Saturday, September 27, 2025

 🧱
 🙏👏🤝🧘🤝🧘🧘🧘🧘🧘🌎🇮🇳🧘🧘🧘🧘🌎🇮🇳🧘🧘🧘
అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… 
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣5️⃣7️⃣.```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
                   *భగవద్గీత*
                  ➖➖➖✍️```
      (సరళమైన తెలుగులో)```


*6. ఆత్మ సంయమ యోగము.*
(ఆరవ అధ్యాయము)
_________________________
*10. వ శ్లోకము:*

*”యోగీ యుజ్ఞీత సతతమాత్మానం రహసి స్థితుఃl*
 *ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహఃll”*

“యోగి అయిన వాడు ఎల్లప్పుడు తన మనస్సును, బుద్ధిని తన అదుపులో ఉంచుకోవాలి. తన మనసును ఆత్మయందు నిలిపి ఉంచాలి. సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఏకాంత ప్రదేశములో ఉండాలి. బయట ప్రపంచములో దొరికే ప్రతి వస్తువు కావాలని ఆశపడకూడదు. ఊరికే ఇస్తున్నారు కదా అని ఇతరుల నుండి ఏమీ ఉచితంగా తీసుకోకూడదు. సాధకుడు అయినవాడు 
ఈ లక్షణములు కలిగి ఉండాలి.
```
ఈ శ్లోకంలో  పరమాత్మ  యోగి ఎలా ఉండాలో వివరించాడు. దీనినే ధ్యానము చేయడానికి ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు అని కూడా అనవచ్చు.    దీనినే అంతరంగిక సాధన అని కూడా అనవచ్చు. ధ్యానం ఒంటరిగా చేయాలి. పది మందిలో చేయకూడదు. ఎందుకంటే ఏకాగ్రత కుదరదు. కాబట్టి ధ్యానం చేయాలంటే ఏకాంత ప్రదేశములో కూర్చోవాలి. బహిరంగ ప్రదేశం కాకుండా ‘రహసి స్థితః’ అంటే రహస్య ప్రదేశములో కూర్చోవాలి. అంటే ఎవరికీ కనపడకుండా అనికాదు. ఎటువంటి శబ్దములు వినపడకుండా, ధ్యానమునకు, ఏకాగ్రతము భంగము, ఆటంకము కలుగని చోట అని అర్థం. ఏకాకీ అంటే ఒంటరిగా కూర్చోవాలి. ‘యత చిత్తాత్మా’ అంటే చిత్తమును అంటే మనోబుద్ధులను, ఇంద్రియములను నిగ్రహించాలి. అటు ఇటు పోకుండా నియమించాలి. ‘నిరాశీ’ అంటే ఈ ధ్యానం చేస్తే నాకు అది వస్తుంది ఇది వస్తుంది. శక్తులు వస్తాయి అనే ఆశ లేకుండా ధ్యానం చేయాలి.

‘అపరిగ్రహః’ అంటే స్వాముల వారు ధ్యానం చేస్తున్నారని, తన భక్తులు తనకు కానుకలు తేవాలని, పాద పూజ చేయాలనీ అనుకోకూడదు. ఇంకా భక్తులు రాలేదే కానుకలు తేలేదే అంటూ ఓరకంటితో చూస్తూ ధ్యానం చేయకూడదు. కాబట్టి ధ్యానము బహిరంగ స్థలములో చేయకూడదు. ఇతరులు మెచ్చుకోడం కోసం ధ్యానం చేయకూడదు. ఇతరులు చూస్తున్నారా లేదా అని చేయకూడదు.

ధ్యానము, భగవంతునికి భక్తునికి అనుసంధానం చేసే ప్రక్రియ. ఇందులో ఇతరుల ప్రమేయం ఉండకూడదు. పూర్వము ఋషులు, మునులు అరణ్యములకు పోయి కుటీరములు నిర్మించుకొని అక్కడ తపస్సు చేసుకొనే వారు. గృహస్థులు కూడా అటువంటి ఏకాంత ప్రదేశములలో ఇళ్లు కట్టుకొని ధ్యానం చేసేవారు. ఈ రోజుల్లో అది కుదరదు కాబట్టి, ఇంట్లోనే ఒక మూల ఏకాంతమైన గదిలో ధ్యానం చేయడానికి ఏర్పాటు చేసుకోవాలి. అంతే గానీ మా పూజగది చూడండి ఎలా అలంకరించామో అని చెప్పుకోడానికి కాదు. తరువాత ఏకాంతంలో ఉండాలి. పది మందిలో ధ్యానం కుదరదు. పది మందిలో వాడు ఏంచేస్తున్నాడు వీడు ఏం చేస్తున్నాడు అనే ధ్యాస ఉంటుంది. ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము మనకు తెలిసిందే. మితాహారం తీసుకోవాలి. మనసును కట్టడి చేయాలి. తాను చేసే ధ్యానం గురించి ప్రచారం చేసుకొని దాని వలన లబ్ధిపొందకూడదు. ఎటువంటి కానుకలు తీసుకోకూడదు.

ధ్యానం అనేది ఉదయం పూట సూర్యుడు ఉదయించకముందు కాలంలో బ్రాహ్మీముహూర్తంలో చేయాలి అని పెద్దలు చెప్పారు. ఎందుకంటే ఉదయం సత్వగుణము అధికంగా ఉంటుంది. శరీరము, మనసు ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంటాయి. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఉదయం ధ్యానమునకు యోగ్యమైనది. సాయంత్రం రజోగుణము తగ్గుతూ తమోగుణము హెచ్చుతుంటుంది. శరీరం విశ్రాంతిని కోరుకుంటూ ఉంటుంది. అందుకని ధ్యానమునకు ఉదయం కాలం శ్రేష్ఠమైనది అని నిర్ణయించారు. ఈ నియమములు పాటించి ధ్యానం చేయాలి. మరి ఈ ధ్యానం ఎన్నిరోజులు చేయాలి అనే సందేహం కూడా వస్తుంది. అందుకే సతతం అని అన్నారు. ప్రతి దినము క్రమం తప్పకుండా నియమిత కాలంపాటు చేయాలి. అంతేకానీ మనకు ఇష్టం వచ్చిన రోజుల్లో, పండుగలలో పర్వదినాలలో మాత్రమే చేయకూడదు. తరువాతి శ్లోకంలో ఏకాంత ప్రదేశంలో ఎలా కూర్చోవాలి, ఎలా ధ్యానం చేయాలి అనే విషయాలు చెప్పాడు పరమాత్మ.✍️```
```(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
 (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
.    *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
  👏🧘🌎🇮🇳🧘🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
           🙏👏🤝🧘🤝🧘🧘🧘🧘🧘🌎🇮🇳🧘🧘మరిన్ని వివరాలకు ఈ గ్రూప్‌లో చేరండి🧘🧘🌎🇮🇳🧘🧘🧘

No comments:

Post a Comment