Friday, March 20, 2026

అణుబాంబు ఎలా పేలుతుంది? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే! | How Atomic Bomb Works? (Animation)

అణుబాంబు ఎలా పేలుతుంది? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే! | How Atomic Bomb Works? (Animation)

Author Name:Think Deep

Youtube Channel Url:https://www.youtube.com/@ThinkDeep

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2gcgFDiM4j4



Transcript:
(00:00) అది 1945 జూలై 16వ తేదీ అమెరికాలోని న్యూ మెక్సికోలో ఉన్న ఎడారి ప్రాంతంలో శాస్త్రవేత్తల బృందం సిద్ధంగా ఉంది. సమయం తెల్లవారి 5దున్నర గంటలు ప్రయోగం జరిగింది. పెద్ద పేలుడుతూ భూమి కంపించి శాస్త్రవేత్తలని కూడా అదిరిపోయేలా చేసింది. ఆకాశం ఎర్రని రక్తవరణంలోకి మారింది. పెద్ద ధూళ మేఘం పుట్ట గొడుగులాగా విచ్చుకుంది.
(00:21) ఆ మధ్యలోనుంచి ఎర్రని నిప్పుల గోళం ఎగిసి పడింది. ఆ దృశ్యాన్ని చూసిన రాబర్ట్ ఓపెన్ హైమర్ భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేసుకున్నాడు. నేను ఇప్పుడు మృత్యువును ఈ జగత్తును అంతమొందించేది నేనే అనే గీతా వాక్యం అతని మదిలో మెదిలింది. వాస్తవానికి ఆ రోజు జరిగింది ఒక పేరుడు పరీక్ష మాత్రమే. కొన్ని రోజుల తర్వాత 1945 ఆగస్టు 6 ఆగస్టు 9వ తేదీలో మానవ విజ్ఞానం చేరుకోగలిగిన ప్రమాదకర స్థాయిని ప్రపంచం మొత్తం నివ్వరపోయి చూసింది.
(00:53) భయభ్రాంతులకు లోనైంది. అరే ఈ విధ్వంసక ఆయుధం మా వద్ద కూడా ఉంటే ఇక నా వైపు చూడడెవ్వడు అని చాలా దేశాలు అనుకునేలా చేసింది. దాన్ని స్వార్థం అన్నాయి బడుగు దేశాలు. స్వీయ రక్షణ అన్నాయి మధ్యస్థ దేశాలు. ప్రపంచ శాంతి కోసమే అన్నాయి పెత్తందారి దేశాలు. కత్తితో కూరగాయలు కొయొచ్చు జీవుల తలకాయలు తరగొచ్చు ఎవరు చెప్పగలరు. ఇది చెప్పింది ఎవరైతేనే కానీ కత్తిని ఎలా ఉపయోగించుకోవాలనే విచక్షణ ఎవరికి వారికి ఉండాలి.
(01:20) అటువంటి విచక్షణ ఇకపై ఉండదేమో అనుకున్నాడు ఓపెన్ హామర్. జపాన్ లోని హిరోషిమా నాగసాఖి పట్టణాల మీద ఆ రెండు తేదీల్లో పిడుగల్లే పడిన ఆయుధం అణుబాంబు. క్షణాల్లోనే లక్షన్నర మందికి ఏం జరిగిందో తెలియకుండానే మసిమసిగా మారి రాలిపోయారు. మరో రెండు నెలల కాలం అనుబాంబు మూలంగా ప్రబలిన వికిరణ శక్తి అంటే రేడియేషన్ విష ప్రభావానికి కనీసం రెండు రెట్ల మందికి పైగా దారుణమైన శారీరక మానసిక హింసకు గురై ప్రాణాలు వదిలేశారు.
(01:47) ఇంకా జీవంతో మిగిలిన వాళ్ళు కొన్ని దశాబ్దాల పాటు క్యాన్సర్ తోనూ అంగవైకల్యంతోనూ అనేక శారీరక రుగ్మతలతోను కొట్టుమిట్టాడుతూ జీవోత్సవాల్లా బ్రతికారు. సదరు అన్వాయుధాన్ని తయారు చేసిన ఓపెన్ హైమర్ కి e = mcస్క్ సూత్రమే ఆధారం. సదరు సూత్రాన్ని ప్రతిపాదించింది ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన జపాన్ పై జరిగిన విధ్వంసం గురించి తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారట.
(02:08) తన సాధారణ సాపేక్ష సిద్ధాంతం ఇలాంటి దారుణానికి పనికొచ్చిందని బాధపడ్డాడు ఆయన. విజ్ఞాన శాస్త్రానికి మానవీయ కోణంతో సంబంధం లేదనేది తెలిసొచ్చిన సందర్భాన్ని ఈనాటికి మనం తలుచుకుంటున్నామ అంటే దాని విషమ స్థితి ఏపాటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆనాడు 1945 ఆగస్టు 6న వదిలిన అణు బాంబుకి లిటిల్ బాయ్ అని ఆగస్టు 9న వదిలిన అణుబాంబుకి ఫ్యాట్ మన్ అని ముద్దు పేర్లు పెట్టుకుంది అమెరికా.
(02:31) లిటిల్ బాయ్లో యురేనియం 235 ఫ్యాట్ మన్ లో ప్లూటోనియం 239 లను ఉపయోగించారు. పరమాణు విచ్చిత్తే అంటే న్యూక్లియర్ ఫిజన్ పద్ధతిలో ఈ రెండు విచ్చిన్నం చెందాయి. ఈ రెండు మూలకాలను న్యూట్రాన్ కణంతో తాడను అందిస్తారు. అప్పుడు అవి విచ్చిన్నం అవుతాయి. ఆ పేలుడులో అత్యధిక శక్తి విడుదలవుతుంది. అంటే న్యూట్రాన్లు విడుదలవుతాయి. అంటే పరమాణువు విచ్చిన్నం అవుతూనే ఆ చిన్న అణువులోనుంచి కూడా అత్యధిక శక్తి విడుదలవుతుంది.
(02:57) ఆ సమయంలో అందులోనుంచి విడుదలైన న్యూట్రాన్లు తక్కిన పరమాణువులను విచ్చిన్నం చేస్తాయి. ఆ పరమాణువులన్నీ ఒక్కొక్కటి అత్యధిక శక్తిని విడుదల చేస్తూ మరిన్ని న్యూట్రాన్లను విడుదల చేస్తాయి. ఆ విడుదలైన న్యూట్రాన్లు మరిన్ని పరమాణువులను డీ కొడతాయి. ఇదొక గొలుసుకట్టు చర్య. ఇది అలా కొనసాగుతూ ప్రచండమైన శక్తి విడుదలవుతూ ఉంటుంది. యురేనియం యొక్క ద్రవ్యరాశి పూర్తిగా ఖర్చుయేదాకా ఈ శృంఖల చర్య కొనసాగుతుంది.
(03:20) ఈ గొలుసుకట్టు చర్యను మధ్యలో నిరోధించడం అసాధ్యం. కనుకనే అణుబాంబు అంటే న్యూక్లియర్ బాంబ్ ప్రయోగమే తప్ప ఉపసంహరణ లేని విధ్వంసకర ఆయుధం అది. ఇది ఎలా పనిచేస్తుందో అర్థమైంది కదా. పిల్లలకు తెలిసిన ఓ ఆట వస్తువు జింగా గేమ్. అందులో ఎన్నెన్నో బ్లాక్స్ ను ఒకదానిపై ఒకటి మేడ కట్టినట్టుగా పేరుస్తారు. ఎత్తు పెరిగే కొద్దీ నిర్మాణంలో స్థిరత్వం తగ్గుతుంది.
(03:40) నిరోధించలేని ఎత్తుకు పెరిగిన చిన్నపాటి బరువు పెట్టినా కానీ అది కుప్పకూలుతుంది. యురేనియం ప్లూటోనియంలు తాము ఉన్న స్థితిలో నిండుకుండల్లా ఉంటాయి. వాటిలోకి బలవంతంగా వచ్చి చేరిన ఒక న్యూట్రాన్ వల్ల కూడా అవి అస్థిరత్వానికి లోనవుతాయి. ఫలితంగా అణువులు విచ్చిన్నమై భారీ విస్ఫోటనం భారీ శక్తి విడుదలవుతుంది.
(04:01) అంటే మూలాల స్థాయిలో మూలాలుగా ఉన్న అణువులు న్యూట్రాన్ల తాడనం మూలంగా ఊహించనలవి కానంతగా విస్ఫోటనం చెందుతాయి. పేలుడులో ఉష్ణం విడుదలవుతుంది. యురేనియం విషయంలో పేలుడు అనంతరం మూడు న్యూట్రాన్లు పుడతాయి. ఆ మూడు న్యూట్రాన్లు యురేనియం లోనున్న మరో మూడు పరమాణువులని నీకొడతాయి. వాటి నుంచి మరిన్ని న్యూట్రాన్లు పుట్టి ఆ గొలుసుకట్టు చర్య కొనసాగుతుంది.
(04:21) వేల సంఖ్యలో ఉన్న పరమాణువుల్ని ఇలా న్యూట్రాన్లతో తాడనం చేస్తుండడంతో ఏమవుతుంది? భూగోళం దద్దరిలుతుంది. ఒక పరిమిత ప్రాంతంలో ఇటువంటి భారీ పేలును కలిగిస్తే ఆ పేలుడు మూలంగా కలిగే విస్ఫోటన శబ్దం తన్మూలంగా పుట్టే తీవ్ర ఉష్ణోగ్రత వల్ల సదరు ప్రాంతం దాని పరిసర ప్రాంతాల్లో అపారమైన నష్టం కలుగుతుంది. సదరు తొలి న్యూక్లియర్ బ్లాస్టర్లో 1945 ఆగస్టుఆరవ తేదీన జరిగిన ఘోర అనర్థంలో 64 kgల యురేనియంను ఉపయోగించారు.
(04:49) అప్పుడు 15,000 టీఎటల మందుగుండును పేల్చినంత శక్తి విడుదలయింది. అయితే ప్రస్తుత విజ్ఞాన శాస్త్రం మరింతగా అభివృద్ధి చెందింది. సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మనకు ఒక కిలోగ్రమ యురేనియం విస్ఫోటన నుంచే 20,000 టీఎన్టల పేలుడు శక్తి లభిస్తుంది. ఆ లెక్కన అది మరింత విధ్వాంసాన్ని కలిగిస్తుందని అర్థమవుతుంది.
(05:09) ఒక్క కణ విస్ఫోటనం అనంతమైన విధ్వంసం. అప్పుడు జపాన్ కి ఏమైందో తెలుసునా తెలుసుకుందాం. లిటిల్ బాయ్ చూడడానికి తుపాకీ ఆకారంలో ఉంటుంది. లోపల రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటేమో సబ్ క్రిటికల్ మాస్ రెండవది సూపర్ క్రిటికల్ మాస్ రెండిటిని చాలా లాఘవంగా విడివిడిగా అమర్చి పెట్టారు. బాంబును మనం అనుకున్నప్పుడు పేల్చాలి కానీ దానికి అదే పేలిపోకూడదు కదా అందుకని ఆ జాగ్రత్త కూడా తీసుకున్నారు.
(05:31) అజాగ్రత్తగా ఉంటే ప్రయోగించే వాళ్ళ ప్రాణాలు పోవచ్చు కూడా ఆకాశం నుంచి విమానం ద్వారా విడిచిన లిటిల్ బాయ్ ను దానికి వెనుక అమర్చిన రెక్కలు నిలకడగా ఉంచాయి. దాని లోపల బ్యాటరీ క్రియాశీలకమైంది. సర్క్యూట్ పని చేయడం మొదలు పెట్టింది. పైనుంచి నేల మీదకు విడిచిన లిటిల్ బాయ్ నేలకు 1900 అడుగుల ఎత్తున చేరగా దానిలోనే అది ట్రిగర్ అయింది. అంతే లోపల చిన్న అగ్గి పుట్టింది.
(05:53) ఆ స్పార్క్ లోపల ఉన్న కొరోడియర్ పౌడర్ ను మండించింది. ఆ పౌడర్ పేలి దాని ముందు అమర్చబడిన ట్రాన్జేషన్ కార్బైన్ డిస్క్ సెకండ్ కు 300మీటర్ల వేగంతో ముందుకు కదిలింది. ముందున్న బాక్స్ లో అమర్చిన యురేనియం 235 యొక్క ట్రిగర్ మాస్ ను డీ కొట్టింది. దాని ఫలితంగా క్రిటికల్ మాస్ పరిమాణం ట్రిగర్ చేయబడింది. న్యూట్రాన్లు విడుదలయ్యాయి.
(06:15) న్యూక్లియర్ ఫీజన్ ప్రక్రియ మొదలై చైన్ రియాక్షన్ కి దారి తీసింది. ఆదిలో మనం చెప్పుకున్న కేంద్రక విచ్చితి ఇదే మరి. న్యూక్లియర్ బాంబు పేలుడు జరిగిన తీరు ఇది. ఫలితంగా విడుదలైన శక్తి 12000 అడుగుల అగ్నిగోళాన్ని రగిలించింది. అది 60,000 అడుగుల ఎత్తుకు పైకి ఎగిసింది. అప్పుడు పుట్టిన ఉష్ణోగ్రత సుమారుగా 6,500°ల సెల్సియస్ కు చేరింది. ఇది సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రతకు సమానం.
(06:37) ఆ పరిధిలో ఉన్న జీవజాలం మనుషులు మొక్కలు మసైపోయారో మాయమైపోయారో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇవన్నీ కంటికి కనిపించినవి కనిపించని శత్రువు ఉంది. దాని పేరు పరమాణు వికిరణ శక్తి అవును అదే రేడియేషన్ అది అలా వందల కిలోమీటర్ల దూరం విస్తరిస్తూ పోయింది. దాని విస్తరణ ప్రభావం ఒక రెండు మూడు నెలలు కనిపించిందేమో కానీ దాని విష ప్రభావం రెండు మూడు తరాల వ్యక్తుల్లో కనిపించింది.
(07:02) ఈనాటికి ఆనాటి రేడియేషన్ కు గురై అంగవైకల్యంతో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేటికి ఆ విస్ఫోటన ప్రాంతానికి తగినంత బాహ్య కవచ రక్షణ లేకుండా ఎవరిని పోనివ్వరు. అక్కడ గోడలు చెట్లు కాలగా మిగిలిన సిద్ధిల అవశేషాల్లో రేడియేషన్ ప్రభావం క్రియాశీలకంగా ఉంది కనుక అక్కడున్న వాళ్ళని దూరంగా చూసి వచ్చేమనడం తప్ప ఒక మొక్క ఆకు ఒక ఇంటి విరిగిన తలుపు పగిలిపోయి ఉన్న ఓ చిన్న ఆట బొమ్మను కూడా పట్టుకొనేవరు.
(07:29) మొత్తానికి మానవాళ మీద మానవుడే వేసుకున్న గొడ్డలి పెట్టు ఇది. స్వీయ నాశనాన్ని కొని తెచ్చుకున్న అవివేకం ఇది. యుద్ధాలు జరిగితే గెలుపోటములు ఉంటాయి అనుకుంటారు కానీ ఇరుపక్షాలు ఓడటమే ఉంటుంది అంటారు తాత్వికులు. అణుబాంబు విస్ఫోటనాల వల్ల తత్వం చదువుకుని తెలుసుకుంది ఏమి లేదు కదా ప్రత్యక్ష ప్రమాణం ఎదురుగా ఉంటే తాత్విక బోధ అవసరమా చెప్పండి.
(07:48) ఈడ్చి ముఖం మీద కొడితే ఆ దెబ్బ ముఖాన్ని మండిస్తుందని చెప్పడానికి అనుభవమే చాలు. సిద్ధాంతాలు అక్కర్లేదు కదా హిరోషిమా నాగసాఖకిల మీద జరిగిన అనుబాంబుల ప్రయోగాల వల్ల అదమ పక్షం రెండు లక్షల మందికి పైగా దుర్మరణం పాలయ్యారని చెప్తారు. ఆ తర్వాత కొన్ని వేల మంది వికలాంగులు అయ్యారు. ఆ తర్వాత పుట్టిన వాళ్ళు కూడా చాలా లోపాలతో పుట్టారు.
(08:09) తన ఈ అణుబాంబు విజ్ఞానం చేసిన విధ్వంసం పట్ల ఓపెన్ హైమర్ పశ్చాత్తాప్ పడ్డాడని జీవితాంతం అపరాధ భావంతో కుమిలిపోయానని చెప్తారు. ఎందుకంటే ఆ తర్వాత అతని ప్రపంచ పర్యటనల్లో అణుబాంబు విజ్ఞానాన్ని నిలిపివేయాలని ప్రతి వేదిక మీద అతను విజ్ఞప్తులు చేస్తూ వచ్చాడు. ఒక శాస్త్రవేత్త వ్యక్తిగా మాత్రమే గొప్పవాడు అయి ఉంటాడే తప్ప విధానపరంగా నిర్బలుడు. శాసన కార్య నిర్వహణ శక్తి లేనివాడు.
(08:31) క్రియాశీలక రాజకీయ శక్తి అతను చెప్పే హితవు తనకు అనుకూలమైతేనే చెవి ఒగ్గుతుంది. తనకు ప్రపంచ ఆధిపత్యాన్ని పెద్దరికాన్ని అందించే అవకాశాలని వదులుకోదు కదా. దాన్ని దాటుకొని పోవడానికి ఓ పాతిక దేశాలు కాచుకొని ఉంటాయి. కనుక అది విధ్వంసమే అగుగాక ముందు దాన్ని తమ అంబుల పొదిలో పెట్టుకొని దాన్ని బూచిగా చూపిస్తూ తక్కిన దేశాల్ని వేలి కొసల మీద ఆడించాలనేది అమెరికా యొక్క ఉద్దేశం.
(08:56) రాజకీయ ప్రాబల్యమే దేశాన్ని నడిపే నావ కనుక అది చెప్పినట్టు చేయడమే ఆ దేశ శాస్త్రవేత్తల కర్తవ్యం. 2025 నాటి లెక్కల ప్రకారం అంటే ప్రతి దేశము తమ వద్ద ఉన్న అన్వాయుధాల జాబితాను ప్రతిసారి నిర్ణీత గడువుకల అంతర్జాతీయ సమాజం ముందు పెడుతూ ఉండాలి. అలా 12531 అన్వాయుధాలు ప్రపంచ దేశాల వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ నిపుణులకు అనుమానం వస్తే ఆయా దేశాల వద్ద ఉన్న అన్వాయుధాలను తనికి కూడా చేస్తాయి.
(09:22) కొన్ని దేశాలు తము లెక్కలు చెప్పేస్తాం. చూపించే ప్రసక్తే లేదని మొండికేస్తుంటాయి. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, భారతదేశం, పాకిస్తాన్, ఇజ్రయిల్, ఉత్తర కొరియాలు అన్వాయుదాలు కలిగిన ప్రముఖ తొలి తొమ్మిది దేశాలు. అన్వాయుద వార్ హెడ్ సంఖ్యను బట్టి వీటి క్రమాన్ని లెక్కిస్తారు. నట్టింట అగ్గి పెట్టుకొని పూరిలు తగలబడకుండా చూడొచ్చా చెప్పండి.
(09:44) పెట్రోల్ బంకుల వద్ద సిగరెట్ ముట్టుకోకూడదు సిగరెట్ కాల్చకూడదు సెల్ ఫోన్ వాడకూడదని హెచ్చరిస్తూ ఉంటారు. పాటిస్తే అందరికీ మంచిదే. పాటించకపోతే ఏ పాపం ఎరుగని వారికి కూడా ముప్పే. అదే కదా విచక్షణ అంటే 1945 నాటి అణుబాంబు ద్వయం తాలకు క్రూర వాస్తవాలు నేటికి గుండెలను గుబేలు మనిపిస్తాయి. తప్పనిసరిగా అన్వాయుద దేశాలుగా మారిన కొన్ని పక్కలో బల్లెల్లా ఉంచితేనే తమకు లాభదాయకమని అన్వాయుద పరిజ్ఞానాన్ని అందరూ కూడా అలవరుచుకున్నారు.
(10:12) చివరిగా ఒక్క మాట మతిస్థిమితం లేని వాని చేతిలో రాయి ఉంటే ఏమవుతుంది మీరే సమాధానం చెప్పాలి. ఏ మాటకు ఆ మాటకి ఇంతవరకు అను పరీక్షలు జరిగాయి. అణువాయుధ దేశాలు తయారయ్యాయి. కానీ ఈ 80 ఏళ్ల కాలంలో మళ్ళీ అనుబాబు ప్రయోగించి ఒక దేశం వేరే దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం అయితే చేయలేదు. అనువిజ్ఞానాన్ని పలు ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్న మానవ సమాజం అనుప్రమాదాల మూలంగా నష్టాలని చవి చూసింది తప్పితే అనువాయుద ప్రయోగం అయితే చేయలేదు.
(10:37) ఆ మేరకు మనిషి జాగ్రత్తగా ఉన్నాడని ఇకమీదట ఉంటాడని నమ్ముదాం. కాకపోతే అడపాపదడప బెదిరింపులు మటుకు చేస్తున్నారు కదా వాళ్ళు అదుపు తప్పి రాయి విసరకుండా చూసుకోవాలి మరి. అది అందరి బాధ్యత. మునుముందు కూడా ఈ నిబద్ధతను ఈ క్రమశిక్షణను ఈ నియంత్రణను కొనసాగిస్తామని నమ్మితీరాలి. ఏమంటారు? మరి ఈ టాపిక్ పై ఈ అణు విద్వాంసాలపై మీ కామెంట్ ఏంటో తప్పకుండా తెలియజేయండి.
(11:01) వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.

No comments:

Post a Comment