Monday, April 6, 2026

(Request failed: 401)

Youtube Video URL:https://www.youtube.com/watch?v=3kgaX3M5c3Q



Transcript:
(00:00) ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం మానివేస్తే ప్రశాంతత లభిస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది చెప్పడం ఎంత సులువో ఆచరించడం అంత కష్టం అనిపిస్తుందయ్యా ఎందుకంటే ఈ రోజులలో ప్రతిది వేగంగా మారిపోతుంది. ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ వివిధ రకములైన విషయముల వలన ఆందోళన చెందడం పని యందు డెడ్ లైన్లు గొడవలు అంతులేని శబ్దం ఇలాంటి గజిబిజి ప్రపంచ పరిస్థితులలో మౌనం కూడా భారంగా అనిపిస్తోంది.
(00:37) మనశశాంతిగా అంటే ప్రశాంతంగా ఎలా జీవించాలి? ఇది అసలు సాధ్యమేనా బాబాజీ సాధ్యమే శ్రద్ధగా విను ప్రశాంతత అనేది బయట ఎక్కడో దొరికేది కాదు అది నీ లోపల నువ్వు నిర్మించుకోవలసిన స్థితి ఈ స్థితి నీకు శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదిగో అల్లంత దూరంలో ప్రవహిస్తున్న నదిని అందులోని నీటిపై తేలియాడుతున్న పడవను గమనించావా? ఆ పడవ నీటిపై తేలియాడుతూ తన ప్రయాణాన్ని సాగించినంతవరకు దానికి ఎటువంటి ప్రమాదం ఉండదు.
(01:16) ఆ పడవులోనికి గనుక ప్రవేశిస్తే ఆ సమయమున ఆ పడవు మునిగిపోతుంది కదా అదేవిధంగా నువ్వు కూడా ప్రపంచంలో ఉండు కానీ నీ మనసులోకి ప్రపంచపు గొడవలను రానివ్వకు అంటే నీ చుట్టూ జరుగుతూ ఉన్న మంచి చెడు విషయాలను గమనిస్తూ అవసరమైనప్పుడు వాటిపై నీవు స్పందించవలసి వచ్చినప్పుడు స్పందిస్తూ వాటి ఫలితం ఏదైనప్పటికీ పాజిటివ్ కానీ నెగిటివ్ గాని నీ మనసుకు తీసుకోకుండా ఉండగలిగితే నీలోని ఒత్తిడి ఉచ్వాస నిశ్వాసాలు కండరాలపై ఒత్తిడివి అటువంటివన్నీ తగ్గి రక్తపోటు నియంత్రణలో ఉండడం అనే ప్రక్రియ నీ దేహంలో జరిగి నీ మనస్సు ఆలోచనారహిత స్థితికి
(02:02) చేరుకుంటుంది. అనగా నీవు ప్రశాంతంగా ఉన్న స్థితికి చేరుకుంటావని అర్థమైందా ఇంకా ఈ స్థితియే మానసిక ఒత్తిడికి నివారణ మార్గం కూడా అయి ఉందని గుర్తించు అప్పుడే నీవు అన్ని పరిస్థితులలోనూ స్థిరమైన చిత్తమును కలిగి ఉంటూ ప్రశాంతంగా జీవనాన్ని గడుపగలుగుతావు. అంటే సముద్రము తన పైభాగాన ఎన్ని అలలు ఎగిసి పడుతూ ఉన్నప్పటికీ లోపల మాత్రం అది ఎంతో నిశశబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది.
(02:38) అంటే తుఫానుగా పుట్టిన అలలు సముద్రపు ఉపరితలంపై మాత్రమే గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. [గొంతు సవరించుకోవడం] సముద్రం లోపల కాదు కాబట్టి నీవు కూడా అలాగే ఉండాలి సుమా అంటే మనం ఏది ఆశించకూడదా బాబాజీ నీ మనసు యొక్క గంధరగోళమైన పరిస్థితులు ఎల్లవేళలా తలుపు తట్టి వస్తూనే ఉంటాయి. కానీ వాటిని లోపలికి అనుమతించాలా లేదా అనే నిర్ణయం నీవే తీసుకోవాలి.
(03:12) దీనికి కొన్ని సులభమైన మార్గాలు చెప్తాను శ్రద్ధగా విను దీర్ఘమైన శ్వాసను తీసుకుంటూ శ్వాసపై దృష్టి నిలపడం అనగా ధ్యాన విధిని అలవరుచుకోవడం వర్తమానంలో అనగా ప్రస్తుత కాలంలో బతకడం మౌనంగా ఉండటం నీ చేతులలో లేని విషయాన్ని వదిలివేయడం మానసిక విశ్రాంతిని కలిగించే పనులు అనగా యోగ సంగీత గీతం వినడం ప్రకృతితో గడపడం అటువంటి వాటిని నీ జీవనశైలిలో భాగంగా చేసుకోవడం ఎటువంటి చర్యల ద్వారా ప్రశాంతతను పొందవచ్చు.
(03:53) ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే గడిచిన దాని గురించి బాధపడటం జరగబోయే దాని గురించి భయపడడం మానేసి ప్రస్తుతం నీ చేతిలో ఉన్న పనిని లేదా పరిస్థితిని పూర్తి ఏకాగ్రతతో అర్థం చేసుకొని చెయ్ నీ చేతుల్లో లేని విషయాల గురించి ఆలోచించడం వృధ అని తెలుసుకో ఉదాహరణకు ఎదుటివారి ప్రవర్తనను మార్చాలని ప్రయత్నం చేయడం సబబే కానీ నీవు మార్చలేని పరిస్థితులు ఎదురైతే దానిని వదిలివేయడం నేర్చుకో ఉన్నదానితో తృప్తి పడడం నేర్చుకుంటే లేని దాని కోసం పరిగెత్తే ఆరాటం తగ్గుతుంది.
(04:36) ఇదే అసలైన శాంతి లేదా ప్రశాంతత. శాంతి అంటే శబ్దం లేకపోవడం అని అర్థం కాదు. శబ్దంలోనూ నిశశబ్దంగా ఉండగల శక్తి. ఎవరైనా సరే వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే లేదా పెడుతూ ఉన్న విషయం కనుక ఉంటే [గొంతు సవరించుకోవడం] దానికి తగిన పరిష్కార మార్గాన్ని ప్రయత్నపూర్వకంగా వెతుకుతూ ఫలితంపై దృష్టి పెట్టక భగవంతుని సర్వస్య శరణాగతి చేయాలి. అంతా శుభం జరుగుతుంది.
(05:08) అనగా మీకు ఏది జరిగితే మంచిదో అదే మీకు లభిస్తుంది అని తెలుసుకో ధన్యురాలను బాబాజీ ఈ క్షణం నుంచి నా ఆలోచనలను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను బాబాజీ

No comments:

Post a Comment