Sunday, August 2, 2026

చేసిన మంచి తిరిగొస్తుందా? || KARMA RETURNS || SEETAKANTH TALKIE #karma #motivation #moralstories

చేసిన మంచి తిరిగొస్తుందా? || KARMA RETURNS || SEETAKANTH TALKIE #karma #motivation #moralstories

Author Name:SEETAKANTH TALKIE

Youtube Channel Url:https://www.youtube.com/@SEETAKANTHTALKIE

Youtube Video URL:https://www.youtube.com/watch?v=TRZfJ8xd6a0



Transcript:
(00:00) ఒక కాలనీలో ఒక ఇంటి బయట ఒక క్యాబ్ పక్కన ఒక ముసలవాడు నిలబడి ఉంది. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉన్నాయి. ఆ క్యాబ్ డ్రైవర్ బయటికి రాగానే ఆమె పరిగెత్తుక వెళ్లి అతని కాళ్ళ మీద పడింది. బాబు నా కొడుకు ఏ దొంగతనం చేయలేదు బాబు ఆ రాత్రి నువ్వు వాడిని చూసావు కదా మెడికల్ షాప్ ఎక్కడఉంది అని వాడు మిమ్మల్ని అడిగాడంట కదా కానీ అదే సమయంలో తన ఓనర్ ఇంట్లో దొంగతనం జరిగితే నా కొడుకే చేశడని అంటున్నారు కానీ ఆ రోజు రాత్రి వాడు ఆ ఇంట్లో లేడు బాబు మీరు ఒక్క మాట కోర్టులో చెప్తే చాలు వాడు బయటికి వచ్చేస్తాడు అని బతిమలాడుతుంది. కానీ ఆ డ్రైవర్
(00:33) నిర్దాక్షణ్యంగా నాకు గుర్తు లేదు అన్నాడు. అలా అనొద్దు బాబు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు నువ్వు సాక్ష్యం చెప్పకపోతే నా కొడుకుకి శిక్ష పడుతుంది అని ఆల్మోస్ట్ కాళ్ళ మీద పడిపోతూ బతిమలాడుతుంది. ఆ డ్రైవర్ చిరాగ్గా నీ కొడుకుకి శిక్ష పడితే నాకేంటి ఊరేస్తే నాకేంటి పక్క జరుగు అని ఆమెను దాదాపు తోసినట్టు పక్కకు నెట్టి క్యాబ్ ఎక్కి వెళ్ళిపోయాడు.
(00:54) ఆ ముసలావిడ ఆ రోడ్డు మీదే కూలబడి గుండెలు బాదుకొని ఏడుస్తుంది. ఇప్పుడు ఆ క్యాబ్ మనిషిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది రాక్షసుడు అనిపిస్తున్నాడు కదా ఆ ముసలావిడ కాళ్ళ మీద పడి బతిమలాడుతుంటే ఒక్క మాట చెప్తే ఒక అమాయకుడికి శిక్ష తగ్గుతుందని తెలిసి కూడా ఆ ఒక్క మాట కూడా చెప్పలేనివాడు వీడు అసలు మనిషేనా అనిపిస్తుంది కదా అతని పేరు రాఘవ వయసు 50 కానీ మీకు నిజం చెప్పనా రెండేళ్ల క్రితం వరకు ఆ కాలనీలో ఎవరికి ఏ ఆపద వచ్చినా అర్ధరాత్రి అయినా వర్షం అయినా మొదట పరిగెత్తుక వచ్చేది ఈ రాఘవే ఆ కాలనీ అతన్ని ఆపద్ బాంధవుడు అని పిలిచేది మరి అలాంటి మనిషిలోని ఆ మనిషిని ఎవరు చంపారు?
(01:29) ఒక్క చుక్క జాలి కూడా మిగలకుండా ఇతని గుండెని రాయిగా మార్చింది ఎవరు? ఇది తెలియాలంటే ఆరు నెలలు వెనక్కి వెళ్ళాలి. రాఘవుకి ఒక పాత యంబులెన్స్ ఉండేది బ్యాంకు లోన్ పెట్టి కొన్నాడు భార్య ఒక కూతురు పెద్ద డబ్బు లేదు కానీ తినటానికి అన్నం ఉంది మొహంలో నవ్వు ఉంది మనసు నిండా మంచితనం ఉంది. ఎవరైనా అవసరానికి యంబులెన్స్ పిలిచి వాళ్ళ దగ్గర సరిపడా డబ్బు లేకపోతే తర్వాత ఇద్దురులే అనేవాడు కానీ ఒక రాత్రి భార్య అడిగింది అందరినీ ఉచితంగా తీసుకెళ్తే మన లోన్ వాయిదా ఎవరు కడతారు రాఘవు నవ్వాడు డబ్బు ఎలాగలాగా సంపాదించుకోవచ్చు ప్రాణం పోతే అది తిరిగి
(02:05) వస్తుందా ఆ ఒక్క మాటలో రాఘవు ఎలాంటి మనిషో తెలిసిపోతుంది. ఒకరోజు అర్ధరాత్రి దాటింది రాఘవ ఒక ట్రిప్ ముగించుకొని తిరిగి వస్తున్నాడు వాళ్ళ కాలనీలో ఒక వీధి మలుపులో ఎవరో ఒక మనిషిని కత్తితో పడిచి చీకట్లో పారిపోయాడు. రాఘవ యంబులెన్స్ ఆపి పరిగెత్తుక వెళ్ళాడు ఎవరైనా ఉన్నారా సహాయం చేయండి అని అరిచాడు రెండు మూడు ఏళ్లలో కిటికీలో నుంచి చూశారు గానీ తలుపులు మాత్రం ఎవరు తీయలేదు.
(02:28) ఆ మనిషి పొట్టలో కత్తి దిగుంది రక్తం పారుతుంది రాఘవ ఇంకా ఎవ్వరి కోసం ఎదురు చూడలేదు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ కత్తిని చేతితో లాగేసాడు పొడిచిన చోట ఆ గాయం చుట్టూ గుడ్డతో కట్టేసాడు. ఆ క్షణంలో అతని ఆలోచన ఒక్కటే ఈ మనిషిని ఎలాగైనా బతికించాలి కానీ ఆ ఒక్క క్షణమే అతని జీవితాన్ని బూడిది చేసింది. ఆంబులెన్స్ లో ఆ మనిషిని వేసుకొని ఆసుపత్రికి పరిగెత్తాడు కానీ గేటు దాటేసరికి ఆ మనిషి ప్రాణం పోయింది.
(02:51) ఇప్పుడు అసలు కథ మొదలైంది. ఆ చనిపోయిన వాడు ఎవరో తెలుసా రాఘవతో ఏడాది క్రితం డబ్బు విషయంలో గొడవ పడినవాడు. ఊరంతా చూస్తుండగా ఇద్దరు కొట్టుకున్నారు ఇప్పుడు చనిపోయిన అతని భార్య ఆసుపత్రికి వచ్చింది భర్త శవాన్ని చూసింది పక్కనే రాఘవని చూసింది పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. వీడికి నా భర్తకి పాత కక్ష ఉంది సార్ వీడే పొడిచి చంపాడు అనుమానం రాకూడదని కాపాడినట్టు నటిస్తున్నాడు అందుకే ఆసుపత్రి కూడా తీసుకొచ్చాడు.
(03:17) పోలీసులు కత్తి మీద వేలు ముద్రలు పరీక్షించారు అవి రాఘవ్వే రెండు బలమైన ఆధారాలు పాత కక్ష హత్య చేయడానికి ఉపయోగించిన ఆయుధం మీద అతను వేలు ముద్రలో ఒక ప్రాణం కాపాడాలని పరిగెత్తుక వెళ్ళిన మనిషి ఒక్క రాత్రిలో హంతకుడు అయ్యాడు జైలుకి వెళ్ళాడు కానీ ఒక్క ఆశ ఉంది ఆ రాత్రి రాఘవ ఎవరైనా సాయం చేయండి అని అరిచినప్పుడు ఆ వీధిలో ఒక్క మనిషి బయట లేడు కానీ మూడు ఇళ్లల్లో కిటికీలు తెరుచుకున్నాయి రాఘవ దూరం నుంచి పరిగెత్తుకుంటూ రావటం సాయం కోసం అరవటం కంగారుగా ఆ మనిషిని ఎత్తుకెళ్లి ఆంబులెన్స్ లో వేసుకో ోవటం ఆ ఇళ్లల్లో వాళ్ళందరూ చూశారు. వాళ్ళలో ఒక్కరు నేను
(03:50) చూశను అని చెప్తే చాలు రాఘవ నిర్దోషిగా బయటిక వస్తాడు. రాఘవ భార్య ఒక్కొక్క తలుపు తట్టింది అందరూ ఒకటే మాట మేమేమి చూడలేదమ్మ చూశారు అందరూ చూశారు ఆయన చూడలేదు అన్నారు మీకు అనిపిస్తుంది కదా చూసింది చూసినట్టు చెప్తే వాళ్ళకి ఏమి నష్టం అని ఒక్క మాట చెప్తే ఒక నిర్దోషి బయట పడతాడు కదా అని పైగా రాఘవ వల్ల వాళ్ళందరూ ఏదో రకంగా సాయం పొందిన వారే కానీ వాళ్ళ లెక్క వేరు ఎందుకు ఇలాంటి హత్య కేసుల్లో తల దూర్చి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవటం అని ఏం సంబంధం లేనట్టు ఉండిపోయారు.
(04:20) ఒక పెద్దాయన మాత్రం తలుపు దగ్గరే నిలబడి గొంతు తగ్గించి చెప్పాడు అమ్మ నేను చూశాను నిజమే మీ ఆయన ఆ మనిషిని కాపాడాలనే పరిగెత్తాడు అది నా కళ్ళతో చూశాను కానీ ఒక్క విషయం ఆలోచించు అసలు పొడిచిన వాడు ఇంకా బయటే ఉన్నాడు పోలీసులకు వాడు ఎవడో కూడా తెలియదు ఇప్పుడు నేను కోర్టుక వెళ్లి నేను ఆ రాత్రి అంతా చూశాను అని చెప్తే అసలు చంపినవాడు నేను వాడి మొహం చూశనని వాడు అనుకుంటాడు ఒక మనిషిని చంపడానికి వెనకాడినవాడు నన్ను వదులుతాడా నా మనవరాలు రోజు ఒక్కతే స్కూల్ కి వెళ్తుందమ్మా మీ ఆయన నిర్దోషి అని నాకు తెలుసు ఆ నిజం చెప్పకపోవడం పాపం అని కూడా తెలుసు ఆ పాపాన్ని మోసేది నేను కానీ
(04:54) మనవరాలకి ఏమైనా అయితే దాన్ని మోసేది కూడా నేనే అని తలుపు మూసేసాడు. వీళ్ళఎవ్వరూ చెడ్డవాళ్ళు కాదు అందరికీ రాఘవ నిర్దోషని తెలుసు అందరికీ తాము తప్పు చేస్తున్నామని కూడా తెలుసు కానీ ఒక్కరూ ముందుకు రాలేదు ఎందుకంటే నిజం చెప్పడానికి ధైర్యం కావాలి మనసులో జాలు ఉంటే సరిపోదు. జైలులో ఆరు నెలలు ఉన్నాక తర్వాత బెయిల్ మీద బయటిక వచ్చాడు రాఘవ కానీ బయటిక వచ్చిన మనిషికి బతకడానికి ఏమి మిగలలేదు.
(05:18) వాయిదాలు కట్టలేదు అని ఒక ఉదయం బ్యాంకు వాళ్ళ వచ్చి ఆంబులెన్స్లు లాకవెళ్ళిపోయారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడిన బండి అది కొత్త ఉద్యోగం కోసం వెళ్తే అంతకుడికి ఎవరు జాబ్ ఇస్తారు సార్ అన్నారు. చివరికి ఒక క్యాబ్ దొరికింది అది కూడా ఎవరో జాలిపడి ఇచ్చింది ఆ క్యాబ్ నడుపుకుంటూ కేస్ ఏమవుతుందో అనే టెన్షన్లో ఉండగా రాఘవ కూతురికి పెళ్లి సంబంధం కుదిరింది.
(05:38) అబ్బాయి వాళ్ళు ఇంటికి వచ్చారు ఎన్నో నెలల తర్వాత ఆ ఇంట్లో మొదటిసారి నవ్వులు మాటలు కుదిరాయి ముహూర్తాలు పెట్టుకుందాం అనుకుంటున్నారు. సరిగ్గా అప్పుడు అబ్బాయి వాళ్ళ నాన్నని వాళ్ళ బంధువు ఒకరు పక్కకు పిలిచి ఏదో చెవిలో చెప్పాడు. ఆ పెద్దాయన మొహం మారిపోయింది. మీ మీద హత్యకేస ఉందా అని రాఘవుని అడిగాడు రాఘవ గొంతు పెగలలేదు. సార్ నేను అది ఏ తప్పు చేయలేదు కాపాడాలని అని ఏదో చెప్పబోతుండగా తప్పు చేసిన వాళ్ళందరూ ఇలాగే మాకుేం తెలియదని చెప్తారు ఒక హంతకూడి కూతురిని కోడలుగా చేసుకునే స్థాయికి మేము దిగజారలేదు అని నానా మాటలని వెళ్ళిపోయారు. కూతురు తలలో ఆ పూలతోనే
(06:10) లోపలికి వెళ్లి తలుపేసుకుంది ఆ చీర కొంగుతోనే ఫ్యాన్ కి ఊరేసుకోబోయింది. రాఘవ తలుపులు బద్దలు కొట్టి కూతురు ప్రాణాలు కాపాడాడు కూతురు ఏడుస్తూ ఇన్నాళ్ళు అంతకుడు కూతురుని కాలేజీలో కామెంట్స్ చేశారు ఇప్పుడు అంతకుడి కూతురు అని పెళ్లి కూడా చేసుకోవట్లేదు అని ఏడుస్తుంది. రాఘవుకి ఏం చెప్పి ఓదార్చాలో అర్థం కాలేదు ఆ రాత్రి రాఘవు ఇంటి బయట ఒంటరిగా కూర్చున్నాడు నేను ఏం తప్పు చేశాను ఒక ప్రాణం కాపాడాలనుకున్నాను అదేనా నా నేరం ఆ రోజు గనుక కళ్ళు మూసుకొని వెళ్ళిపోయి ఉంటే ఈరోజు నా కూతురికి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా ఇన్నాళ్ళు నా నుంచి ఎన్నో
(06:41) సహాయాలు పొందిన వారు కూడా సాక్ష్యం చెప్పడానికి కూడా ముందుకు రావడం లేదు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈ లోకంలో మంచికి చోటు లేదు మంచివాడిగా బతకడమే అది పెద్ద తప్పు ఇకడి నుంచి నేను ఎవరికీ ఏమీ చేయను మనిషిలా కాదు రాయిలా బతుకుతాను. ఆ రాత్రి రాఘవ అనే మంచి మనిషి చనిపోయాడు అతని శరీరంలో నుంచి ఒక రాయి లేచి నిలబడింది.
(07:03) ఇక ఇప్పుడు ప్రస్తుతానికి వద్దాం ఈరోజు రాఘవ కేసు చివరి విచారణ న్యాయమూర్తి ముందు ఆధారాలు అన్నీ ఉన్నాయి వేలి ముద్రలు పాత కక్ష ఒక్క సాక్షి కూడా లేడు. శిక్ష కాయం లాయర్ కూడా తలదించుకున్నాడు న్యాయమూర్తి తీర్పు చెప్పబోతున్నారు సరిగ్గా అప్పుడు కోర్టు తలుపులు బార్లా తెరుచుకున్నాయి. ఒక మనిషి ఇంకో మనిషి కాలర పట్టుకొని లాక్కుంటూ లోపలికి వచ్చాడు ఆ కాలర్ పట్టుకొని లాక్కవచ్చే అతను ఒక లారీ డ్రైవర్ సార్ ఆగండి అసలంతకుడు వీడు ఆ రాఘవు గారు కాదు అని తన ఫోన్ ని న్యాయమూర్తి ముందు పెట్టాడు.
(07:35) ఆ మనిషి తాగిన మొత్తులో నేరం ఒప్పుకున్న రికార్డింగ్ అది పోలీసులు విచారించారు అతను నిజం ఒప్పుకున్నాడు రాఘవ నిర్దోషి అని నమ్మారు రాఘవ మోకాళ్ళ మీద కూలబడిపోయాడు రెండేళ్ల బాధ కన్నీళ్లుగా కారిపోతుంది. భార్యా కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి కౌగలించుకున్నారు. కాస్త తేరుకున్నాక రాఘవ ఆ లారీ డ్రైవర్ కాళ్ళ మీద పడ్డాడు. మీరు ఎవరు సార్ నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే నాకోసం ఇంత ఎందుకు చేశారు అని అడిగాడు.
(07:57) అప్పుడు ఆ లారీ డ్రైవర్ అతన్ని లేపాడు అతని కళ్ళల్లోనూ నీళ్ళు సార్ మీకు గుర్తులేదు కానీ నాకు ప్రతిక్షణం గుర్తుంది. ఏడాది క్రితం ఒక వర్షం రాత్రి నా చిన్న కూతురికి ఒళ్ళు కాలిపోయే జ్వరం నా చేతుల్లోనే స్పృహ తప్పుతోంది. మా ఊరి నుంచి ఏమి వాహనాలు లేక లారీలో తీసుకొని బయలుదేరాను. హైవే మీద నా లారీ చెడిపోయింది.
(08:17) ఎన్ని వాహనాలు వెళ్ళాయో సార్ చేతులెత్తి అరిచాను అందరూ చూశారు ఎవ్వరూ ఆగలేదు. ఆ చీకట్లో నా కూతురు చచ్చిపోతుంది అనుకున్నాను. మీరు ఒక్కరే ఆగారు సార్ మా అమ్మాయిని మీ ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకెళ్ళారు డాక్టర్ చెప్పాడు ఇంకొక అరగంట ఆలస్యం అయితే నా కూతురు నాకు దక్కేది కాదు అని అప్పుడు మీకు డబ్బు ఇవ్వబోయాను తీసుకోలేదు బిడ్డని జాగ్రత్తగా చూసుకో అని వెళ్ళిపోయారు ఆరోజు మా అమ్మాయి బతికింది సార్ ఇప్పుడు ఏడో తరగతి చదువుతుంది అని దండం పెడుతూ చెప్పాడు.
(08:40) రాఘవ అంతా మౌనంగా వింటున్నాడు డ్రైవర్ మళ్ళీ మాట్లాడుతూ ఆ హత్య చేసినవాడు మా ట్రాన్స్పోర్ట్ కంపెనీలోనే పని చేస్తున్నాడు సార్ నెల రోజుల క్రితం వాడు తాగిన ముత్తులో ఒకడిని పొడిసి పారేసానురా ఇంకొకడు నా బదులు జైలుకి వెళ్ళాడు అని గొప్పగా చెప్పుకున్నాడు సార్ అప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదు కానీ మొన్ననే పేపర్లో మీ ఫోటో చూశను గుండె ఆగినంత పనిఅయింది ఇతనేగా నా కూతురిని కాపాడినవాడు ఇతనికి శిక్ష పట్టడానికి వీలు లేదు అనుకున్నాను సార్ అందుకే వాడిని మళ్ళీ తాగించి మాట్లాడించాను ఫోన్లో రికార్డ్ చేసి తీసుకొచ్చాను సార్ అన్నాడు అతను రాఘవ
(09:10) చేతులు పట్టుకుంటూ ఆ రోజు మీరు నా కూతురిని తిరిగిచ్చారు సార్ ఈరోజు నేను మీ కూతురికి తండ్రిని తిరిగిస్తున్నాను. నాకు చాలా తృప్తిగా ఉంది సార్ అని చెప్పాడు. రాఘవుకి ఆ రాత్రి గుర్తులేదు అతని మొహం గుర్తులేదు ఆ చిన్న సాయాన్ని అతను ఎప్పుడో మర్చిపోయాడు. కానీ కాలం మర్చిపోలేదు. అప్పుడు లాయర్ రాఘవ దగ్గరికి వచ్చి అతని భుజం మీద చెయేసి రాఘవ మన పెద్దలు ఒక కథ చెప్తారు ఈరోజు నీకు చెప్పాలనిపిస్తుంది ఒకసారి శ్రీకృష్ణుడి వేలికి గాయమై రక్తం కారుతుందట అక్కడే ఉన్న ద్రౌపది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన కట్టుకున్న ఖరీదైన చీర కొంగు చించి ఆ
(09:41) వేలుకి కట్టు కట్టిందట అది ఎంత చిన్న పని ఒక గుడ్డ ముక్క ఆమె ఆ మరుక్షణమే మర్చిపోయింది కానీ కృష్ణుడు అన్నాడంట నీ రుణం నేను తీర్చుకుంటాను అని ఏళ్లుు గడిచాయి ఆ చిన్న సంఘటన ఎవరికీ గుర్తులేదు ఒకరోజు నిండు సభలో ద్రౌపదికి ఘోరమైన అవమానం ఆమె మానం పోతున్న క్షణం ఆ సభలో ఎవరున్నారో తెలుసా భీష్ముడు ద్రోణాచార్యుడు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు ఆమె ఐదుగురు భర్తలు ఉన్నారు అందరూ చూస్తున్నారు కానీ ఒక్కరు లేవలేదు ఆమె ఒక్కొక్కరిని కళ్ళల్లోకి చూసి అడిగింది ఒక్కరు ముందుకు రాలేదు అందరూ తలలు దించుకున్నారు సరిగ్గా అప్పుడు ఆమె ఏనాడో ఇచ్చిన ఒక గుడ్డ ముక్క అంతులేని
(10:18) వస్త్రాలుగా మారి ఆమె మానాన్ని కాపాడింది చూసావా ఆమె ఇచ్చింది ఒక గుడ్డ ముక్క ఆమెకు అది గుర్తు కూడా లేదు కానీ కాలం మర్చిపోలేదు నువ్వు ఆ వర్షం రాత్రి ఒక అపరిచితుడు బిడ్డని కాపాడావు నీకు అది గుర్తులేదు కానీ ఈరోజు అదే మంచి నీ బిడ్డకి తండ్రిని తిరిగిచ్చింది నువ్వు మంచికి చోటు లేదు అనుకున్నావ్ కానీ ఈరోజు నిన్ను కాపాడింది ఎవరు నీ డబ్బు కాదు నేను కాదు ఆఖరికి కోర్టు కూడా కాదు నువ్వు ఎప్పుడో చేసిన ఒక చిన్న మంచి అది నిన్ను కాపాడింది.
(10:46) రాఘవ కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు రెండేళ్ల కసి ఆ ఒక్క క్షణంలో కరిగిపోయింది. సరిగ్గా అప్పుడు కోర్టు వరండాలో ఇంకొక అలజడి చెలరేగింది. పోలీసులు ఒక కుర్రాన్ని హ్యాండ్ కప్స్ తో లోపలికి తీసుకెళ్తున్నారు వెనక ఒక ముసలావిడ ఆ ముసలావిడ ఎవరో రాఘవుకి తెలుసు సాక్ష్యం చెప్పి తన కొడుకుని కాపాడమని తన కాళ్ళ మీద పడి వేడుకున్న ఆ ముసలావిడ ఆమె ఏడుస్తూ వెళ్తుంది ఆ కుర్రాడి మొహంలో రెండేళ్ల క్రితం తన మొహం కనిపించింది ఆ తల్లి కళ్ళల్లో తన భార్య కూతురి కళ్ళు కనిపించాయి ఆ సంకెళ్ళలో తన చేతులు కనిపించాయి ఆగండి అంటూ రాఘవు పరిగెత్తుక వెళ్ళాడు సార్ నేను సాక్ష్యం చెప్తాను ఆ
(11:19) రోజు రాత్రి 1220 కి ఈ కుర్రాడు నా క్యాబ్ దగ్గరికి వచ్చాడు మెడి మెడికల్ షాప్ ఎక్కడ సార్ అని అడిగాడు నేనే అతన్ని మెడికల్ షాప్ దగ్గర డ్రాప్ చేశాను నా కళ్ళతో నేను చూశాను అతనే ఇతను దొంగతనం జరిగిన సమయంలో అతను నా దగ్గరే ఉన్నాడు. ఆ ముసలఆమె రాఘవ కాళ్ళ మీద పడబోయింది రాఘవ ఆమెను పొట్టుకొని లేపాడు వద్దమ్మ నా కాళ్ళ మీద పడకు నిన్ను తోసేసి పాపం చేశాను ఇప్పటివరకు నా మంచితనమే నా బతుకుని బూడిది చేసింది అనుకున్నాను కానీ ఈరోజు తెలిసింది నా మంచితనం నన్ను ముంచలేదు ఈరోజు తేల్చింది కూడా అదే అని ఆ రోజు నేను ఎన్ని తలుపులు తట్టానో తెలుసా ఒక్కటి
(11:52) తెలుచుకోలేదు ఆ బాధ నాకు తెలుసు ఇంకో తల్లికి ఆ బాధ నేను ఉండనివ్వను అని ఎమోషనల్ గా అన్నాడు కథ ఎక్కడితో అయిపోయింది ఇప్పుడు మనం కాసేపు మాట్లాడుకుందాం మీ లైఫ్ లో ఎప్పుడైనా ఇలా అనిపించిందా నేను ఎవరికీ అన్యాయం చేయలేదు నా వల్ల ఎవరికీ నష్టం జరగలేదు అందరికీ హెల్ప్ చేస్తూనే వచ్చాను మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు పక్కవాడు అడ్డదారిలో వెళ్తూ హాయిగా ఉన్నాడు నేను నీతిగా ఉండి ఏడుస్తున్నాను ఆ దేవుడికి కళ్ళు లేవా అని అనిపించే ఉంటుంది.
(12:17) ఎందుకంటే ఇది మనిషి సహజ లక్షణం మనం చేసే మంచికి రిటర్న్ మనకి ఇన్స్టెంట్ గా కావాలనిపిస్తుంది. ఈరోజు మనం ఒకరికి సహాయం చేస్తే రేపు అవసరమైనప్పుడు మనకు సహాయం అందాలి. అలా జరగకపోతే మంచితనం వేస్ట్ ఈ లోకంలో మంచోడిగా ఉండటం మూర్ఖత్వం అనుకుంటాం. ఇక్కడే మనం ఒక పెద్ద నిజాన్ని మిస్ అవుతున్నాం అదే కర్మ సిద్ధాంతం అర్థం చేసుకోవడం చాలా సింపుల్ నువ్వు ఏది ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది కానీ ఎప్పుడు తిరిగి వస్తుందో డిసైడ్ చేసేది మనం కాదు ఇక్కడ మనం ఏం చేస్తున్నామో ప్రతిదీ కాలమో దేవుడో లెక్క కడుతూనే ఉంటారు మంచియినా సరే చెడైనా సరే ప్రతి పని ప్రతి మాట ప్రతి కన్నీటి చొక్క అన్ని ఒక
(12:50) అకౌంట్లో రికార్డు అవుతాయి ఆ లెక్క ఎప్పుడూ తప్పు కాదు కానీ దాని ఫలితం ఎప్పుడు ఇవ్వాలో డిసైడ్ చేసేది మనం కాదు మనం కోరుకున్నప్పుడు కాదు మనకు అవసరమైనప్పుడు తప్పకుండా వస్తుంది రాఘవ ఆ వర్షం రాత్రి ఒక చిన్న పాపని కాపాడాడు దానికి రిటర్న్ మనసటి రోజు రాలేదు అతను అడగను లేదు ఆరు నెలలు జైలు అనుభవించాక ఆంబులెన్స్ పోయాక కూతురు పెళ్లి ఆగిపోయాక మంచితనం వేస్ట్ అని అతను గివ్ అప్ చేశక అప్పుడు వచ్చింది కానీ వచ్చింది సరిగ్గా అతని లైఫ్ ఆగిపోయే క్షణంలో వచ్చింది ఒక్క రోజు లేట్ అయి ఉంటే రాగ ఒక శిక్ష పడిపోయేది. ఇక్కడ ఒక అద్భుతమైన ఇంగ్లీష్
(13:21) లైన్ ఉంది కర్మ హస్ నో మెన్యూ యు గెట్ సర్వడ్ వాట్ యు డిసర్వ్ అంటే కర్మ దగ్గర మెనుూ కార్డు ఉండదు హోటల్లో లాగా నాకు ఇది కావాలి ఇప్పుడే కావాలి అని ఆర్డర్ చేయలేం మన అర్హతను బట్టి అది మన ప్లేట్లోకి వస్తుంది వడ్డిస్తుంది మనకు కావాల్సినప్పుడు కాదు అది రావాల్సినప్పుడు వస్తుంది. ఇప్పుడు అసలు విషయం కర్మ మంచికి మాత్రమే అప్లై అవుతుందా కాదు ఇది రెండు వైపుల పదునున్న కత్తి మన చుట్టూ కొందరు ఉంటారు ఇతరుల కడుపు కొట్టి బాగుపెడతారు అమాయకులని మోసం చేసి కోట్లు కూడబెడతారు ఎవరి కన్నీళ్ళను పట్టించుకోరు పైగా ఏ లోటు లేకుండా హాయిగా గర్వంగా బతుకుతారు. అలాంటి
(13:54) వాళ్ళని చూసినప్పుడు మనక ఒకటే ప్రశ్న వీళ్ళు ఎంత చేస్తున్నా ఎందుకు హాయిగా ఉన్నారు ఆ దేవుడు నిజంగా చూస్తున్నాడా చూస్తున్నాడు లెక్క కూడా రాస్తున్నాడు కాకపోతే ఆయనకు తొందర లేదు పెద్దవాళ్ళు చెప్తారు హి సీస్ ఎవ్రీథింగ్ బట్ హి వెయిట్స్ అంతా చూస్తాడు సరైన టైం కోసం ఎదురు చూస్తాడు. చట్టం నుంచి తప్పించుకోవచ్చు మనుషుల నుంచి తప్పించుకోవచ్చు సిసిటీవీ కెమెరాల నుంచి కూడా తప్పించుకోవచ్చు కానీ కాలం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు.
(14:18) ఆ దెబ్బ ఎప్పుడు పడుతుందో ఎవ్వరికీ తెలియదు కానీ పడుతుంది అది కూడా వాళ్ళు దాన్ని పూర్తిగా మర్చిపోయిన రోజున వాళ్ళు నేను గెలిచాను అని అనుకుంటున్న రోజున వాళ్ళక అన్నిటికంటే ఎక్కువ నొప్పి పెట్టే చోట నొప్పి పుట్టే చోట తగులుతుంది. అందుకే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఎవరికీ చెడు చేయకపోవడం కూడా ఒక మంచి పనే ఎందుకంటే మన వల్ల ఈరోజు ఒకరు కార్చిన కన్నీరు మనం మర్చిపోయినా ఆ కన్నీళ్లు మన ఇంటి తలుపు తట్టే రోజు వస్తుంది.
(14:44) ఇంకో విషయం గమనించారా రాఘవుని ఆ కష్టంలో ఆదుకోవడానికి ఒక్కరు రాలేదు వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు కాదు వాళ్ళకి నిజం తెలుసు అయినా ఒక్కరు ముందుకు రాలేదు దీనికి సైకాలజీలో ఒక పేరు ఉంది ద బై స్టాండర్డ్ ఎఫెక్ట్ ప్రేక్షక ప్రభావం అంటే ఏంటి ఒక ప్రమాదం జరిగినప్పుడు చుట్టూ ఎంతమంది ఎక్కువ ఉంటే హెల్ప్ చేసేవాళ్ళు అంత తక్కువ ఉంటారు వినటానికి విచిత్రంగా ఉంది కదా జనం ఎక్కువ ఉంటే సాయం ఎక్కువ రావాలి కదా కానీ రివర్స్ లో జరుగుతుంది ఎందుకు ఎందుకంటే ప్రతిఒక్కరు ఒకటే అనుకుంటారు ఇంతమంది ఉన్నారు కదా ఎవరో ఒకరు చేస్తారులే నేనెందుకు అందరూ ఇలాగే అనుకుంటారు ఎవరు ఏమి ఏమీ చేయరు. ఇది రోజు
(15:13) మనం చూస్తున్నదే రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగితే 20 మంది చుట్టూ గుమి కొడతారు 20 ఫోన్లు బయటిక వస్తాయి వీడియోలు రీల్స్ అవుతాయి స్టేటస్లు అవుతాయి కానీ ఆ మనిషిని ఎత్తుకొని ఆసుపత్రికి తీసుకెళ్ళే వాళ్ళు ఎవరో ఒక్కరు ఉంటే ఉంటారు రాఘవ లాంటి వాళ్ళు రాఘవ విషయంలో జరిగింది సరిగ్గా అదే ఆ మూడు కిటికీలు వెనక ముగ్గురు ఉన్నారు ప్రతి ఒక్కరు అనుకున్నారు మిగతా ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్తారులే అందరూ అలాగే అనుకున్నారు ఒక నిర్దోషి జైలుకి వెళ్ళాడు ఇక్కడ ఇంకో నిజం ఉంది చాలా ఇబ్బందికరమైన నిజం నిజం చెప్పడం ఫ్రీ కాదు దానికి ఖర్చు అవుతుంది టైం
(15:42) ఖర్చువుతుంది ధైర్యం ఖర్చువుతుంది కొన్నిసార్లు రిస్క్ కూడా తీసుకోవాలి అందుకే చాలామంది ఒకటే లెక్క వేస్తారు నేను నోరు తెరిస్తే నాకేం లాభం పైగా నష్టం ఆ లెక్క కరెక్ట్ కావచ్చు కానీ ఆ లెక్కలో ఒక విషయం మిస్ అవుతాం రేపు ఆ ప్లేస్ లో మనం కూడా ఉండే అవకాశం ఉంది అనే విషయం ఈరోజు మనం తప్పుకుంటే రేపు మనం అన్యాయానికి గురైనప్పుడు మనకోసం ముందుకు వచ్చే వాళ్ళు కూడా సరిగ్గా అలాగే తప్పుకుంటారు మనం ఏ తలుపు తెరవలేదో రేపు మనకు కూడా ఏ తలుపు తెరుచుకోదు అదే కర్మ చివరిగా ఒక మాట మీరు చేసిన మంచికి ఫలితం రాలేదు అనిపిస్తుందా మంచితనం అనవసరం అని మీరు రాఘవలా
(16:14) అనుకుంటున్నారా ఆగండి మీ విత్తనాలు ఇంకా భూమిలోనే ఉన్నాయి మొలవటానికి కొంచెం సమయం పడుతుంది. మనం మంచిని వదిలేయకూడదు మనం వదిలేసిన మరక్షణం మన విత్తనాలన్నీ ఎండిపోతాయి. ఇంకో గొప్ప మాట డు గుడ్ అండ్ డోంట్ లుక్ బ్యాక్ ద వరల్డ్ కీప్స్ ఏ రికార్డ్ ఆఫ్ ఇట్ అంటే మంచి చెయ్యి వెనక్కి తిరిగి చూడకు నువ్వు ఈ లోకానికి ఏమ ఇస్తావో ఈ లోకం లెక్కలో రాసుకుంటుంది మనం మర్చిపోవచ్చు కానీ ఆ లెక్క చెరిగిపోదు.
(16:39) మీరు చేసిన ఒక మంచి ఊహించన రూపంలో తిరిగివచ్చిన సందర్భం ఉంటే కింద కామెంట్స్ లో రాయండి మంచితనం వేస్ట్ అని నిరాశలో ఉన్న మీ స్నేహితుడికి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక పవర్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం మంచి చేయండి లెక్క అడక్కండి ఉంటాను జై హింద్ జై శ్రీరామ్.

No comments:

Post a Comment