Tuesday, May 5, 2026

 2021లో హిమాలయాల్లో ఒంటరి ట్రెక్కింగ్ సమయంలో అదృశ్యమైన ఒక రష్యన్ విద్యార్థిని, నాలుగు సంవత్సరాల తర్వాత నేపాల్‌లోని ఎత్తైన బౌద్ధ మఠానికి సంరక్షకురాలిగా నేషనల్ జియోగ్రాఫిక్ జర్నలిస్టులు గుర్తించారు.

24 ఏళ్ల అలీనా వెట్రోవా అన్నపూర్ణ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరి తిరిగి రాలేదు. ఆమె కోసం మూడు వారాల పాటు రక్షణ చర్యలు సాగాయి, కానీ హిమపాతం కారణంగా ఆమె మరణించిందని భావించారు. ఆమె తల్లిదండ్రులు నోవోసిబిర్స్క్‌లో ప్రతీకాత్మక అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే 2025 ప్రారంభంలో, కనిపించకుండా పోయిన మఠాలపై డాక్యుమెంటరీ చిత్రీకరిస్తున్న బృందం, సముద్ర మట్టానికి 4,800 మీటర్ల ఎత్తులో ఉన్న దూర ప్రాంత పర్వత దేవాలయంలో, సన్యాసి వస్త్రాలు ధరించి, టిబెటన్ మరియు నేపాలి భాషలను అలవోకగా మాట్లాడుతున్న యూరోపియన్ రూపురేఖలున్న యువతిని కనుగొన్నారు.

ఆమె అలీనా అని తేలింది. ఎత్తు కారణంగా వచ్చిన అనారోగ్యంతో స్పృహ కోల్పోయిన ఆమెను, అక్కడి ఏకాంతవాసి సన్యాసులు కనుగొని, ఔషధ మూలికల కషాయాలతో కొన్ని నెలలు సంరక్షించారు. ఆమెకు స్పృహ వచ్చినప్పటికి మార్గాలు మంచుతో కప్పబడి ఉండటంతో, వేసవి వచ్చే వరకు దిగివచ్చే పరిస్థితి లేకపోయింది. ఆ నెలల్లో ఆమె టిబెటన్ వైద్యం, ధ్యానం నేర్చుకోవడం ప్రారంభించింది.

మఠాధిపతి చెప్పిన ప్రకారం, అలీనాకు ఒక అరుదైన వరం కలిగింది — ఆమె వాసన ద్వారా పర్వత ఔషధ మూలికలను ఖచ్చితంగా గుర్తించగలిగింది. దీనిని సన్యాసులు పునర్జన్మ పొందిన ఆత్మకు సంకేతంగా భావించారు. ఆమెకు “టెన్జిన్ డోల్మా” అనే పేరు పెట్టి, 40 ఏళ్లుగా ఎవరూ నిర్వహించని మఠ ఔషధశాల బాధ్యతలకు వారసురాలిగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.

ఇప్పుడు అలీనా 600కుపైగా ఎత్తైన ప్రాంతపు మొక్కల జాతుల సేకరణను నిర్వహిస్తోంది. ఆమె సంప్రదాయ బర్గండీ రంగు వస్త్రాలు ధరిస్తోంది, తలను గుండు చేయించుకుంది, చేతులపై యాక్ ఎముకలతో చేసిన ఆచార కంకణాలు ధరించింది. ఇవి ఆమె స్థాయికి గుర్తుగా అనుమతించబడ్డాయి. ప్రతి ఉదయం జరిగే కార్యక్రమంలో ఆమె నుదిటిపై కుంకుమ బొట్టు పెడతారు.

జర్నలిస్టులు తిరిగి వెళ్లాలనుకుంటున్నావా అని అడిగితే, అలీనా అచ్చమైన నేపాల్ యాసతో రష్యన్‌లో ఇలా సమాధానమిచ్చింది: “నేను ఇప్పటికే నా ఇంట్లోనే ఉన్నాను. పర్వతాలు ఎవరిని ఎంచుకుంటాయో వారిని బయటకు వెళ్లనివ్వవు.”

ఆమె తల్లిదండ్రులు ఇప్పటికే కాఠ్మాండూకు వెళ్లారు. ఈ నెలాఖరులో వారి భేటీ జరగనుంది...

ఇలాంటివి మనం సినిమాల్లో చూసి ఉంటాం.. 
నిజంగా జరిగినప్పుడు మరింత లోతైన అనుభవాలకు తీసుకెళ్తాయి..

ఆంగ్లం నుంచి స్వేచ్ఛానువాదం..

No comments:

Post a Comment