Monday, April 6, 2026

 *ప్రాణం అంటే ఏమిటి?* 

మానవ స్థూల శరీరంలో ఉండే నరాలలో నిత్యము ఒకే వాయువు 10 విధాల కర్మలు చేస్తున్నాయి కాబట్టి దశవాయువులుగా గ్రహించబడ్డాయి. 

శిశువు మాతృ గర్భంలో ఉండగా ఏడవ నెలలో ఈ ప్రాణము (జీవశక్తి) ప్రవేశింపబడుతుంది. జీవశక్తి అంటే అది అగ్నితత్వం కలది. అంటే జటరాగ్ని కూడా అదే అవుతుంది. శరీరంలో నడిచే దశ వాయువు వల్ల శరీరానికి జీవశక్తి అంటే చైతన్యము కలగజేసేది ఒక ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీని ప్రాణము అంటారు మానవుడు చనిపోయినాక శరీరం చల్లబడిపోతుంది, మానవుడు జీవించి ఉన్నంత కాలం 36 డిగ్రీల వేడి ఉంటుంది ఆ వేడి ఏది కలగజేస్తుందో అదే ప్రాణం.(అగ్నిః హి ప్రాణః | యజ్ఞవల్కోపనిషత్ 2 ప్రాణమే 'అగ్ని') జీవుడు తాను భుజించిన ఆహారము తాగిన నీరు పీల్చిన గాలి వీటి యొక్క సారం శక్తి ఆ శక్తి శరీరాన్ని చైతన్య పరుస్తుంది ఆ చైతన్యమే జీవశక్తి ఆ జీవ శక్తి కే ప్రాణమని పేరు.       *ఆధ్యాత్మిక కుటుంబం 4*                                                 

No comments:

Post a Comment