Monday, October 26, 2026

కుండలిని యోగ రహస్యాలు & చక్ర ధ్యానం | Kundalini Secrets | 108 years Baba With Ravi Sastry

కుండలిని యోగ రహస్యాలు & చక్ర ధ్యానం | Kundalini Secrets | 108 years Baba With Ravi Sastry

Author Name:Sree Souravi Tv

Youtube Channel Url:https://www.youtube.com/@sreesouravitv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qJlxHqj9Wu0





Title: కుండలిని యోగ రహస్యాలు & చక్ర ధ్యానం | Kundalini Secrets | 108 years Baba With Ravi Sastry

Author Name: Sree Souravi Tv

Description: కుండలిని యోగ సాధన వెనుక ఉన్న అసలైన అంతరార్థం, చక్రాల సాధన క్రమం మరియు ఆధ్యాత్మిక ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్వామీజీ అందించిన విశేష వివరణ ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో వీక్షించండి.

00:00 - పరిచయం (Introduction)
04:15 - కుండలిని యోగం అంటే ఏమిటి?
11:30 - షట్చక్రాల సాధన మరియు శక్తి ప్రవాహం
20:45 - నిత్య జీవితంలో కుండలిని యోగ సాధన పద్ధతులు
32:10 - సాధన సమయంలో కలిగే అనుభవాలు & శారీరక మార్పులు
43:25 - సాధకులు పాటించవలసిన నియమాలు & గురు కృప
52:10 - ముగింపు & సందేశం (Conclusion)

#KundaliniYoga #KundaliniSadhana #SpiritualWisdom #TeluguBhakthi #SreeSouraviTV #ChakraMeditation #KundaliniAwakening


, #Srisouravitv,#Souravitv,#Souravi , #srisatya #marellaravisastry #lordvinayaka #ayurvedic #sreeniravitv #ravisastry #astrology #niravitv #shreeniravitv #shreeniravi #niravitvastro #ravisastry
#SreeNiraviTV #SreeSouraviTV #KriyaYoga #TeluguSpiritual #SriSouraviTV
#TeluguSpiritual #SanatanaDharma #BhagavadGita #Meditation #Pranayama
#Breathwork #Soham #Kundalini #Chakras #Yoga #Spirituality #TeluguPodcast




Marella Ravi Sastry on Sree Souravi TV

Marella Ravi Sastry, an M.A. in Astrology, spiritual seeker, and preacher, brings unique insights to Sree Niravi TV through "Spiritual Interviews." His show is a captivating journey exploring wisdom from reclusive spiritual gurus who practice in peaceful seclusion, sharing their teachings with a broader audience. Known for his deep knowledge of ancient philosophy and astrology, Sastry also runs Sri Swara Gayatri Jyothishalayam in Hyderabad, offering practical guidance on life challenges. His engaging content appeals to those seeking spiritual and personal growth through astrological and philosophical insights.


Follow us on Instagram: /sreesouravitv
Like us on Facebook:https://www.facebook.com/profile.php?...
Like us on Facebook : / ravisastry.mca
website : http://ssgastrology.com
https://sreeniravimedia.com
contact/8639579629

Follow us on Instagram:   / sree_niravitv  
Like us on Facebook:https://www.facebook.com/profile.php?...
Like us on Facebook :   / ravisastry.mca  
sree niravi tv,sreeniravitv,sree niravitv,sree,sri
🙏 Subscribe to Sree Souravi TV (@sreesouravi tv ) for more life-changing spiritual content.
🔔 Don’t forget to like, comment, and share to inspire others!

📢 Follow us on Social Media:
Instagram | Twitter | Facebook - @sreeniravitv


niravi tv, souravi tv, sree souravi tv
devidas guruji peddapuram, dr sri satya, marella ravi sastry, neem karoli baba
kriya yoga, pranayama yoga, 1176 angel number, panchadasi mantra, dhyanam

Transcript:
(00:13) ఈ కుండల్ని యోగం అంటే ఏమిటి ఇది ప్రతి మనిషికి ఉంటుందా? ప్రతి జీవిలో కూడా అంతర్గత శక్తి ఒకటి ఉంటుంది. ఆత్మ వేరు అంతర్గత శక్తి వేరు. [సంగీతం] దేహ శక్తి ఆత్మశక్తి కుండలని శక్తిలు ఈ మూడు కలిస్తే ఏమవుతుంది శివుడు ఉన్నాడు అంటే శక్తి ఉంది. ఆ శక్తి స్వరూపిని రూపమే కుండలిని అనబడే కింద ఉన్నాయి.
(00:40) సో ఈ పరమాత్మతో ఇది ఐక్యము అంటే [సంగీతం] సంపూర్ణ కుండలినిగా మళ్ళీ సర్ప రూపాన్ని చూస్తాం. అయ్యను అమ్మను కలపాలంటే మధ్యలో ఈ సుబ్రహ్మణ్యుడు ఉండి తీరాల ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ సౌరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఇప్పుడు మరొక్కసారి సంత సదానందగిరి మహారాజ్ వారు హిమాలయ యోగి రుద్ర ప్రయోగవాసి వారితో సజ్జన సాంగత్యం చేసే మహాభాగ్యం మరొక్కసారి మనకు కలిగింది.
(01:16) ఇప్పటిక అనేక ఎపిసోడ్లు మనం చేసినప్పటికిని కుండల్ని యోగం మీద కుండల్ని రహస్యాల మీద ప్రత్యేకించి ఎప్పుడూ చేయలేదు. వారు స్వయానా కుండల్ని యోగి హిమాలయ సాధన చేసినటువంటి అనుభవం కలిగినటువంటి 110 సంవత్సరాల పైనున్నటువంటి బాబాజీ కాబట్టి వారిని అడిగి ఈ కుండల్ని రహస్యాల యొక్క విశేషాలని ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం నమస్కారం బాబాగారు హరి ఓం బాబాగారు కుండలిని అనేది అందరూ కూడా మనకి ప్రస్తావిస్తూ ఉంటారు కుండల్ని యోగం అని అంటూ ఉంటారు.
(01:54) ఈ కుండల్ని యోగం అంటే ఏమిటి ఇది ప్రతి మనిషికి ఉంటుందా అంటే ప్రతి మనిషిలో ఆ కుండల్ని శక్తి ఉంటుందా శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గం గణపతయే నమః యా కుందేందు తుషారహార దవళ యా శుభ్ర వస్త్రాన్వితావ వీణ యావీణావరదండ మండితకర యా శ్వేత పద్మాసనాం యా బ్రహ్మచుత శంకర ప్రవృత్తి దేవై సదా పూజితః సామాంపాతు సరస్వతీ భగవతి నిశేష జాజ్యాపః ఐయం సరస్వత్యే నమః వసుదేవ సుతం దేవం కంస చానూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ గురుభ్యో నమః మా
(02:41) గురువుగారైనటువంటి మహంతి హిమాలయగిరిజి వారి పాదపద్మములను మనసులో స్మరించుకొని సౌరవి వీక్షక ప్రేక్షక మహాశయులందరి అందరికీ దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ కుండలిని ప్రతి ఒక్కరి నోట ఈ పేరైతే సులభంగా తెలుస్తుంది కానీ కుండలిని అన్న పేరు ఎందుకు వచ్చింది అర్థాలు ఏంటి ఎక్కడ ఉంటుంది ఎట్లా దాన్ని ప్రచోదయం చేయాలా పాతకాలంలో కడవలు అటు ఇటు దొల్లిపోకుండా ఉండేదానికి కింద కుదురు అని పెడతారు అది బట్టను చుట్ట చుట్టి పెడతారు.
(03:25) అట్లా చుట్ట చుట్టబడి పెట్టిన దాన్ని కుండలినేని సంస్కృతంలో అంటారు. ప్రధానంగా ఆ పేరు అక్కడి నుంచి వచ్చింది. ప్రతి జీవిలో కూడా అంతర్గత శక్తి ఒకటి ఉంటుంది. ఆత్మ వేరు అంతర్గత శక్తి వేరు దేహము అనేది ప్రకృతి ఇస్తే దాని లోపలికి ఆ ప్రకృతి మాత యొక్క సంపూర్ణ శక్తి అమ్మవారి శక్తి ఒక రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. మానవుడు తన దేహ బలాన్ని వాడుకుంటున్నాడే కానీ ఆ అంతర్గత శక్తిని వాడుకోవడం కాదు ఆ అంతర శక్తిని వాడుకోనేదానికి ఉపయోగపడేదే కుండలిని మహాయోగము అని అంటారు.
(04:08) అందుకే దాన్ని సర్పంతో పోలుస్తారు. అందున మూడున్నర చుట్లు చుట్టుకొని ఉంటుంది అని అంటారు. ఒక మానవుడు అనేక జన్మలు ఎత్తి మానవ జన్మకు వస్తున్నాడు అని అంటారే ఈమూడున్నర చుట్ల అర్థం అది మొదటి చుట్టూ ఖనిజాలు శిలలు అనబడేటువంటి చైతన్యము అత్యల్ప మాత్రలో ఉన్నటువంటి స్థితిలో ఉన్న జన్మలు వాటిని దాటుకొని కాస్త చైతన్యము పెరిగిన స్థితి పాదపాలు అని చెప్పబడే చెట్లు వృక్షాలు వృక్షము అన్న పేరు లోనే వృద్ధి క్షయము ఉంది జాగ్రత్త అని చెప్పబడతా ఉంది.
(04:50) ఆ చెట్లు పెరుగుతున్నాయి చస్తున్నాయి పక్క చెట్లతో మాట్లాడుతాంది అని కూడా జగదీష్ చంద్రబోస్ అనే ఒక సైంటిస్ట్ ప్రయోగం చేసి నిరూపించాడు మన భారతీయ శాస్త్రవేత్త దాంట్లో చైతన్యం ఇంకొంచెం అధిక స్థాయిలో ఉంది. దాన్ని కూడా తాటి ఇంకా మంచి చైతన్య స్థితి చలనం కూడా కలిగిన జంతువులు చతుష్పాతం అవి తిరుగుతాయి ఆహార సమూపార్ధన ఎట్లా అన్న జ్ఞానం ఉంది ఎక్కడ భద్రంగా పడుకోవాలా ఎక్కడ సంతానం కనాలా వాటిని చూడాలా ఇవన్నీ తెలుసుకోగలిగిన జ్ఞానం ఇంకో లెవెల్ కు పెరిగింది.
(05:27) ఇంకా హై లెవెల్ కు వచ్చినప్పుడు మా నవుడు తయారయ్యాడు. మనవు నుంచి వచ్చాడు కాబట్టి మానవులు అని పిలుస్తున్నారు. ఈ మానవుడు పూర్ణ మానవుడై మాధవుడుగా మారలేడు. దానవుడిగా పోయేదానికి ఈ లోకంలో అనేక ఛాన్సెస్ ఉన్నాయి అతనికి మాధవుడిగా అయ్యే ఛాన్సెస్ తక్కువ ఒక సద్గురువును ఆశ్రయించి ఈ సాధారణ మానవుడు మాధవుడు అయ్యే నాలుగవ స్టేజికి పోయేదానికి మూడవ స్టేజికి మధ్యలో ఉన్నాడు కాబట్టి దాన్ని మూడున్నర చుట్లు అన్నారు.
(06:03) ఇంత లోతైన అర్థంతో పెట్టారు. మన దేహంలో ఉన్నటువంటి షచక్రాలలో మూలాధారము గణపతికి గ్రహాల పరంగా చూస్తే శని దేవుడికి అది మూలస్థానం పార్వతమ్మ తన ఇష్టంగా తయారు చేసుకున్న కొడుకు గణపతి పసుపు ముద్దతో చేసింది అన్న కథ అందరికీ తెలుసు తో ఆ తల్లి పార్వతి ఆ కొడుకు దగ్గరే ఉంటుంది. సదాశివుడు అనబడేటువంటి ఆ పరబ్రహ్మ తత్వం సహస్రారంలో కొలువై ఉండు.
(06:40) ఆ శివుణని ఈ అమ్మోరుని కలపడం సుబ్రహ్మణ్య తత్వం అందుకే మధ్యలో ఆరు చక్రాలు ఉంటాయి. మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు ఆరు చక్రాలు ఇది రహస్యం అంటే శివ పరివారం అంతా మానవుడి దేహంలోనే గుప్త రూపంలో ఉంది ఆ గుప్త రూపంలో ఉన్నటువంటి ఈ తల్లి పార్వతీ శక్తిని మేలుకొలిపేదానికి చేసే సాధన కుండలిని సాధన అని చెప్పబడతాం. ఈ కుండలిని సాధన వేదంలో చెప్పబడిన విధానం ఒకటైతే అనేకమంది ఋషి ముని ద్రష్టలు వాళ్ళ ప్రయత్నంతో వాళ్ళు ప్రయత్నం చేసి ఇంకో కొన్ని దారులు కూడా కనిపెట్టారు. ఏది
(07:26) కనిపెట్టినా వీటన్నిటిలోకి వాడాల్సింది ఇడా పింగళ సుషుమన అనే ప్రధాన నాడు మీరు నాడీ శోధన శాస్త్రంలో రాస్తు మీ శ్వాస శాస్త్రంలో రాశారు కదా ఇన్ని వేల నాడులని కొన్ని వందల నాడుల పేర్లు రాసి వాటి వాటి ఉపయోగాలు రాశారు వాటిలో ఎన్ని ముఖ్యం వాటిలో ఎన్ని ముఖ్యం అని తగ్గించుకొని ఆఖరికి ఈ మూడు నాడుల దగ్గర మీరు ఆగారు.
(07:54) ఇడా పింగల సుషుమన సూర్య చంద్ర అగ్ని నాడులు అనబడే వీటిని వాడే ఆ కుండలిని ప్రచోదయం చేసే విధానాలు ఉంటాయి. ఇప్పుడు ఎడమ శ్వాస కుడి శ్వాసలతో తీసుకునేది మానవుడి సహజ శ్వాస స్థితి ఇంకొంచెం సాధకుడైనవాడు ఈ ఎడమ ముక్కు కుడి ముక్కు రంద్రాలను ఒక నియమబద్ధ రూపంలో చేసుకుంటూ పోయినప్పుడు కుంభించే స్టేటికి వస్తాడు. కుంభకం నేర్చుకున్నాక అంతర్కుంబకము బాహ్య కుంభకము కేవల కుంభక స్థితికి పోతాడు.
(08:29) ఆ కేవల కుంభ స్థితికి పోయేటప్పుడు ఈ సాధనలు ఒకదారి ఉంటే ఆసనాలలో మూలబంధము ఉద్యాన బంధము జాలందర బంధము అనే మూడు రకాల బంధాలు త్రిబంధనాలు త్రిబంధనాలు వాటిని వేయటం ద్వారా పీల్చుకున్న గాలిని కుంభించాం అది మళ్ళీ బయటికి వెళ్ళకుండా ఈ బంధాలు వేసేసాం ఇప్పుడు ఆ గాలి సహజ సిద్ధంగా పోవాల్సినటువంటి కుజా పింగళాలలో పోలే లేక ఆ సాధకుడి అదృష్టము గురువు ఇచ్చిన ఉపదేశ లక్షణాన్ని పట్టి ఏదో ఒక దినం ఒకే దినం కాదు ఏదో ఒక దినం ఇడా పింగళంలో కాకుండా మధ్యలో ఉన్న ఈ సుషుమనలో ప్రవేశం చేసింది.
(09:14) ఈ సుషుమన ఎక్కడ ఉంటుంది సైంటిస్టుల ప్రకారం చూస్తే మెదుడు మెడుల్ల ఆమ్లగేట మెడుల్ల ఆమ్లగేట నుంచి ఒక తీగ మన 33 వెన్నుపూసలలోకి దిగుతుంది. వెన్నుపూస అంతంకి ఈ మైండ్ యొక్క మొత్తం పవర్ డ్రాప్స్ దిగి అక్కడ ఉంటుంది. అది అక్కడ ఈ డ్రాప్స్ ని తిరిగి పైకి తీసుకొని రావడం బ్రెయిన్ ఫ్లూయిడ్ బ్యాక్ బౌండ్ ఫ్లూయిడ్ అనే రెండు పేర్లు చెప్తారు ఇంగ్లీష్ వాడు ఆ ఫ్లూయిడ్స్ ను ఏకీకరణ చేయటం అది జరిగినప్పుడు మానవుడు ఒక నిశ్చల స్థితికి వస్తాడు ఆత్మతత్వం అంటే ఏంటి పరద్వమ్మ తత్వం అనేది ఏది అనేది రెండు కూడా వానికి అవగతం అయితాయి.
(10:00) బయటికి ఇప్పుడు చెప్పినంత ఇది సులభ వ్యవస్థ కాదు ఏండ్ల ఏండ్ల సాధన చేసి ముందు ప్రాణాయామం అభ్యాసం చేయాల కుంభకం అభ్యాసం చేయాలా బాహ్య కుంభకము కేవల కుంభక స్థాయికి వెళ్ళాలా మూడు బంధాలు వేయడం నేర్చుకోవాలా వేసిన బంధాలను విడుదల చేసే పద్ధతిలో అనులోమ విలోమ క్రమాలు ఉంటాయి. వేసేటప్పుడు మూలబంధం వేస్తాం మళ్ల ఉడియాన బంధము మళ్ల జాలందర బంధము వేస్తాం వదిలేటప్పుడు జాలందర బంధం ముందు ఉద్యాన బంధం తర్వాత మూలబంధం తర్వాత ఎంతటి సాధకుడైనా మూలబంధం వేస్తాడు తర్వాత బంధం వేసేసరికి మూలబంధం విడిపోతుంది.
(10:47) తో ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒక సరిైన గురువు సరిైన అవగాహనతో చేస్తూ పోయినప్పుడు ఈ మూడు బంధాలను వేయడము తీయడము అనే క్రియ అతనికి అలవాటు అయితే ఆ కుండలిని సాక్షాత్కారం తొందరగా కలుగుతుంది. ఇది టూగా మీరు అడిగిన కుండలి వ్యవహారం అయితే మనకి కుండల్ని సాధన చేస్తున్న వ్యక్తికి కుండల్ని మేలుకున్న తర్వాత అతని జీవితంలోనూ వ్యక్తిగతంగాను వచ్చేటటువంటి మార్పులు ఏంటి శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగాను జాతకపరంగా ఈ శని [గురకలు] మీరు అంటారు ఏలనాటి శని అర్ధ శని అది అని ఏదైతే లెక్కలు చెప్తారు ఉన్నాయి కదా అదే 12 ఏళ్ల శని ఆరేళ్ల శని మూడేళ్ల శని
(11:31) ఏడున్నర సంవత్సరము అద్దాష్టమ శని అష్టమ శని అదేదో అంటారు కదా ఆ సో మొట్టమొదట సాధకుడికి ఒకవేళ కుండలిని సిద్ధిస్తే ఆ శని అవరోధాలు తొలుగుతాయి. [గొంతు సవరించుకోవడం] ఆరోగ్యం బ్రహ్మాండంగా తయారవుతుంది. జీర్ణ శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత స్థితి అయినటువంటి స్వాధిష్టానానికి ఆ ప్రయాణాన్ని చేయగలిగి కుండలిని శక్తిని స్వాధిష్టానంలో నిలిపి మళ్ళీ వెనక్కు పంపగలిగిన సాధన చేసినప్పుడు మీ మూత్ర విసర్జన మల విసర్జన వ్యవహారాలు సక్రమంగా జరిగిపోతాయి.
(12:10) తిన్న ఆహారము 99% కంప్లీట్ గా శక్తిగా మారి శరీరానికి అందుతుంది. ఈ ఉపయోగాలు బాహ్యాన అంతర్గతంగా మన దేహం పంచభూతాత్మకంగా తయారయింది. జలస్థానం ఎంత ఉండాలి ఎక్కడ జలస్థాన ప్రయాణాలు జరగాలో అది సవ్య దిశలో జరుగుతాయి. భూతత్వంతో ఉన్నటువంటి మూలాధార కనెక్షన్ లో ఉన్నాం తద్వారా ఎముకలు కండరాలు దృఢమైతాయి. ఈ జలతత్వం దగ్గరికి వచ్చేసరికి శరీరంలో వాటర్ పర్సెంట్ ఎక్కువైపోయి తక్కువయపోయి ఒక మనిషి లావులు సన్నాల్లో మారిపోతూ ఉంటాడు. మీరు దాన్ని ఒబేసిటీ అని అంటారు.
(12:53) అది కుండలిని సాధన చేస్తూ స్వాధిష్టాన చక్రం వరకు తీసుకొని వచ్చి మళ్ళీ కిందకి తీసుకు పంపగలిగిన స్టేజ్ కి వచ్చిన మానవుడికి ఇది అంతగా పని చేయదు. అతనికి అద్భుతమైనటువంటి శరీర దృఢత్వం ఏర్పడుతుంది దారుఢ్యంగా దృఢత్వం ఏర్పడుతుంది. ఇంకా పైకి తీసుకొని వచ్చి మణిపూరకానికి వరకు ప్రయాణం చేపించి మళ్ళీ కిందికి దింపగలతే జీతక్రియా వ్యవస్థ అత్యంత అద్భుతంగా పని చేయడం మొదలు పెడ ఇంకా పైకి వచ్చి మన అనాహతానికి తీసుకొని వచ్చాం.
(13:34) అక్కడికి తీసుకొని వచ్చేసరికి ఈ వాయు సంచలనం దశ ప్రాణాలు ఏది ఎక్కడ ఎట్లా ఉండాలనో ఆయా స్థానాలలో అక్కడ నిలిచి పని చేస్తాయి. ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము అనేసి ఉన్నాయి. నాగ కూర్మక దేవదత్త ధనంజయాలు అనేటివి ఉన్నాయి. అవి ఏ ఏ స్థానంలో ఉండి ఎట్టఎట్లా పని చేయాలో అక్యూరేట్ గా అంత అద్భుతంగా పని చేయడం మొదలు పెడతాం. ఇంకా తర్వాత విశుద్ధి చక్రం వరకు తీసుకనివచ్చి మళ్ళీ దింపడం అనే సాధనకు పెంచుకుంటూ పోయి వచ్చినప్పుడు వాక్పటుత్వం అనేది వస్తుంది వాక్ సిద్ధి అనేది కలుగుతుంది.
(14:15) ఎందుకంటే మనిషికి ఓకల్ కార్డ్ అనబడేది అక్కడ ఉంటుంది. పరా పశ్యంతి మధ్యమ వైఖరి అంటున్నాం. ఈ పరా దగ్గర నుంచి వచ్చే మార్పులు కూడా స్వచ్ఛంగా ఉండి వైఖరి కూడా స్వచ్ఛంగా ఉంటుంది. వాక్సుద్ధి అంటే అతను చెప్పిన మాట నిజమై తీరే పరిస్థితి వస్తుంది. ఎక్కడ ఏ వాక్కును వాడాలా ఎంత వాడాలా ఎంత వాడకూడదు ఎప్పుడు వాడాలా ఎలా వాడాలా? ఈ జ్ఞానంఅంతా అతనికి దొరుకుంది.
(14:46) ఇక్కడికి దీనికి మళ్ళీ పంచభూతాలతో లింకు చూసుకుంటే మూలాధారము భూమి తత్వం స్వాధిష్టానము జలతత్వం మణిపూరకం అగ్ని తత్వం విశ్వ అనాహతము వాయుతత్వం ఆకాశ తత్వం విశుద్ధి అంటే ఒక జీవుడు ఇప్పుడు తాను ఏర్పడిన పంచభూత తత్వాలను అతిక్రమించి కేవలం జీవుడుగా మిగిలాడు. దాన్ని చూపించేదానికే ఆజ్ఞా చక్రం యొక్క చిత్రము ఎట్లా ఉంటుందంటే ఒక వృత్తము ఆ వృత్తంలో ఒక ఓంకారము ఇటు పక్క హం ఇటు పక్క క్షం అనే బీజక్షరాలు ఉంటాయి.
(15:25) మన పూర్వీకులు ఎంత జ్ఞానులు అంటే ఆ దళాలలో ఉన్న అక్షరాలు ఏది ఎక్కడ ఉన్నాయో కనిపెట్టారు కాబట్టి వాళ్ళు మంత్రాలు ప్రయోగించేటప్పుడు ఏ మంత్రము ఎన్నెన్ని అక్షరాలతో ఉంటే ఆ అక్షరాలు ఎక్కడ ఎక్కడ ఉండాది నియమించి పెడితే ఆ మంత్రం ఉచ్చారణ చేసినప్పుడు ఈ దళాలలోని ఆయ దళాలలోని పెటల్స్ దళాలు కదులుతాయి. ఈ శరీరంలో ఉన్నటువంటి షచక్రాలు ఇంటర్నల్ ఆర్గాన్స్ ను కూడా కంట్రోల్ చేస్తుంది.
(16:02) నాడుల ప్రవాహ కారణంగా నరాల ప్రవాహ కారణంగా కాదు నాడులు అనబడేటివి అదృశ్య రూపాలు చక్రాలు ఎట్లా అదృశ్యము వాటితో అనుసంధానమైన నాడులు కూడా అదృశ్య రూపాలు. సో ఇన్ని రకాల ఉపయోగాలు ఉండి జీవుడు ఈ పంచభూత తత్వాన్ని దాటుకొని జీవుడుగా మిగిలిపోయినప్పుడు ఈ జీవ తత్వం అంటే ఏంటి పరమాత్మ తత్వం అంటే ఏంటి కొంచెం బోధ అయితది ఆ తర్వాత నేనే అది అన్న భావనలోకి పోగలుగుతారు.
(16:38) ఇంతవరకు కోహం బ్రహ్మ భావనలో ఉన్నాడు అహం బ్రహ్మస్మి అని తెలుసుకున్నాడు. అక్కడ నేను బ్రహ్మను అంటే రెండు ఉన్నాయి నేను ఉన్నాడు బ్రహ్మము ఉంది. ఇంకా పూర్తి బ్రహ్మం అయినప్పుడు నేను అని చెప్పుకునే స్థితి రాదు. వేదంలో నాలుగు మహా వాక్యాలు ఉన్నాయి. అహం బ్రహ్మస్మి తత్వమస్సి ప్రజ్ఞానం బ్రహ్మ సర్వం కలిదం బ్రహ్మ ఆయమాత్మనం ఆయత్మ కోహం బ్రహ్మ అని ప్రశ్న వేసుకొని ప్రపంచంంతా అంతా కలిసిపోతుంది సర్వం కలిద్వం బ్రహ్మ అన్న స్టేజికి రావడం అక్కడ సర్వం కలిద్వం బ్రహ్మ కానీ వేదాలు చెప్పిన ఈ నాలుగు వాక్యాలు ప్రజ్ఞానం బ్రహ్మ ఆయత్మానాం బ్రహ్మ
(17:24) అహం బ్రహ్మస్మి సతమస్మి అహం బ్రహ్మస్మి అన్నప్పుడు నేను బ్రహ్మను రెండు ఉన్నాయి. తత్వమసిలో మూడు ఉన్నాయి. నీవు అది అయి ఉన్నావు ఒకడు చెప్తున్నాడు నీవు అది అయి ఉన్నావు అక్కడ మూడు తత్వాలు వచ్చాయి. ప్రజ్ఞానం బ్రహ్మలో ఎక్కడ ఏది లేదు ఆత్మ లేదు ఏమీ లేదు. మ్ నీ ప్రబలమైన జ్ఞానమే బ్రహ్మ నీలోని జ్ఞాన స్వరూపంగానే ఆ బ్రహ్మ విరాలింుతున్నాడు అనేదానికి ప్రజ్ఞానం బ్రహ్మ ఆయమాత్మనాం బ్రహ్మ అధర్వణ వేద వాక్యం దాంట్లో మట్టుకే మీకు క్లియర్ గా ఈ ఆత్మే బ్రహ్మ అక్కడ అది అనే రెండు లేవు ఉన్న ఆత్మే బ్రహ్మ అది ఉపాధిలో ఉన్నంతసేపు
(18:13) దాని పేరు జీవాత్మ ఉపాధి వదిలి పెట్టేస్తే అది పరమాత్మ అంటే పరమాత్మ అంటూ వేరేగా లేదు సర్వం వ్యాప్తం అంతచ నారాయణ బహిత్య నారాయణ అంతర్బహిచ మధ్యచ నారాయణ ఊర్వచ్చ నారాయణ అదచ్చ నారాయణ అంటారు అటువంటి ఆ నారాయణ తత్వం అచల తత్వం అచలము అంటే కదలలేనిది అని అందరు అర్థం చేస్తారు. కదిలేదానికి ఇంకో చోటంటూ లేనిది అది అచల స్థితి అయితే ఇప్పుడు చక్రభేదనం గురించి వర్ణించారు కదండీ ఇప్పుడు మామూలుగా అలాగే మనకి గ్రంధి భేదన కూడా జరుగుతుంది కదా గ్రంధి భేదన అనేది మనకి వచ్చేసి మూడు
(18:58) గ్రంధులు ఉన్నాయి కదా బ్రహ్మ గ్రంధి విష్ణు గ్రంధి రుద్ధ గ్రంధి ఈ గ్రంధి భేదనం కుండల్ని సాధనలో ఎలా జరుగుతుంది అదే యత్ పిండాండే తత్ బ్రహ్మాండే అనేసి ఒక మాట అన్నారు కదా అంతా ఏముందో అదంతా ఈ పిండాండంలో ఇందులో లేనిది ఎందులో లేదు అనేసి చెప్ప ఒక వాక్యం ఉంది కదా అంటే ఓ జీవుడా నీవే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని నిరూపణ చేసేదానికి ప్రత్యక్షంగా మీకు ఆ మూడు గ్రంధులు చూపిస్తారు.
(19:29) మూలాధార స్వాదిష్టాలను దాటినప్పుడు అక్కడ ఉన్న ముడి పేరు బ్రహ్మ ముడి అంటారు బ్రహ్మ గ్రంధి ఆ ముడిని విప్పేయడం గ్రంధి చేదనము అనే మాట వాడతాడు. ఏం జరుగుతుంది స్వాధిష్టానం దగ్గర పునరుత్పత్తి అవయవాలు ప్రతి జీవికి ఉన్నాయి. ఆ జీవి పునరుత్పత్తి చేస్తాఉంది. బ్రహ్మ ఏం చేస్తున్నాడు సృష్టి చేస్తున్నాడు. ఈ జీవుడు కూడా సృష్టి చేస్తున్నాడు కదా ఆడ మగా కలయక జరిగినప్పుడు సంతానము అనే ఫలం వస్తాఉంది.
(20:10) ఆడ మగా కలిసినప్పుడు సంతానము అనే ఫలం వస్తుంది. ఆడ కావచ్చు మొగ కావచ్చు సాధకుడు ఆ స్థాయికి పోయినప్పుడు తానే బ్రహ్మ అని తెలుసుకుంటాడు. ఇంకాస్త పైకివచ్చి మణిపూరక అనాహతాలు దాటినప్పుడు ఒక ముడి అంటారు. దాన్ని విష్ణు వృద్ధి అంటారు విష్ణు అంటే సర్వవ్యాపకత్వము పోషకత్వం ఒకడు పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యను పోషించాలా తనను పోషించుకోవాలా తనకు పుట్టిన బిడ్డలను పోషించుకోవాలా తన కన్న తల్లితండ్రులను పోషించుకోవాలా తనకు పిల్లని ఇచ్చిన అత్త మామలను పోషించుకోవాల స్త్రీ పురుషుడు ఎవరైనా ఈ పోషణ శక్తి అంతా మీలోనే ఉంది కదా
(20:56) పోషించేవాడు రక్షించేవాడు విష్ణు ఎట్లగనో మీరు అదే పని చేస్తున్నారు అక్కడ కాబట్టి ఆ విష్ణు తత్వం కూడా మీలో ఉంది అని చెప్పేదానికి విష్ణు గ్రంథి ఇక్కడేమో మూలాధారంలో నుంచి స్వాధిష్టానం వరకు వస్తే పునరుత్పత్తి వాళ్ళ రక్షణ ఒక స్టేజ్ వచ్చినాక వాళ్ళ జీవితం వాళ్ళు నడిపేటట్లు వాళ్ళని వదిలేయడం శివతత్వం అన్ని వదిలేసి శుద్ధంగా ఉండడం శివతత్వం ఆ [గురకలు] మూడవ స్థితి ఇక్కడ వరకు మీకు వస్తుంది.
(21:31) ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే సృష్టి స్థితి లయలను మూడిటిని చేసే మహాశక్తి ఒకటి ఉంది. వీటినే సృష్టించగలిగిన మహాశక్తి అది సదాశివ బ్రహ్మం అని చెప్పకూడదు పరబ్రహ్మం దానికి మనం ఆ పేరు పెట్టాం అది నిరాకార తత్వం. ఇప్పుడు ఈ జీవుడు తనలో ఉన్న బ్రహ్మ విష్ణు తత్వాలను కూడా తెలుసుకొని వీటికన్నా అతీతమైనటువంటి ఆ పరబ్రహ్మ స్థితికి చేరుకోవడం లక్ష్యం జీవాత్మ పరమాత్మలో ఐక్యము అన్నాడు అదే ఈ కుండలిని అయితే జీవాత్మ పరమాత్మలో ఐక్యము అన్నాడు ఈ కుండలిని శక్తికి ఆత్మ శక్తికి రెండిటికీ ఉన్న వ్యత్యాసం ఏంటి ఆత్మ శక్తి కుండల్ని
(22:17) శక్తి రెండూ కలిసినప్పుడు ఈ దేహశక్తికి ఎలా ఉపయోగపడుతుంది దేహశక్తి కుండల్ని కలిస్తే ఏమవుతుంది దేహశక్తి ఆత్మశక్తి కలిస్తే ఏమవుతుంది దేహశక్తి ఆత్మశక్తి కుండల్ని శక్తిలు ఈ మూడు కలిస్తే ఏమవుతుంది ఆ లోపల జరిగేటటువంటి క్లాసెస్ ఏంటి దాని వల్ల ప్రయోజనం ఏంటి సాధకుడు ఎలా అభివృద్ధి చెందుతాడు ఇప్పుడు సహస్రారంలో ఎట్లైతే సదాశివుడు ఉన్నాను అని చెప్తాడో ఆ సదా సదాశివుడు హృదయ గృహం అష్టదల పద్మేషు తిష్టంతో పరమాత్మ అని ఇంకో రూపంలో కూడా చెప్తారు నేతయావషట్ [గురకలు] అని చెప్పేటప్పుడు అగ్ని స్వరూపంగా ఇక్కడ మూడు రూపాలలో ఉన్నాడు అని చెప్తాడు
(23:03) ఉన్న ఆ ఒక్క ఆత్మ ఈ పంచకోశాలను పంచభూతాలను పంచతన్మాత్రలను పంచేంద్రియాలను పంచ ప్రాణాలను ఇన్నింటిని మెయింటైన్ చేస్తా మ్ అది అక్కడక్కడ స్థానాలు మార్చుకుంటూ తిరుగుతాం స్థిరంగా ఉన్నది ఇక్కడ రెండు పేర్లతో పిలవబడతా ఇక్కడ ఉన్నప్పుడు దాని పేరు సదాశివుడు లోపల ఉన్నప్పుడు పరమాత్మ యొక్క అంశ అయిన జీవాత్మ శివుడు ఉన్నాడు అంటే శక్తి ఉంది.
(23:38) ఆ శక్తి స్వరూపిని రూపమే కుండలిని అనబడే కింద ఉన్న శక్తి సో ఈ పరమాత్మతో ఇది ఐక్యము అంటే ఆత్మతో కూడా ఐక్యమే ఈ ఆత్మ సంపూర్ణ శుద్ధీకరణ స్థితిలో తాను మొదలే ఉంది కానీ ఉపాధిని ధరించినాక ఆ ఉపాధి అవసరాలు ఇష్టాలు కోరికలు కర్మలను పట్టి కొన్ని వాసనలను అంటించుకుంటాం. కుండలిని సాధన చేసినప్పుడు దేహపరంగా దేహము దృఢమైన దేహం ఉంటుంది.
(24:12) అనారోగ్యాలు సామాన్యంగా రావు ఏదైనా గాయాలు దెబ్బలు తగిలిన మిగతా వాళ్ళ కన్నా తొందరగా మానతాయి. ఇది దేహపరము కుండలిననికి ఉన్న అనుసంధానం ఆత్మపరంగా ఉంటే సహజ సిద్ధ స్వచ్ఛంగా ఉన్న ఆత్మ ఇంకా ప్రకాశవంతమానమై ఉంటుంది విరాజిల్లుతుంది ఆత్మ ఎప్పుడు విరాజమానమై ఉంటుందో మనసు యొక్క చంచలత కొంచెం తగ్గుతుంది. ఎప్పుడు మనోచంచలత తగ్గిందో మానవుడు ఆనందంగా ఉండగలుగుతాడు సంతోషంగా కాదు సంతోషం వేరే అది వస్తూ పోతూ ఉంటుంది.
(24:51) ఆనందం నిత్య స్థితి ఆ నిత్య స్థితికి మానవుడు ఉంటాడు. ఇది మీరు అడిగిన ఈ మూడు రకాల అనుసంధానాలు కుండలిని ఆత్మ దేహం ఈ ఒక్క కుండలిని సాధన చేస్తే దేహపరంగాను మీరు దృడంగా ఉంటారు ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది. ఇది దేహపరంగా ఆత్మ పరంగా పరమోత్కృష్ట స్థానానికి ఆత్మ చేరుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ దేహాన్ని విడుదల చేసుకునేదానికి సిద్ధంగా ఉంటుంది.
(25:23) దానికి ఆ జన్మలలో అంటిన వాసనలు తగ్గుతూ వస్తాయి. అదే ఆత్మను సదాశివ తత్వంగా ఇక్కడ చూసుకున్నప్పుడు ఆ సదాశివుని లోని శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి కింద ఉండి ఈ శక్తిని పైకి తీసుకనివచ్చి అక్కడ కలపడం అనే వ్యవహారం చెప్తాం. అయితే ఇక్కడ కుండల్ని శక్తి సాధన చేసేటప్పుడు మనకి చక్రాల్లో చూసినప్పుడు స్వాధిష్టానానికి అధిపతిగా సుబ్రహ్మణ్య స్వామిని చూస్తాం.
(25:53) సంపూర్ణ కుండలినిగా మళ్ళీ సర్ప రూపాన్ని చూస్తాం దాన్ని ఇంగ్లీష్లో సర్పెంట్ పవర్ అని కూడా సంబోధిస్తుంటారు కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈ సర్పెంట్ పవర్కి అధిపతి మళ్ళీ సుబ్రహ్మణ్యుడుగానే మళ్ళీ చేస్తాం ఈ సర్పాల అన్నిటికీ రాజుగా సుబ్రహ్మణ్య అందుకే నేను మీకు ముందే చెప్పాను అయ్యను అమ్మను కలపాలంటే మధ్యలో ఈ సుబ్రహ్మణ్యుడు ఉండి తీరాల అని ఆ పేరులోనే ఉంది శుభ్రమణి మణి అంటేనే ప్రకాశవంతం దాంట్లో మరీ శుభ్రత ఉ [గొంతు సవరించుకోవడం] ప్యూరెస్ట్ ప్యూరిటీ మ్ ప్యూరెస్ట్ ప్యూరిటీ అందుకే రెండు పేర్లు సదాశివం ఎప్పుడూ ప్యూరిటీ ఇక్కడికి వచ్చేసరికి సుబ్రహ్మణ్య తత్వంలో
(26:39) ప్యూరెస్ట్ ప్యూరిటీ పేర్లు మారుతున్నాయి మొత్తానికి ప్యూరిటీ ఆ ప్యూరిటీ సాధారణ ప్యూరిటీ కాదు హైయెస్ట్ లెవెల్ ప్యూరిటీ అని చెప్పాలంటే రెండు రకాలుగా అదే మణి పూరక చక్రం అని కూడా దానికి అంత అద్భుతమైన పేరు పెట్టారు మణి మణి అంటే ప్రకాశవంతం ఒకడి దగ్గర మణి ఉంది అంటే అదేంటి ఇష్టకామ్యార్థం మని ఆ మణి ఉంటే ఏ కోరికలన్నా వాడికి తీరుతాయా అది దాని తత్వం అయితే ఈ కుండలిని వేద ప్రమాణ యోగం కింద మనకి వేదాల్లో చెప్పబడిన యోగం కింద ప్రస్తావిస్తారు కదా మిగిలిన యోగాలన్నీ కూడా వేదం తర్వాత అంటే ఈ ఋషులు కనిపెట్టి వేదం తర్వాత కాదు కుండలిని సరళీకృతం
(27:24) చేస్తూ కుండలిని అందుకోలేని వాళ్ళకు అందించేదానికి ఆ కాలపు ద్రష్టలు కనిపెట్టిన వివిధ మార్గాలు హటయోగం నాదయోగం స్వరయోగం ఇన్నీ పేర్లు మారుతున్నాయి ఎక్కడైనా చేయాల్సింది ఈ ఇడా పింగళ సాధన వాటిని బంధించేసి మూల ఈ మూడు బంధాలు వేసినప్పుడు జరుగుతుంది అనేది అది ప్రామాణికం. దాన్ని సరళీకృతం చేసి పాపం అంత కఠిన శ్రమ చేయలేడు అనుకున్నప్పుడు ముందు నీ శరీరాన్ని నువ్వే గట్టిపరుచుకునే దానికి ఆసనాలు అనేటి అలవాటు చేశారు.
(28:07) అది కూడా ఎట్లా చేశారు ఏ ఏ జంతువు విశ్రాంతి పొంది శక్తిని పొందుతాందో గమనించి గమనించి గమనించి అవి ఏ ఏ ముద్రలలో కూర్చుంటాయో ఆ ముద్రలను మన మీద మనమే చేసుకుంటే మనం ఆ శక్తి పొందుతాము అన్నట్లుగా ఆసనాలు పెట్టారు ఆసనాల్లో ఎక్కువ ఆసనాల పేర్లు జంతువుల ఆసనాల పేర్లే ఉంటాయి. భుజంగాసనము మకరాసనం శశి ఆసనము ఉష్టాసనముసనం మతాసనము కూర్మాసనము మయూరాసనము చాలా ఎక్కువ పేర్లు జంతువుల పేరు జంతువులే ఉంటాయి పద్మాసనము సిద్ధాసనము మహాసనము ఇవి
(28:54) శారీరక ఉపయోగానికి పనికవచ్చే మిగతాటివన్నీ ఆయా జంతువులు ఈ జంతువుల జన్మలు మనం ఇంతకుముందే అనుభవించాం ఆ గురువు ఒక్కసారి చెప్పంగానే మనకు ఆ జన్మ గుర్తొచ్చి ఆ ఆసనం బాగా వేయగలుగుతాం. ఒక గురువు 70 ఆసనాలు 70 మందికి నేర్పిస్తాడు. ఆ 70 లో ఆయ కుక్కుటాసనం గా ఉండిపోయినోడు కుక్కుటాసనాన్ని బ్రహ్మాండంగా వేయగలుగుతాడు. ఎందుకంటే వాడికి ఆ పూర్వజన్మ వాసన ఇంకోడు మకరాసనం వేయగలడు.
(29:30) ఇంకొకడు పిపిలి ఆసనం వేయగలడు ఒకటొకటి అలాగా ఈ ఆసనాల ప్రయోగం చేస్తూ ముందు శరీరాన్ని దృడం శరీరం మధ్య కలుధర్మ సాధనం అనేది ఉంది కదా ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ఏ సాధన అయినా మానవుడు చేయగలడు కుండని చేస్తే స్వత సిద్ధంగా లోపల నుంచి రిపేర్ అయి బాడీ స్ట్రాంగ్ అయిపోతుంది. స్ట్రాంగ్ అంటే కండలు తిరిగిన శరీరం కాదు శీతోషణ సుఖ దుఃఖాలను సమంగా చూడగలిగిన శక్తి దీనికి అలవడుతుంది.
(30:04) మంచి కొండలలో కూడా ఈ కోట్లు స్వటర్లు వేసుకోకుండా తిరగొచ్చు. అట్లాగనే మంచి ఎడారులలో కూడా నీళ్ళ దప్పికతో సమస్యలు పడకుండా ఆ ఎండను రిస్ట్రైన్ చేసుకునే కెపాసిటీ వస్తుంది అది సహజ సిద్ధంగా కుండలిని దేహ దారుఢ్యాన్ని పెంచి సాధన చేసి పరిస్థితులకు అనుకూలంగా మార్చుకునేది ఆసనాల ద్వారా జరుగుతుంది. మనిషికి రెండు అవసరమే అది చేయలేని వాడు ఇది చేస్తాడు.
(30:40) ప్రాణాయామాలు చేయడము అంటే దాంట్లో ఎన్నో రకాలు ఉన్నాయి మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. ఒకే నాడిని ఎంతసేపు ఆడిస్తే ఏం ఫలితము ఆల్టర్నేటివ్ గా ఆడిస్తే ఏం ఫలితము ఒకదానితో ఒకదాన్ని అనుసంధానం చేస్తే ఏమవస్తుంది ఇవన్నీ మీరు బాగా రాసి ఉన్నారు వివరాలు సో ఇవి ఎంతమంది అంత ఖచ్చితంగా చేయగలరు ఎప్పుడూ సదా గురువు ఎదురుగా ఉంటే తప్ప ఇవి చేత కావు.
(31:07) ఆసనాలు గురువు నాలుగు దినాలు నేర్పిస్తాడు ఐదో దినం మీకు వచ్చేస్తుంది. మీ అంతకు మీరే వేసుకోవచ్చు. దేని బెనిఫిట్ దానికి ఉంది వాళ్ళు దాన్ని సింప్లిఫై చేసి అసాధ్యమైన మనుషులకు సుసాధ్యం చేసేదానికి సింప్లిఫికేషన్ చేశారు ఇప్పుడు సహస్రనామాలు ఉన్నాయి షార్ట్ కట్ లో ఏమంటాడు రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం ఇది చెప్పారు కదా అని చెప్పి సహస్రనామాలు చదవకుండా ఈ శ్లోకమే చదువుకుంటా కూర్చుంటే అయితదా సహస్రనామాలు చెప్పినప్పుడు ప్పుడు ఆ శివ తత్వము విష్ణు తత్వం అంటే ఏంటి ఆయన ఎన్ని రూపాలుగా ఉన్నాడు శాస్త్రం అంటే వెయ్యే కాదు అనంతము అన్న సంఖ్యలోకి
(31:52) పోతుంది అన్న తత్వం వానికి అర్థమైపోతుంది. అట్లాగనే ఒక్కసారి కుండలిని సాధన బాగా చేస్తున్నవాడు ఏ శాస్త్రము చదివినా ఆ శాస్త్రంలోని సారాన్ని గట్టిగా పట్టుకోగలడు. సులభంగా అర్థమయంది. అర్థంఅవ్వడమే కాకుండా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎప్పుడు ఏ సమయంలో ఎట్లా ప్రవర్తించాలా ఏ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలా అతనికి అవగతం అయింది.
(32:21) అయితే ఈ కుండల్ని సాధనకి సిద్ధాసనాన్ని అశ్విని ముద్రలని ప్రధానంగా చెప్తుంటారు కదా ఈ సిద్ధాసనం యొక్క గొప్పతనము అశ్విని ముద్రల యొక్క గొప్పతనం ఏంటి? మూల ఆధారం మూల బంధం మూలం మూలం అన్న పదం వస్తాంది ది స్టార్టింగ్ పాయింట్ ఒక మనిషి ఎక్కడ ఎట్లా కూర్చున్నా కూర్చునేకి మూల ఆధారము ఈ పిరుదులు ఆ గుతస్థానం అది విసర్జకావయవంగా పనిచేస్తాఉంది.
(32:53) ఆ విసర్జ కావలయం సరిగ్గా పని చేయకపోతే మీకు ఇప్పుడు చెప్తున్న సైన్స్ ఫిష్టుల అని పైల్స్ అని దాంట్లో ఏదేదో ఐదారు రకాల జబ్బులు అక్కడ వస్తాయి. ఎప్పుడైతే తిన్నది అరిగి మిగిలినది బయటికి పోకపోతే లోపల రోగాలు మొదలైతాయి. సో ఆ మార్గము సవ్యంగా ఉన్నప్పుడు ఆ మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. వాటికి అవసరమైనదే ఈ మూలబంధము అనే ఈ క్రియలన్నీ అక్కడ జరుగుతాయి.
(33:25) [గురకలు] దాన్ని క్లీన్ చేయడం శుభ్రం చేయడం శక్తిమంతం చేయడం అశ్విని ముద్ర అశ్వనీ ముద్ర మాటి మాటికి మీరు అశ్వనీ ముద్ర వేస్తున్నారంటే మీకు తెలియకుండా మల విసర్జనికే జబ్బు ఒకటి వస్తుంది మలాన్ని ఆపుకోలేరు. మూత్రాన్ని ఆపుకోలేరు కొంతమంది కొన్ని రకాల సమస్యలు వస్తే వాళ్ళకు ఈ అశ్వని ముద్ర వేసినప్పుడు ఆ గ్లాండ్స్ అన్నీ కూడా బాగా యక్టివేట్ అయ్యి అవసరమైనప్పుడే నేను పోగలను అన్నంత రెసిస్టెన్స్ కెపాసిటీ పెరుగుతుంది.
(34:01) కానీ అట్లా బలవంతంగా మలాన్ని బంధించి పెట్టకూడదు. ఈ దేహానికి ఒక అలవాటు అంటూ చేస్తే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేశారు లేదు నాలుగు ఐదుకు లేశారు. ఆ లేసిన వెంటనే ఒక్కసారి మల విసర్జన జరిగిపోవాలి. దానికి తగినట్లుగానే మన వాళ్ళు ఆహార వ్యవహారాలలో రాత్రిపూటఏడు గంటలకే తినేసేయి ఆ తినేది తేలికైన ఆహారం తిను అంటారు. రాత్రిఏడు గంటల నుంచి ఉదయంఎమిది గంటల వరకు ఈ ఆహారం అద్భుతంగా జీర్ణం అయపోయి శక్తి అంతా గ్రహించుకున్నాక పిట్టు మిగులుతుంది.
(34:38) ఆ పిట్టు గట్టిగా ఉండకుండా లూజుగా ఉండేటువంటి ఫైబర్ కలిసిన తిండి తిను అని డాక్టర్లు చెప్తారు. అందుకే మనవాళ్ళు కందమూళాలు కాయకూరలు ఎక్కువ ఆకుకూరలు తిన్నప్పుడు ఆ మలము బలమైపోయి ఇబ్బంది కలగకుండా సులభంగా వస్తుంది. ఇంకా రాలేదు అంటే ఆముద సేవనం లాంటిది తర్వాత సబ్జా గింజలు వీటిని ఎక్కువ తీసుకోవడంతో అది ఫ్రీగా వెళ్ళిపోదు.
(35:10) దానికి తోడు ఈ అశ్వనీ ముద్ర వేయడం అది ఈ లోపల పార్ట్టునంతా కూడా బ్రహ్మాండంగా శక్తివంతంగా చేస్తుంది. ఆ ఒక్క అశ్విని ముద్ర వేస్తే మీ మూల ఈ మలద్వారం ఒకటే కాకుండా మూలాధార చక్రం కూడా యక్టివేటెడ్ అయింది. అది అతి దగ్గరగా ఉంటుంది కదా గుదస్థానానికి దగ్గర కాబట్టి మూలాధార చక్రం అద్భుతంగా యక్టివేట్ అయింది. అందుకనే అశ్వనీ ముద్ర ఎక్కువ సాధన చేయమంటాడు.
(35:43) ఈ సిద్ధాసనం అదే మలద్వారాన్ని ఈ మడమతో మూసేస్తాం లింగ మార్గాన్ని ఈ మడమతో మూసేస్తాం. ఈ రెండే కదా బహిర్ అవయవాలు కల్మష అవయవాలు అంటాం ఆ కల్మశాలు పోకపోతే మనిషికి డేంజర్ అది అవసరమే మనిషి అవసరమే చెడ్డ అవసరమే ఆ రెండిటి మీద అద్భుతమైన నియంత్రణ వస్తుంది సిద్ధాసనం ఆ యూరినరీ గ్లాండ్స్ కిడ్నీస్ ఇవన్నిటి మీద ప్రభావం పడుతుంది ఆ ఒత్తిడి తద్వారా ఆ రెండు అంగాలు వాటికి సంబంధించిన ఉపాంగాలు అంటే పెద్ద పేగు యూరినల బ్లాడర్ ఫాలోపిన్ ట్యూబ్స్ ఇవన్నీ కూడా స్త్రీ
(36:32) పురుషులకు కలిసి చెప్పాలి కాబట్టి ఫాలోపిన్ ట్యూబ్స్ స్త్రీలలో ఎక్కువ అండాలు విడుదలయ ఆ అండాల విడుదల స్థానం ఒకటి ఉంటుంది అంటే కోషన్ ఇవన్నీ కూడా యక్టివేటెడ్ ఆసనాలు మూలంగా అయితే ఈ కుండల్ని చేయాలి అంటే ఎలాంటి పరిస్థితుల్లో చేయాలి ఎట్లాంటి గురువులని ఆశ్రయించి చేయాలి అలాగే కుండల్ని సాధన చేయడానికి ఎట్లా శరీరాన్ని వీటిని సంసిద్ధం చేసుకోవాలి గురువు అంటే తెలియనిది నేర్పి చెప్పేవాడు ఆచార్యుడు అంటే తాను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరి ఆచరింప చేసేవాడు గురువునే ఈ రెండు పేర్లతో పిలుస్తాం ఆచార్య అని పిలుస్తాం.
(37:16) ఎప్పుడు పిలుస్తాం ఆయన తాను స్వయంగా చేస్తూ దాంట్లో నిష్నాతత పొంది దాని లాభ నష్టాలు తెలుసుకొని అప్పుడు ఇతరులకు బోధిస్తుంటే అటువంటి గురువు దగ్గర మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న దాన్ని ఆయన చెప్పింది చెప్పినట్లు సాధన చేయాలి. చేసినప్పుడు మనమే కొన్నాళ్లకు గురువుగా మారుతాం. అప్పుడు అది సిద్ధిస్తుంది కూడా ఒకటి గురువు మీద పరిపూర్ణ విశ్వాసం ఉండాలా ఆ గురువు ఈ చెప్పే గురువు చేసి ఉన్న గురువై ఉండాల ఆయన నాలుగు పుస్తకాలు చదివేసి చెప్పాడు అంటే ప్రయోజనం ఆయన చదివిన పుస్తకాలే మనము చదువుతున్నాం. ఫలితం ఏంటి
(38:03) ప్రాక్టికల్ థియరాటికల్ వందలు ఉంటాయి ప్రాక్టికల్ ఎంతైనా గాని అద్భుతం ఆ మీరు తెలుగులో అదేమో చెప్తారు గంగిపాలు గరిటడ గరిటడైనను చాలు కడవడైన ఏమి కరముపాలు కరముపాలు గాడిదపాలి అంతే అంటాన్నారే కానీ గాడిదపాలి ఇప్పుడు కోట్ల కిలోలు ధరలు చేస్తాఉంది దాని శక్తి దానికే ఉంది. సో ఇది జరిగేది మార్పులు కుండల్ని మానసిక స్థితుల్లో ఎటువంటి మార్పులు తీసుకొస్తుంది అసలు మానసిక మేదస్సుని ఎలా మారుస్తుంది మన చంచలత అనేది తగ్గిపోతుంది మనసు యొక్క దృష్టి మొత్తము నేను వదిలిపెట్టు తీసుకుంటున్న శ్వాస కుంబించాను మూడు బంధాలు వేశను ఇప్పుడు ఈడలో పోలేదు పింగళలో
(38:50) పోలేదు సుషుమంలోకి పోతాఉంది ఈ భావనలోనే ఉన్నాడు వాడు మనసులో ఇంకా రెండో కోలికలు ఆలోచనలు రావడం లేదు మనసులో కోరికలు వస్తే కదా ఇది కల్మష మానసం అవుతుంది. నిశ్చలంగా ఉన్న ఒక చెరువులో రాయి పడితే తరంగాలు పుడతాయి. లోపల ఉన్న చిత్రం సరిగ్గా కనపడదు. ఎప్పుడైతే అది చంచలం లేకుండా నిర్మలంగా ఉంటుందో ఇప్పుడు ఈ మనసుకు ఒకటే డ్యూటీ నేను శ్వాస తీశను కుంపించాను మూడు బంధాలు వేసేసాను.
(39:27) ఇప్పుడు ఈడా పింగళ కూడా బంద్ ఏం ముక్కు మూసుకొని కాదు సాధనతో ఏమీ చేయకుండానే రెండిటిని బంద్ చేయొచ్చు. ఇప్పుడు అది ఎక్కడికి పోతాంది ఖాళీ అదే అబ్జర్వేషన్ లో ఉన్నాం. ఓహో ఇప్పుడు సుషమనలోకి పోతా సెల్ఫ్ కమాండింగ్ ఆటో కమాండింగ్ ఇదంతా మనసు ద్వారానే చేయిస్తున్నాం ఇంకోటితో కాదు మనసును తొక్కేయడం ఎప్పటికీ సాధన కాదు మనసు సహకారం చేసుకొని మనసుతోనే ఆత్మను తెలుసుకోవడం సాధన కూడా అదే అయితే ఇప్పుడు కుండల్ని సాధన చేసిన వాళ్ళకి సంస్కార శుద్ధి సంస్కారాలు ఉంటాయి మనిషి అన్న తర్వాత కొన్ని మంచి అలవాట్లు చెడు అలవాట్లు చెడు సంస్కారాలు ఈ సంస్కార శుద్ధి అనేది జరుగుతుంది అలాగే కర్మ
(40:15) శుద్ధి అంటే కర్మ ప్రక్షాలన జరుగుతుంది అంటారు ఇది ఎలా కర్మ ప్రక్షాలన టోటల్ గా జరగదు కర్మల ప్రభావం తగ్గుతుంది. సంస్కార శుద్ధి ఆటోమేటిక్ గా పాతకాలంలో గురుకులాల్లో చేర్పించేవాడు ఏమీ తెలియని వయసులో ఐదేళ్ల పిల్లవాడు అక్కడికి వెళ్ళేవాడు. ఇంకా అక్కడి నుంచి వాడికి విద్యలే చెప్పబడతాయి కాబట్టి వాడిలో అన్ని ఉన్నత సంస్కారాలే ఉంటాయి.
(40:42) ఇక్కడ సంసార గోలలో ఉండిపోయినోడైతే వాడికి సంస్కారాల శుద్ధి అవసరం అయపోతుంది. సంసారంలో ఉన్నవాడికి చిన్న వయసులోనే పోయి సాధన చేసిన వాడికి కుసంస్కారాలు అనేది ఉండనే ఉండవు కాబట్టి సంస్కార శుద్ధి అనే ఎక్కువ సమయం మిగిలిపోతుంది. సులభంగా అతను గ్రాస్ప్ చేసుకొని పట్టేసుకొని ఎత్తేసుకుంటాడు. ముందుకు వెళ్ళిపోతాడు. అంటే ఈ విధంగా కుడ్డల్ని సాధన అనేది హిమాలయాల్లోనో ఆశ్రమాల్లోనో చేయాలంటారు కదా కుటుంబ జీవన విధానంలో సంసార జీవనంలో ఉండి కూడా సాధ్యమేనా ఎంతో మంది ఇక్కడ ఉండి కూడా సాధించవచ్చు.
(41:24) ఎట్లా అంటే రెండు రకాలు ఉండాయి ఒక కవి అంటాడు నిరుపహతి నిరుపహతి స్థలంబు ప్రియభూతితిక తెచ్చిచ్చు కర్పూరపు వీడే షడ్రుచవంతమైన విందు భోజనంబు సేవక గణంబు సేవ చేయుచుండంగా మనసుకు తృప్తి కలిగి కవితము వచ్చును అంటాడు ఒకడు వానికి ఇన్ని సౌకర్యాలు ఉండాలంట ప్రశాంతమైన వాతావరణము సంగీతం వినపడుతూ ఉండాలా నాట్యకత్తలు నాట్యం చేస్తూ ఉండాలా దానికి ముందే షడ్రుచులతో ఫుల్గా భోం చేసి తూగుటయ్యాల మీద కూర్చొని ఉంటే భార్య కర్పూరపు వీడే తంబుల్ అందిస్తూ ఉంటే సేవకురాళ్లు వింజామరలు విరుస్తూ ఉంటే అప్పుడు వీడికి
(42:09) కలిగిన సుఖముతో కవిత్వం పుడుతుంది అని ఒకడు అంటాడు. కడుపు కాలి కూడా కవిత్వం పుడుతుంది. రెండు రకాలుగా అట్లాగానే ఈ సాధన కూడా ఉత్త కడుపుతో చేస్తేను పని చేయదు కడుపు నిండా చేస్తేను పని చేయదు సకల సౌకర్యాల మధ్య కూర్చొని చేస్తేను పని చేయదు. అల్లర్లు డిస్టర్బ్లు ఉన్న చోట పని చేయదు. మన ఇంట్లోనే మనకు అంటూ ఒక చిన్న రూమ్ ఏర్పాటు చేసుకొని ఆ రూమ్ను బాగా శుద్ధం చేసి గాలి వెలుతురు బాగా వచ్చేటట్లు చూసుకొని అటువంటి చోట ఒక జ్యోతిని వెలిగించి ఆవునెయి ఏదో ఒకటి ఆవునెయ్యితో దీపం వెలిగిస్తే ఆ ఏరియా అంతా
(42:53) ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. అక్కడ కూర్చొని ఒక మంచి ఆసనం మరీ ఎత్తైనది కాదు మరీ కిందిది కాదు ఒక రెండు మూడు గంటలు స్థిరంగా కదలకుండా కూర్చోగలిగిన ఆసన సాధన చేయాలి. ఆసన సిద్ధి ఆసన శుద్ధి అనేది రెండు ఉన్నాయి. ఆసన శుద్ధి కడిగేయడం ఆసన సిద్ధి అంటే ఏ ఆసనాన్ని మనం సాధనస్తున్నామో ఆ ఆసనంలో కనీసం అంటే మూడు గంటలు ఎంత మాత్రము కదలకుండా కూర్చునే స్థితికి చేరుకోవడం.
(43:31) ఆ స్థితికి వచ్చినాక ఇంకా మెల్లమెల్లగా అది దినాలు కూర్చున్న గాన మీకు తెలియని స్థితి ఏర్పడిపోతుంది. దాన్ని ఆసన సిద్ధి అంటారు. అట్లా ఒక మంచి ప్రదేశంలో ఆసన సిద్ధిని సాధించుకున్నాక ఒక మంచి మెత్తటి వస్త్రం పరిచి దర్బలు పరిచి దర్బలు పరచటం మూలంగా భూమికి ఆకర్షణ శక్తి మన శక్తినంతా లాగేసుకోకుండా ముందు దర్బలు దాని పైన వస్త్రం లేదా ధావళి అనేది ఒకళ్ళు బ్రాహ్మణులు ఇంతకుముందు వాడేవాళ్ళు పట్టుది ధావళి అది పట్టు కాదే ఇంకో రకమైన జంతువు నుంచి వచ్చే దారాలు అంటారు దాని వెంట్రుకలు ఆ వెంట కొలత చేస్తారు.
(44:12) ఆ దావళి దోష రహితం దాన్ని ఉతకాల్సిన పనే లేదు ఎప్పుడు ఏడు సార్లు ఇట్లా ఏడు సార్లు ఇట్లా దుంపేస్తే శుద్ధము అంటారు. దావళీలు మార్కెట్లో దొరుకుతాయి. [గురకలు] దాని మీద కూర్చొని చేసినప్పుడు మంచి ఆసన సిద్ధి అనేది కలుగుతుంది. అది కూడా డైరెక్ట్ గా దాని మీద కూర్చొని దాన్ని పాడు చేయకుండా దానిపైన మళ్ళీ వస్త్రం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు మన పూర్వీకులు ఊరికే చెప్పరు.
(44:43) అప్పుడు సుఖంగా కూర్చుంటాం మడమల దగ్గర గాని మోకాళ్ళ దగ్గర గాని తుంటి దగ్గర గాని ఏ నొప్పి బాధ ఉండదు. పెన్నం ఒక నిటారుగా ఉంటుంది సమక్రాయ శిరోగ్రీవం అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతలో చెప్పిన స్థితి దొరుకుతుంది. మనకి ఈ కుండల్ని సాధన చేసినటువంటి ప్రఖ్యాత యోగులు మన మనం ఎవరిదైనా జీవితాలు చదవాలి అంటే ఎవరెవరు ఉన్నారు మనకి అందుబాటులో మనకి అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో సిద్ధ గురువు అని చెప్పుకుంటున్నటువంటి పుతాళం పీఠాధిపతి ఆయన చేసేది అమ్మవారి ఉపాసనలు అయినా అమ్మవారి ఉపాసనలో కుండలిని కూడా అమ్మవారి
(45:30) రూపమే కాబట్టి ఆ మహానుభావుడు ఆ సాధన చేసి ఉన్నాడు. సిద్ధిని పొంది ఉన్నాడు కాబట్టి ఈరోజుకు అంత అద్భుత స్థితిలో ఉన్నాడు. నాకు తెలిసి కొన్ని నెలల క్రితం కూడా అతనికి ఒక భయంకరమైన ఆయుషట్ అయింది ఆ మహానుభావుడికి వేరేవాడై అంటే జై సీరామ అయిపోవాల ఆయనకున్న ఆ తపస్శక్తి మంత్రశక్తి అమ్మవారి అనుగ్రహము ఆ మహేశ్వరుడు కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరాన సిద్ధేశ్వరాన ఆ మహానుభావుడు తన పరిపూర్ణ దక్షతన అంతా కూడా తన ప్రియ శిష్యురాలు ఒక ఆవిడకి ఇచ్చారు డాక్టర్ ఆమె ఆమెకు ఒక ఆశ్రమం కూడా కట్టించారు తిరుపతి ఏరియా దగ్గర
(46:13) ఆ శ్రీశక్తి పీఠం ఆ వాళ్ళు ఈ సాధనలో ఉన్నారు కానీ బయటికి చెప్పుకోదు. మ్ తర్వాత కాశీలో ఆ 130 ఏళడ్ల వరకు బతికిన మహానుభావుడు ఉన్నాడు కదా శివానంద మహారాజు ఆయన యోగాసన క్రియలు చేస్తాడేమో ఆ వయసులో అంత చేయగలిగినాడు అంటే ఆయనలో ఉన్న కుండలిని శక్తి అద్భుతంగా ఆయనకు పని చేయడం ఆ అలాగే ఇంకా ఎవరైనా మనకి ఇప్పుడు చరిత్రలో ఉన్నటువంటి యోగులు ఉన్నారు కదా ఆ వాళ్ళల్లో మహానుభావులు ఎవరు ఇప్పుడు ఈ విశ్వామిత్రుడు వశిష్టుడు ఇట్లాంటి వాళ్ళు భరద్వాజుడు అగస్త్యుడు లోపాముద్ర స్త్రీలలో కూడా ఉభయ భారతి
(47:00) అంటే ఆమె శంకరాచార్యు గడగడలాడిచ్చింది మండన మిశ్రుని భార్య వీళ్ళంతా కూడా సాధకులే త్రైలింగ స్వామి కచ్చితంగా ఆయనైతే నడిచే శంకరుడు అని పేరు పొందాడు. ఎప్పుడు తింటాడో తెలిీదు. తిన్నాడంటే ఎంత తింటాడో తెలియదు. 300 ఏళ్ళు బతికినట్టుగా రికార్డులలో ఉంది. మ్ అటువంటి మహానుభావులు వీళ్ళందరూ కూడా కొంతమందికి సాధన చేసి కుండలిని తీసుకొని దాన్ని అలాగే వదిలేస్తారు దాన్ని వాడుకోరు.
(47:36) కొంతమందికి వాళ్ళకు తెలియకుండానే వాళ్ళలో కుండలిని శక్తి ప్రచోదయం అయిపోతుంది. పూర్వజన్మ వాసన వాళ్ళు పూర్వ జన్మలో 99 మెట్లు ఎక్కి ఉంటారు. మళ్ళీ ఏ కారణం చేతనో ఆ శరీరం పతనం అయిపోతే ఆ పరమాత్మ మళ్ళీ వచ్చిన జన్మలు ఆ 99వ శిర్పు నుంచి ముందుకు తీసుకెళ్ళేటట్లు ప్రచోదయం చేసేస్తారు. అట్లా కూడా చాలామందికి జరుగుతుంది. తర్వాత మొండిగా సాధన చేసిన వాళ్ళలో ఈ మధ్య మనకఅందరికీ కనపడుతున్న హిమాలయ యోగి ప్రభాకర్ జీ మహారాజ్ ప్రభాకర్ జీ అని చెప్పేసి మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు ఆయన్ని ఆ అటువంటి వాళ్ళు ఆ తర్వాత జ్ఞానానంద మహర్షి అని మీరు
(48:21) తెలంగాణలో ఉంటాడు ఒకాయన ఆయనది ఎక్కడో ఆశ్రమం కూడా ఉంది కరీంనగర్ పోయ జడ్చల దగ్గర జడ్చ శ్రీశైలం పోయేటప్పుడు జడ్చల జ్ఞానానందగిరి మహారాజు ఆయన క్రియాయోగాన్ని ఎక్కువ చేస్తూ పోతే ఆయనకు తెలియకుండానే ఆయనలో కుండలిని ప్రచోదయమయింది. ఇన్న దగ్గర దగ్గర ఏడేళ్ళ అయితా ఉంది ఆయన ఆహారం వదిలేసాడు. కేవలము కూరగాయలు పండ్లు కూరగాయలు కూడా కాదు పండ్లు మందారపు మందార పూలు ఆ మందార ఆ మందార పూలు ఒక ప్లేట్ పెట్టుకుంటాడు ఒక 20 30 అయితే నీళ్లు తాగేస్తాడు మ్ 24 గంటలు సేవ చేస్తున్నాడు ఇప్పుడు
(49:07) నువ్వు విద్యార్థులలో చైతన్యం తీసుకొని రావాల అని బ్రహ్మజ్ఞానం అని తీసుకొని రావాల పిల్లలకు ఈ ఆర్టిఫిషియల్ చదువులు కాదు కాదు మన చదువును మర్చిపోతా ఉంటారు. మన చదువులు చదివినవాడు సంస్కారవంతంగా జీవనం సాగిస్తాడు. ఈ దికమాల ఇంగ్లీష్ చదువులు చదువుకొని ఆ అలవాట్లకు బానిసలే బ్రష్ట్ పడుతున్నారు. వాటిని మార్చేదానికి ఆ మహానుభావుడు అంత కంకణం కట్టుకొని తిరుగుతున్నారు.
(49:33) అలాగే గాయత్రి మంత్రం చేస్తే కుండలిని అవేకనింగ్ అవుతుంది అంటారు గాయత్రీ మంత్రానికి కుండలినికి అనుసంధానం ఉన్నదా ఎందుకంటే కుండలిని మూడున్నర చుట్లు అయితే గాయత్రి త్రిపాద గవత్రి త్రిపద మూడు రకాలుగా ఆకాశ గంగ భూగంగ పాతాళ గంగ అనే మూడు గంగా స్వరూపాలు ఎట్లైతే ఉందో మూడు పాదాలుగా ఉంటుందిఎనిమిది మూల 24 అక్షరాల చతుర్విశంతి అక్షరాని ఈ అక్షరాలు పలికేటప్పుడు ఈ షట్ చక్రాలలో కుండలినికి సంబంధించిన ఈ షట్ చక్రాలలో ఆయా దళాలు కదులుతాయి.
(50:12) కుండలిని మనం సాధన చేసి ఎట్లైతే ఆ దళాలను ఉద్దీపింప చేస్తున్నాం చక్రాలనే ఉద్దీపనంప చేస్తున్నాం ఇక్కడ చక్క ఈ అక్షరాలు ఆ దళాలలో ఉన్నటువంటి చక్క చక్రాలలో ఉన్న దళాలను వైబ్రేట్ చేస్తాయి. కాబట్టి కుండలిని సాధన చేసేవాడికి దానికి ముందే గనుక గాయత్రి బాగా అనుసంధానం అయి ఉంటే ఆయనకి తొందరగా ప్రచోదయం అయతుంది. బాగా యవకన అయతాడు.
(50:43) శీఘ్రంగా ఫలితాలు పొందగలడు. ఇప్పుడు చాలామందికి బాబా ఇప్పుడు కుండల్ని లేవంగానే శరీరంలో ఆ కుండల్ని వచ్చేసి స్వాధిష్టాన చక్రంలోనో ఇట్లా పడ్డప్పుడు కామ క్రోధ లోభ మదమా ఆశ్చర్యాల్లో ఏటినో ఒకదాన్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది అంటే దాన్ని వాసనలో పైకి లేపుతూ ఉంటుంది. ఆ లేచిపోయినప్పుడు వాళ్ళు ఆ విధంగా అంటే క్రోధంలో ఉన్నవాళ్ళు క్రోధంగానో కామంలోనో విపరీత కామంగానో ప్రవర్తించి వాళ్ళ శరీరంలో ఆ తత్వంలోకి వెళ్ళిపోతుంది.
(51:14) అలా కుండల్ని అలాంటి విపరీతాల్లోకి వెళ్ళిన వాళ్ళకి దాన్ని నియంత్రించి బాలెన్స్ చేయడం ఎలా ఆ బ్యాలెన్స్ చేయడానికి ఏమన్నా పద్ధతి ఉందా మీరు అడిగినదే కాకుండా కుండలిని ఒక్కసారి లేయను మొదలు పెడితే దాన్ని ఆపడం కష్టం ఆజ్ఞను కూడా దాటుకొని సహస్రారానికి పోయి బ్రహ్మరంద్ర ఛేదన చేసేసింది అంటే ఈ జీవుడిని కూడా లాక్కొని వెళ్ళిపోతుంది కాబట్టి నియంత్రణ కూడా అవసరం మీరు ఇంతవరకు అన్ని అడిగారు ఈ ప్రశ్న ఇంకా అద్భుతమైన ప్రశ్న పొందడం సులభం పొందిన దాన్ని నిలుపుకోవడం యోగ క్షేమం వహమ్యాహం అంటే యోగం అంటే కలిగి ఉండడం ఆ ఉన్నవి పోకుండా ఉండడం క్షేమం
(52:00) సో ఈ పోకుండా ఉండేదాన్ని విపరీతమైపోయి మనల్ని పాడు చేయకుండా ఉండేదానికి సోహం బ్రహ్మ హంస సోహం అని చెప్పేసి తిరిగి రివర్స్ లో చదువుకుంటూ ఇప్పుడు ఆజ్ఞ దగ్గరికి వచ్చేసింది ఆజ్ఞ నుంచి విశుద్ధి దగ్గరికి వచ్చేసింది సోహం అమస్మి సోహం అమస్మి సోహం అమస్మి ఇప్పుడు మెల్లగా అనాహతం దగ్గరికి వచ్చేసింది సోహం అమస్మి సోహం అమస్మి సోహం అమస్మి ఇప్పుడు నా మణిపూరక దగ్గరకానికి వచ్చేసింది.
(52:31) సోహం అమస్మి హమస్మి సోహం సోహం అమస్మి ఇప్పుడు నా స్వాధిష్టానానికి వచ్చింది. తన స్వస్థానమైన మూలాధారానికి ఆ తల్లి చేరుకుంది. ఆ భావన ఒక దిక్కు మనం ఇంటర్నల్ కమాండ్ ఇస్తున్నాము. ఈ సోహం హంస అంటాం మనం చేసేదే హంస జపం ఇట్లా చేస్తే హంస రివర్స్ వస్తే సోహం ఆ మాట అన్నప్పుడు ఈ వాయు చలనం కూడా అట్లా డౌన్ అయింది. న్యాయం అయితే హంస జపం అంటున్నాం పీల్చేటప్పుడు హం అని వస్తుంది తీసేటప్పుడు సహ అని వస్తుంది లేదా సహ అని వస్తుంది హం అని పోతాంది ఎట్లో చెప్తారు దాన్ని రివర్స్ చేసేసామఅంటే అది డౌన్ చాలా
(53:18) సంతోషం బాబాగారు చాలా అద్భుతమైన విషయాలు అంత గురుకృప అంతా గురు కృప అంతా గురుకృప అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఇప్పటివరకు అద్భుతంగా కుండల్ని యోగం గురించి ఇన్ని కోణాల్లో మన మాకు అందించినందుకు చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు మనం ఈ యొక్క జ్ఞానాన్ని మనం బాబాగారి దగ్గర నుంచి తీసుకున్నాం మరొక్కసారి మరొక్క విశిష్ట అతిథి దగ్గర నుంచి మనం అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సెలవు నమస్కారం లోకా సమస్త సుఖినోభవంతో శుభం భుయాత్ సహనావతు సహనభునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తుమా
(54:02) విద్విశావహై ఓం శాంతి శాంతి శాంతి ఓకే

No comments:

Post a Comment