Monday, March 28, 2022

🍁ఉచితం🍁ఒక కుక్క గ్రహించిన చిన్న విషయాన్ని కూడా మానవులమైన మనం గ్రహించలేక పోతున్నం

🍁ఉచితం🍁
ఒక రోజున దొంగ ఒకడు ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు.
ఇంటి ముందు కాపలాగా ఒక కుక్క ఉన్నది. దొంగను చూసింది కానీ ఏ చప్పుడు చేయకుండా చూస్తూ ఉన్నది. అతన్ని చూసి మొరగని కుక్కను చూసి దొంగ ఆలోచనలో పడ్డాడు. దొంగతనానికి వెళదామా? వద్దా? అని.
తీరా ఇంటి లోపలకు వెళ్ళాక కుక్క అరిచిందంటే ఏం చేయాలి? ఇప్పుడే అరిస్తే వేరే ఇంటికి దొంగతనానికి వెళ్లొచ్చు! అని అనుకున్నాడు.
ఇలా ఆలోచిస్తూ చివరగా తాను తెచ్చిన రొట్టెముక్కను కుక్కకు విసిరాడు. అంతే వెంటనే ఆ కుక్క గట్టిగా అరుస్తూ అతని వెంటపడి కరవడానికి ప్రయత్నించింది.
అప్పుడు దొంగ కుక్కతో ఇలా అన్నాడు. "నన్ను చూసికూడా అరవని నువ్వు రొట్టె ముక్క ఇవ్వగానే అరుస్తున్నావు ఎందుకు?" అని అడిగాడు.
నువ్వు ఊరికే ఉన్నప్పుడు, ఒకవేళ నువ్వు ఈ ఇంటి బంధువో లేక తెలిసిన వ్యక్తో అయిఉంటావని అనుకున్నాను.
కానీ ఎప్పుడైతే నువ్వు "ఉచితంగా రొట్టెముక్క ఇచ్చావో అప్పుడే నాకు అర్థమయింది నువ్వు దొంగవని", అని బదులిచ్చింది ఆ కుక్క.
ఆలోచించవలసిన విషయమే కదండీ ఇది. ఉచితం అనగానే ఆలోచన మరిచి ఎగబడుతున్నారు జనాలు.
"ఉచితంగా రొట్టె" ఇచ్చాడంటే అందులో ఎంతటి అర్థం ఉందో గ్రహించింది కుక్క. కానీ మషులమైన మనమే "ఉచితంగా డబ్బులు" ఎందుకు ఇస్తునారో గ్రహించలేక పోతున్నాం.
ఒక కుక్క గ్రహించిన చిన్న విషయాన్ని కూడా మానవులమైన మనం గ్రహించలేక పోతున్నందుకు చాల బాధగా ఉంది.

సేకరణ

మంచి మాట..లు

ఆత్మీయ బంధు మిత్రులకు ఆదివారపు శుభోదయం శుభాకాంక్షలు ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడి అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ... 💐🤝 AVB
ఆదివారం :-27-03-2022
ఈ రోజు AVB మంచి మాట..లు

కష్టసుఖాలు సీజన్ వంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైమ్ కు వస్తాయి, ఉండాల్సిన రోజులు ఉంటాయి, పోవాల్సిన టైమ్ వచ్చినప్పుడు పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని.

రెండు చక్రాల బండికి stand ఎంత అవసరమో రెండు జీవితాల మధ్య understanding కూడా అంతే అవసరం.

ప్రశ్న ఏదైనా ప్రేమతో బదులు ఇస్తే మనం గడిపే ప్రతిరోజు అందంగా ఉంటుంది. బదులు ఇచ్చే విధానం తోనే సగం ప్రపంచాన్ని మనం గెలవవచ్చు.

కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, మనస్సు విప్పి మాట్లాడుకోవడానికి నలుగురు మనుషులు, ఇదే అసలైన సంపద.

ఎవరితోనైనా గొడవ జరిగితే మళ్ళీ కలవడానికి ఆ వ్యక్తి చేసిన ఏదైనా ఒక చిన్న మంచి పని ఉందేమో గుర్తు తెచ్చుకోండి, జీవితం హ్యాపీ గా ఉండాలంటే అందరితో కలిసి ఉండాలి.

సేకరణ ✒️ AVB సుబ్బారావు 📱9985255805

సేకరణ

"అందరూ బాగుండాలి!" అనేది కేవలం ఓ వాక్యం కాదు, అది ఒక దివ్య మంత్రం !

🍀🌺🍀🌺🍀🍀🌺🍀🌺🍀
"అందరూ బాగుండాలి!"
➖➖➖✍️

"అందరూ బాగుండాలి!" అనేది కేవలం ఓ వాక్యం కాదు, అది ఒక దివ్య మంత్రం !

అన్ని ఇతర మంత్రాలకంటే అదే గొప్పగ పనిచేస్తుంది!

ప్రయోగించి చూసినవారికి దాని యొక్క ఫలితాలు పూర్తిగా తెలుస్తాయి !!

'అందరూ బాగుండాలని అనుకోవల్సిన అగత్యం ఏమిటి? 'అంటూ ఎదురుప్రశ్న వేసే వారున్నారు.

'ఇతరుల బాగు కోరితే ఏం వస్తుంది?' అన్నది వారు వేసే రెండో ప్రశ్న.

అందరూ బాగుండాలని అనుకోవడం వెనుక ఓరహస్యం ఉంది…

"సర్వేజనా స్సుఖినో భవంతు!" అనేది పెద్దల మాట!

ఇతరులు బాగుండాలని కోరుకునే వాడు… తానూ బాగుంటాడు !!

ప్రతి రోజూ... తనకు సంబంధంలేని మనిషి యొక్క క్షేమం కోరి హృదయ పూర్వకంగా ప్రార్థన చేసే వ్యక్తికి అదే ఆరోగ్యం, ఆనందం!

ఈ ఆరోగ్యం- ఆనందం… కోసం అతడు ఎక్కడికీ వెళ్ళనక్కర లేదు.

అలా ప్రార్థన చేస్తున్నపుడే ఇతని శరీరంలో మార్పులు కలుగుతాయి. మనసులో చక్కటి భావప్రకటనలు ఏర్పడి ధ్యానంగ మారి రోగాల్ని దూరం చేస్తాయి.

లోకం క్షేమం కోరుకునేవారి బాగును భగవంతుడే చూస్తుంటాడు.

నలుగురు ఇళ్ళు కట్టుకోవడానికి సహాయపడిన వ్యక్తిని చెట్టుకింద ఎవరు ఉండనిస్తారు?

నిజాయితీగా నిస్వారంగా ఉండేవారు, నలుగురి క్షేమమూ కోరేవారే ఈలోకానికి కావాలి. వారందరి ఉమ్మడి రూపమే దివ్యశక్తి ! దాన్ని ఏదేవుడి పేరుతో నైనా పిలుచుకోవచ్చు!✍️️

🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🍀🌺🍀🌺🍀

సేకరణ

వనితా…అలసిపోవా నువ్వూ......అలిసిపో తల్లీ! కనీసం అయినా అలసిపో తల్లీ!

వనితా......

వనితా…అలసిపోవా నువ్వూ
అల్లారు ముద్దుగా పెంచుకున్నారే,
నీ అరికాళ్ళ క్రింద అరచేతులుంచారే,
నీకు కారే కన్నీటికి దోసిలి పట్టారే,
నీ మోముపై నవ్వును చూసి మురిసిపోయారే,
నీ ఎదుగుదల చూసి గర్వ పడ్డారే నీ కన్నవాళ్ళు.

నీ చదువు సంస్కారాలు చూసి ఉప్పొంగిపోయారే,
నీ కార్యదక్షతకి దాసోహం అయ్యారే.

నీ ముగ్ద మనోహర సౌదర్యానికి దాసోహం అంటూ ఒకడొచ్చాడే.

ఇలాంటి ఈడు జోడు ఇలలో లేదంటూ విర్రవీగి పోతిమే…

కాలం వేసే కాటు మొదలాయేనేమో
అరచేతులు కాయలు కాచే,
అరికాళ్ళు పగుళ్ళు వారే.

వేకువ జానము మొదలు
వెట్టి చాకిరి నీ బంధువాయే
పిల్లల పిలుపులు భర్త అరుపులు.

పరుగు పరుగున పనులు ముగించి పయనమయితివే.
ఇంటి బాద్యతలు సగం మొయ్యటానికి.

గూటికి చేరిన వేళ
కులాసాగా వేసే కేక “కాఫీ”

ఇదిగో మొదలు... అదే మొదలు క్షమించు తల్లీ...
కనికరం లేదే ఈ మగ జాతికి.
కనీసం అలిసి పోయి అయినా కనిపించు తల్లీ!
ముగింపే లేని గమ్యానికి, సంసారమనే పడవలో భయలుదేరావ్.

ముంచుకున్నా నువ్వే
చేరుకున్నా నువ్వే

అలిసిపో తల్లీ!

కనీసం అయినా అలసిపో తల్లీ!

⁃ కోటయ్య మొగిలి, ముంబై......✍️

సేకరణ

ఏడు చేపల కథకు ఆధ్యాత్మిక వివరణ

🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఏడు చేపల కథకు ఆధ్యాత్మిక వివరణ తెలుసుకుందాం.
☘☘☘☘☘☘☘☘
రాజుగారు అంటే మనిషి.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
జీవితమే ఒక వేట. వేటే ఒక జీవితం.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
రాజ కుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు ( అనగా 6 )
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
1.కామ 2.క్రోధ 3.లోభ 4.మోహ 5.మద 6.మాత్సర్యాలు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
వీటన్నిం టిని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు. అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
అందుకే కథలో ఆరు చేపలను ఎండగట్టినట్టు చెప్పారు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఏమిటా చేప. అది మనస్సు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
దీన్ని జయించడం చాలా కష్టం.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఎంత ప్రయత్నించినా అది ఎండదు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
మనస్సు అంటే ఏమిటి❓
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
మనస్సు అంటే సంకల్ప వికల్పాలు
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది❓గడ్డిమేటు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
గడ్డిమేటు అంటే ఏమిటి?
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
కుప్పపోసిన అజ్ఞానం.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించా లంటే ఎలా?
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయ కమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే‼️
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఆ కుప్ప తరిగేది కాదు, తగ్గేది కాదు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
మరి అది పోవాలంటే ఏం చేయాలి❓
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఆవు వచ్చి మేయాలి.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఆవు ఎక్కడి నుంచి రావాలి. అసలు ఆవు అంటే ఏమిటి❓
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఆవు అంటే జ్ఞానం.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు (జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం)
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఈ గోవును ఎవ్వరు మేపాలి.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
గొల్లడాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు❓
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
సమర్ధ సద్గురుడు, జగద్గురుడు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా‼️
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికి ధారపోశాడు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఏమిరా నాయనా‼️ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు❓
🌸🌸🌸🌸🌸🌸🌸
అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఓ జగన్మాతా ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు❓ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు❓
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
వాడికి చీమ కుట్టింది. ఎక్కడిది చీమా❓దానికి ఇంకోపేరే సంసారం.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడికన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్ల వాడినే చూసుకుంది. మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టక పోవడం వలన తన విధిని నిలిపి వేసాడా.లేదు.అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం,
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
చీమలు పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట❓
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు
ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు.

🕉️ఓం నమో🙏భగవతే వాసుదేవాయ
🕉️సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏*

సేకరణ

సృష్టి ఎందుకు?

సృష్టి ఎందుకు?

అందరికీ కలిసి ఒక ప్రపంచం లేనే లేదు...
యెవడి ప్రపంచంలో వాడున్నాడు...
యెవడి స్వప్నప్రపంచం వాడిదే అన్నట్టుగా...

నీ కలలో ఇదే విధమైన సంభాషణే జరిగిందనుకో...
ప్రశ్నించేవాడు...
సమాధానమిచ్చేవాడు...
ఇద్దరూ నీవే కదా అవుతావు....

ఎవడి కలకు వాడే కర్త.
ఎవడి జగత్తుకు వాడే కర్త.
స్వప్న జగత్తుకు...
జాగ్రత్ జగత్తుకు...
ఇంచుకైనా భేదం లేదు...

భగవంతుడు ఎందుకు సృష్టించాడు?
అని ప్రశ్నించేవాడు ఆ భగవంతునికి అభిన్నం.
ఆడించేవాడూ భగవంతుడే...
ఆడేవాడూ భగవంతుడే...

తన మూలం వెళ్లి...
తనలో కలిసిపోయి...
తాను ఒక్కడే శేషించినప్పుడు...
ఆ తాను భగవంతుడే అని అనుభవమాయ్యాక...
ఆ ఏకాత్మస్థితిలో...
సృష్టితో పాటు...
ప్రశ్న, ప్రశ్నించేవాడు కూడా మాయమౌతారు...

"ఎందుకు" అన్న ప్రశ్నకు...
ఖచ్చితమైన సమాధానం...
వాచా ఎప్పటికీ దొరకదు...
తాను భగవంతునిలో అంతర్భాగమై ఉన్నప్పటికీ...
తాను "అదే" అయినప్పటికీ....
మనకు తెలియడం లేదు...

ఒకడు గూబ గుయ్యమనేట్టు చెంపమీద కొట్టాడు...
ఎందుక్కొట్టావు? అని అడిగితే...
నా బలమేమిటో నీకు తెలియడానికి అన్నాట్ట...
ఈ సృష్టి యెందుకు చేశావు?
అని భగవంతుణ్ణి అడిగితే...
నేనొకడ్ని ఉన్నానని...
నీకు తెలియడానికి అన్నాట్ట...

ఇది హాస్యాస్పదంగా అనిపించినప్పటికీ...
సృష్టి కారణమేమి? అన్న ప్రశ్నకు...
ఇంతకు మించి సమాధానం లేదనిపిస్తుంది...

గొంతెత్తి పాట పాడకుంటే...
అతడు గాయకుడు అని ఎలా తెలుస్తుంది?
వీణ పై స్వరాల్ని మీటకుంటే...
అతడు వైణికుడు అని ఎలా తెలుస్తుంది?
రాతిని శిల్పంగా మలచుకుంటే...
అతడు శిల్పి అని ఎలా తెలుస్తుంది?
చిదాకాశమనే తెరపై విశ్వసృష్టిని గీయకుంటే... అతడు భగవంతుడు అని ఎలా తెలుస్తుంది?

బ్రహ్మ మానసపుత్రుడైన వశిష్ఠమహర్షి...
పుట్టుకతోనే శుద్ధబ్రహ్మజ్ఞాని...
అతనికి బంధంగానీ, దుఃఖంగానీ తెలియవు...
నీవు గడియకాలం అజ్ఞానానికి లోనవుదువుగాక...
అని అకారణంగా, ఓ సదుద్దేశంతోనే...
వశిష్ఠునికి శాపం పెట్టాడు బ్రహ్మ...
వశిష్ఠుడు అజ్ఞానవశుడై విచారవదనంతో...
తన అకారణ దుఃఖాన్ని పోగొట్టమని ప్రార్థించగా...
అందుకు బ్రహ్మ చేసిన ప్రబోధమే యోగవాశిష్ఠం...

కష్టసుఖాలనేవి ఎలా ఉంటాయో...
అనుభవంలో ఉన్నప్పుడే...
అందుండి బయటపడడానికి అనువైన బోధను...
లోకులకు చేయగలిగే సమర్థత...
వశిష్ఠునికి వస్తుందనేది బ్రహ్మగారి సదుద్దేశము...

మితం అనేది తెలియకపోతే
అమితం అనేది ఎలా తెలుస్తుంది?
అంతం అనేది తెలియకపోతే
అనంతం అనేది ఎలా తెలుస్తుంది?
బాధ అనేది తెలియకపోతే
ఆనందం అనేది ఎలా తెలుస్తుంది?
అజ్ఞానం అనేది తెలియకపోతే
జ్ఞానం అనేది ఎలా తెలుస్తుంది?

భగవంతుడు చేసిన సృష్టికార్యము కూడా అలాంటిదే...
ఏకంగా ఉన్న తాను ఏకంగా ఉండక...
అనేకమైనాడు అది లీల అయ్యింది....
తిరిగి అనేకం నుండి ఏకం వైపుకు ప్రయాణమయ్యాడు...
అది జీవితం అయ్యింది...

"ఎందుకు?" అని అడిగితే,
లోకవత్ లీలా కైవల్యం అంటుంది బ్రహ్మసూత్రం.
"లీల" అన్నాక ఇంకేం మాట్లాడగలం?
"లీల యెందుకు?" అని అడగలేం.
ఆనందం కోసం ఆడేది క్రీడ.
ఆనందంగా ఉండి చేసేది లీల.

ఎందుకు దుఃఖిస్తున్నావు?
అని అడుగుతామే గాని...
ఎందుకు ఆనందంగా ఉన్నావు? అని అడగం...
దుఃఖానికి కారణం ఉంటుందేగాని...
ఆనందానికి కారణం ఉండదు...

శిశువు అకారణ ఆనందానికి బాహ్యచేష్టలే కేరింతలు...
శివుని అకారణ ఆనందానికి బాహ్యరూపమే ప్రపంచం...
శివుని ఆనందసాగరంలో తేలియాడే నురగలు
ఈ ద్వంద్వాలు, త్రిపుటులు...
*

సేకరణ

స్త్రీ అను పదమునకు 220 పర్యాయ పదములివి.

ఇన్ని పదాలు ఒక్క స్త్రీ కే ఉన్నాయని ఇప్పటివరకు నాకు తెలియదు.

స్త్రీ అను పదమునకు 220 పర్యాయ పదములివి. దాదాపుగా ఒక పదమునకు ఇన్ని పర్యాయ పదములు గల ఘనత మరే భాషలో ఉండవేమో ...!!!*
1. అంగన
2. అంచయాన
3. అంబుజాలోచన
4. అంబుజవదన
5. అంబుజాక్షి
6. అంబుజనయన
7. అంబురుహాక్షి
8. అక్క
9. అతివ
10. అన్ను
11. అన్నువ
12. అన్నువు
13. అబల
14. అబ్జనయన
15. అబ్జముఖి
16. అలరుబోడి
17. అలివేణి
18. అవ్వ
19. ఆటది
20. ఆడది
21. ఆడగూతూరు
22. ఆడుబుట్టువు
23. ఇంచుబోడి
24. ఇంతి
25. ఇదీవరాక్షి
26. ఇందునిభాష్య
27. ఇందుముఖి
28. ఇందువదన
29. ఇగురాకుబోణి
30. ఇగురాకుబోడి
31. ఇభయాన
32. ఉగ్మలి
33. ఉజ్జ్వలాంగి
34. ఉవిధ
35. ఎలతీగబోడి
36. ఎలనాగ
37. ఏతుల
38. కంజముఖి
39. కంబుకంఠ
40. కంబుగ్రీవ
41. కనకాంగి
42. కన్నులకలికి
43. కప్పురగంధి
44. కమలాక్షి
45. కరబోరువు
46. కర్పూరగంది
47. కలకంఠి
48. కలశస్తిని
49. కలికి
50. కలువకంటి
51. కళింగ
52. కాంత
53. కించిద్విలగ్న
54. కిన్నెరకంఠి
55. కురంగానయన
56. కురంగాక్షి
57. కువలయాక్షి
58. కూచి
59. కృషమధ్యమ
60. కేశిని
61. కొమ
62. కొమరాలు
63. కొమిరె
64. కొమ్మ
65. కోమ
66. కోమలాంగి
67. కొమలి
68. క్రాలుగంటి
69. గజయాన
70. గరిత
71. గర్త
72. గుబ్బలాడి
73. గుబ్బెత
74. గుమ్మ
75. గోతి
76. గోల
77. చంచరీకచికుర
78. చంచలాక్షి
79. చంద్రముఖి
80. చంద్రవదన
81. చక్కనమ్మ
82. చక్కెరబొమ్మ
83. చక్కెర
84. ముద్దుగుమ్మ
85. చాన
86. చామ
87. చారులోన
88. చిగురుంటాకుబోడి
89. చిగురుబోడి
90. చిలుకలకొలోకి
91. చెలి
92. చెలియ
93. చెలువ
94. చేడి(డియ)
95. చోఱుబుడత
96. జక్కవచంటి
97. జని
98. జలజనేత్ర
99. జోటి
100. ఝషలోచన
101. తనుమధ్య
102. తన్వంగి
103. తన్వి
104. తమ్మికింటి
105. తరళలోచన
106. తరళేక్షణ
107. తరుణి
108. తలిరుబోడి
109. తలోదరి
110. తాటంకావతి
111. తాటంకిని
112. తామరకంటి
113. తామరసనేత్ర
114. తియ్యబోడి
115. తీగ(వ)బోడి
116. తెఱువ
117. తెలిగంటి
118. తొగవకంటి
119. తొయ్యలి
120. తోయజలోచన
121. తోయజాక్షి
122. తోయలి
123. దుండి
124. ధవలాక్షి
125. ననబోడి
126. నళినలోచన
127. నళినాక్షి
128. నవల(లా)
129. నాంచారు
130. నాచారు
131. నాచి
132. నాతి
133. నాతుక
134. నారి
135. నితంబవతి
136. నితంబిని
137. నీరజాక్షి
138. నీలవేణి
139. నెచ్చెలి
140. నెలత
141. నెలతుక
142. పంకజాక్షి
143. పడతి
144. పడతుక
145. పద్మముఖి
146. పద్మాక్షి
147. పర్వందుముఖి
148. పల్లవాధర
149. పల్లవోష్ఠి
150. పాటలగంధి
151. పుచ్చడిక
152. పుత్తడిబొమ్మ
153. పువు(వ్వు)బోడి
154. పువ్వారుబోడి
155. పుష్కరాక్షి
156. పూబోడి
157. పైదలి
158. పొల్తి(లతి)
159. పొల్తు(లతు)క
160. త్రీదర్శిని
161. ప్రమద
162. ప్రియ
163. ప్రోడ
164. ప్రోయాలు
165. బంగారుకోడి
166. బాగరి
167. బాగులాడి
168. బింబాధర
169. బింబోష్ఠి
170. బోటి
171. భగిని
172. భామ
173. భామిని
174. భావిని
175. భీరువు
176. మండయంతి
177. మగువ
178. మచ్చెకంటి
179. మడతి
180. మడతుక
181. మత్తకాశిని
182. మదిరనయన
183. మదిరాక్షి
184. మసలాడి
185. మహిళ
186. మానవతి
187. మానిని
188. మించుగంటి
189. మించుబోడి
190.మీనసేత్రి
191. మీనాక్షి
192. ముగుద
193. ముదిత
194. ముదిర
195. ముద్దరాలు
196. ముద్దియ
197. ముద్దుగుమ్మ
198. ముద్దులగుమ్మ
199. ముద్దులాడి
200. ముష్ఠిమధ్య
201. మృగలోచన
202. మృగాక్షి
203. మృగీవిలోకన
204. మెచ్చులాడి
205. మెఱుగారుబోడి
206. మెఱుగుబోడి(ణి)
207. మెలుత
208. మెళ్త(లత)మెల్లు(లతు)
209. యోష
210. యోషిత
211. యోషిత్తు
212. రమణి
213. రామ
214. రుచిరాంగి
215. రూపరి
216. రూపసి
217. రోచన
218. లతకూన
219.లతాంగి
220. లతాతన్వి
తెలుగు భాషలో ఒక్క స్త్రీ అనే పదానికి మాత్రమే ఇన్ని పర్యాయ పదాలున్నాయంటే - తెలుగు నా మాతృభాష అని చెప్పడం గర్వకారణం కదా.
దేశభాషలందు తెలుగు లెస్స!

సేకరణ

నేటి మంచిమాట. పిల్లలకి class లో నువ్వే first రావాలి, నీకే అన్ని పేరు ప్రఖ్యాతులు కావాలి అని చిన్నపటి నుంచి నూరిపోయించడం కంటే...

నేటి మంచిమాట.

తల్లితండ్రులు పిల్లలకి class లో నువ్వే first రావాలి, నీకే అన్ని పేరు ప్రఖ్యాతులు కావాలి అని చిన్నపటి నుంచి నూరిపోస్తుంటారు, కానీ అది correct కాదు, నేను అందరికన్నా ముందుండాలి అన్న భావన కంటే అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అనే సరిఅయిన భావన తోనే పిల్లలని పెంచాలి. గెలుపు ఓటమి అన్నవి అందరికి ప్రకృతి సహజం, వాటివల్ల నిరాశకు లోనుకాకుండా సమంగా ఉండడమే వ్యక్తిగత గెలుపు. ఈ భావన పిల్లలలో అలవాడాలంటే వాళ్ళకి ధ్యానవిద్య తప్పనిసరి. ధ్యానం వలన మనస్సు ను శాంతంగా ఉంచుకోవటం అన్నది basic common sense.

- బ్రహ్మర్షి పితామహ పత్రీజీ


సేకరణ

నిత్య సత్యాలు....

🌊ప్రవాహాన్ని జయించలేకపోయినా మళ్ళించవచ్చు.
అలాగే మనస్సులోని దుర్గుణాలను దూరం చేయాలని ప్రయత్నించటం కన్నా దానిని సద్గుణాల వైపు మళ్ళించగలగటం తేలిక👍

⌚ గడిచే ప్రతి గంటకూ ఓ అరవై క్రొత్త విషయాలను మనం నేర్చుకుంటూనే వున్నాం.అదే మన విజయాలకు కారణం.

మరి మన పరాజయాలకూ కారణం వుంది.
ఈ గంటలో మనం యాభైతొమ్మిది పాత విషయాలను మరచిపోతుంటాం.⌚

👉ముందు నీకు ఏమి కావాలో తేల్చుకో

నీవు ఏమి కోరుకుంటున్నావో తెలుసుకో

రెండింటి మద్య దూరం ఎంత తగ్గించ గలిగితే అంత దుఃఖం నీ నుండి దూరమైనట్లే!



సేకరణ

మానసిక ఆరోగ్యం కోసం....ధ్యానం ......

మానసిక ఆరోగ్యం కోసం....ధ్యానం ......

అందరూ శారీరక ఆరోగ్యం కోసం ప్రయత్నిస్తున్నారు దానికోసం నడవడం, ఆసనాలు, ప్రాణాయామం అభ్యాసం చేస్తున్నారు,,, మంచిదే కానీ.... అంతకంటే ముఖ్యమైనది మైండ్ ఫిట్నెస్.. మానసిక ఆరోగ్యం.
A sound mind in a sound body

బాగానే ఉన్నాం అంటారు కానీ..... వారిలోని మానసిక లోపం వారికి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా, సరైన మానసిక స్థితి కలగాలంటే,, మైండ్ ఫిట్ గా ఉండాలంటే...,, ఆనాపానసతి ధ్యానం.... తప్ప వేరే మార్గం లేదు.
మనసు లోని చెడు గుణాలు పోవాలన్నా,మనసు శుద్ధమవ్వాలన్నా,, మనసు మారాలి అన్నా,, ఒకటే మార్గం
అదే శ్వాస మీద ధ్యాస. మనసు లో అలజడి ‌, అశాంతి , దుఃఖము, ఉన్నా బాధ ఉన్న సమస్య ఉన్నా, ప్రతిరోజు క్రమం తప్పకుండా అభ్యాసం, చేయగా ఆనందాన్ని ,ఆరోగ్యాన్ని, ఆత్మజ్ఞానం వస్తుంది.

సుఖాలు కోరుకోవడం తప్పు లేదు. సుఖాలు వెంట పరుగులు తీస్తున్నారు తప్ప ,, దుఃఖం లేని స్థితి కోరుకోవడం లేదు ..దుఃఖాలు లేనటువంటి సుఖాలు కోరుకోవడమే వివేకం.
దుఃఖం లేకుండా జీవించడమే అసలైన జీవితం. దుఃఖ రాహిత్యం
పొందేందుకు అందరూ ప్రయత్నం చేయాలి.

ఉషోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

Sunday, March 27, 2022

కోపం ఎందుకు వస్తుంది, దాని దుష్పరినామాలు, కోపం వచ్చినపుడు మనిషి ఏం చేస్తాడు...

ఫ్రెండ్స్. మనకు నచ్చనిది మనసు మెచ్చనిది
మెదడు ఒప్పనిది వ్యతిరేక క్రియా జరిగినచో శరీరంలో తాపం, శ్వాసలో వేగం,
కనులలో కంపనం,మాటలలో గతులు తప్పిదం దాని పేరే కోపం. ప్రదర్శించటానికి వేదిక దొరికితే చాలు ప్రళయ తాండవం చేసే నర్తకి ఈ కోపం

అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే
అంతా మంచే జరుగుతుంది. కాని కోరికలు
అన్నీ తీరవు కదా! మనకు తీరని కోరికలే ఎక్కువ.
ఎలాటి కోరికలు అంటే ఇతరుల జీవితంలో జరిగేవి మనకు జరగాలి అని విపరీతంగా ఊహించుకుంటాం ఊహించుకున్న కోరికలు తీరకపోతే విపరీతమైన కోపం వస్తుంది.

పోనిలే ఒక వేళ తేగా కోరుకుంటున్నాడు
నా బిడ్డ అని ఆ భగవంతుడు కోరిక తీర్చాడు అనుకుందాం అక్కడితో ఆగుతామా
అయ్యో ఆగం. అగం కాకా అగం.దాని వెంటనే
మరొక కోరిక పుట్టుకొస్తుంది .

ఎందుకంటే దొరికినదానితో తృప్తి చెందడం మానవ లక్షణం కాదు. ఉన్నదానిని పక్కన బెట్టి లేనిదాని కోసం పాకులాడటం మనకు పుట్టుకతో వచ్చిన గుణం. కాబట్టి కోరికలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. అవి తీరకపోతే కోపం రావడం సహజం. ఆ కోపం మనమీద కాదు. ఎవరిమీదనో కోపం.
వాళ్ల వల్ల నాకు ఇలా జరిగింది.వీళ్ల వల్ల నాకు ఇలా జరిగింది. అని వాళ్ల మీదా వీళ్ల మీద కోపం వస్తుంది.
అప్పుడు ఏమవుతుంది అనుబంధాలను విడగొడుతుంది ఆప్యాయతను చెడగొడుతుంది మనిషిగా మనలను పడకొడుతుంది.

కొంతమంది అయితే మరి విచిత్రం
అకారణ కోపం. దానికి ఒక కారణం ఉండదు. చిరుబురులాడుతుంటారు.ఎప్పుడు చూడు అసహనంగా ఉంటారు పలకరిస్తే కస్సుమంటారు చేతిలో ఏది ఉంటే అది విసిరికోడతాడు.

అసలు ఈ కోపం అంటే ఏమిటి ఎందుకు వస్తుంది కోపం అంటూ వేరే ఏమీ లేదు. అనుకున్న కోరిక తీరకపోతే, అనుకున్నది జరగకపోతే, తాను అనుకున్నట్టు కాకుండా వ్యతిరేకంగా జరిగితే,
తనకు నచ్చని వాడిని చూస్తే కలిగే స్థితి కోపము.
ఒక ప్రవాహం పోతూ ఉంటుంది. అది ప్రశాంతంగా ఉంటుంది. దానికి ఏదైనా అడ్డుతగిలితే ఎగిసిపడుతుంది. అలాగే అనుకున్నది నెరవేరకపోతే, మనకు నచ్చనిది జరిగితే, కోపం వస్తుంది.

క్రోధం వచ్చిన తరువాత జరిగే పరిణామము... మానవుడు తాత్కాలికంగా వివేచనా శక్తి కోల్పోతాడు. విచక్షణ ఉండదు. మంచి చెడు గుర్తించడు. ఎవరిని తిడుతున్నాడో
ఏం తిడుతున్నాడో చూడడు .
నోటికి ఎంతవస్తే అంత అనేస్తాడు.
దానినే మోహము అంటారు. అంటే ఆ కోపానికి వశుడు అవుతాడు. ఆవేశానికి లోను అవుతాడు. పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తాడు.

శంకరుల వారు కోపం వచ్చినవాడి గురించి చెబుతూ అటువంటి వాడు గురువునుకూడా ఆక్షేపిస్తాడు
నీకేం తెలుసు అంటాడు. తల్లిని కూడా కొట్టడానికి పోతాడు.

ఇటువంటి స్థితికి చేరుకున్నప్పుడు మానవుడికి బాహ్య స్మృతి ఉండదు. ఒకవిధమైన ట్రాన్స్ ఉంటాడు ఊగి పోతుంటాడు. అంటే మంచి చెడు తెలుసుకొనే స్మృతి అంటే జ్ఞాపక శక్తి పోతుంది. తాను ఎవరితో మాట్లాడుతున్నాడో మరిచిపోతాడు. నువ్వెంత అంటే నువ్వెంత అని అంటాడు. వాడు నా యజమాని వాడు నా తండ్రి, నా అన్న నా బంధువు, నా భార్య అనే స్పృహ (జ్ఞాపకం) కూడా ఉండదు. ఎవరినీ లెక్కచేయడు. ఆ స్థితి నుండి మానవుడు ఇంకా దిగజారి తన బుద్ధిని కోల్పోతాడు. ఏది చేయాలి ఏది చేయకూడదు అని నిర్ణయించేది బుద్ధి. ఆ బుద్ధి కూడా పని చేయదు . పక్కకు తొలిగి ఉంటుంది. ఎందుకంటే చెప్పినా వినే స్థితిలో ఉండగా .

ఫ్రెండ్స్ కోపం రావడం మానవ సహజం అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత.


నేనైతే నాకు కోపం వచ్చినప్పుడు
నా కళ్ళనుండి కన్నీరు రానివ్వని. కానీ
నా నోటి నుండి మాట మాత్రం రానివ్వను.
కన్నీటితో నా కోపం పోతుంది.
అదే నేను మాట జారితే
ఎదుటివారికి బాధ కలుగుతుంది ఈ సత్యాన్ని అందరూ గుర్తించాలి.

ఉషోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

Friday, March 25, 2022

BJP మెహబూబా ముఫ్తీతో ఎందుకు పొత్తు పెట్టుకుంది?

BJP మెహబూబా ముఫ్తీతో ఎందుకు పొత్తు పెట్టుకుంది?

ఈరోజు "ది కాశ్మీర్ ఫైల్స్" సినిమా ప్లే అవుతోంది.
ఇందులో ఆర్టికల్ 370 గురించి చర్చలు ఉన్నాయి. కాశ్మీర్ వెలుపల ఎవరూ కాశ్మీర్ రాష్ట్రంలో భూమిని కొనుగోలు చేయలేరు.

అయితే, అదే చట్టం ప్రకారం పీఓకేలో ఉన్న వ్యక్తిని కశ్మీరీగా పరిగణించారు.

దీనికి తోడు కాశ్మీరీ ముఖ్యమంత్రికి "ప్రధాని" స్థానం లభించింది. కాశ్మీర్‌లో స్వతంత్ర జాతీయ జెండా ఉండేది.

ఆర్టికల్ 370ని రద్దు చేయాలంటే కాశ్మీర్ అసెంబ్లీ ఆమోదం అవసరం. కాబట్టి, ఈ విభాగాన్ని రద్దు చేయడం దాదాపు అసాధ్యం అని నేను కూడా అనుకున్నాను.

అయితే, దీనికి సంబంధించిన వ్యూహాలను రూపొందించాలని మోడీ ప్రభుత్వం తన వ్యూహకర్తలను కోరింది.

అందులో అతను ఎలా విజయం సాధించాడు:

తొలి దశలో మెహబూబా ముఫ్తీతో కలిసి కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
దీంతో చాలా మంది బీజేపీపై విరుచుకుపడ్డారు. అందులో నేను కూడా ఉన్నాను.

మెహబూబాకు బీజేపీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది.
కానీ అది హోం మంత్రిత్వ శాఖను తన వద్ద ఉంచుకుంది. దీని కారణంగా, ఉగ్రవాదుల వ్యూహాలు, వారి పేర్లు మొదలైన వాటి గురించి బిజెపి తగినంత సమాచారాన్ని సేకరించింది.

ఇప్పుడు రెండో దశ ప్రారంభమవుతుంది.

ఇందులో మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి.
మెహబూబా తనకు ప్రజల మద్దతు అని చెప్పుకోవడానికి వచ్చారు.

తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా కశ్మీర్ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగింది.

విభేదాల కారణంగా మెహబూబా, ఒమర్‌లు ఒక్కటవ్వలేదు. మోడీ మనసులో ఏముందో వారికి అర్థం కాలేదు.

జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో మళ్లీ గెలుపొందడం ఖాయమని మెహబూబా అసెంబ్లీని రద్దు చేశారు.

ఇప్పుడు మూడో దశ మొదలైంది.

జమ్మూ కాశ్మీర్‌ గవర్నర్‌ అభ్యర్థన మేరకు ఒకరోజు బీజేపీ అకస్మాత్తుగా లోక్‌సభలో ఆర్టికల్‌ 370 రద్దు బిల్లును తీసుకొచ్చింది.

ఈ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టే వరకు ఈ కథనం గోప్యంగా ఉంచబడింది.

అసెంబ్లీని రద్దు చేస్తే గవర్నర్‌కు అసెంబ్లీపై అన్ని హక్కులు ఉంటాయి.

కాబట్టి, గవర్నర్ ఆమోదం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఆమోదంగా పరిగణించబడుతుంది.

మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం అభ్యర్థన మేరకు గవర్నర్ అసెంబ్లీని రద్దు చేయడంతో అక్కడ కూడా ఎలాంటి ఫిర్యాదు రాలేదు.

ఇలాంటి వ్యూహాలు రచించే బీజేపీ వ్యూహకర్తలకు సెల్యూట్ చేస్తున్నాను.

కశ్మీర్ అసెంబ్లీని మెచ్చుకుంటే సరిపోదు. ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నప్పుడు
అత్యంత రహస్యంగా ఉంచిన వారందరి కారణంగా, ఈ రోజు మనం ఆర్టికల్ 370 నుండి విముక్తి పొందినట్లు కనిపిస్తోంది.

మనం "ది కాశ్మీర్ ఫైల్స్" చూస్తున్నప్పుడు, ఈ వ్యూహకర్తలు మరియు దానిని అమలు చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేయండి.

చివరగా

జై భాజపా, మోదీషా నాయకత్వం వర్ధిల్లాలి. భాజపాలో వృధ్ధులు వ్యూహాలు రచిస్తారు మధ్య వయస్కులు అవలంబిస్తారు, యువకులు అనుసరిస్తారు. అందుకే ప్రజలను సురక్షితంగా పరిపాలిస్తున్నారు, పాలిస్తారు.

✊️భారత్ మాతాకీ జై✊️

సేకరణ

💍 విలువైన ఉంగరం కథ💍

💍 విలువైన ఉంగరం కథ💍

✍️మురళీమోహన్

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

👌ధనికుడైన వృద్ధుడొకడు తన ఆస్తిని సమభాగాలుగా తన ముగ్గురు కొడుకులకూ పంచి యిచ్చాడు. కాని విలువైన వజ్రపు ఉంగరాన్ని తను వుంచుకున్నాడు.
"అలా ఎందుకు చేశావు?" అన్న ప్రశ్నకు అతను ఇలా జవాబిచ్చాడు. "ఆఖరుకు నాకు మిగిలిన ఈ వజ్రపు ఉంగరాన్ని విభజించడం సాధ్యం కాని పని. కనుక నా ముగ్గురు కొడుకులలో ఎవరు నిజమైన మానవతావాదో నేను కనుగొన్నాకనే ఈ వజ్రపు ఉంగరం వాడికి దక్కుతుంది". కాబట్టి మీ ముగ్గురూ దేశాటన చేసివచ్చాక మీ అనుభవాలు వివరంగా చెప్పండి అప్పుడు ఎవరు మానవతావాది అవుతారో నిర్ణయించి ఈ ఉంగరం బహుకరిస్తాను అన్నాడు, దాంతో అతని ముగ్గురు కొడుకులూ మూడు త్రోవలలో వెళ్ళారు. కాలం అతి వేగంగా సాగిపోయింది. అతను నిర్ధారించిన సమయం ఆసన్నమైంది. ముగ్గురు అన్నదమ్ములూ తండ్రి యింటికి మరలి వచ్చారు. ఒక్కొక్కడూ తన మానవతా చర్యలను చెప్పుకోసాగాడు.

వారిలో జ్యేష్టుడు ఇలా మొదలుపెట్టాడు, "నాన్నా! విను. ఒక రోజు నా దగ్గరకు ఒక అపరిచితుడు వచ్చాడు. తన ధనాన్ని అంతా నాకు అప్పగించి, తను తిరిగి వచ్చేంత వరకు దాన్ని భద్రంగా వుంచుకోమని కోరాడు. నేను సరే అన్నాను. రాసి యిచ్చిన పత్రంలా నా మాటను అతను స్వీకరించి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులయ్యాక అతను తిరిగి వచ్చి తన డబ్బునిమ్మన్నాడు. నేను దానిని నా దగ్గర వుంచేసుకునేవాణ్ణే, కాని నిజమైన మానవతావాదిని కాబట్టి ఆ డబూ వడ్డీతోసహా కూడా చేర్చి అతనికి అప్పగించాను. కాబట్టి ఇప్పుడు నీవే చెప్పు, ఆ వజ్రాల వుంగరానికి నేను తగినవాణ్ణే కదా!" అన్నాడు. వృద్ధుడు ఇలా అన్నాడు "కాని అబ్బాయీ, లోకంలో అంతరాత్మ వుండే వ్యక్తులు చేసినట్లే నువ్వు కూడా చేశావు" అన్నాడు.

ఇక రెండో కొడుకు ప్రారంభించాడు. "నా సముద్ర యానంలో వానా, వురుములతో సహా పెనుతుఫాను చెలరేగింది. ఆ తరుణంలో ఓడ పైభాగం మీద ఒంటరిగా నుంచున్న ఒక అమాయకుడైన బిడ్డ తూలి లోతైన సముద్రంలో పడిపోయాడు. ఆ బిడ్డను కాపాడాలని ఎవ్వరూ అనుకోలేదు. కాని నిజమైన మానవతావాదినైన నేను మాత్రం భయంకరంగా విజృంభించే కెరటాలలోకి దూకి ఒక అమాయకుడైన బిడ్డను రక్షించాను. నాన్నా, ఇప్పుడు చెప్పు, నేను యదార్థమైన మానవతా వాదినే కదా" అన్నాడు. దానికి ఆయన తండ్రి "మంచి పనే చాశావు నాయనా! నీ జీవితాన్నే నీవు లక్ష్యపెట్టక తెగించావు. అది చాలా ఘనకార్యమే. కాని పిరికిపందకానివాడు, ఎవరైనాసరే సరిగ్గా అలాగే చేసేవాడు" అన్నాడు.

ఆఖరి కొడుకు తన అనుభవాన్ని యిలా చెప్పసాగాడు, "నాన్నా! నేను దేశాటనలో కొన్నాళ్లు గొర్రెల మందకు కాపరిగా ఉన్నాను, అప్పుడు ఒకరోజు చల్లని గాలి నా శత్రువును నిద్రపుచ్చింది. ఆ సుఖనిద్రలో ఏటవాలుగా వుండే చోటుకు అతను దొర్లిపోయాడు. ఇంక కొంచెం దొర్లితే అతను తప్పక చనిపోయేవాడే. నేను అతన్ని లోయలోకి జారిపోనివ్వలేదు. అతను నా శత్రువైనా అతన్ని లేపి ఆ విపత్తునుండి అతన్ని రక్షించాను" అని ముగించాడు. అతని తండ్రి గర్వంగా సంతోషిస్తూ "అబ్బాయీ! నీవు అత్యంత ఘనమైన కార్యాన్ని చేశావు, శత్రృత్వాన్నీ, పగనూ మనస్సు నుండి బహిష్కరించడానికి అత్యంత గొప్ప హృదయం అవసరం. నీవే నిజమైన మానవతావాదివి. నిస్సందేహంగా ఈ వజ్రపు ఉంగరం నీకే చెందాలి" అని ఆ ఉంగరాన్ని తన చిన్న కొడుక్కి బహూకరించాడు.👍

సేకరణ

ఒక చిన్న పనితో దేశంలో ఎవరూ గాంధీ కుటుంబాన్ని చూడడానికి ఇష్టపడరు !!!

 *బీజేపీ గారు ఒక చిన్న పని చేయండి !!* *అప్పుడు దేశంలో ఎవరూ గాంధీ కుటుంబాన్ని చూడడానికి ఇష్టపడరు !!!*


 *MO  మథాయ్ పుస్తకం "రెమినిసెన్సెస్ ఆఫ్ ది నెహ్రూ ఏజ్"పై నిషేధాన్ని తొలగించండి.


 * ఇది భారతదేశంలో విక్రయించబడనివ్వండి మరియు కొంత ఉచిత పంపిణీని ఇవ్వండి !!*

 *నాలుగు రోజుల్లో కాంగ్రెసోళ్లు వీధుల్లో డ్యాన్స్ చేస్తారు!!!*


 ప్రపంచానికి నిజం తెలియదు కాబట్టి మథాయ్ పుస్తకం నిషేధించబడింది.  ఎంఓ మథాయ్‌తో ఇందిరకు అక్రమ సంబంధాలు ఉన్నాయి.  పన్నెండేళ్లపాటు.  ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ వంశాన్ని అనైతికత యొక్క కొత్త శిఖరానికి తీసుకెళ్లింది!


 * ఇందిరను ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేర్చారు, కానీ పేలవమైన పనితీరు మరియు అసభ్యత కారణంగా ఆమెను అక్కడి నుండి వెంటనే తొలగించారు.  ఆ తర్వాత అతన్ని శాంతినికేతన్ యూనివర్సిటీలో చేర్చారు, కానీ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అతని దుష్ప్రవర్తనకు అతన్ని బహిష్కరించారు.  శాంతినికేతన్ నుండి తరిమివేయబడిన తర్వాత ఇందిర ఒంటరి అయిపోయింది!*


 రాజకీయ నాయకుడిగా, తండ్రి రాజకీయాలతో బిజీగా ఉన్నారు, తల్లి స్విట్జర్లాండ్‌లో క్షయవ్యాధితో మరణించింది.  ఫిరోజ్ ఖాన్ అనే వ్యాపారి తన ఒంటరితనాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.  మోతీలాల్ నెహ్రూ ఇంటికి ఫిరోజ్ ఖాన్ ఖరీదైన విదేశీ మద్యాన్ని సరఫరా చేసేవాడు.  ఫిరోజ్ ఖాన్, ఇందిరల మధ్య ప్రేమ చిగురించింది!


 * ఇందిరతో ఫిరోజ్ ఖాన్ అక్రమ సంబంధాలు నెరుపుతున్నాడని అప్పటి మహారాష్ట్ర గవర్నర్ డాక్టర్ శ్రీ ప్రకాష్ నెహ్రూను హెచ్చరించారు!  ఫిరోజ్ ఖాన్ ఇంగ్లండ్‌లో ఉండి ఇందిర పట్ల చాలా సానుభూతిని కలిగి ఉన్నాడు.  వెంటనే ఆమె తన మతాన్ని విడిచిపెట్టి, ముస్లిం మహిళగా మారింది మరియు లండన్‌లోని ఒక మసీదులో ఫిరోజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది.  ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ తన పేరును మైమూనా బేగంగా మార్చుకున్నారు.  ఈ వివాహంతో అతని తల్లి కమలా నెహ్రూ చాలా కోపంగా ఉన్నారు, దీని కారణంగా అతని ఆరోగ్యం మరింత క్షీణించింది.  ,  ,


 * నెహ్రూ కూడా ఈ మార్పిడితో సంతోషించలేదు, ఎందుకంటే అది ఇందిరకు ప్రధాని అయ్యే అవకాశాలను ప్రమాదంలో పడేస్తుంది!  కాబట్టి ఇస్లాం నుండి హిందూమతంలోకి మారడానికి దీనికి ఎటువంటి సంబంధం లేనప్పటికీ, యువ ఫిరోజ్ ఖాన్‌ను తన ఇంటిపేరును ఖాన్ నుండి గాంధీగా మార్చమని నెహ్రూ కోరారు.  ఇది కేవలం ఒక అఫిడవిట్ ద్వారా పేరు మార్చిన విషయం,* * మరియు ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ గాంధీ అయ్యాడు, అయినప్పటికీ ఇది బిస్మిల్లా శర్మ వంటి అస్థిరమైన పేరు!  భారత ప్రజలను మోసం చేసేందుకు ఇద్దరూ పేరు మార్చుకున్నారు.  అతను భారతదేశానికి తిరిగి వచ్చాక, ప్రజల ముందు నకిలీ వైదిక వివాహం ఏర్పాటు చేయబడింది!


 ఆ విధంగా ఇందిరా మరియు ఆమె వారసులకు గాంధీ అనే కల్పిత పేరు వచ్చింది!  నెహ్రూ మరియు గాంధీ రెండూ ఫాన్సీ పేర్లు, ఊసరవెల్లి దాని రంగును మార్చుకుంటుంది, కాబట్టి ఈ వ్యక్తులు తమ నిజమైన గుర్తింపును దాచడానికి తమ పేర్లను మార్చుకున్నారు.*


 *కె.ఎన్.రావు పుస్తకం "నెహ్రూ వంశం"*

 *(10:8186092005 ISBN) సంజయ్ గాంధీ ఫిరోజ్ గాంధీ కొడుకు కాదు అని స్పష్టంగా వ్రాయబడింది, దాని కోసం ఆ పుస్తకంలో అనేక వాస్తవాలు ఉన్నాయి!  అందులో సంజయ్ గాంధీ మహమ్మద్ యూనస్ అనే మరో ముస్లిం పెద్దమనిషి కొడుకు అని స్పష్టంగా రాసి ఉంది!

 ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మహ్మద్ యూనస్ ఇంట్లో సంజయ్ గాంధీతో సిక్కు అమ్మాయి మేనక వివాహం కూడా జరిగింది.  సంజయ్ గాంధీ విమాన ప్రమాదం తర్వాత ఎక్కువగా ఏడ్చిన వ్యక్తి మహ్మద్ యూనస్.*


 *యూనస్ యొక్క పుస్తకం "పర్సన్స్ ప్యాషన్స్ అండ్ పాలిటిక్స్" (ISBN-10: 0706910176)లో సంజయ్ గాంధీ పుట్టిన తర్వాత, అతను పూర్తి ముస్లిం ఆచారంతో సున్తీ చేయించుకున్నాడని స్పష్టంగా వ్రాయబడింది.*


 *కేథరీన్ ఫ్రాంక్ రాసిన ఇందిరా నెహ్రూ గాంధీ జీవితం (ISBN: 9780007259304) ఇందిరా గాంధీ యొక్క కొన్ని ఇతర ప్రేమ వ్యవహారాలపై వెలుగునిస్తుంది.  అందులో ఇందిర తొలి ప్రేమ శాంతినికేతన్ లో జర్మన్ టీచర్ తో అని రాసి ఉంది.  తర్వాత ఎం.ఓ.  ఆమె మథాయ్ (తండ్రి కార్యదర్శి), ధీరేంద్ర బ్రహ్మచారి (అతని యోగా గురువు) మరియు దినేష్ సింగ్ (విదేశాంగ మంత్రి)తో ప్రేమ వ్యవహారాలకు కూడా ప్రసిద్ధి చెందింది!*


 *మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ తన పుస్తకం "ప్రొఫైల్స్ అండ్ లెటర్స్" (ISBN: 8129102358)లో ఇందిరా గాంధీకి మొఘలులతో ఉన్న అనుబంధం గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు!  అందులో 1968లో భారత ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ ఆఫ్ఘనిస్థాన్‌కు అధికారిక పర్యటనకు వెళ్లినట్లు ఉంది.  నట్వర్ సింగ్ ఐఎఫ్ఎస్ అధికారిగా ఈ పర్యటనకు వెళ్లారు.  ఆరోజు కార్యక్రమాలు ముగిశాక, సాయంత్రం ఇందిరాగాంధీ వాకింగ్‌కి వెళ్లాల్సి వచ్చింది.  కారులో చాలా దూరం ప్రయాణించిన తర్వాత, ఇందిరా గాంధీ బాబర్ స్మశానవాటికను సందర్శించాలనుకున్నారు, అయితే అది ప్రయాణంలో చేర్చబడలేదు.  ఆఫ్ఘన్ భద్రతా అధికారులు ఈ కోరికను వ్యతిరేకించారు, కానీ ఇందిర తన పట్టుదలతో మొండిగా ఉండి, చివరకు నిర్జన ప్రదేశంగా ఉన్న స్మశానవాటికకు వెళ్లింది.  ఆమె కళ్ళు మూసుకుని బాబర్ సమాధి వద్ద నిలబడింది మరియు ఆమె వెనుక నట్వర్ సింగ్ నిలబడి ఉన్నాడు.


 * ఇందిర తన ప్రార్ధన ముగించగానే, ఆమె తిరిగి నట్వర్‌తో చెప్పింది, ఈ రోజు నేను నా చరిత్రను రిఫ్రెష్ చేసాను ("ఈ రోజు మనం చరిత్రతో మన బ్రష్‌ను కలిగి ఉన్నాము")!  మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ అని, ఈ మొఘల్ సామ్రాజ్యం నుండి నెహ్రూ కుటుంబం పుట్టిందని ఇక్కడ చెప్పుకుందాం!


 నెహ్రూ ఒక కాశ్మీరీ పండిట్ అని చాలా సంవత్సరాలుగా భారతీయ ప్రజానీకం మోసానికి గురవుతున్నారు, ఇది పూర్తిగా తప్పుడు వాస్తవం!


 ఈ విధంగా, ఈ అల్పపీడనాలు భారతదేశంలో వేళ్ళూనుకున్నాయి, అది నేడు చాలా పెద్ద వృక్షంగా మారింది, దీని ప్రతిష్టాత్మక కొమ్మలు ఈ రోజు తల్లి భారతిని చాలా బాధించాయి!  ఇప్పుడు మీకు దేశం పట్ల ఏదైనా బాధ్యత ఉంటే, ఇప్పుడు మీరు "మౌనంగా" ఉండకండి మరియు పై నిజం అందరికీ చెప్పండి!

                                                                  

 *వందేమాతరం!* 🙏


 * దేశానికి సత్యాన్ని తెలియజేసే బాధ్యత ప్రతి హిందూ సోదరుడిపై ఉంది!

                                                                                                                  *జై_శ్రీరామ్* 🙏

ఉత్తర , పడమర దిక్కులకు తల ఉంచి నిద్రించకూడదు అన్నవిషయానికి సంపూర్ణ వివరణ -

ఉత్తర , పడమర దిక్కులకు తల ఉంచి నిద్రించకూడదు అన్నవిషయానికి సంపూర్ణ వివరణ -

రాత్రి సమయంలో పడుకునేప్పుడు శిరస్సు తూర్పుదిశగా ఉంచవలెను అనియు మరియు దక్షిణ దిశకు ఒక మాదిరిగా కొంచం మంచిది అని పెద్దవారు చెప్తారు అదేవిధంగా మనపురాణాలలో కూడా వ్రాయబడి ఉన్నది. తూర్పుదిశకు శిరస్సు ఉంచి శయనించువాడు ఆరోగ్యవంతుడు అనియు మార్కండేయ పురాణమున చెప్పబడి ఉంది. దీనికి సంబంధించిన కొన్ని విషయాలను సంపూర్ణంగా వివరిస్తాను.

భూమి ఒక పెద్ద అయస్కాంతం . మాములు అయస్కాంతం చుట్టూ అయస్కాంతక్షేత్రం ఎలా ఉండునో భూమికి కూడా చుట్టూ అయస్కాంతక్షేత్రం 66,000 మైళ్ళ వరకు వ్యాపించి ఉండును. ఈ విశ్వం అండాండం అనియు మనశరీరంను పిండాండం అని జ్ఞానులు పిలుస్తారు . విశ్వములోని అన్నింటి ప్రభావం , .శక్తి మన శరీరంలో కూడా ఉన్నది. అందుకనే ఈ రెండింటి మధ్య "లయ" తప్పకుండా కాపాడగలుగు శక్తి ఉన్న చాలా మానసిక రుగ్మతులకు ఔషధం దొరుకును .

ఉత్తరదిక్కుకు ఆకర్షణ ( అయస్కాంత) శక్తి ఉన్నది. దిక్సూచిని ఏ దిక్కుకి తిప్పినను దాని ముల్లు ఉత్తరదిక్కుకు తిరుగును. ఈ ఆకర్షణ శక్తి మానవుని శిరస్సు మూలకంగా శరీరంపైన తన ప్రభావమును చూపించును. అయస్కాంతపు ఉత్తర ధ్రువమునకు రోగనిరోధక శక్తి అనగా క్రిమిరోగాల వంటి వానిని నాశనం చేసి కాపాడగల శక్తి ఉన్నదని దక్షిణధ్రువమునకు శక్తిని ప్రసాదించగల గుణమున్నది మన పురాణాలలో ఉన్నది. మానవుని శరీరం ఒక విద్యుచ్ఛక్తి కేంద్రం . శరీరముకు కావలసినంత విద్యుత్తు మాత్రమే శరీరంలో ఎల్లప్పుడూ ఉండును. శరీరం తనకి కావలసిన ఎలెక్ట్రిసిటీని ఎల్లప్పుడూ ఉత్పన్నం చేసుకొనుచూ బయటకి విసర్జించుచూ ఉండును.

వాత్సాయన మహర్షి ప్రకారం శరీరం నందలి 24 కేంద్రాలలో ఈ పని జరుగును. ఈ 24 కేంద్రాలలో బ్రహ్మాండం అతిముఖ్యమైన కేంద్రం . బ్రహ్మాండం అనగా శిరస్సు నందలి పైభాగం . దీనినే పుణికి అని బ్రహ్మకపాలం అని అందురు. ఇది శరీరంలో విద్యుచ్చక్తి ఉత్పత్తికి మరియు బయటకి విసర్జనకు రెండింటికి కేంద్రమై ఉన్నది. మానవ శరీరంలో ఉత్పత్తి అయిన విద్యుత్ వెంట్రుకల చివరనుంచి చేతి గోళ్ల చివర నుంచి చర్మరంధ్రాల ద్వారా అత్యంత సూక్ష్మంగా బయటకి విసర్జించబడును.

దాదాపు 1300 గ్రాముల బరువుగల మనవుని మెదడు దాదాపు 20 వాట్స్ విద్యుత్ శక్తిని వెలువరించును. మానవ హృదయము నుండి వెలువడు విద్యుత్ శక్తిని " వెక్టార్ " ద్వారా కొలుస్తారు. ఈ విద్యుత్ శక్తిని ఊపిరిని తమ ఆధీనంలో ఉంచగలుగుట ద్వారా ఆయుర్వృద్దిని పొందవచ్చును. యోగులు ఈవిధంగా ఉచ్చ్వాస , నిచ్చ్వాసాలను తమ అదుపులో ఉంచి జీవశక్తిని దాని పరిమాణాన్ని ప్రభావితం చేయగలిగేవారు.

శిరస్సును ఉత్తరదిక్కుకు ఉంచి నిద్రించిన ఉత్తరదిక్కు నందు ఉన్న ఆకర్షణశక్తి వలన శరీరం నందలి విద్యుత్ శక్తి కొంత కోల్పోవును . ప్రతిదినం ఇట్లు జరుగుచుండడం వలన క్రమేణా శరీరం తన శక్తిని వర్ఛస్సును కోల్పోవును . విద్యుత్ కిరణములు మన పాదముల నుండి ప్రవహించి శిరస్సు నుండి వెలువడును. విద్యుత్ శక్తి ప్రవహించుచోట చల్లదనమును , వెలువడుచోట ఉష్ణం కలుగునని శాస్త్రవేత్తలు నిర్ధారించెను . కావున శిరస్సు నుండి విద్యుత్ శక్తి వెలువడుటచే శిరస్సు అత్యుష్ణమ్ చెంది తలభారం , బాధ , అలసట , నిస్సారం మొదలగునవి కలుగును. కొన్ని శరీరభాగాలు తమ క్రియను కోల్పోయి పక్షవాతం , తిమ్మిరి , నడుమునొప్పి మొదలగు వాతవ్యాధులు కలుగును. నరముల సంబంధ వ్యాధులు జనియించుటకు వీలు కలుగును. కావున దక్షిణదిశకు శిరము ఉంచి శయనించిన యెడల విద్యుత్ శక్తి పాదముల గుండా వెలువడుట వలన నష్టమేమి సంభవించదు. పార్థివ విద్యుత్ దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రవహించును.

ఇదేవిధముగా పడమట దిక్కు కూడా . ఇక్కడ సూర్యుడు అస్తమించుట చేత అతని ఆకర్షణశక్తి , మనుష్యుని నందలి విద్యుత్ శక్తిని ఆకర్షించును. సూర్యుడు ప్రపంచానికి కన్నువంటి వాడు. సర్వప్రాణులకు ఆధారభూతము , జగత్తును పోషించువాడు . సూర్యుని నుండి ప్రసరించు కిరణములు మనుష్యుని పై మంచి ప్రభావం చూపి దానితో శరీరం నందలి విద్యుత్ ని తన అధీనంలో ఉంచుకొనును. అందువలనే ఉత్తర దిశకు తల ఉంచి నిదురించిన ఎటువంటి పరిణామాలు కలుగునొ అటువంటి పరిణామాలే పడమర దిక్కుకి తల ఉంచి నిదురించిన కలుగును


సేకరణ

అందం అనేది.....

*శుభోదయం* 🙏🏻🙏🏻🙏🏻
*శుభ దినం* 🤝🤝🤝

~అందం అనేది నవ్వే పెదవిలో ఉండదు. 
బాధను దాచుకునే హృదయంలో ఉంటుంది. 
~అందం అనేది అవమానించే గుణంలో ఉండదు. 
ప్రేమతో ఆదరించే గొప్ప ~మనసులో ఉంటుంది. 
~అందం అనేది శరీరానికి సంబందించినది కాదు. 
స్వచ్ఛమైన మనసుకు సంబందించినది. 
~జీవితం ఎలాంటిది అంటే, అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది. 
అర్థం అయ్యే వయసులో కన్నీళ్ళను తెప్పిస్తుంది. 

మన జీవితంలో మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయాలని చూడరాదు. 
ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది. 
ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు ☺️

ఒకరిని బాధపెట్టి మనం అనందపడటం కాదు.
జీవితం అంటే మనం బాధలో ఉన్నా... 
ఇంకొకరిని సంతోష పెట్టడమే నిజమైన జీవితం 😌

నేటి జీవిత సత్యం. ఋణాను బంధాలు

నేటి జీవిత సత్యం.

ఇతరులతో పూర్వజన్మలో  మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు. 

ఆ ఇచ్చిపుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో, మరణించడమో  జరుగుతుంది.  


ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవితకాలంలో మనకి  ఏర్పడే సంబంధాల  మీద మోజు కలుగదు. 


ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే...


--  మనం పూర్వ జన్మలో  ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.


--  ద్వేషం కూడా బంధమే. పూర్వజన్మలోని  మన మీదగల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు.


--  మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు  అపకారం చేసే వారిగా ఎదురవుతారు.


-- మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగానో, సహాయకులుగానో ఎదురవుతారు . 


ఉదాహరణకు ఒక జరిగినకథ:-


కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం  అడుక్కుంటూ ఉండేవాడు. ఈ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు. కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచలోనో  పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు. తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు.  ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు...

పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు  ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా  ఇవ్వలేదు . అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను  బాధలు  పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు. 


అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ: 


ఒకసారి సత్యసాయిబాబా  బస చేసిన అతిథిగృహం  బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, “స్వామీ ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి?” అని. ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకని వారు ఈ జన్మలో    ఆహారం కోసం పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు. నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా  దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు  స్వామి.


ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి  వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే, ఆయన వెనక్కి  పిలిచి నీ చేతి సంచి  ఏది అని అడిగితే,  పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు. అప్పుడు మలయాళ స్వామి వారు ”నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు  చేత సంచీని మోయిస్తె వచ్చే జన్మలో  నువ్వు అతని బియ్యం  బస్తాను మోయాల్సి ఉంటుంది!”   అన్నారు.


ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం. మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవంతోనో  లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా  స్వీకరించిన వన్నీ  కర్మ బంధాలయి జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి. 


కొత్త వాళ్ల నుంచి పెన్ను  లాంటి వస్తువులను  తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే  నాకు ఫలానాది తీసుకురా  అని చెప్పడం, ఇలాంటివి అనేక  సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.  

అవి కర్మ బంధాలవుతాయి  అని తెలియక మన  జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాలో చిక్కుకుపోతుంటాము.


ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే  అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం. అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు.*


కాబట్టి ఇప్పుడు ఆలోచిద్దాం ఈ కర్మబంధాల నుంచి ఎన్ని జన్మలెత్తినా  మనం తప్పించుకో గలమా.......✍️

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

నేటి మాట - భగవత్ చింతన, ఇప్పుడే చేయాలా???

🙏సర్వేజనాః సుఖినోభవంతు: 🙏

🥀 శుభోదయం 🥀

🌷 నేటిమంచిమాట 🌷

ఏదో ఒక ఆదర్శాన్ని కలిగివున్న వ్యక్తి 10 పొరపాట్లు చేస్తే, ఏ ఆదర్శమూ లేనివాడు 100 పొరపాట్లు చేస్తాడు. కాబట్టి,కనీసం ఒక ఆదర్శాన్నైనా కలిగివుండడం మంచిది.

🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

నేటి మాట

భగవత్ చింతన, ఇప్పుడే చేయాలా???
ఈ రోజుల్లో, ఎలా ఉన్నారంటే, సినిమా, టీవీలు, సీరియళ్లు అంటే అందరికీ టైం దొరుకుతుంది కానీ ఆధ్యాత్మిక కార్యక్రమములు అంటే, అయ్యో టైం లేదని వాపోతుంటారు...

శ్లో॥ చింతా మపరి మేయాంచ ప్రళయాం తా ముపాశ్రితాః ।కామోప భోగ పరమాః ఏతావదితి నిశ్చితాః ॥

తా॥ చనిపోయేంతవరకు అంతులేని కోరికలలో మునిగితేలుతూ, కామభోగాలు తప్ప జీవితానికి వేరే లక్ష్యం ఏదీలేదని నిశ్చయించుకుంటారు...

ప్రళయాంతాం అపరిమేయాం చింతాం ఉపాశ్రితాః...

చచ్చేంత వరకు అంతులేని కోరికలలో మునిగి తేలుతూ ఉంటారు.
కట్టు విప్పుకొన్న గొడ్డు ముందూ వెనకలు చూడకుండా ఎలా పడితే అలా పరుగులు తీస్తుంది... ఎవరో ఒకరు దానిని హింసించి అదుపులోకి తీసుకొనే దాకా అది ఆగదు... ఊపిరి ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు అలా పరుగులు తీస్తూనే ఉంటుంది... తెగిన గాలిపటం గాలి ఎటు వీస్తే అటు కదిలిపోతుంది... అది ఎక్కడో ఒక చోట, చెట్టు కొమ్మల మధ్య చిక్కుకొనే దాకా ఎగురుతూనే ఉంటుంది...

అలాగే...
అసుర స్వభావి భగవంతునిపై విశ్వాసం లేనివాడు గనుక వాడికెప్పుడూ విషయచింతనే, చిన్న వ్యాపారం ప్రారంభిస్తాడు, కలిసొస్తే ఇంకా పెద్దది, ఇంకా పెద్దది అని పెంచుకుంటూ పోతాడు...
ఇళ్ళు కొంటాడు, స్థలాలు కొంటాడు, పరిశ్రమలు స్థాపిస్తాడు, సినిమాహాళ్ళు కట్టిస్తాడు, ఆశ తీరదు, కాలేజీలు కట్టించి విద్యా వ్యాపారం బాగుందనుకుంటాడు... హాస్పిటల్స్ కట్టించి పెద్ద పెద్ద డాక్టర్లను రప్పించి వైద్య వ్యాపారం ప్రారంభిస్తాడు...
ఇక ఇక్కడ లాభం లేదని విదేశాలకు వెళతాడు, నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు...

శరీరం, మనస్సు, బుద్ధి... అన్నీ విషయ చింతనలోనే, భార్యకు సుఖంలేక పోయినా, కొడుకులు చెప్పిన మాట వినకపోయినా, బంధువులు శతృవులుగా మారినా ఆ జీవుడు ఆశల పల్లకిలో ఊరేగుతూనే ఉంటాడు.
తనంతట తాను మారడు, ఎప్పుడో భగవంతుడే దయ తలచి ఏ విమాన ప్రమాదంతోనో, హార్ట్ ఎటాక్ తోనో అతణ్ణి బంధ విముక్తుణ్ణి చెయ్యక పోతే అతడికీ గాడిద చాకిరీ తప్పదు...
ప్రకృతి వేసిన శిక్షను అనుభవించక తప్పదు, ఒక వేళ ఆరోగ్యం చెడినా, కాలోచెయ్యో విరిగినా, మంచంలో పడి ఉన్నా మనస్సు మాత్రం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది.
కోరికల వేడితో విషయ చింతన అనే అగ్నిలో కాలిపోతుంటాడు...

బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః ।
వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోఽపినసక్తః॥

బాల్యం ఆట పాటలతో.. యవ్వనం కామ ప్రేరిత చర్యలతో.. వృద్ధాప్యం చింతలతో.. గడిచిపోతే పరమాత్మను తలచుకొనేది ఎప్పుడు...
ఒంటిలో శక్తి వున్నప్పుడే, మనసులో ఖాళీ వున్నప్పుడే, నాలుకపై నరం కదులుతున్నప్పుడే, భగవత్ చింతన సలుపుతూనే వుండాలి...
సర్వాంతర్యామి అయిన ఆయనను మరువకున్నప్పుడే మానవ జన్మకు సార్థకత చేకూరుతుంది... మోక్షం ప్రాప్తిస్తుంది...

🌹 శుభమస్తు🌹
🙏 సమస్త లోకా సుఖినోవంతు🙏

సేకరణ

Thursday, March 24, 2022

మనల్ని నాశనం చేసే 5 విషపూరిత అలవాట్లు

మనల్ని నాశనం చేసే 5 విషపూరిత అలవాట్లు
........................................................

1 . వాయిదా వేయడం ( procrastination )

2 . కంప్లైంట్స్ చెయ్యడం ( complaining )

3 . అతిగా ఆలోచించడం ( overthing )

4 . పోల్చుకోవడం ( comparison )

5 . సేఫ్ జోన్లో ఉండాలనుకోవడం ( staying comfort zone )

............వాయిదా వేయడం ..........

ఏవేవో చేయాలనుకుంటాం . జీవితానికి లక్ష్యాలు పెట్టుకుంటాం . కానీ వాటిని రేపు ,, ఎల్లుండి,,,వారం ,,, సంవత్సరం అని వాయిదా వేసుకుంటూ వుంటాం ..పుణ్యకాలం కాస్తా వెళ్లిపోయాక... చేసేదేముండదు ఇక .

................కంప్లైంట్స్ చెయ్యడం..........

ఇదో దరిద్రపు అలవాటు . మనకు శక్తి తక్కువగా ఉన్నప్పుడు మనం
ఎదుటి వారి మీదనో,,ఇంకేదో మీదనో కంప్లైంట్స్ చేస్తాం ..ఈ భూమ్మీద ఎవ్వరూ కరెక్ట్ కాదు...ఇంకా perfect మనిషి పుట్టలేదు.
మనలోని ఏదైతే లోపమో,, అవలక్షణమో ,,వాసనో ,,, అసమర్థతో వుంటే అది బయటి వాళ్ల మీద కంప్లైంట్స్ గా మారుస్తాం

..........అతిగా ఆలోచించడం..........

ఆలోచించేకీ ఏమీ లేనప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నట్టు నాకు బొత్తిగా అర్థం కాదు...ఒక సమస్య అతిగా ఆలోచిస్తే పరిష్కారం అవుతుంది అంటే భూమ్మీద మనుషులందరూ పనీ పాటా వదిలేసి కేవలం ఆలోచిస్తూ కూర్చొని వుండేవాళ్ళు...ఈ భూమ్మీద నువ్వో గెస్టువి మాత్రమే..కాబట్టి నీ బుర్రకి అతిగా పనిపెట్టకు..

......... పోల్చుకోవడం ...............

ఇదో పనికిమాలిన అలవాటు . సూది చేసే పని గునపం చెయ్యలేదు..గునపం చేసే పని సూది చెయ్యలేదు...దేని
ప్రత్యేకత దానిదే...మల్లెపూలు వచ్చే సువాసన గులాబీలు ఇవ్వలేవు . గులాబీలు ఇచ్చే సువాసన మల్లెలు ఇవ్వలేవు..దేని
ప్రత్యేకత దానిదే...టాయిలెట్లు కడిగే వాని ప్రత్యేకత వానిదే,,విమానం నడిపే వాని ప్రత్యేకత వానిదే..వేశ్య వృత్తి చేసే
ఆమె ప్రత్యేకత ఆమెదే....కాబట్టి మీ జీవితంలో ఎవ్వరితోనూ మిమ్మల్ని పోల్చుకొకండి....ఈ భూమ్మీద మీకు మీరు మాత్రమే ప్రత్యేకం ..అలాగే ఎవరికి వారు ప్రత్యేకమే...

............ సేఫ్ జోన్లో ఉండాలనుకోవడం...........

భూమ్మీద చాలా మంది ఇంత డబ్బులు వుంటే సేఫ్ గా ఉంటామనో,,ఇన్ని ఆస్తులు వుంటే సేఫ్ గా ఉంటామనో
లేకపోతే ఫలానా జాగా లో వుంటే సేఫ్ గా వుంటామనో అనుకుంటారు...ముందు మీరు నిద్రలో నుండి మేల్కొవాలి..
అలాంటివేమీ లేవు...సేఫ్ జోన్లో వుండి నేర్చుకునేది ఏమీ వుండదు..
ఆ యుద్ధం చేసే వాడు గెలుస్తాడు... ఆడే వాడు గెలుస్తాడు..
సేఫ్ గా ఉండాలనుకునే వాడు జీవితంలో ఏ పాఠాన్నీ నేర్చుకోలేడు... 🙏

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

సేకరణ

నేటి జీవిత సత్యం.

నేటి జీవిత సత్యం.

ఎన్ని వైపుల నుంచి ఎన్ని నదీజలాలు సముద్రంలోకి ప్రవహించినా విశాల సముద్రం అలజడికి లోను కాదు. అదేవిధంగా అన్నిరకాల ప్రాపంచిక సుఖభోగాలు స్థితప్రజ్ఞుడిలో ప్రవేశించినా ఎలాంటి వికారాన్ని అతడు పొందలేడు. పైగా అవన్నీ అతనిలో లీనమైపోతాయి. అటువంటి వాడే శాంతిని పొందుతాడు. భోగలాలసుడు కాడు’ అంటూ కృష్ణ భగవానుడు అర్జునుడికి చేసిన బోధను అనుసరించి స్థిరచిత్తం కలిగిన స్థితప్రజ్ఞుడిని ఏ కోరికలు చలింపజేయవన్న సత్యం బోధపడుతుంది. సంయమనమే శాంతిని ప్రసాదించే మార్గం. కాబట్టి ఎవరైనా శాంతిని కోరుకున్న వ్యక్తి విధిగా సంయమనాన్ని సాధించాలన్నది భగవదాశయం. ఇది మన జీవితాలకు ఒక పరిపూర్ణతను ఇస్తుందన్నది కాదనరాని సత్యం.
ఆత్మజ్ఞానం సంయమనాన్ని సులభతరం చేస్తుంది. తనను తాను నియంత్రించుకొని, ఇంద్రియాల ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మోద్ధరణ చేసుకున్న వ్యక్తిలో సంయమన గుణం వృద్ధి చెంది అతడొక స్థితప్రజ్ఞత కల సంయమిగా వెలుగగలడు. అందుకే స్వామి సంయమిని సముద్రంతో పోల్చాడు. ఎన్ని నదులు తనను చేరినా సముద్రం హద్దు మీరదు. అది గంభీర వారాశిగానే మిగులుతుంది. దాని లోతు అంత సులభంగా తెలుసుకోలేం. సంయమి గుండె లోతులను కూడా గ్రహించడం సులభమేమీ కాదు. ఏ కోరికలు తనను లొంగదీసుకోలేవు. విషయ వాంఛలేవీ అతనిని బంధించలేవు. అతని హృదయం జ్ఞాన మార్గంలోనే పయనిస్తుంది తప్ప మరొక దారిలోకి మళ్లిపోదు. ఈ సత్యాన్ని శ్రీకృష్ణ భగవానుడు.. అర్జునుడికి వివరించిన తీరు అసదృశం.
ఈ బోధనలను బట్టే జ్ఞాని అయినవాడు సముద్రపు వలె ఎటువంటి చలనం లేక స్థిరంగా నిలుస్తాడు. అజ్ఞాని సముద్రం అలల వంటివాడు. ఎగిసి ఎగిసి పడుతుంటాడు. చలనచిత్తుడై ప్రవర్తిస్తుంటాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పిన సముద్రం పోలిక విశిష్టమైనది. సాగరాన్ని సమీపించే నదీజలాలు వివిధ వర్ణభేదాలతో, రుచి భేదాలతో ఉంటాయి. వర్షం వల్ల ఏర్పడే వాగులు, వంకల వంటి వాటి లక్షణాలు వేరే ఉంటాయి. అన్నింటిలో ఉండే ఒకేఒక సమాన గుణం ప్రవాహశీలత. సముద్రుడు తానుసైతం ప్రవాహశీలత కలిగినవాడు, తనలోను జలతత్వమే ఉంది కనుక, వాటన్నిటినీ స్వీకరించి, ఏ మాత్రం పొంగిపోకుండా స్థిరచిత్తుడై గంభీరంగా ఉంటాడు. వ్యక్తిలో కోరికలు పరుగులెత్తినా వాటన్నింటినీ అధిగమించి వాటిని తనలో కలుపుకొని స్థిరచిత్తుడిగా నిలబడి ఉన్నప్పుడే అతడు స్థితప్రజ్ఞుడై శాంతిని పొందగలడు. అంటే స్థితప్రజ్ఞుడు సాగర సదృశుడు కావాలి. అనేక భోగభాగ్యాలు అందుబాటులో ఉండవచ్చు. కానీ, వాటియందు మాత్రమే తన మనసును నిలపరాదు. నిమిత్త మాత్రుడిగానే వాటిని అనుభవించాలన్నది భగవద్గీత బోధించే శాశ్వత తత్వం.
ఇన్ని ప్రవాహాలు తనలో కలవడం వల్ల సాగరానికి ఎంత పూర్ణత్వం ఒనగూడినా, దాని గొప్పదనానికి మాత్రం స్థిరత్వమే ప్రధాన హేతువు. మానవుడికి ఎన్ని కోరికలున్నా వాటికి కట్టుబడక, అవే జీవిత పరమార్థాలుగా భావించక జీవించేవాడే సాగర సదృశచిత్తుడు. అతడే సాటిలేని స్థితప్రజ్ఞుడు. ఆనందాలు ప్రవాహాలై తనను చేరవచ్చు. అయినా తానుమాత్రం అశాశ్వతమైన ఈ ఆనందాలకు లొంగకుండా పూర్ణ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించగలగాలి. ఒక మహాసాగరం వలె అన్నింటినీ తనలో కలుపుకొని గంభీరంగా జీవించినప్పుడు జీవితం చరితార్థమై కర్తవ్య నిర్వహణలో లక్ష్యం చేరుకోగలిగే ఉత్తమ సాధకుడై నిలబడతాడు. అపురూపమైన శాంతిని అందుకోగలుగుతాడు. ఇది శాశ్వత సత్యం.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

Wednesday, March 23, 2022

🌹 స్నేహం 🌹from 🌺 జీవిత రహస్యాలు ( ఓషో) 🌺

🌺 జీవిత రహస్యాలు ( ఓషో) 🌺
🌷 Part -- 5 🌷
🌹 స్నేహం 🌹

🌳 నిజమైన స్నేహితుడెవరు? అని అడగకండి. నేను ఎవరికైనా నిజమైన స్నేహితుడినా? అని అడగండి. ఇది సరైన ప్రశ్న.ఇతరుల సంగతి నీకెందుకు? వారు నీకు స్నేహితులు అవునా? కదా? అన్న సమస్య ఎందుకు?

🍀 మన ప్రవర్తనను బట్టి మిత్రులు, శత్రువులు నిజమైన స్నేహితులు అని తయారవుతారు. కానీ ముందుగానే వారు ఆ విధంగా ఉండరు.

☘️ 'ఎవరైతే అవసరంలో ఆదుకుంటారో వారు నిజమైన స్నేహితులు' అయితే ఆ సామేతలో చాలా అత్యాశ కనిపిస్తుంది. అది స్నేహం కాదు. నీవు స్నేహితుడిని అవసరానికి ఉపయోగపడే వస్తువులా వాడుకోవాలనుకుంటున్నావు. ప్రతి మనిషి అతనికతడే ఒక లక్ష్యం. సహాయం చేసే పరిస్థితిలో నీ స్నేహితుడు ఉంటే అతను తప్పక సహాయం చేస్తాడు. ఆ పరిస్థితిలో అతను లేకపోతే అతను నిజమైన స్నేహితుడైన కూడా నీకు సహాయం చేయలేడు.

🏵️ ఏదో ఒకరి పట్ల ప్రత్యేకంగా స్నేహంగా ఉండనక్కర లేదు. అది కుళ్ళిపోయిన ఆలోచన. స్నేహ బంధాన్ని సృష్టించడం కంటే స్నేహాన్ని సృష్టించు.

🌸 ఎవరైనా మీతో స్నేహంగా ఉన్నారా లేదా అన్న విషయాన్ని గురించి భాధపడకండి.అది ఒక వ్యాపారం ఎందుకు భాధపడాలి?మొత్తం ఈ సృష్టిని నీ స్నేహితునిగా ఎందుకు మార్చుకోకూడదు?

🌿 ఈ సృష్టితో స్నేహంగా ఉంటే సృష్టి అంతకు కొన్ని వేల రేట్లు నీతో స్నేహంగా ఉంటుంది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

సేకరణ

యద్భావం తద్భవతి

" యద్భావం తద్భవతి "


పూర్వం ఒక ఊళ్ళో ఒక పేరుమోసిన జమిందారు ఉండేవాడు ఆయన గర్విష్టి, పొగరుబోతు.


ఒకసారి ఆయన యధాప్రకారంగా శివుని ఆలయానికి వెళ్ళాడు. అక్కడొక సన్యాసి కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. తానూ కూడా వెళ్ళి అతని పక్కన కూర్చుని ధ్యానం చేసాడు.


ధ్యానానంతరం ఆ సన్యాసిని,జమిందారు "నేను ధ్యానం చేసేటప్పుడు ఎలా కనిపించాను?" అని అడిగాడు.


"శివునిల కనిపించారు " అని చెప్పి, " మరి నేనెలా కనిపించాను?" అని అడిగాడు సన్యాసి.


"పెంట కుప్పలా కనిపించారు " అన్నాడు జమిందారు   అతిశయంగా.

ఆ మాటలకి సన్యాసి చిరునవ్వు నవ్వాడు.


ఊహించని ఆ పరిణామానికి విస్తుపోయిన జామిందారు " మీకు కోపం రాలేదా?" అని అడిగాడు.


"కోపమెందుకు? మన మనసు ఎలా వుంటే ఎదుటివారు అలా కనిపిస్తారు. నా మనసు నిండా శివుడు నిండి వున్నాడు కాబట్టి నువ్వు నాకు శివునిలా కనిపించావు, నీ మనసు నిండా పెంట వుంది కాబట్టి నీకు నేను పెంటకుప్పలా కనిపించాను" అని వివరించాడు సన్యాసి. 


దానితో జామిందారు ముఖం చిన్నబోయింది.


ధర్మ నీతి

ఈ సంఘటన ద్వారా మనం గమనించాల్సిన ధర్మం, నీతి ఏమి అనగా...

"యద్భావం తద్భవతి" అని వేదంలో చెప్పినదానికి ఇది చక్కని సరియైన ఉదాహరణంగా చెప్పుకోవచ్చు.


మన మనసు దేనితోనైతే నిండి ఉందొ... అది భయంతోనా, అసూయతోనా, ధైర్యంతోనా, ఆధ్యాత్మిక వైరాగ్యంతోనా అనే దానితోనే మన చూపు, మన ఆలోచనలు, మన చేతలు ఆధారపడి ఉంటాయని అర్ధం అవుతుంది.


ఒకరిపై ఒకరు అసూయలతో, ద్వేషాలతో మనం మన జీవితాన్నే పూర్తిగా వ్యర్థం చేసుకుంటున్నాము. 


అందుకు మనం ఎదుటివారికంటే ముందు మన మనసును తెలుసుకొని, ఆ మనసు దేనితో నిండి ఉందో కనుక్కోని సరిదిద్దుకున్నప్పుడు మన జీవితం సార్ధకతమవుతుంది.


 అందుకు మన పురాణాల్లో " సర్వం ఆ పరమేశ్వరుడి శక్తి నిండి వుంది, నీలో కూడా ఆ శక్తే ఉన్నది. నీవు ఆ శక్తినే చూడాలి, అంతేకాని ఆ శక్తిని నీలోను, బయటి ప్రపంచంలోను వేరు వేరుగా చూడకూడదు అనే ఉద్దేశ్యంతో సనాతనంగా ఒక ప్రణాళికతో బాల్యం నుండి ధర్మ బోధనలు గురు ముఖంగా నేర్పింపబడేవి. 


అందువల్ల పూర్వ కాలంలోని ప్రజలు ధర్మంగా జీవించారు, కానీ ఇప్పుడున్న కాలంలో అలాంటి ధర్మ బోధనలు ఏవి..? ఎక్కడ బోధించబడుతున్నాయి..? ధర్మం అనే పదం ఒకటి ఉందనే సంగతి కూడా ఇప్పటి కొంతమంది పిల్లలికి తెలియదు. అలా అయితే వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది. ఆలోచించండి....


ఈ పోటీ యుగంలో ఇవి అవసరం లేదు అని, పోటీతత్వమే ఊపిరిగా సాగుతున్న బోధనలు మారాలి. అంతవరకు కనీస బాధ్యతగా తమ తల్లిదండ్రులే ఈ ధర్మ బోధనలు తమ తమ పిల్లలకు బోధింపబడే విధంగానైనా చూడండి మీ పిల్లల భవిష్యత్తు కోసం. 


*మీ శ్రేయోభిలాషి 

సేకరణ

రుచించక పోయినా ఇదే యదార్థం.

రుచించక పోయినా ఇదే యదార్థం.

మూసిన కన్ను తెరవకపోయినా,
తెరిచిన కన్ను మూయకపోయినా,
శ్వాస తీసుకుని వదలకపోయినా,
వదిలిన శ్వాస తీయకపోయినా,
ఈ లోకంలో ఈ జన్మకు అదే చివరి చూపు.
మనం ఎవ్వరం అయినా సరే మనల్ని ఈ ప్రపంచం నిర్థాక్ష్యిణ్యంగా మరచిపోయేలా చేస్తుంది కాలం.

విరోధులు స్నేహితులైనా, పశ్చాతాపపడినా, మనసు మార్చుకున్నా మరల కనిపించం.
ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీలు, సున్నిపిండితో నున్నగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు.

ఈ క్షణం మాత్రమే నీది,
మరుక్షణం ఏవరిదో?
ఏమవుతుందో ఎవరికి తెలుసు?

ఈ ప్రపంచాన్ని భస్మీ పటలం చేసే అణ్వాయుథాలు నీవద్ద ఉన్నా నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో పరమాత్మకి తప్ప ఎవరికీ తెలియదు..

ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారైనా, సంపన్నులైనా బలవంతులైనా అవయవక్షీణం-ఆయుఃక్షీణంను తప్పించుకోజాలరు.

ఈ సృష్టిలో మనము మొదలు కాదు. చివర కాదు.

ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాము. అద్దె ఇంటిని విడిచివెళ్లేటప్పుడు మన సామాన్లు మనం తీసుకువెళ్లినట్టు మనం చేసిన కర్మలను మనతో మోసుకువెళ్లక తప్పదు..

చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి ఉన్న ఆయుర్థాయం మనకి లేదు.

ఈ భూమ్మీద కాలమనే వాహనంలో ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోతాం. మనం సహప్రయాణికులం మాత్రమే.

కుటుంబం, స్నేహాలు, శత్రుత్వాలు అన్నీ భ్రమ, మాయ.

అశాశ్వతమైన వాటిని జపధ్యానములతో ఛేధిద్దాం.
అజ్ఞానం అనే చీకటిని చీల్చే ఖడ్గం ధ్యానం.

అందుకే మనుషుల్లా జీవిద్దాం.
మనిషి ఎలా జీవించాలో చెప్పిన రామాయణ, భారత, భాగవతాదులను ఈ జీవితం ముగిసేలోపు తెలుసుకుందాం. అందులోని సంశయాలను తీర్చుకుందాం.

దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవడం అంటే పదవిలో ఉండగానే సంపాదించుకోమని కాదు.

భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు నాలుగు పుణ్యకర్మలు ఆచరించి ఈ జీవకోటిలో మనిషి మాత్రమే చేయగలిగే ఉత్తమ కర్మలను ఆచరించాలని పరమార్థం.

ఓపిక ఉండగానే నిత్యం గురువుని ఆశ్రయించి ఉపదేశంపొంది ధర్మాచరణ, కర్మాచరణ చేయాలి.

*నిరంతరం భగవత్ ధ్యానంతో ఉంటూ, సత్యమైన మార్గం ద్వారా ధనాన్ని ఆర్జించి, తోటి వారికి పంచుతూ, నిన్ను నీవు ఉన్నతాత్మగా పెంచుకుంటూ ఉండటమే జీవనం.🙏🙏🙏

సేకరణ

"నేను"ను పెంచే కంచెను తీసేయాలంటే !? 🙏శ్రీరమణమహర్షి

🍁"నేను"ను పెంచే కంచెను తీసేయాలంటే !?"🍁

📚✍️ మురళీమోహన్

🙏శ్రీరమణమహర్షి : అంతరంగంలో నేను ఫలానా అన్న భావన, జీవనంలో అనుభవాలతో తాదాత్మ్యత తగ్గించుకుంటూ పోతే మనం మన సహజస్థితిలోనే ఉంటాం. బాహ్యజీవనంలో మనం ఎలాగూ ఇతరుల నుండి విడిగానే ఉంటాం. కానీ అంతరంగంలో ఆ విభజన రాకూడదు. అది ఎలాంటిదంటే పార్కు నిండా మొక్కలు/చెట్లు ఉంటాయి. అందులో ఒకదానికి చుట్టూ కంచె [ఫెన్సింగ్] వేసి ఫలానా వారు నాటిన మొక్క అని రాసిన బోర్డు ఏర్పాటు చేస్తారు. ఆ బోర్డు లేకపోతే అది మిగిలిన మొక్కలతో ఏ రకంగానూ భిన్నంగా ఉండదు. మన మనసులో కూడా మన గురించి అలాంటి కంచె [ఫెన్సింగ్] బోర్డులు రాసి పెట్టుకున్నాం. అవే మనని మన సహజత్వం నుండి విభజించి అశాంతిని కలిగిస్తున్నాయి. మన మనసులో మనం వేసుకున్న కంచె మనసులోని సహజమైన శాంతిని మ్రింగేస్తుంది. అదే 'కంచే చేనుమేయడం' అనే నానుడిలోని తాత్వికమైన అర్థం. మన మనసులోని కంచెను మనం తొలగించుకుంటే మనజీవితం సహజ సుందరంగా సాగుతుంది !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
"ఇంద్రియాతీతమైన దైవానుభూతే శాశ్వతంగా నిలిచి ఉంటుంది..!" [అధ్యాయం -103]

🕉🌞🌏🌙🌟🚩

సేకరణ

మంచి మాట...లు

దేవతా స్తోత్రాః

కార్య ప్రారంభ స్తోత్రాః
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ॥

యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం ।
విఘ్నం నిఘ్నంతు సతతం విష్వక్సేనం తమాశ్రయే ॥

గణేశ స్తోత్రం
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః ।
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ॥

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం ।
అనేకదం-తం భక్తానాం-ఏకదంత-ముపాస్మహే ॥

ఆత్మీయ బంధు మిత్రులకు బుధవారపు శుభోదయం శుభాకాంక్షలు విజ్ఞ నాయకుడు వినాయకుడు.. సుబ్రహ్మణ్య స్వామి వారు.. హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...
23-03-2022:-బుధవారం
ఈ రోజు AVB మంచి మాట...లు

నిజాయితీ అనేది ఒక వ్యక్తి
తనకు తానుగా మలచుకున్న
ఒక అమూల్యమైన అలవాటు.
విలువలు లేని వాళ్ళ దగ్గర
దీనిని ఆశించకూడదు....!!

మనకు శత్రువులు
తయారవుతున్నారు అంటే వాళ్ళు సాధించలేనిది...ఏదో
నువ్వు సాధించావని అర్థం....!!


కన్నీరు చాలా విలువైనది....
దానిని మనుషుల దగ్గర
చూపిస్తే విలువలేదు...కానీ
అదే కన్నీరు దేవుని సన్నిధిలో
కారిస్తే నీ ప్రతి కన్నీటి చుక్కను
ఆనంద భాష్పాలుగా....
మార్చగల దయామయుడు దేవుడు....!!

మేఘంనుంచి పడే ప్రతి చినుకూ ముత్యం కాకపోయినా- ఏ చిన్ని మొలకకో ప్రాణం పోస్తుంది. ఎండు ఆకైనా ఒకరి కడుపు నింపేందుకు విస్తరిగా మారుతుంది. ఈ విశాల సృష్టిలో పుట్టిన ప్రతీ జీవి బతుక్కీ ఒక అర్థమూ, పరమార్థం ఉంటాయి. అది తెలుసుకున్నవారి జీవితం చరితార్థమవుతుంది


జీవితంలో సంతోషంగా
ఉండాలంటే....
కొన్ని విషయాల్లో
మతిమరుపు...
చాలా అవసరం.....!!


నీతి కోసం బ్రతుకు...
నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది...
సత్యం కోసం బ్రతుకు..
ధర్మం నిన్ను బ్రతికిస్తుంది...
మంచి కోసం బ్రతుకు...
మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది....!!


నిన్ను బాధపెట్టిన సందర్భాల గురించి
ఎక్కువగా ఆలోచించకు...
కాలం అనేది ఒకటుంది...
అది అన్నింటికీ తప్పకుండా
సమాధానం చెప్పి తీరుతుంది....!!

అవమానం జరిగిన చోట
నేర్చుకోవాల్సింది...తిరిగి
అవమానించడం కాదు...
తిరిగి నిలబడే ధైర్యాన్ని
నేర్చుకోవాలి....!!

సేకరణ ✒️
AVB* సుబ్బారావు 📱9985255805

సేకరణ

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

అర్ధం కాలేదు...అనే స్థితి నుండి.అర్ధం అయ్యింది.అనే స్థితికి ఎదగడం విజ్ఞానం.

అర్ధం అయ్యింది.
అనే స్థితి నుంచి.అర్ధం కాలేదు అనే స్థితికి ఎదగడం జ్ఞానం. తెలియనితనం అనేది అజ్ఞానం కాదు. అదే శుద్ధజ్ఞానం.

అక్కడ తెలియడానికి ఏమీ ఉండదు.ఆ శుద్ధ తెలియనితనమే- శిశుత్వం, ఋషిత్వం, దైవత్వం.

మీరు గతంలో జీవించటం మరియు ఇతరులను గమనించడం ఆపేస్తే ఇక మీ ఆనందాన్ని మీ నుండి ఎవరూ వేరు చేయలేరు..

శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

నేటి మాటల ముత్యాలు.

నేటి మాటల ముత్యాలు.

🌷సుఖపడటం మోజులో పడి భవిష్యత్తు పాడుచేసుకోవడం తప్పు.

🌷భక్తిలేక పోవడం తప్పు కాదు, ఇతరుల మనోబావాలు దెబ్బతీయడం తప్పు.

🌷బతకడం కోసం తినాలి ,తిండి కోసం బతకకూడదు.

🌷జన్మ నిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్యం చేయడం తప్పు, నమ్మివచ్చిన భార్యను వదలడం తప్పు.

🌷ఇతరులు మెప్పు కోసం నీకోసం కష్టపడే వారిని,నిన్ను అభిమానించే వారిని బాధపెట్టడం తప్పు

🌷సంతోషాలకు ,అయిన వాళ్లకు దూరం చేసే సంపాదన వృధా,

🌷అన్నిటికన్నా దారుణం నమ్ముకొన్న వారికి ద్రోహం చేయుట , దీనికి పరిహారం లేదు

🌷స్నేహం చేయడం గొప్పనా ,సహాయం చేయడం గొప్పనా అంటే సహాయం చేయడమే గొప్ప,

🌷ఎన్ని ఏండ్లు స్నేహం చేసినా గుణం తెలుసుకోలేము గుడ్డి ప్రేమతో ఉంటారు, డబ్బు ఇచ్చి తిరిగి తీసుకునే టప్పుడే మనిషి గుణం తెలుస్తుంది

🌷బలహీనులు పైన బలం చూపించకూడదు , మనది కానీ చోట అధికారం చూపకూడదు.

🌷అన్నిటా అధికులైనవారిని చూసి అసూయపడటం కన్నా లేనివారికి సహాయపడి గొప్పవారు కావడం మిన్న..

🌷ఆకలికి చేసిన దొంగతనం, ప్రణాపాయంలో చెప్పే అబద్దం, ఒక బంధాన్ని నిలపడం కోసం చేసే మోసం తప్పు కాదు..

🌷చదువుకు తగ్గ సంస్కారం లేకపోవడం దండగ

🌷ఆశపడటం తప్పు కాదు.అత్యాశ పడటం తప్పు

🌷అహంకారి ఇంట్లో పరమాన్నంకన్నా, ఆప్యాయత గల ఇంట్లో గంజినీళ్లు మిన్న..

🌷ఉపయోగించడానికి పనికిరాని బురదనీరు మంటలు ఆర్పడానికి పనికి వస్తుంది కనుక ఉపయోగా పడని వ్యక్తి ఉండరు.

🌷సీత వంటి భార్య, లక్ష్మణుడు వంటి తమ్ముడు ఉంటే వనాలు కూడా రాజ భావనాలే

🌷భక్తిని రోడ్డు పైకి తెచ్చేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు అంటే, పాలను ఇంటింటికి వచ్చి ఇస్తారు ,సారాయి వెతుక్కుని వెళ్తారు, భక్తిని పెంచడం కోసం తప్పు లేదు, కానీ భక్తితో వ్యాపారం చేయడం తప్పు.

🌷మన్నించమని అడగటం తక్కువ కాదు ,అది బంధం నిలుపు కోవడం.

🌷మౌనంగా ఉండటం అంటే తప్పు ఒప్పుకున్నట్టు కాదు బురదలో రాళ్లు వేయడం ఇష్టం లేదని అర్థం.

🌷 మంచి వాళ్ళు అజ్ఞాతం లో ఉంటే చెడు రాజ్యం ఎలుతుంది

🌷కంటికి దగ్గరగా దైవం ఉన్నా కనిపించదు, దూరపు కొండలు నునుపు.

🌷ఎంత సంపాదన ఉన్నా ఆరోగ్యం లేని వాడు పేద వాడే.

🌷 అప్పు లేని వాడు ఎక్కడైనా మహారాజే..

🌷రాలిని ఆకులు చూసి కృంగి పోకూడదు, రాబోయే చిగురులు కోసం ఎదురు చూడాలి.

🌷 మనిషి భయాన్ని ఎప్పుడు జయించ గలడు, మృత్యువును సత్యం అని అంగీకరించినప్పుడు.

🌷 మనిషి ఊపిరి రక్తంలో ఉంటుంది, భగవంతుడు మనిషి ఆకలిలో ఉంటాడు. రక్త దానం చేస్తే ప్రాణ దానం చేసి నట్టు , అన్న దానం చేస్తే దైవాన్ని తృప్తి పరచినట్టు.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

Tuesday, March 22, 2022

నేటి మాట జీవుడు దేహాభిమనాన్ని వదిలితే - జీవుడు దేవుడే...!!

నేటి మాట

జీవుడు దేహాభిమనాన్ని వదిలితే - జీవుడు దేవుడే...!!
గోపికలు దేహాభిమానాన్ని వదిలారు...
అది ఎలా అనగా... వస్త్రాపహరణ లీల, దేహాన్ని వస్త్రంతో పోల్చారు వేదాంతంలో...
వస్త్రాన్ని హరించటమంటే దేహాభిమానాన్ని హరించటమే, అందుకే చిన్నికృష్ణుడు తమ ఇండ్లలో కుండలను పగలగొట్టి వెన్నను దొంగలించినప్పుడు అంటుంటారు...
"కృష్ణా మా ఉపాధులనే కుండలను పగులగొట్టి హృదయమనే వెన్నను దొంగాలించావా.. ఎంత దొంగవయ్యా నీవు".. అని...

అసలు భగవంతుడు మనకు మనోబుద్ధులను ప్రసాదించింది మోక్షాన్ని అందుకొనుటకే...
కాలం వృధా చేసుకోకుండా వాటి సహాయంతో సాధన చేసి మోక్షాన్ని పొందాలి...
భగవంతుడిచ్చిన వాటిని తిరిగి ఆయనకే సమర్పించాలి, లేకపోతే భగవత్ ద్రోహులమవుతాం...

మనసు నిజంగా గయ్యాళిగంప, అది తనకు నచ్చిన పనులు చేస్తుందే గాని మనం చెప్పిన పనులు చేయదు...
తల దువ్వుకోటానికో , బొట్టు పెట్టుకోటానికో , చీరలు నగలు సింగారించుకోటానికో , బూటు పాలిష్ చేసుకోవటానికో , కాలరు టై బిగించుకోటానికో , పౌడర్లు, స్నోలు రాసుకోవటానికో గంటలు గంటలు ఖర్చు పెడుతుంది గాని, జపం చెయ్యటానికో, ధ్యానం చెయ్యటానికో పట్టుమని 10 నిమిషాలు కేటాయించదు...

ఏదో కొంపలు మునిగిపోయినట్లు తపించి పోతుంది...
జపం చెయ్యటం లేదేం, ధ్యానం చెయ్యటం లేదేం, అంటే చాలు... ఏదండీ తీరుబాటు కావటం లేదంటారు...
"మీలాగా మేం సన్యాసులం కాదు గదా".. అని పైకి అనకపోయినా లోన అనుకొంటారు...
ఇల్లూ, వాకిలి, పెళ్ళాం, బిడ్డలు, ఉద్యోగం, వ్యాపారం బోలెడు జంజాటకం, ఇవన్నీ కదల నివ్వటం లేదు అంటారు...

నిజంగా అవి మనను పట్టుకున్నాయా.. మానవులు వాటిని పట్టుకొని విడిచిపెట్టలేక పోతున్నారా...
ఎరుకల వాళ్ళు మామిడి తోటల్లో కోతులను పట్టుకోవటం కోసం కడవను తీసుకెళతారు.
దాని మూతి చిన్నది, పొట్ట పెద్దది, దానిని భూమిలో గుంట తీసి పూడ్చి మూతి మాత్రం భూమిపై కనిపించేట్లు ఉంచుతారు.
దానిలో వేరుశెనగ పప్పులు వేస్తారు, వాళ్ళు చెట్టు చాటున నక్కి ఉంటారు...
కోతి వచ్చి కుండలో చేయి పెట్టి వేరుశెనగ పప్పులను గుప్పిటి నిండా గట్టిగా పట్టుకుంటుంది...
చెయ్యి బయటకు తీయబోతే రాదు, ఎందుకంటే లోపల పెట్టేటప్పుడు ఒట్టి చెయ్యి మాత్రమే, కానీ.. బయటకు తీసేటప్పుడు పప్పులతో ఉన్న గుప్పెట.
చెయ్యి బయటకు రాకపోయే సరికి అసలే చపలచిత్తం గదా.. లోపల ఎవరో తన చేతిని గట్టిగా పట్టుకున్నారను కుంటుంది.
తాను పట్టుకున్న గుప్పెట వదిలేస్తే తంటా తీరిపోతుంది. కాని అది గుప్పెట మాత్రం వదలదు.
అలా చేతిని బయటకు లాగిలాగి పడిపోతుంది, దానితో ఎరుకల వాడొచ్చి పట్టుకుంటాడు...

మానవుడు కూడా అంతే.. ఇక్కడి విషయవస్తువులను పట్టుకొని వదలడు.
అవే మనను పట్టుకున్నాయని వాదిస్తాడు, పోరాడి పోరాడి చివరకు శరీరాన్ని వదిలేస్తారు, గాని పట్టు మాత్రం వదలరు.. పట్టువదలరు.. దానితో యమధర్మరాజు వచ్చి పట్టుకుపోతాడు...
కనుక మనస్సు విషయవస్తువుల వ్యామోహం నుండి విడివడాలి.
వాటిని విడిచి మనస్సును ఈశ్వరుని పై నిలపాలి.
అలా ఎవరైతే మనోబుద్ధులను ఈశ్వరుని పై నిలుపుతారో వారు ఈశ్వరుని లోనే నిలుస్తారు, నివశిస్తారు.

అంటే మనోబుద్ధుల అడ్డం తొలిగితే జీవుడు దేవుడే. 'ఇందులో ఎటువంటి సంశయం అవసరం లేదు'...
మనోబుద్ధులు రెండూ మన వ్యక్తిత్వం...
ఆ రెండూ భగవంతునిలో చేరితే మన వ్యక్తిత్వం నశించి ఆయనలో ఐక్యమైపోవటం జరుగుతుంది.
ఉప్పుబొమ్మ సముద్రపు లోతులను కొలుస్తున్నట్లే మనస్సు ఆత్మసాగారాన్ని మధించాలి.
చివరకు ఉప్పుబొమ్మ కరిగిపోయి సముద్రాకారంగా మారిపోయినట్లు మనస్సు కరిగి ఆత్మాకారంగా మారిపోవాలి...

మన దివ్యత్మాన్ని మరచి నేను సామాన్యుణ్ణి అనుకొనే మానవుడు ఈ విషయాన్ని నమ్మలేక పోతున్నాడు... ఇందులో సందేహించవలసిందేమీ లేదు, ఈశ్వరుని యందు మనోబుద్ధులు రెండింటినీ పూర్తిగా నిలపటం తీవ్ర వైరాగ్య మూర్తులకే గాని సామాన్యులకు సాధ్యం కాదు...

🌺 శుభమస్తు🌺
🙏 సమస్త లోకా సుఖినోవంతు🙏

సేకరణ

పెళ్ళి చేసుకుని స్వేచ్ఛగా ఉండడం సాధ్యమేనా? from జీవిత రహస్యాలు ( ఓషో)



🌺 జీవిత రహస్యాలు ( ఓషో) 🌺
🌷 Part -- 4 🌷
🌹 పెళ్ళి చేసుకుని స్వేచ్ఛగా ఉండడం సాధ్యమేనా? 🌹

🍁 ఈ క్రింది విషయాలను తెలుసుకొని వాటిని విశ్వసించి , ఆచరిస్తే ఎవరైన పెళ్ళి చేసుకుని స్వేఛగా ఉండవచ్చు .

🌴 ఎవరూ మరొకరి కోసం పుట్ట లేదు .

💮 మీ ఆదర్శాలను , మీ అభిప్రాయలను అనుసరించడానికి , మీ ఆదర్శాలకనుగుణంగా జీవించడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు .

🏵️ నీవు ఎంత కావాలంటే అంత ప్రేమను ఇవ్వగలను . కానీ , నీవు ఇతరులను ప్రేమకోసం ఒత్తిడి చేయలేవు . ఇతరుల నుండి ప్రేమను ఒత్తిడితో పొందలేవు . ఎందుకంటే ఎవరూ ఇక్కడ బానిస కాదు .

🌸 ఈ పెళ్ళి ఆట మాత్రమే , దీన్ని పెద్ద విషయంగా తీసుకోవద్దు . పెళ్ళికి ముందు ఎంత స్వతంత్రంగా ఉన్నామో ఇప్పటి నుంచి అలాగే ఉండాలి . నా జీవితంలో నీవు నీ జీవితంలో నేను కలగజేసుకోకూడదు . ఇద్దరం స్నేహితుల్లో జీవిద్దాం . సంతోషాన్ని , దుఃఖాన్ని స్వేచ్ఛని పంచుకుందాం. ఎప్పటికీ ఒకరికి ఒకరం భారం కాకుండా బ్రతుకుందాం , మన మార్గాలు వేరయ్యె రోజు వచ్చినప్పుడు అది బాధాకరమైనదైతే విడిపోదాం " అని నీవు పెళ్ళి చేసుకునే వారితో ఈ విధంగా చెప్పాలి నువ్వు.

☘️ నేను నిన్ను నిజంగా ప్రేమిస్తే , నా ప్రేమ నీకు ఎప్పుడైతే వేదనగా పరిణమిస్తుందో ఆ క్షణమే నిన్ను నేను వదిలేస్తాను. నీవు నన్ను ప్రేమిస్తే నాకు నీ ప్రేమ ఎప్పుడైతే బంధంగా పరిణమిస్తుందో అప్పుడు నీవు నన్ను వదిలేస్తావు " అని చెప్పాలి.

🍀 నీవు దేనినైనా గంభీరంగా తీసుకుంటే అది నీకు స్వేచ్ఛగా అనిపించదు .

🌳 నీవు దేనినైనా గంభీరంగా తీసుకోకుంటే అది నీకు స్వేచ్ఛగా ఉంటుంది .

🌲 పేమ, స్వేచ్ఛ రెండూ కలసే ఉంటాయి . నీవు ఒక దాన్ని మాత్రమే తీసుకొని మరొక దాన్ని విస్మరించలేవు . ఎవరికైతే స్వేచ్ఛ తెలుసో , వారు ప్రేమ స్వరూపులవుతారు. ఎవరికైతే ప్రేమందో వారు స్వేచ్ఛ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటారు . నీవు ప్రేమించిన వ్యక్తికి స్వేచ్ఛను ఇవ్వలేకపోతే మరెవరికి ఇవ్వగలవు ?

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏



సేకరణ

రక్షణ లేని లోకంలో రాలుతున్న పువ్వులు - విఠల పంచ పది

రక్షణ లేని లోకంలో రాలుతున్న పువ్వులు

యువకులు మొదలు వృద్ధుల వరకు నమ్మకూడదు
పొరుగు పురుషపుంగవులను విశ్వసించకూడదు
ఎదిగే ఆడపిల్లకు జాగ్రత్త చెప్పడం మరువకూడదు
మన దగ్గరి బంధువులతోనూ చనువు కూడదు
మానవుడెప్పుడు మృగమౌనో తెలియదు విఠల!

నమ్మించి వంచించేవారు మన చుట్టూవున్నారు
ప్రేమించి మోసగించేవారు అడుగడుగునవున్నారు
రక్షకులనుకున్నవారు రాక్షసులై భక్షకులౌతున్నారు
సినిమా సోషల్మీడియాతో పెడదారిపడుతున్నారు
చుట్టూ పాములు తోడేళ్ళు మేకవన్నె పులులున్నవి విఠల!


తల్లిదండ్రులు పుత్రులను సన్మార్గంలో పెట్టాలి
వారి దినచర్యపై నిరంతరం ఓ కన్నేసి వుంచాలి
పిల్లల ప్రవర్తన స్నేహాలను నిత్యం గమనించాలి
ఫోన్ వాడే విధానాన్ని నిశితంగా పర్యవేక్షించాలి
చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే వ్యర్థమే విఠల!

సేకరణ