స్థితప్రజ్ఞత అంటే ఏమిటి? జీవితాన్ని మార్చే గుణం 😌
Author Name:Vanirani
Youtube Channel Url:https://www.youtube.com/@Vanirani1987
Youtube Video URL:https://www.youtube.com/watch?v=_m3Xwh0QHmc
Transcript:
(00:00) గురుభ్యో నమః అందరికీ కూడా నమస్కారాలండి నేను ఈరోజు తీసుకుంటున్న విషయం స్థిత ప్రజ్ఞత స్థిత ప్రజ్ఞత అంటే ఏంటి ఎవరిని స్థిత ప్రజ్ఞుడు అంటారు దాని గురించి మాట్లాడుకుందాం. స్థిత ప్రజ్ఞత అంటే ఎటువంటి మార్పు ఇటు సంతోషంలో కానీ దుఃఖంలో కానీ ఒకటే రకంగా భావాన్ని కలిగి ఉండేవాడు రాముడు స్థిత ప్రజ్ఞుడు కైకేయి వరాలు కోరుకున్నప్పుడు
(00:44) అతడు రాజ్యాన్ని వదిలి అడవుల పాలు వెళ్ళాలి అడవులకు వెళ్ళాలి 14 సంవత్సరాలు అడవుల్లో గడపాలి అని తెలిసినా కూడా అతడు ఏమాత్రము పొంగలేదు లొంగలేదు బాధపడలేదు అలా స్థిత ప్రజ్ఞతతోనే ఉన్నాను. అటువంటి స్థిత ప్రజ్ఞత మనం అందరం కూడా అవలంబించాలి. దీనికి చిన్న ఉదాహరణ చెప్తానండి సముద్రం పెద్ద సముద్రం ఉంది సముద్రం దగ్గరికి ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటూ వచ్చాడు.
(01:20) అనుకోకుండా అతని యొక్క ఆడుకుండే వస్తువు బాలు సముద్రంలో కొట్టుక వెళ్ళిపోయింది. వాటర్ వచ్చింది బాలును తీసుకొని వెళ్ళిపోయింది. ఆ బాలు ఎప్పుడైతే ఈ వాటర్ లో కొట్టుకుపోయిందో ఇతను కోపంతో ఆ మట్టి మీద ఈ విధంగా రాశడు సముద్రం ఒక దొంగ అని తర్వాత ఇంకొక ముసలి ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చి సముద్రం దగ్గర ఏమని రాస్తుంది సముద్రం ఒక మోసగాడు అని ఎందుకంటే అతని బిడ్డ ఆమె బిడ్డ ఆ సముద్రంలో కొట్టుకొని పోయాడు అందుకని సముద్రం ఒక మోసగాడు అని
(02:05) రాసింది. ఆ తర్వాత ఒక ముసలతను వచ్చాడు. ముసలతను వచ్చేసి ఈ కింద ఈ విధంగా రాస్తున్నాడు సముద్రం ఒక దుష్టుడు అని ఎందుకు అతని పండ్ల బుట్ట అతని చెప్పులు సముద్రంలో కొట్టుకుపోయినాయట ఆ తర్వాత ఒక యువకుడు వచ్చాడు అతనికి ఆ వాటర్ లోనే సముద్రం బొడ్డున ముత్యాలు దొరికినాయి సముద్రం ఒక స్వర్ణకారుడు దైవంతో సమానం అని కింద రాశడు అందరూ రాసింది వన్ బై వన్ అక్కడ ఉన్నాయి వాటర్ సముద్రపు వాటర్ అలా వచ్చింది వాటిని అన్నిటిని తుడిచి పెట్టుకొని వెళ్ళింది.
(02:50) నీరు సముద్రం తన పని ఏమన్నా ఆపిందా తన పని తను చేసుకుంటూనే వెళ్ళిపోయింది. దుష్టుడు అన్నారు మోసగాడు అన్నారు దొంగ అన్నారు మెచ్చుకున్నారు ఏమి చేసినా కూడా సముద్రంలో మార్పు లేదు. అదేవిధముగా ఎవరు ఏమన్నా కూడా స్థిత ప్రజ్ఞతతో కలిగి ఉన్న వారికి ఎటువంటి ప్రభావం వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద ఉండదు మనశశాంతి ఉంటుందండి కాబట్టి స్థిత ప్రజ్ఞతతో ఉండాలని మనవి చేస్తూ సర్వేజన సుఖన భవంతు స్వస్తి
No comments:
Post a Comment