Sunday, September 28, 2025

 🔔 *ఆణిముత్యాలు* 🔔

చేతిలో గీతలు అరిగితే గాని, నుదుటి మీద రాసిన రాతలు మారవు. 🌿

విలువైన వాటిని భగవంతుడు మనకు ఇచ్చేటప్పుడు ఆలస్యం చేస్తాడు, ఎందుకంటే వాటి విలువ మనకు తెలియాలి కాబట్టి. 🌸

డబ్బు వస్తే నీ చుట్టూ చేరే వారు చాలామంది ఉంటారు. జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు కూడా ఎవరూ ఉండరు. కాబట్టి నీకోసం కొంత దాచుకో. 🌹

చిమ్మచీకట్లో చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో, మనం బాధలో ఉన్నప్పుడు మన ఆత్మీయులు ఇచ్చే చిన్న ఓదార్పు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. 🌺

జీవితంలో పదిమందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు. పదిమంది బాధను తీర్చి ఎదగడం గొప్ప. 🌷

ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది. కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా ఇష్టంతో చేయి. 🍀

నిన్నటి కంటే రేపు బాగుండాలి. రోజును మించి రోజు సాగాలి. దిగులు నీడలు తాకకూడదు. జీవితం ఆనందమయం కావాలి. 🌻

బంగారం మన ఒంటి మీద ఉన్నంత సేపే విలువ ఇస్తుంది. కానీ సంస్కారం మన జీవితానికి నిరంతరం విలువనిస్తుంది. 


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment