Monday, April 6, 2026

 217b1;237B1;34b28;82c7;184e5;54f5;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

     *ఇచ్చుటలో వున్న హాయి…*
               ➖➖➖✍️


 *మోటివేషన్... మంచి కథ..... సంతృప్తి కథ* 
```
*ఆఫీస్ కు రెండు రోజులు సెలవు రావడంతో అమ్మా, నాన్నలతో గడపడానికి మా ఊరికి బయలుదేరాను.

 *బస్టాండ్ కు చేరుకున్న నేను, అప్పుడే వచ్చిన బస్ ఎక్కాను.

 *పరిస్థితి చూస్తే కూర్చోడానికి సీటు దొరికేలా లేదు.
       
*అప్పుడే.. ఒకతను లేచి నిలబడి అతని సీటు నాకు ఇచ్చి, అతను వేరే దగ్గరకి వెళ్ళి నిలుచున్నాడు.
 
*హమ్మయ్య.. అనుకుంటూ అతనికి థాంక్స్ చెప్పి అక్కడ కూర్చున్నాను.

*నాకు సీటు ఇచ్చిన అతనికి పక్కనే ఒక అతను లేవడంతో అతను ఆ సీట్లో కూర్చోవడం జరిగింది.

*ఇంతలో వేరే అతను బస్సు ఎక్కడంతో అతను లేచి నిలబడి మళ్లీ అతని సీటు ఆ వచ్చిన అతనికి ఇచ్చాడు.

*ఇలా అతను తరువాత నాలుగు అయిదు స్టాపులలో అందరికీ అలాగనే అతను కూర్చున్న సీటు ఇవ్వడం చేస్తూ ఉన్నాడు.
     
*ఇదంతా గమనిస్తున్న నేను, చివరి స్టేజీలో బస్సు దిగబోయే ముందు అతనితో మాట్లాడాను.

*”నువ్వు కూర్చోకుండా ప్రతిసారి నీ సీటు వేరే వాళ్లకు ఎందుకిస్తున్నావు?” అని అడిగాను.

*అతని సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. “నేను ఏమీ చదువుకోలేదు, డబ్బున్నవాణ్ణి కూడ కాదు. కూలి పనులు చేసుకునే వాణ్ణి. ఏ విధంగానూ ఎవరికీ ఏమి ఇవ్వలేక పోయాను. అందువలన నేను రోజూ ఈపని చేస్తున్నాను. ఈ పని తేలిక కూడ” అన్నాడు.

*"కూలి చేసుకునే నాకు నిలబడడం కష్టం కాదు. నేను సీట్ ఇచ్చిన వారు తిరిగి నాకు కృతజ్ఞతలు చెప్తారు.
ఎవరికీ ఏమీ ఇవ్వలేని నాకు, ఈ తృప్తి చాలు. ఆ తృప్తితో నాకు సుఖంగా నిద్రపడుతుంది” అన్నాడు.

*నాకు నోటంట మాట లేదు. ప్రతిరోజూ ఏదో ఒకటి ఇవ్వటం అంటే అది వారికి గిఫ్ట్ తో సమానమే...

*ఎదుటివాళ్లకు ఇవ్వాలంటే మన దగ్గర ఏమీలేకపోయినా ఇవ్వచ్చు అని అతన్ని చూచి తెలుసుకొన్నాను.

*మనం ధనవంతులం, స్థితిమంతులం ఐతేనే ఒకళ్లకు ఇవ్వగలం అనుకోవటం తప్పు.
ఇచ్చే మనసున్న ఎవరైనా "ధనవంతుడే" అని అతన్ని చూశాక తెలుసుకున్నాను.

*ఒకరికి ఇవ్వడంలో గల "సంతృప్తి", మరెందులోనూ రాదని అర్థమైంది

*”ఇచ్చుటలో వున్న హాయి వేరెచటనూ లేనే లేదని..” పాట గుర్తొచ్చింది.

 *మిత్రులారా దయచేసి..
 *సేవాగుణాన్ని, సంతృప్తిని పిల్లలలో అలవరచండి.
 *మనం కూడా అలవరచుకునే ప్రయత్నం చేద్దాం.!
 *"మానవసేవే మాధవసేవగా తరిద్దాము." ✍️```
.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                    🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
          ➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...                  8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```

No comments:

Post a Comment