[9/27, 17:17] +91 98852 16452: 🌸🌻🌸🌻🌸🌻🌸🌻🌸
*ఈరోజు (27-09-2025)*
*శ్రీశైలంలో "కాత్యాయని దేవి"*
*అలంకరణ*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
కాత్యాయని దేవిని పూజిస్తే వివాహ సంబంధిత సమస్యలను దూరం చేస్తుందా ?
అమ్మవారిని పూజించి చూడండి అన్నీశుభాలే !
నవరాత్రి తొమ్మిది రోజులలో దుర్గా దేవి యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తారు. క్రమంగా ఆదిశక్తి ఆమె భక్తుల జీవితాల నుండి అన్ని సమస్యలను తొలగిస్తుంది. ఈ తొమ్మిది రూపాలలో , ఒక వ్యక్తి యొక్క జీవితంలో వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలను తొలగించే దేవత కూడా ఉంది. మంగళ దోషాలను సైతం ఆమె తొలగిస్తుందని చెప్పబడింది.
ఆమే కాత్యాయయుని కుమార్తె , కాత్యాయనీ. కాత్యాయనీ దేవి నాలుగు చేతులతో చిత్రీకరించబడి ఉంటుంది. ఇందులో ఆమె తన ఎడమ వైపు పై చేతిలో కమలాన్ని , మరో చేతిలో కత్తిని కలిగి ఉంటుంది. అదేవిధంగా , కుడి చేతులు అభయ మరియు వరద ముద్రలతో కూడుకుని ఉంటాయి. పసుపు రంగు చీర ధరించిన ఆమె సింహం మీద అధిరోహించి దర్శనమిస్తుంది.
కాత్యాయనీ దేవిని పూజించబడే ఇంట్లో శాంతి మరియు శ్రేయస్సు కలుగు తుందని చెప్పబడింది. వివాహానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా కాత్యాయనీ దేవిని పూజించడం ద్వారా ఫలితాలను పొందగలరని సలహా ఇవ్వబడింది. వివాహ విషయాలలో ఆలస్యం , భార్యా భర్తల మధ్య తరచుగా విభేదాలు , సరైన భాగస్వామిని కనుగొనలేక పోవడం , వంటి సమస్యలు నవరాత్రి వేళల్లో ఆమెకై ఉపవాసం పాటించడం ద్వారా తొలగించబడుతుందని చెప్పబడింది. ఆమె వర్ణనలు కాళిక పురాణాలలో కూడా కనిపిస్తాయి. కాత్యాయనీ దేవి కూడా ఆదిశక్తి అంశగా పరిగణించబడుతుంది. కావున భయాన్ని త్యజించడం కోసం కూడా కాత్యాయనీ దేవిని పూజించడం జరుగుతుంది.
పన్నెండవ గృహంతో సంబంధం ఉన్న దేవతగా కాత్యాయనీ దేవిని కొలవడం జరుగుతుంది.
జ్యోతిష శాస్త్రం ప్రకారం , కాత్యాయనీ దేవి జన్మ కుండలి చార్ట్లో బృహస్పతి గ్రహంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆమెను
*'బ్రహ్మ మండల ఆదిశక్తి దేవి'*
అని కూడా పిలుస్తారు.
గోకులంలోని గోపికలు , కృష్ణుని ప్రేమను పొందుటకై ఈ దేవతకు ప్రార్ధనలు చేశారని చెప్ప బడింది. భగవత్ పురాణంలో వారు యమునా నదిలో స్నానం చేసి , ధూప దీపాలతో , పువ్వులు మరియు నైవేద్యాలను సమర్పించి ఉపవాసం చేసేవారని చెప్ప బడింది. ఈ ఉపవాసాలు చేయడం ద్వారా , క్రమంగా దోషాలు తొలగిపోయి వివాహ మార్గాన్ని సుగమం చేస్తుందని చెప్పబడింది.
దేవీ నవ రాత్రులలో కాత్యాయని దేవీని పూజ చేయడం వివాహాది సమస్యలతో భాదపడేవారికి అత్యంత ముఖ్యమైన రోజుగా చెప్పబడుతుంది.
వివాహానికి సంబంధించిన సమస్యల నివారణ కొరకు సూచించబడిన కాత్యాయని దేవీ మంత్రాలను కొన్ని క్రింద
ఇవ్వబడ్డాయి :
*1. ముందస్తు వివాహానికి సూచించబడిన కాత్యాయనీ మంత్రం :*
ఓం కాత్యాయనీ మహామయే, మహాయోగిన్యాధీశ్వరీ !
నాంద్ గోప్సూతత్ దేవి పాటిమ్ మే కురు తే నమః !!
*2. వివాహ ఆలస్యానికి సూచించదగిన కాత్యాయని మంత్రం :*
హే గౌరీ శంకర్ అర్ధాంగి యధా త్వాం శంకర్ ప్రియా !
తథా మమ్ కురు కల్యాణి కంటకం సుదుర్లభం !!
*3. వివాహ సమస్యల నుండి బయట పడేందుకు :*
హే గౌరీ శంకర్ అర్ధంగిని యథా త్వం శంకర ప్రియ !
తథా కమ్ కురు కల్యాణి కంత్ కాంత్ సుదుర్లభమ్ !!
*4. ఆలస్యమైన వివాహాలకు కాత్యాయనీ సూర్య మంత్రం :*
ఓం దేవేంద్రని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భీమిని !
వివాహం భగ్యం ఆరోగ్యశ్రీ షిఘ్రా లాభమ్ చ దేహి మే !!
*5. కోరుకున్న భాగస్వామి కోసం సూచించదగిన కాత్యాయనీ మంత్రం :*
ఓం దేవేంద్రని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భీమిని !
వివాహం భగ్యం ఆరోగ్యశ్రీ షిఘ్రా లాభమ్ చ దేహి మే !!
*6. మంచి వివాహ జీవితానికి ఉద్దేశించిన కాత్యాయనీ మంత్రం :*
ఓం షంగ్ శంకరాయ సకల్ జన్మర్జీత్ పాప్ విధ్వామ్స్ నాయ్ !
పురుషార్ద్ చౌతుస్టాయ్ లాభయ్ చ పాటిమ్ మే దేహి కురు కురు స్వాహ !!
*ధ్యాన శ్లోకం :*
*చంద్రహాసోజ్వలకరా శార్దూలవరవాహనా|*
*కాత్యాయినీ శుభం దద్యాదేవి దానవఘాతినీ ||*
🌸🌻🌸🌻🌸🌻🌸🌻🌸
[9/27, 17:17] +91 98852 16452: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
*దేవీ శరన్నవరాత్రులలో*
*శ్రీశైలంలో కాత్యాయని దేవి!!*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*ప్రార్ధనా శ్లోకము :*
'చందరహాసోజ్వలకరం శార్దూలవరవాహనాకాత్యాయనీ శుభం దద్ద్యాద్దేవీ దానవ ఘాతినీ '
*అలంకారము*
సరస్వతి దేవి - తెలుపు రంగు
నివేదనం : రవ్వకేసరి
*మహిమ - చరిత్ర*
దుర్గామాత ఆరవ స్వరూపం కాత్యాయని. పూర్వం ‘కత’ అనే పేరుగల ఒక గొప్ప మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు ‘కాత్య’ మహర్షి. ఈ కాత్యగోత్రజుడే విశ్వవిఖ్యాతుడైన ‘కాత్యాయన’ మహర్షి.
ఇతడు ‘పరాంబా’ దేవిని ఉపాసిస్తూ, ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సును ఆచరించాడు. భగవతీదేవి లేదా దుర్గాదేవి పుత్రికగా తన ఇంట జన్మించాలని అతని కోరిక. భగవతీ మాత ఆయన ప్రార్థనను అంగీకరిస్తుంది.
కొంతకాలం తరువాత ‘మహిషాసురుడు’ అనే రాక్షసుని ఆగడాలతో భూలోకం పెచ్చరిల్లిపోతుంది. ఈ మహిషాసురుని సంహరించడానికై బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తమ తేజస్సుల అంశలతో ఒక దేవిని సృష్టిస్తారు.
మొట్ట మొదట కాత్యాయన మహర్షి ఈమెను పూజిస్తారు. అందువలన ఈమె ‘కాత్యాయని’ అని ప్రసిద్ధికెక్కింది.ఈమె ‘కాత్యాయన’ మహర్షి ఇంట పుత్రికగా అవతరించిందని మరి ఒక కథ.
ఈమె అమాంత భాద్రపద బహుళ చతుర్దశినాడు జన్మించింది (ఉత్తర భారత పౌర్ణిమాంత పంచాంగ సంప్రదాయమును బట్టి ఇది ఆశ్వీయుజ శుద్ధ చతుర్దశి).
ఈమె ఆశ్వీయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులలో కాత్యాయన మహర్షి పూజలందు కొని విజయదశమినాడు మహిషాసురుని వధించింది.
ఈమె సాక్షాత్తూ గాయత్రీ అవతారమేనని చెప్పబడింది. కాత్యాయనీ ఉపాసన వల్ల సంతాపాలు, భయాలు, అనుమానాలు దూరమవుతాయి. వేదవిద్య అబ్బుతుంది .
*సాధన*
కాత్యాయనీ దేవి అమోఘ ఫల దాయిని. కృష్ణుడిని పతిగా పొందటానికి గోకులంలో గోపికలందరూ యమునానదీ తీరాన ఈమెనే పూజించారని భాగవతం చెబుతుంది. ఈమె గోకులానికి అధిష్ఠాత్రిగా వెలిసినది.
ఈమె స్వరూపము దివ్యమూ, భవ్యమూ. ఈమె శరీరకాంతి బంగారు వన్నెతో తళతళా మెరుస్తూ ఉంటుంది. ఈమె నాలుగు భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది.
ఈమె కుడిచేతులలో ఒకటి అభయముద్రనూ, మరొకటి వరదముద్రనూ కలిగి ఉంటుంది. ఈమె ఒక ఎడమ చేతిలో ఖడ్గమూ, మరొక ఎడమ చేతిలో పద్మమూ శోభిల్లుతూ ఉంటాయి.
సింహవాహన నవదుర్గా నవ రాత్రులలో ఆరవరోజున కాత్యాయనీ స్వరూపం పూజింపబడుతుంది. ఆ దినాన సాధకుడి మనస్సు ఆజ్ఞా చక్రంలో స్థిరమవుతుంది. యోగసాధనలో ఈ ఆజ్ఞా చక్రం యొక్క స్థానం ప్రముఖమైనది.ఈ చక్రంపై స్థిర మనస్సుగల సాధకుడు తన సర్వస్వమును కాత్యాయనీ దేవీ చరణాలలో సమర్పిస్తాడు. పరిపూర్ణంగా ఆత్మసమర్పణము చేసిన భక్తుడికి సహజంగానే కాత్యాయనీ మాత దర్శనం లభిస్తుంది.
ఈ దేవిని భక్తితో సేవించిన వారికి ధర్మ, అర్థ, కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థముల ఫలములు లభిస్తాయి. అతడు ఈ లోకంలో అలౌకిక తేజస్సులను, ప్రభావములను పొందగలడు.
రోగములు, శోకములు, సంతాపములు, భయము మొదలైనవి అతడినుండి సర్వదా దూరమవుతాయి.
జన్మజన్మాంతరాల పాపాలు నశించటానికి ఈ దేవి ఉపాసన కంటె సులభమైనా, సరళమైన మార్గం మరొకటి లేదు. ఈమెను ఆరాధించేవారు నిరంతరం ఈమె సాన్నిధ్యం నుండీ, పిమ్మట పరమపదప్రాప్తికీ అర్హులవుతారు.
కాబట్టి మనము అన్నీ విధాలా ఈ తల్లిని శరణుజొచ్చి, ఈమె పూజలందూ, ఉపాసనయందూ తత్పరులము కావాలి...
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/27, 17:17] +91 98852 16452: 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
*శ్రీ కాత్యాయనీ దేవీ*
*అష్టోత్తర శతనామావళి*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
ఓం శ్రీ గౌర్యై నమః
ఓం గణేశ జనన్యై నమః
ఓం గిరిజా తనూభవాయై నమః
ఓం గుహాంబికాయై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం గంగాధర కుటుమ్బిన్యై నమః
ఓం వీరభద్రప్రసవే నమః
ఓం విశ్వవ్యాపిన్యై నమః
ఓం విశ్వరూపిన్యై నమః
ఓం అష్టమూర్త్యాత్మి కాయై నమః
ఓం కష్టదారిద్ర్యశమన్యై నమః
ఓం శివాయై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం శాంఖర్యై నమః
ఓం బాలాయై నమః
ఓం భావాన్యై నమః
ఓం భద్రదాయిన్యై నమః
ఓం మాంగళ్యదాయిన్యై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం మంజుభాషిన్యై నమః
ఓం మహేశ్వ ర్యై నమః
ఓం మహా మాయాయై నమః
ఓం మంత్రారాధ్యాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం హేమాద్రిజాయై నమః
ఓం అమర సంసేవ్యాయై నమః
ఓం అన్నపూర్ణాయై నమః
ఓం అమృతేశ్వర్యై నమః
ఓం అఖిలాగమ సంస్తుతాయి నమః
ఓం సుఖ సచ్చిత్సుధారాయై నమః ఓం అంబాయై నమః
ఓం బాల్యారాధికభూతా నమః
ఓం భానుకోటి పుదాయై నమః
ఓం సముద్యతాయై నమః
ఓం హిరణ్యాయై నమః
ఓం వారాయై నమః
ఓం సుక్ష్మాయై నమః
ఓం శీతాంశుకృతశేఖరాయై నమః
ఓం హరిద్రాకుమ్కుమాయై నమః
ఓం మారాధ్యాయై నమః
ఓం సర్వాకాలసుమంగ ల్యై నమః
ఓం సర్వ భోగ ప్రదాయై నమః
ఓం సామ శిఖ రాయై నమః
ఓం వేదాంత లక్షణాయై నమః
ఓం కర్మబ్రహ్మ మయై నమః
ఓం కామ కలనాయై నమః
ఓం వాంచితార్ధ దాయై నమః
ఓం చంద్రార్కాయుత తాటంకాయై నమః
ఓం చిదంబర శరీరన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం కామేశ్వరపత్యై నమః
ఓం కమలాయై నమః
ఓం మురారి ప్రియార్దాయై నమః
ఓం మార్కండేయ గై నమః
ఓం హేమ వత్యై నమః
ఓం పార్వత్యై నమః
ఓం పాప నాశిన్యై నమః
ఓం నారాయణాంశజాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిరీశాయై నమః
ఓం నిర్మలాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం మృడాన్యై నమః
ఓం మునిసంసెవ్యాయై నమః
ఓం మానిన్యై నమః
ఓం మేనకాత్మజాయై నమః
ఓం కుమార్యై నమః
ఓం కన్యకాయై నమః
ఓం దుర్గాయై నమః
ఓం కలిదోష విఘా తిన్యై నమః
ఓం కాత్యా యిన్యై నమః
ఓం కృపా పూర్ణాయై నమః
ఓం కల్యాన్యై నమః
ఓం కమలార్చితాయై నమః
ఓం సత్యై నమః
ఓం సర్వ మయై నమః
ఓం సౌభాగ్య దాయై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం అమలాయై నమః
ఓం వర ప్రసదాయై నమః
ఓం పుత్ర పౌత్ర వరప్రదాయై నమః
ఓం పుణ్యాయై నమః
ఓం పురుషార్ధప్రదాయై నమః
ఓం సత్య ధర్మరతాయై నమః
ఓం సర్వసాక్షిన్యై నమః
ఓం శశాంకరూపిన్యై నమః
ఓం శ్యామలాయై నమః
ఓం బగళాయై నమః
ఓం పాండ్యై నమః
ఓం మాతృకాయై నమః
ఓం భగామాలిన్యై నమః
ఓం శూలిన్యై నమః
ఓం విరజాయై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం ప్రత్యంగిరాంబికాయై నమః
ఓం ఆర్యాయై నమః
ఓం దాక్షాయన్యై నమః
ఓం దీక్షాయై నమః
ఓం సర్వ పశూత్తమోత్తమాయై నమః
ఓం శివాభి దానాయై నమః
ఓం విద్యాయై నమః
ఓం ప్రణవార్ధ స్వరూపిన్యై నమః
ఓం ప్రణవాద్యై నమః
ఓం నాదరూపాయై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం త్రిగుణాంభికాయై నమః
ఓం షోడశాక్షరదేవతాయై నమః
*ఇతి శ్రీ కాత్యాయనీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
No comments:
Post a Comment