Monday, April 6, 2026

 *నామ స్మరణ ఎప్పుడు చేయాలి??*

" భక్తుడు అనే వాడు సర్వ వేళలందూ విరామము లేక నామస్మరణ చేయాలి !!..."

చెట్టు నాటిన తోడనే పండ్లను ఆశించకూడదు, పండ్లు ఎట్లుండునో అని దాని రుచి తెలుసుకొనుటకై  చెట్టు యొక్క ఆకులూ, బెరడూ  నమలకూడదు!!...
అట్లు చేసినయెడల పండు యొక్క మాధుర్యమును తెలియదు...
అంతియేకాక మొక్క నశించి పోవును... అదే రీతిగా నామమను మొక్కను అభివృద్ధి పరచుకొనుటయే నీ వంతు, దానిని సరిగ్గా చేస్తున్నానా, లేదా; నామములోనికి మహత్తు ఉందా? లేదా? అని ఈ రుచులు చూచుటకు ప్రయత్నించకూడదు...
సందేహించకుండా, తప్పక ఆనామమను మొక్కగా, వృక్షమై  , భక్తుడు ఆశించిన ఫలమును తిని పించగలదు...
అట్టి ఫలమును పట్టుకొనునట్టి  వల నామము, 
కనుక ఆ నామమును ఎప్పుడు మార్చకుండా, దాని రూపమును దృష్టి లో పెట్టు కున్న, అదే ఏకాగ్రత...
సర్వ వేళలందూ విరామము లేక నామమును చేయవలెను, అదే జీవితంలో మొదటిపని...

No comments:

Post a Comment