*శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో బెజవాడ కనకదుర్గమ్మ*
*ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రకటించే అష్టలక్ష్ముల సమిష్టి రూపంగా శ్రీమహాలక్ష్మీ రూపాన్ని పేర్కొంటారు. మహాలక్ష్మీ సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. నాలుగోవరోజు మహాలక్ష్మీ రూపంలో భక్తులను అనుగ్రహిస్తారు. రెండు చేతులలో కమాలలను ధరించి, అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండ గా శ్రీ మహాలక్ష్మీ రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు.*
*వరాలిచ్చే తల్లి, సిరిసంపదలు కురిపించే మాత అయిన మహాలక్ష్మీ రూపంలోని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తారు. కృష్ణానదిలోని భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవారిని దర్శించుకుంటారు. మహాలక్ష్మీగా అమ్మవారు అభయమివ్వడం ప్రత్యేకత. లోక స్థితికారిణిగానూ మహాలక్ష్మీ అమ్మవారికి పేరుంది. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మీ.*
*డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తి త్రయంలో మధ్య శక్తి. మహాలక్ష్మీని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీసప్తసతి చెబుతోంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు వస్త్రాలతో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మకు నైవేద్యంగా సమర్పించే పదార్థం చెక్కర పొంగలి, క్షిరాన్నం.*
*మహాలక్ష్మీగా అమ్మవారు అభయమివ్వడం నేటి ప్రత్యేకత. లోక స్థితికారిణిగానూ మహాలక్ష్మీ అమ్మవారికి పేరుంది. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రకటించే అష్టలక్ష్ముల సమిష్టి రూపంగా శ్రీమహాలక్ష్మీ రూపాన్ని పేర్కొంటారు. మహాలక్ష్మీ సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని.*
*అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మీ. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తి త్రయంలో మధ్య శక్తి. మహాలక్ష్మీని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీసప్తసతి చెబుతోంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి.*
*ఈ వేషధారణలో అమ్మవారిని అనేక ఆభరణాలతో అలంకరిస్తారు. జ్ఞానం, సమతుల్యత మరియు పరిణతి చెందిన మనస్సుకు చిహ్నంగా ఉన్న ఏనుగు ఆమె పాదాల వద్ద కనిపిస్తుంది. క్షీరసాగరం నుండి పుట్టిన శ్రీ మహాలక్ష్మీ దేవి, క్షీర సముద్రం చిలికినప్పుడు, తన భక్తులకు ఐశ్వర్యం, 'సర్వ సౌభాగ్యాలు' (అన్ని ప్రాపంచిక సుఖాలు) మరియు అష్ట ఐశ్వర్యాలు (అష్ట ఐశ్వర్యాలు) మరియు 'అష్ట సిద్ధిలు (ఎనిమిది సాఫల్యాలు) ప్రసాదిస్తుంది. . అందుకే, ఇంద్రకీలాద్రిపై ఉన్న గర్భగుడి చుట్టూ ఆమె ఎనిమిది రూపాల విగ్రహాలు-- ఆది లక్ష్మి, గజ లక్ష్మి మొదలైనవి కనిపిస్తాయి*
*┈┉━❀꧁మాత్రేనమః꧂❀━┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌸🌹🌸 🙏🕉️🙏 🌸🌹🌸
No comments:
Post a Comment