Monday, April 6, 2026

గంగానది అసలు జన్మ స్థలం కనుక్కొంది ఎవరు? #satyanandiraju #sanatandharma #hindu #devotional #ytviral

గంగానది అసలు జన్మ స్థలం కనుక్కొంది ఎవరు? #satyanandiraju #sanatandharma #hindu #devotional #ytviral

Author Name:Satya Sanatana Dharma Telugu Channel

Youtube Channel Url:https://www.youtube.com/@satyasanatanadharmateluguc6778

Youtube Video URL:https://www.youtube.com/watch?v=hNBAGaeyVmU



Transcript:
(00:01) శ్రీమాత్రే నమః మీ సత్యానందిరాజు మానస సరోవరం మీరు వెళ్లే ఉంటారు. దాని లోతు ఎంతో మీకు తెలుసా? మందపల్లి శనేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళారా? లాలా లజపతిరాయి స్థాపించినటువంటి డిఏవి జాతీయ కళాశాల ఎక్కడ ఉందో మీకు తెలుసా? జలియన్ వాలాబాగ్ గురాగతం జరుగుతున్నప్పుడు మన తెలుగువారు ఎవరైనా అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారా? ఎక్కడైనా ఆలయంలో శ్రీ చక్రాన్ని మనం చూసే ఉంటాం.
(00:37) శ్రీ చక్రమే ఆలయంగా మారితే ఆ క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా? మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళారా? ఏంటండీ సత్య గారు మీకు ఏమైంది అసలు ఒక వాక్యానికి ఇంకో వాక్యానికి పొంతలు లేకుండా మాట్లాడుతున్నారు అని మీకు ప్రశ్న మీ మనసులో మెదులుతో కానీ ప్రతి వాక్యానికి ప్రతి పదానికి కూడా ఎంతో అవినాభావ సంబంధం ఉంది. అంతేకాదు ఇవన్నీ కూడా దండ వచ్చితే ఒక మహాయోగి యొక్క సమగ్ర జీవితం.
(01:08) ఆ మాన సరోవరం యొక్క లోతు మొట్టమొదటిసారిగా కనిపెట్టింది ఎవరో తెలుసా ఎవరో కాదు కనకదండి వెంకట సోమయాజులు ఈ ప్రశ్న వేసినప్పుడు నేను ఒక బ్రిటిష్ శాస్త్రవేత్త పేరు ఏమైనా చెప్తానేమో అని మీరు అనుకుని ఉండవచ్చు కానీ మన తూర్పు గోదావరి జిల్లా వారు మన తెలుగువారు ఆ వెంకట సోమయాజి చాలా విచిత్రంగా ఉంది కదా అసలు తూర్పు గోదావరి గోదావరి జిల్లాలో ఉండవలసినటువంటి సోమయాజులు మాన సరోవరం ఎందుకు వెళ్ళారు వెళ్తే వెళ్ళారు కానీ అక్కడ పరిక్రమణ చేసి వచ్చేసేయాలి మరి అక్కడ లోతి ఎందుకు కొల్చారు అసలు అక్కడ వారు ఏం చేశారు
(01:54) ఇలాంటి అద్భుతమైన విశేషాలు ఇవాళ మనం సత్సంగం చేసుకోబోతున్నాం. మీకు ఈ సత్సంగం నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడమే కాదు హైప్ కూడా చేయండి. ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి ఎన్నో విశేషాలు సత్సంగం చేసుకుని వారి యొక్క ఆశీస్సులు అలాగే ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మెండుగా పొందేద్దాం పదండి ఈ సోమయాజులు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మందపల్లి పక్కన ఉన్నటువంటి ఏనుగు మహల్ అనే ఒక చిన్న ఊరిలో జన్మించారు.
(02:29) ఎప్పుడు జనవరి 14, 1896 వీరి తల్లిదండ్రుల పేర్లు విశ్వపతి శాస్త్రి సీతమ్మగారు వీరి పేరు ఎట్లా ప్రముఖం అంటే మీకు అర్థమైపోయింది కదా ఏనుగుల్ మహల్ స్వామి ప్రణవానంద మనం ఒక నెల రోజుల క్రితం వీరి యొక్క గురువుగారు గొరగనమూడి జ్ఞానానంద స్వామి వారి గురించి సత్సంగం చేసుకున్నాం గుర్తుందా ఎవరైనా చూడనివారు ఉంటే ఆ లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా కుడా చూడండి వారి యొక్క శిష్యులే స్వామి ప్రణవానంద చిత్రం ఏంటంటే శిష్యుడు అంటే స్వామి ప్రణవానంద ఒక 11 నెలలు జ్ఞానానంద స్వామి వారి కంటే కూడా పెద్ద జ్ఞానానికి వయసుతో
(03:14) సంబంధం ఏముంది సరే వీరి పాఠశాల విద్య అంతా కూడా కొత్తపేటలో జరిగింది. తర్వాత చదువులకి రాజమండ్రి వెళ్ళారు అక్కడ కొన్ని సంవత్సరాలు చదివిన తర్వాత లాహోర్ వెళ్ళారు అక్కడ ఉంది లాలా లజపతిరాయి వారు స్థాపించినటువంటి డిఏవి జాతీయ కళాశాల అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే ఇక్కడేదో ఒక డిగ్రీ చేసి గుమాస్తాగా చేరడం బ్రిటిష్ గవర్నమెంట్ లో ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే గురువు గారి లాగా ఈయన కూడా స్వాతంత్రోద్యమానికి కట్టుబడి ఉన్నారు.
(03:48) ఆ కళాశాల ఎంతోమంది ఉద్యమకారులకి పెట్టింది పేరు అందుకని అక్కడికి వెళ్ళా ఇప్పుడు అర్థమైందా ఇందాక ఈ కళాశాల గురించి మీ దగ్గర ఎందుకు ప్రస్తావించాను నేను ఇందాక చెప్పాను కదా జలిీన్ వాలాబాగ్ దుర్ఘటనకి మన వెంకట సోమయాజులు గారు ప్రత్యక్ష సాక్షులు అంతేకాదు రౌలర్ చట్టానికి వ్యతిరేకంగా ఎంతో తీవ్రంగా పోరాడారు. ఆ రోజుల్లో కనీసం రోజుకి నాలుగు సార్లు అయినా బ్రిటిష్ సైనికులు వీరిని పిలిచేవారు విచారణ కోసం 1918 నవంబర్ డిసెంబర్ లో లాహోర్ లో ఇన్ఫ్లుయెన్జా వ్యాధి తీవ్రంగా పాగిపోయింది.
(04:27) ఎన్నో వందల వేల మంది మరణించారు. కానీ వెంకట సోమయాజులు గారు తమ ప్రాణాలకు తెగించి మరి ఎంతో మందిని కాపాడారు. అదే సంవత్సరం గడ్వాల్ ప్రాంతంలో తీవ్రమైన కరువు వస్తే అక్కడ కూడా తమ విశిష్టమైనటువంటి సేవలు అందించారు. అక్కడే మొట్టమొదటిసారిగా హిమాలయాలతో ప్రేమలో పడ్డారు మన వెంకట సోమయాజు దాని తర్వాత డిగ్రీ పూర్తి చేశారు రైల్వేస్ లో అకౌంటెంట్ జాబ్ వచ్చింది కానీ వదిలేశారు వదిలేసి ఆంధ్రప్రదేశ్ కి తిరిగి వచ్చేశారు.
(05:01) వచ్చిన తర్వాత ఎన్నో స్వాతంత్రోద్యమాల్లో పాల్గొన్నారు 10 నెలలు జైలుకు వెళ్లారు కానీ 1927 లో వారి మనసు హిమాలయాల వైపు ఆకర్షించబడింది అప్పుడు వారు హిమాలయాలకు బయలుదేరారు. అప్పుడే మొట్టమొదటిసారిగా హిమాలయాల్లో జ్ఞానానంద స్వామి వారి యొక్క దర్శనం వారికి లభించింది. అట్లా 1927 లో స్వామి జ్ఞానానంద దగ్గర దీక్ష తీసుకుని వెంకట సస్వామ్యజులు స్వామి ప్రణమానంద గా మారిపోయారు దాని తర్వాత పాతిక సంవత్సరాలు కఠోరమైనటువంటి తపస్సు చేశారు కటయోగం రాజయోగం కేచరి ముద్ర తీవ్రమైనటువంటి సాధనలు చేశారు అక్కడ లామాలు ఎంతగానో గౌరవించేవారు ఎందుకంటే వీరు ఆ బౌద్ధారామాల దగ్గర హిమాలయ పర్వతాల్లో ఎంతో తపస్సు
(05:47) చేశారు కైలాస శిఖరానికి 36 36 సార్లు మాన సరోవరానికి 33 సార్లు పరిక్రమణ చేశారు 25 చాతుర్మాసి వ్రతాలు చేశారు అక్కడ అంతగా వారికి హిమాలయ పర్వతాలతో ఒక సాన్నిహిత్యమైనటువంటి సంబంధం ఏర్పడిపోయింది. గంగా నది జన్మస్థానం అయినటువంటి గంగోత్రి దగ్గర ఈ సంవత్సరం మొత్తం కాలంలో సగభాగం దాదాపు మైనస్ డిగ్రీ టెంపరేచర్ లో ఉంటుంది.
(06:14) అయినా కూడా అటువంటి గడ్డ కట్టేటువంటి టెంపరేచర్ లో స్వామి ప్రణమానంద దాదాపు ఒక సంవత్సరం ఉన్నారు. అందుకే అక్కడ సంవత్సరంలో ఆరు నెలలు మూసేస్తారు ఆ ప్రాంతాన్ని అయినా కూడా స్వామి ప్రణవానంద 1934 35 మద్య ఒక సంవత్సరం మొత్తం గంగోత్రిలోనే ఉన్నారు. అలా మళ్ళీ చెల్లింది వారి గురువుగారు జ్ఞానానంద స్వామికే ఈ గురు శిష్యులకే అట్లా సాధ్యమైంది.
(06:39) స్వామి జ్ఞానానంద మామూలువారు కాదు వారికి శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం అయింది. అయినా కూడా ఈ దేశానికి అనుశాస్త్ర పితామహులుగా ఆయన నిలిచిపోయారు. హోమీ బాబాకి ఎంతగా గుర్తింపు వచ్చిందో అంతటి గుర్తింపు స్వామీజీ జ్ఞానానందికి వచ్చి ఉండాల్సింది. కానీ భారత ప్రభుత్వం దురదృష్టం కొద్దీ అంతగా గుర్తింపు వీరిద్దరికీ కూడా ఇవ్వలేదు అనేది నా సొంత అభిప్రాయం.
(07:08) అట్లా వారు యోగి లాగానే ఆగిపోలా స్వామి జ్ఞానంద లాగా అంటే వారి గురువు గారి అడుగుజాడల్లో నడిచి శాస్త్రవేత్తగా మారారు వారి తపస్సు అంత కూడా ధారపోసి దేశానికి ఎన్నో ఆవిష్కరణలు చేశారు అలాంటివి ఇలాంటివి కాదు కొన్ని ఉదాహరిస్తాను గంగా సింధు బ్రహ్మపుత్ర సత్యలజ్ నదులు యొక్క జన్మస్థానం ఎక్కడో సరైనవి కనుక్కున్నారు అప్పటివరకు మ్యాప్స్ లో ఉన్నవి తప్పు అని నిరూపించి చారు దానికోసం ఎన్నో పర్వత కనుములు లోయలు దాటారు.
(07:40) రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ వారు తమ తప్పులు దిద్దుకునే మ్యాప్స్ లో వీరికి ఫెలోషిప్ ఇచ్చి గౌరవించారు. అది వారి యొక్క గొప్పతనం 1946 లో చిన్న రబ్బర్ బోట్ లో సముద్ర మట్టానికి 18,004 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి మాన సరోవరం మీద ప్రయాణం చేస్తూ దాని యొక్క లోతుని మొట్టమొదటి సారిగా కొలిచారు. ఎవరు? మన స్వామి ప్రణమానంద 84 అడుగులు అని చెప్పి తేల్చారు అప్పటివరకు ఉన్న మూఢ నమ్మకం ఏమిటంటే దానికి లోతు ఎంతో ఎవరూ కొలవలేరు అని చెప్పి దాన్ని బద్దలు కొట్టారు స్వామి ప్రణమానంద ఆ కాలంలో ఒక చిన్న రబ్బర్ బోటు మీద అదొక పెద్ద సాహసం అని చెప్పారు
(08:23) దురదృష్టం ఏమిటంటే ఇటువంటి విశేషాలు ఏవి కూడా మన పిల్లల పాఠ్యాంశాల్లో ఉండవు ఎవరో అక్బర్ బీర్బల్ బాబర్ యొక్క చరిత్రలు చదువుకుంటామే కానీ కానీ మన జ్ఞానానంద మన స్వామి ప్రణవానంద గురించి ఎక్కడా కూడా మన పాఠ్యాంశాల్లో కానీ పుస్తకాల్లో కానీ ఉండవు దురదృష్టం అటువంటి మార్పులు జరగాలని చెప్పి మనందరం కోరుకుందాం స్వామి ప్రణమానంద ఎక్కడైనా మ్యాప్స్ యొక్క వివరాలు ఇస్తే ఎంత పెద్దవారైనా సరే వారి యొక్క మ్యాప్స్ మార్చుకోవాల్సిందే అందుకు ఉదాహరణ సర్వే ఆఫ్ ఇండియా నేషనల్ అట్లాస్ ఆర్గనైజేషన్ వాళ్ళ మ్యాప్స్ మార్చేసుకునే వారు స్వామి ప్రణవానంద చెప్తే అంతే అదొక
(09:03) స్టాండర్డ్ అందుగాను ఇండియన్ జియోగ్రాఫికల్ సొసైటీ లండన్ రాయల్ ఏషియాటిక్ సొసైటీ వారు ఫెలోషిప్ ఇచ్చి గౌరవించారు. స్వామి ప్రణవానంద యొక్క సేవలు కేవలం ఈ జియోగ్రాఫికల్ మ్యాప్స్ వరకే ఆగిపోలేదు. దేశం యొక్క రక్షణ కోసం కూడా వారు ఎంతో పాటుపడ్డారు. వారి సొంత డబ్బులు 36వ000 రూపాయలు ఇప్పుడు 1950 52వ ప్రాంతంలో ఇంత డబ్బులు వెచ్చించి మరి అప్పట్లో ఈ పాకిస్తాన్ ఏజెంట్లు అలాగే కొన్ని ఈ ఫారెన్ క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి గూఢాచర్యం పై ప్రభుత్వానికి 4,000 పేజీల రిపోర్ట్ ఇచ్చి పంపించారు.
(09:42) దాని వల్ల ఏమైంది అంటే మన భారతదేశం 1954 లో మన సరిహద్దు జిల్లాలను గుర్తించి అక్కడ నూతనంగా కొన్ని చెక్పోస్ట్లు నిర్మించింది. అట్లా వారు మన దేశం యొక్క రక్షణకి ఎంతగానో పాటుపడ్డారు స్వామి ప్రణమానంద. అలా స్వామి ప్రణమానంద రెండు అద్భుతమైనటువంటి గ్రంథాలు రాశారు ముఖ్యంగా ఎక్స్ప్లోరేషన్ ఇన్ టిబేట్ కైలాస్ మానస్ సరోవర్ ఇవి తెలుగులో కూడా మీకు దొరకవచ్చు నా డిస్క్రిప్షన్ లో వివరాలు చూడండి నేను ప్రయత్నించి చూస్తాను ఆ వివరాలు తెలిస్తే మాత్రం తప్పకుండా డిస్క్రిప్షన్ లో పంచుకుంటాను తప్పకుండా పుస్తకాలు మీరు చదవడమే కాదు పిల్లల చేత కూడా చదివించండి
(10:21) ఎందుకంటే మన భావితరాలకు ఇవన్నీ కూడా తెలియాలి వారు తయారు చేసినటువంటి మ్యాప్స్ కానీ అని ఇతరితర పరికరాలన్నీ కూడా యాంత్రపలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కత్తా మ్యూజియం లో ఉన్నాయి ఇప్పటికీ ఇందాక నేను చెప్పాను చూసారా ఒక 19 కోట్ల సంవత్సరాల నాటి శిలాజాలం దొరికిందని చెప్పి అది కూడా ఈ కోల్కత్తా మ్యూజియం లోనే ఉంది.
(10:44) అలాగే వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ డెహరాడూన్ మ్యూజియంలో వారు తయారు చేసినటువంటి టోపోగ్రాఫిక్ మ్యాప్స్ అవన్నీ కూడా అక్కడ భద్రపరచబడ్డాయి. నైనటాల్లో వారి యొక్క ఆశ్రమం ఉందని చెప్తారు ప్రణమానంద ఆశ్రమం అందులో వారి వస్త్రాలు పాదుకలు కెమెరా వారు వాడినటువంటి బారోమీటర్ హైగ్రోమీటర్ ఇతరతర పరికరాలు అన్నీ కూడా అక్కడ భద్రపరచబడ్డాయి రాజమండ్రి పిఠాపురంలో ఉన్నటువంటి కొన్ని స్థానికమైనటువంటి లైబ్రరీలో వారి యొక్క సొంత వ్రాత ప్రతులు కొన్ని ఉన్నాయి వారి సంతకం చేసినటువంటి కొన్ని ప్రతులు ఉన్నాయి అని చెప్పి చెప్తారు.
(11:21) అసలు మనం స్వామి ప్రణమానంద యొక్క ఆధ్యాత్మిక వైభవం గురించి తెలుసుకోవాలి అంటే పాల్ బ్రెన్ రాసినటువంటి హెర్మిట్ ఇన్ హిమాలయస్ అనే పుస్తకం మనం చదివి తీరాల్సింది. ఆ వివరాలు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి మీరు చూడండి. ఒకసారి పాల్ బ్రెంటన్ మాన సరోవరానికి వెళుతూ వెళుతూ మార్గ మధ్యంలో హిమాలయంలో స్వామి ప్రణమానందను కలిశారు.
(11:46) అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ కొన్ని ఆంక్షలు విధించడం వల్ల ఈ యాత్రకు వెళ్ళలేకపోయారు పాల్ బ్రెంట్ అప్పుడు స్వామి ప్రణమానంద కొన్ని రహస్య మార్గాలు తెలియజేశారు కైలాస శిఖరానికి ఎలా చేరుకోవచ్చు ఆ సందర్భంలో అసలు వారి మధ్య ఎటువంటి సంభాషణలు జరిగినాయి అసలు స్వామి ప్రణమానంద ఎటువంటి ఔనిత్యం కలిగినటువంటి వ్యక్తి అనేది పాల బ్రెన్ను అద్భుతంగా వ్యక్తీకరించారు ఆ పుస్తకంలో అదే సందర్భంలో పాల బ్రిన్ చాలా బాధపడుతున్నారు నేను వెళ్ళలేకపోతున్నాను యాత్రకి అని అప్పుడు ఏం చెప్పారు అంటే స్వామి ప్రణమానంద ఈ కైలాస మానస సరోవర యాత్ర అనేది బయటకి చేసేది కాదు అంతర్గతంగా చేయాల్సింది
(12:26) అక్కడికి వెళ్లడం ముఖ్యమైనప్పటికీ కూడా లోపల ఉన్న శివత్వాన్ని దర్శించడం అంతకంటే ముఖ్యం కైలాస శిఖరం అనేది ఒక గొప్ప స్పిరిచువల్ ఎనర్జిక్ సెంటర్ ఒక గొప్ప కాస్మిక్ సెంటర్ అక్కడికి మనం వెళ్ళడం అంటే దానికి తగిన టువంటి మార్పులు మన సాధనలో మనం తెచ్చుకోవడం అలా జరిగినప్పుడే ఆ యాత్రకి ఉత్తమ ఫలితం ఉంటుంది అని చెప్పి స్వామి ప్రణమానంద అద్భుతంగా నిర్వచించారు.
(12:56) అంతే కాదు పాలబ్రింటన్ ఇంకా ఏం చెప్పారంటే నేను ఎంతో మంది సన్యాసిని చూసాను భారతదేశంలో కానీ ఈ సన్యాసి ఎన్నో అద్భుతమైనటువంటి ఆధునికమైనటువంటి శాస్త్రీయ పరికరాలను మోసుకు వెళ్లడం నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను స్వామి ప్రణమానంద దగ్గరే అని చెప్పి చెప్పారు. అట్లా ఆధ్యాత్మికతని వైజ్ఞానిక శాస్త్రాన్ని కూడా సమ్మిళితం చేసి ఈ లోకోధారణ చేసినటువంటి మహనీయుల స్వామి ప్రణమానంద మనం గంగ నుంచి నీళ్లు తెచ్చుకుంటాం పవిత్ర జలాలు కొన్ని సంవత్సరాలు అయినా కూడా అవి అలాగే ఉంటాయి.
(13:32) ఎందుకు ఉంటాయో స్వామి ప్రణమానంద శాస్త్రీయంగా నిరూపించారు ఇటువంటి ఖనిజ లవణాల వల్ల గంగా నది యొక్క జలాల పవిత్రంగా అన్ని సంవత్సరాలు ఉంటాయో శాస్త్రీయంగా నిరూపించారు స్వామి ప్రణమానంద. స్వామి ప్రణమానంద ట్రీట్స్ ఆన్ శ్రీ చక్ర అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని రాశారు. అందులో మనలోని షడ్చక్రాలు అలాగే శ్రీ చక్రంలో ఉండే ఆవరణలకి ఉన్నటువంటి సంబంధాన్ని వారు అద్భుతంగా నిర్వచించారు.
(14:00) అలాగే అసలు జామెట్రీకి, మంత్రానికి ఉన్న సంబంధం గురించి శివశక్తి యొక్క కలయిక ద్వారా సృష్టి ఎలా జరుగుతుందో శ్రీ చక్రం ద్వారా నిరూపించారు. శ్రీ చక్రం గురించి వైజ్ఞానిక పరంగా యోగ విద్యా పరంగా తాత్వికంగా కూడా అద్భుతమైనటువంటి విశ్లేషణ చేశారు ఆ గ్రంథంలో వారు చేసినటువంటి ఈ కృషికి భారతదేశ ప్రభుత్వం ఆఖరికి 1976లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చారు చిన్నప్పుడే ప్రణమానందులు విరూపాక్ష పీఠాధిపతులు అయినటువంటి నృసింహ భారతీ స్వామి వారి దగ్గర శ్రీ విద్యా మంత్రోపదేశం పొందారు.
(14:35) వారు 17 సంవత్సరాలు శ్రీచక్రం మీద తీవ్రమైనటువంటి పరిశోధన చేసి నేను ఇందాక చెప్పినటువంటి ఆ గ్రంథాన్ని వ్రాశారు మార్చి 28, 1983న వారి స్వగ్రామమైన ఏనుగుల్ మహల్ మందిరంలో శ్రీ మహా త్రిపుర సుందరి దేవి శ్రీ చక్రమేరు యంత్రాన్ని ప్రతిష్టింప చేశారు ఆ యంత్రం సుమారు రెండు టన్నుల బరువు ఉంటుంది. అంటే వారి తపస్సు శక్తి అంతా కూడా అక్కడే నిక్షిప్తమై ఉంది మీరు ఎప్పుడైనా మందపల్లి సినీశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళితే అక్కడి నుంచి కేవలం 350 m దూరంలోనే ఈ శ్రీచక్రమీరు యంత్రం యొక్క ఆలయం ఉంటుంది తప్పకుండా వెళ్లి దర్శించండి ఆఖరికి
(15:17) స్వామి ప్రణమానంద మే 17, 1989 వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు వారి చివరి శ్వాస వదిలేసి పరమాత్మలో ఐక్యమై అయిపోయారు వారి కోరిక ఏమిటంటే వారి యొక్క అవశేషాలు ఏవి కూడా మిగల్చవద్దు అని చెప్పారు అందుకని వారికి అగ్ని సంస్కారం జరిగింది. హైదరాబాద్ లోనే అలా తమ తపస్శక్తి మొత్తం కూడా ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం ధారపోసినటువంటి మహాయోగి స్వామి ప్రణవానంద మన తెలుగువారు అని చెప్పి గర్వంగా చెప్పుకుందాం.
(15:51) స్వామి ప్రణవానందకు సరైన గుర్తింపు వచ్చిందా మీరు కామెంట్స్ లో తెలపండి. అలాగే వారి జీవిత ఘట్టాల్లో మీకు ఏది బాగా నచ్చిందో కూడా కామెంట్స్ తో పెట్టండి. ఈ సత్సంగం మీకు నచ్చినట్లైతే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడమే కాదు హైప్ కూడా చేయండి. ఈ సత్సంగంలో పాల్గొన్న మీ అందరికీ నాకు కూడా స్వామి ప్రణవానందు యొక్క ఆశీస్సులు ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నా.
(16:18) ఇంకో అద్భుతమైన సత్సంగంలో అందరం మళ్ళీ కలుద్దాం. శ్రీ మాత్రే నమః సత్యానంది రాజు.

No comments:

Post a Comment