Friday, September 26, 2025

 *_నేటి విశేషం_*

*_శ్రీ దేవీ శరన్నవరాత్రులు 5వ రోజు - అలంకారం శ్రీశైలం లో దేవీ స్కందమాతగా - ఇంద్రకీలాద్రిపై లక్ష్మీదేవి గా దర్శనo_*
*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*

*_దేవీ స్కందమాత_*
*━❀꧁🔆꧂❀━*
*శ్లో𝕝𝕝 ప్రధమం శైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి, షష్ఠమం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||*

*_"దేవీ స్కందమాత" ధ్యాన శ్లోకం_*

*_శ్లో𝕝𝕝 సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |_*
*_శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||_*

కుమార స్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి యైన దుర్గాదేవిని 'స్కందమాత' పేరున నవరాత్రులలో 5వ రోజున ఆరాధింతురు. ఈమె చతుర్భుజ. షణ్ముఖుడైన బాలస్కందుని ఈమెయొడిలో ఒక కుడిచేత పట్టుకొనియుండును. మరియొక కుడిచేత పద్మము ధరించియుండును. ఎడమవైపున ఒకచేత అభయముద్ర, మరొకచేత కమలము ధరించి, 'పద్మాసన' యనబడు ఈమెయు సింహవాహనయే.

స్కందమాతను ఉపాసించుటవలన భక్తుల కోరికలన్నియు నెఱవేఱును. ఈ మర్త్యలోకమునందే వారు పరమ శాంతిని, సుఖములను అనుభవించుదురు. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునకు చెందును.ఈ దేవి సూర్య మండల-అధిష్టాత్రి యగుటవలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో, స్వచ్ఛకాంతులతో వర్ధిల్లుదురు.

*_ఓo శ్రీ స్కందమాత్రే నమః_*

          *_🌹శుభమస్తు🌹_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏

No comments:

Post a Comment