ట్ అబ్జర్వేషన్ మాత్రమే ఉంది కాబట్టి ఈ అటాచ్మెంట్ వల్ల వచ్చే ప్రమాదం మామూలుగా ఉండదు.
(03:43) ఈరోజు చాలా మంది యువత డిప్రెషన్ లోకి వెళ్ళడానికి యంజైటీ టాబ్లెట్లు మెంగడానికి చివరికి సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రధాన కారణం ఇదే. మనం ఇష్టపడిన వాళ్ళు మనకి దూరమైపోతే నా లైఫ్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నారు. అలా అనుకోవడానికి కారణం ఏంటంటే ఒక మనిషిని నా ఆస్తి అని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి నా ఆస్తి నన్ను కాదని ఎలా వెళ్తుంది అనే ఈగో హర్ట్ అవుతుంది కాబట్టి కొంతమంది అయితే మరీ టూ మచ్ జాబ్ పోతేనే చనిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి అంటారు.
(04:05) అలా ఎందుకు అనుకుంటారంటే వాళ్ళకన్నా ఆ జాబ్ అనేది గొప్పలా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ జాబ్ పోతే వాళ్ళు వేస్ట్ అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయిపోతారు కాబట్టి మనం ఈ ప్రపంచంలో ప్రతిదాన్ని కంట్రోల్ చేయాలనుకుంటాం. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మనం దేన్ని కంట్రోల్ చేయలేం వాతావరణాన్ని కంట్రోల్ చేయలేం, ట్రాఫిక్ ని కంట్రోల్ చేయలేం.
(04:23) ఎదుటి వారి ఆలోచనలని కంట్రోల్ చేయలేం. చివరికి మన శరీరంలో జరిగే మార్పులు కూడా కంట్రోల్ చేయలేం. కంట్రోల్ లేని చోట ఓనర్షిప్ పెట్టుకుంటే మిగిలేది బాధ మాత్రమే. మనం ఒక అద్ది ఇంట్లో ఉంటున్నాం. ఆ ఇంటి కూడా నాదే, సీలింగ్ నాదే, ఈ నేల నాదే అని ఏడిస్తే పిచ్చోడు అంటారు. కానీ జీవితం విషయంలో మనం చేస్తున్నది అదే. ఈ నాది అనే పదం ఒక జైలు లాంటిదే.
(04:42) ఇందులో ఎరుకున్నంత కాలం మీకు స్వేచ్ఛ ఉండదు. భయం అనే సంఖ్యలు ఎప్పుడూ వేసే ఉంటాయి. రేపు ఏం జరుగుతుందో అనే టెన్షన్ తోనే సగం ఆయుషు పోతుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ సమస్య నుంచి బయట పడటం ఎలాగా? ఈ బరువుని దించుకోవడం ఎలా? దీనికి ఒక అద్భుతమైన మెంటల్ మోడల్ ఉంది. దీన్నే ద గెస్ట్ హౌస్ థియరీ అంటారు. దీన్ని చాలా సింపుల్ గా అర్థం చేసుకుందాం.
(04:59) మీరు ఊటీలోనూ కొడాయి కెనకు వెళ్ళారనుకోండి అక్కడ మంచి లగ్జరీ హోటల్ రూమ్ బుక్ చేసుకున్నారనుకోండి రూమ్లోకి వెళ్ళగానే ఏం చేస్తారు? ఆ బెడ్డు మీద తూగుతారు, ఏస ఆన్ చేస్తారు, టీవీ చూస్తారు, బాల్కనీలో నుంచొని వ్యూ ఎంజాయ్ చేస్తారు. ఆ రూమ్ ని పూర్తిగా వాడతారు, ఆస్వాదిస్తారు. కానీ ఎప్పుడైనా ఆ రూమ్లో ఉన్న ఫర్నిచర్ చూసి ఇది నాది అది నాతోనే ఉండాలని చెప్పేసి ఏడ్చారా? చెక్ చేసే టైం వచ్చినప్పుడు నేను ఈ రూమ్ ని వదిలి వెళ్ళను.
(05:22) ఈ గోడలు నాకు చాలా నచ్చాయి అని చెప్పేసి హోటల్ మేనేజర్ కాలు పట్టుకుంటారా? లేదు కదా చాలా హ్యాపీగా ఆ రూమ్ కి రిసెప్షన్ లో కీ ఇచ్చేసి హ్యాపీగా మీ బ్యాగ్స్ తొరుకొని టాటా చెప్పి మరి బయటికి వచ్చేస్తారు. పైగా అక్కడ గడిపిన రోజులు చాలా బాగున్నాయి అని చెప్పేసి ఒక మంచి మెమరీని తీసుకెళ్తారు. సో జీవితాన్ని కూడా ఎగ్జాక్ట్ గా ఇలాగే చూడాలి.
(05:41) ఈ ప్రపంచం ఒక పెద్ద గెస్ట్ హౌస్ లాంటిదండి. మనం ఇక్కడికి వచ్చిన గెస్ట్లు మాత్రమే మీరు వేసుకున్న ఈ బట్టలు మీరు వాడుతున్న ఈ బైకు మీరు చేస్తున్న ఈ ఉద్యోగం మీరు ఉంటున్న ఈ ఇల్లు అన్నీ కూడా ఈ హోటల్ రూమ్ లోని ఫర్నిచర్ లాంటివే వాటిని వాడండి ఆనందించండి శుభ్రంగా ఉంచుకోండి కానీ అవి మీ సొంతం అని మాత్రం అనుకోకండి. మీరు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు బర్త్ అనే చెకింగ్ జరిగింది.
(06:01) ఎప్పుడో ఒకప్పుడు డెత్ అనే చెక్ కూడా జరుగుతుంది. ఈ మధ్యలో ఉన్న టైం అంతా మనం ఎంజాయ్ చేయాల్సిన వెకేషన్ మాత్రమే ఈ ఒక్క ఆలోచన మీ మైండ్ లోకి డీప్ గా వెళ్తే మీ లైఫ్ ఎంత తేలిగ్గా మారుతుందో తెలుసా? జాబ్ పోయిందా ఓకే మీరు దాచుకున్న డబ్బులు పోయాయా ఓకే మీరు ఎంతగానో ఇష్టపడిన మనుషులు మీకు దూరంగా వెళ్ళిపోయారా అది కూడా ఓకే.
(06:20) సో మనం ఏం చేయాలంటే ఉన్న వాటితోనే ఎంజాయ్ చేయాలి. అంతేగనీ అవి నావి అవి నాతోనే ఉండాలి అంటే మాత్రం అస్సలు కుదరదు. అది డబ్బు కావచ్చు, ఉద్యోగం కావచ్చు నువ్వు ఎంతగానో ఇష్టపడిన మనుషులు కూడా కావచ్చు. ఏది ఉన్నా లేకపోయినా ఎవరు ఉన్నా లేకపోయినా మన జర్నీ మనదే. గెస్ట్ హౌస్ థియరీ అంటే బాధ్యత లేకుండా బతకడం అని కాదు.
(06:40) ఇప్పుడు మనం హోటల్ రూమ్ కి వెళ్ళామ అనుకోండి. హోటల్ రూమ్ మనది కాకపోయినా దాన్ని ఎంత నీట్ గా ఉంచుతామో మన జీవితాన్ని కూడా అంతే బాధ్యతగా చూసుకోవాలి. కానీ ఓనర్షిప్ అనే అహంకారం లేకుండా చూసుకోవాలి. గెస్ట్ లా ఉండడం అంటే ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయడమే. ఓనర్ లా ఉండటం అంటే ప్రతిక్షణం కాపలా కాయడం. సో మీ లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా లేక కాపలా కాద్దాం అనుకుంటున్నారా? ఛాయిస్ మీదేనండి వినడానికి బాగానే ఉంది బ్రో కానీ ప్రాక్టికల్ గా దీన్ని లైఫ్ లో ఎలా అప్లై చేయాలి అంటే మాత్రం పొద్దున్నే లేచి ఆఫీస్ కి వెళ్తే బాస్ తిడుతుంటే ఈఎంఎల్
(07:07) కట్టాల్సి వస్తుంటే జీవితంలో సుఖంగా ఎలా ఉంటాము అన్ని కష్టాలే కదా అని చెప్పేసి డౌట్ మీకు రావచ్చు. దానికి కొన్ని పవర్ఫుల్ ప్రాక్టికల్ టెక్నిక్స్ చెప్తాను. ఇవి రేపటి నుంచి కాదు ఈ వీడియో అయిపోయిన వెంటనే స్టార్ట్ చేయండి. టెక్నిక్ నెంబర్ వన్ మార్నింగ్ రెంటల్ మైండ్ సెట్ అంటే రేపు పొద్దున నిద్ర లేవగానే అద్దంలో మొహం చూసుకొని ఒక్క నిమిషం ఈ మాట చెప్పుకోండి ఈ శరీరం నాకు అద్దికి ఇవ్వబడింది.
(07:30) ఈ రోజు అనే సమయం నాకు అద్దికి ఇవ్వబడింది. ఈ ఉద్యోగం ఈ బంధాలు అన్ని టెంపరరీ గిఫ్ట్స్ మాత్రమే వీటిని నేను ఈరోజు పూర్తిగా ఆస్వాదిస్తాను ప్రేమిస్తాను కానీ పట్టుకోను. ఇలా అనుకోవడం వల్ల ఆ రోజు వచ్చే చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. ఎందుకంటే గెస్ట్ కి కంప్లైంట్స్ ఉండవు. క్యూరియాసిటీ మాత్రమే ఉంటుంది. టెక్నిక్ నెంబర్ టూ లాస్ట్ కాదు రిటర్న్ అంటే ఇది చాలా పవర్ఫుల్ స్టాక్ ఫిలాసఫీ అన్నమాట.
(07:53) మీ జీవితంలో ఏదైనా పోయినప్పుడు అది డబ్బు అయినా వస్తువైనా మనిషి అయినా సరే నేను కోల్పోయాను అని అనకండి. దానికి బదులుగా ఐ రెంటెడ్ ఇట్ అంటే నేను తిరిగి ఇచ్చేసాను అనుకోండి అంతే మీ దగ్గర నుంచి 5000 పోయాను అనుకోండి యూనివర్స్ నాకు ఇచ్చిన డబ్బుని యూనివర్స్ కి తిరిగి ఇచ్చేసాను అనుకోండి మీ నాన్నగారు చనిపోయాడు. దేవుడు నాకు ఇచ్చిన ఒక అద్భుతమైన తోడుని మళ్ళీ దేవుడే తీసుకెళ్ళపోయాడు అనుకోండి అంతకుమించి ఏమి లేదు వినడానికి కఠినంగా అనిపించొచ్చు కానీ ఒక్కసారి ఆలోచించి చూడండి మీ మనసులో ఉన్న భారం మొత్తం దిగిపోతుంది.
(08:23) ఎందుకంటే ఈ భూమ్మీద మనకి దక్కే ప్రతిదీ మనకి భగవంతుడు ఇచ్చింది. మళ్ళీ భగవంతుడు తీసుకుంటే మనం ఎందుకు బాధపడాలి జస్ట్ ఆయన నాకు ఇచ్చాడు నేను రెట్ని చేశను అలా అనుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక టెక్నిక్ నెంబర్ త్రీ లగేజ్ తగ్గించుకోండి. మనం ట్రిప్ కి వెళ్ళినప్పుడు బ్యాక్ బరువు తక్కువ ఉంటే ఎంత హాయిగా జీర్ణం చేస్తామో లైఫ్ లో కూడా అంతే అనవసరమైన కోపాలు, పగలు, ద్వేషాలు, గతం తాలూకు, అవమానాలు ఇవన్నీ బరువులే వీడు నన్ను ఇలా అన్నాడు వాడు నన్ను మోసం చేశాడు అనే చెత మోస్తూ ప్రయాణం చేయకండి.
(08:51) మీరు గెస్ట్ మాత్రమే ఇవన్నీ మూట కట్టుకొని ఎక్కడికి తీసుకెళ్తారు ఏది మీతో రాదు. ఎవరైనా ఏమైనా అన్నారా అక్కడికక్కడే వదిలేయండి. లైట్ తీసుకోండి నవ్వు వేసి ముందుకు వెళ్ళిపోండి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ప్రయాణం కూడా అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మీరు ఈ భూమి మీదకి వచ్చింది బ్యాంకు బ్యాలెన్సులు పెంచుకోవడానికో ఆస్తులు కూడ పెట్టుకోవడానికో అందరినీ మెప్పించడానికో కాదు మీరు వచ్చింది జీవితం అనే ఈ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయడానికి ఆకాశాన్ని చూడండి గాలిని పీల్చండి నచ్చిన పని చేయండి.
(09:19) నచ్చిన వాళ్ళతో నవ్వండి. రేపు అనేది ఉందో లేదో ఎవరికీ తెలియదు. ఉన్నది ఈ క్షణం మాత్రమే. అందులోన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ క్షణానికి మీరు ఓనర్ కాదు కేవలం విజిటర్ మాత్రమే. అలా అని చెప్పేసి ఏ పని చేయకుండా డబ్బులు సంపాదించొచ్చు అని చెప్పన అనగానే మీకు నచ్చిన పని చేస్తే ఆటోమేటిక్ గా డబ్బులు వాటంతటవే వస్తాయి. పోనీ మీరు డబ్బుల కోసం పని చేస్తున్నారే అనుకోండి ఆ పనిని ఇష్టంగా చేయండి జీవితం ప్రశాంతంగా ఉంటుంది.
(09:41) ఇంకోళ్ళతో కంపేర్ చేసుకోమాకండి చాలా దరిద్రంగా ఉంటుంది. ఎందుకంటే మీ జీవితం మీది కాబట్టి ఇంకొకడి జీవితంతో కంపేర్ చేసుకోమాకండి. కావాలంటే కష్టపడి పని చేసుకోండి. పనిలో ఆనందాన్ని వెతుక్కోండి. మీకు ఇష్టమైన పని చేశారనుకోండి ఆటోమేటిక్ గా డబ్బులు వచ్చేస్తాయి. లేదు డబ్బులు వచ్చే పని చేస్తున్నారు అనుకోండి ఆ పనిని ఇష్టంగా చేయండి. ప్రశాంతంగా ఉంటారు.
(09:57) సో ఈ క్షణం నుంచే ఆ భయం అనే ముసుగు తీసేయండి. ఈ నాది అనే సంఖ్యలు తెంచేయండి. ఒక గెస్ట్ లాగా స్వేచ్ఛగా ఆనందంగా బ్రతకడం మొదలు పెట్టండి. ఎందుకంటే రెంటల్ హౌస్ లో ఉన్నప్పుడు గోడలు పట్టుకొని ఏడవకూడదు. కిటికీ తెరిచి గాలిని ఆస్వాదించాలంతే. సో ఈ వీడియో మీకు కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. ఈ గెస్ట్ హౌస్ తీరీ మీలో చిన్న మార్పుని తీసుకొస్తుందా? అయితే ఈరోజే మారండి.
(10:16) మీ ఫ్రెండ్స్ లో ఎవరు ఎక్కువగా చిన్న చిన్న వాటికి టెన్షన్ పడుతుంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ఒరేయ్ లైట్ తీసుకొని చెప్పండి. చివరగా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. బాగా ఆలోచించి కామెంట్ చేయండి. ప్రస్తుతం మీ లైఫ్ లో మీరు దీన్ని గట్టిగా పట్టుకొని అది పోతుందేమో అని చెప్పేసి భయపడుతున్నారా ఒకవేళ నిజంగా భయపడితే అది మనిషా ఉద్యోగమా లేక డబ్బా అది కూడా కాకపోతే ఇమేజ్ అదేంటో ధైర్యంగా కామెంట్ చేసి దాని పక్కన నేను దీన్ని వదిలేస్తున్నాను అని చెప్పండి.
(10:40) మీ కామెంట్ చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారు. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అంతే కాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక రెండు అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను వాటిని కూడా చూడండి.
(10:55) ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్ ఓం

No comments:

Post a Comment