5 Signs Warning of Negativity 👁️ Watch Remedies Right Now! 🕉️ నెగిటివిటీ హెచ్చరికలు #sanatanadharma
https://youtu.be/tn5vJXRbTlE?si=NSfpg5faJwPSKm9Z
యూనివర్స్ గుసగుసలాడుతుంది. నెమ్మదిగా తన భాషలో మీకు జరుగుతున్నవి జరగబోయేవి చెప్తూ ఉంటుంది. విశ్వం యొక్క ఈ రక్ష మనకు అనుక్షణం ఉంటుంది. యూనివర్స్ తల్లి మూలతత్వమే వెల్ బీయింగ్ శుభస్పందనలు మాత్రమే. ఈ గుసగుసల భాష అర్థం చేసుకోవడం ఒక ఆర్ట్ అండి ఒక కళ. దీని గురించి బైరాగి నాకు చెప్పింది నేను మీకు చెప్తాను ఇవాళ. నమస్కారం మిత్రమా నా పేరు వంశీ. జగమంత కుటుంబం నాది ఛానల్ లో బైరాగి మీకు లైఫ్ లెసన్స్, బైరాగి కథలు, బైరాగి మెడిటేషన్ మ్యూజిక్ అందిస్తూ ఉంటారు. ఈ చిన్ననిడివి మైక్రో లెసన్స్ వీడియోల్లో మాత్రం నేను మీకు హోస్ట్ గా ఉంటాను. మొదలెడదామా మరి యూనివర్స్ మనతో సూచనల ద్వారా మాట్లాడుతుంది. తెలుగులో ఇంగ్లీష్ లో మాట్లాడదు కదా ఈ సూచనలండి పూర్వకాలం భారత్లో చక్కగా అర్థం చేసుకునేవారు మన పూర్వీకులు. ఈ కాలంలో మనం వినడం మానేసామండి. ఒక్క క్షణం అంటే ఒక్క క్షణం కూడా ఖాళీగా ఎక్కడ ఉంటున్నాం. టీవీ, పని, మొబైలు అది ఇది ఇలా నిశశబ్దం లేకుండా ఉన్నాం. మరి ఇన్ని కార్యకలాపాల గందరగోళంలో ఈ సూచనలు మన కాన్షియస్ మైండ్ కి చేరట్లేదు. అందుకే బైరాగి ధ్యానం చేయమంటారు. ధ్యానం వల్ల మనసు నిశ్శబ్దం చేస్తుంటే యూనివర్స్ సూచనలు మనం పట్టుకోగలం లేదంటే అవి వచ్చి వెళ్ళిపోతూనే ఉంటాయి మనకు తెలియకుండా విశ్వం మనకి ఇచ్చే సూచనలు రెండు రకాలు శుభప్రదమైన సూచనలు నెగిటివిటీ సూచనలు నెగిటివిటీ సూచనలు మనం ఏదో నెగిటివ్ పరిస్థితులు ఎదుర్కోవల్సి వస్తుందని ముందే చెప్తాయి. మిత్రమా ఈ సూచనలు క్యాచ్ చేస్తే చటుక్కున్న వాటి నుంచి తప్పుకోగలుగుతాం. తెలివిగా వ్యవహరించడం అంటే అదే కదండీ మరొక మాట జగమంత కుటుంబం నాది ఛానల్ లో మనం నెగిటివ్ విషయాల గురించి మాట్లాడము. ఈ ఛానల్ నే అందరిలో హై వైబ్రేషన్స్ పెంచాలని తీసుకొచ్చాం. కానీ ఈ వీడియోలో నెగిటివ్ సూచనలు చెప్తున్నాను. భయం కలిగించడానికి కాదు రక్షణ కోసం మీరు ధైర్యంగా ఊపిరి పీల్చుకోవడం కోసం మీకు ఉచ్చస్థాయి అనుపరివర్తన అవకాశం అందించడం కోసం అందుకేనండి ప్రతి నెగిటివ్ సూచనకు రెమిడీలు కూడా అందిస్తున్నాను. సూచన ఒకటి బరువైన భావన ఏదైనా చోటికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లోనే ఒళ్ళు మనసు బరువుగా అనిపిస్తూంటుంది ఒకోసారి గాలి మందంగా ఊపిరి ఇరుగ్గా సాగవచ్చు. ఇది మీ ఎనర్జీ డిస్టర్బ్ అవుతోంది అని చెప్తున్న యూనివర్స్ సూచన అండి. కొద్దిగా నీరు తీసుకొని కళ్ళ మీద చెవుల వెనుక మెడ వెనుక తుడుచుకోండి. ఆ తర్వాత కళ్ళు మూసుకొని నోరు తెరవకుండా ఉమ్ అని మళ్ళీ మళ్ళీ శబ్దం చేస్తూ రెండు నిమిషాలు గడపండి. ఇదే బ్రామరి ఇది ఎలా చేయాలో బైరాగి వీడియోలో చూడండి. కావాలంటే మన ఛానల్ లో ఉంటుంది. శివయ్య విభూతి నుదిటి మీద పెట్టుకోండి. మీరు ఇంట్లో ఉంటే తలుపు వద్ద కూడా కాస్త చల్లండి. సూచన రెండు రిపీట్ లో పీడకలలు రావడం. ఈ కలల ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్ ఏవో నెగిటివ్ తరంగాలు మిమ్మల్ని తాకే ప్రయత్నం చేస్తున్నాయి అని మీకు చెప్తుంది. ఇవి యూనివర్స్ తల్లి గుసగుసలు. దీనికి రెమిడీ నిద్రపోయే ముందు 10 సార్లు లోతైన మెత్తటి శ్వాసలు తీసుకోండి చిరునవ్వుతో. తర్వాత ఒక్క నిమిషం పాటు పైనుంచి తెల్లటి దివ్య కాంతి మీలోకి ప్రవేశించి మీ శరీరంలో ప్రతి కణంలో నిండుతున్నట్లు భావన చేయండి. కాస్త శివయ్య విభూతి చిన్న పొట్లం కట్టి దిండు కింద పెట్టుకోండి పడుకునే ముందు ఓం నరసింహాయ నమః అనే మంత్రం 11 సార్లు చెప్పుకొని రక్ష రక్ష రక్ష అనుకోండి ఆ తర్వాత నిద్రపోండి. మీ ఆస్ట్రల్ బాడీ కి రక్షణ కవచం వస్తుంది. సూచన మూడు జంతువుల అసాధారణ ప్రవర్తన. కుక్కలు ఏడవడం, పిల్లులు మిమ్మల్ని చూసి బుసలు కొట్టడం, పక్షులు అసాధారణంగా కేకలు పెట్టడం వంటివి ఏదో ప్రతికూల ఎనర్జీ సంకేతాలండి. జంతువులు మనకంటే చాలా సెన్సిటివ్ మిత్రమా. వాటిలో సిక్స్త్ సెన్స్ బలంగా ఉంటుంది. అవి నెగిటివ్ ఎనర్జీస్ ని, ఎంటిటీస్ ని, దిష్టిని కూడా మనకంటే ముందుగా పసిగట్టగలుగుతాయి. ఇంటి దగ్గర గుడ్లగూబ అరవడం, గబ్బిలం తిరగడం, కుక్కలు అర్ధరాత్రి పూట ఏడవడం వంటివి కూడా శాస్త్రాల్లో చెప్పిన నెగిటివ్ ఎనర్జీ సూచనలు. రెమెడీ పెద్దగా భయం లేదు ఇంట్లో సామ్రాణి ధూపం వేసి ఇల్లంతా నింపేయండి. తులసమ్మ దగ్గర దీపం వెలిగించండి. ఇంట్లో కర్పూరం వెలిగించి దేవుడికి హారతి ఇవ్వండి. తర్వాత హనుమాన్ గురువుగారు మీ ఎదుటే అంత ఎత్తున బాసింపట్లు వేసుకొని కూర్చున్నట్టు కల్పన చేసి హనుమాన్ చాలీసా చదవండి. వెంటనే గుప్పున మీకు పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. మిత్రమా ఇవన్నీ మూఢనమ్మకాలని చెప్పే సెక్యులర్లు, సగం సగం సైన్స్ నాలెడ్జ్ గాళ్ళు, కమ్యూనిస్టులు వీరికి తెలియంది ఏంటంటే నేను చెప్పిన రెమిడీలు అన్ని గాలిలో మీ ఒంట్లో అనుపరివర్తన కలుగజేసే సైంటిఫికల్ ప్రోవెన్ టూల్స్. సూచన నాలుగు, అకస్మాత్తుగా బలహీనత ఫీల్ అవ్వడం అంటే లో ఎనర్జీ అండి. ఇది మీరు ఆధ్యాత్మికంగా సెన్సిటివ్ అయితే మీకు సులువుగా తెలిసిపోతుంది లో ఎనర్జీస్. దీని అర్థం ఏదో ఒక కారణం వల్ల శక్తి క్షీణించింది. ఇలా లో ఎనర్జీ ఉంటే మనం చేసే పనులు జడగొట్టుకుంటాం లేదా అనవసరమైన మనుషులు పరిస్థితులు తగుల్చుకుంటాం. లో ఎనర్జీ ఉంటే లో ఎనర్జీ శాల్తీలు మనకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. రెమిడీ సుఖ ప్రాణాయామం 15 సార్లు చేయండి. అనులో విలోమ అంటారే అది. మన ఛానల్ శ్వాస వీడియోలో బైరాగి చెప్పారు అది ఎలా చేయాలో దీన్నే నాడీ శోధన అంటారు. దీనివల్ల నాడీ వ్యవస్థ సెట్ అవుతుంది. ఎనర్జీ ఫ్లో అవుతుంది. తర్వాత ఒక దుర్గా అమ్మవారి శ్లోకం Google లో వెతికి చదువుకోండి. ఇన్స్టంట్ గా వైబ్రేషన్స్ తెలుస్తాయి పెరుగుతాయి మీకు ఇంకా ఒక 10 నిమిషాలు 417 హర్డ్స్ మ్యూజిక్ వింటూ ధ్యానం చేయండి చాలు. 417హz అంటే స్వాధిష్టానం చక్రం మెడిటేషన్ మ్యూజిక్ పేరుతో మన జగమంత కుటుంబనాది ఛానల్ లో బైరాగి అందించారు అది చూడండి మీరు. మిత్రమా ఈ ప్రక్రియ అంతా జస్ట్ 15 నిమిషాల్లో జుమ్మని లేచి కూర్చుంటాయి మీ ఎనర్జీస్ సూచన ఐదు ఒక్కసారిగా రిలేషన్షిప్స్ లో ఒత్తిడి వస్తుంది అంటే మీలో ఏదో వైబ్రేషన్ మీకు తెలియకుండానే యాక్టివేట్ అయింది అని అర్థం అందరితో గొడవలు అవుతుంటాయి. ఇలా అవితే 99% మంది ఎదుటి వారిదే తప్పు అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ తారస పడిన ప్రతి వారితో ఏదో ఒక చిరాకు ఎదురైతే ఇక్కడ తేడా మనలో మన వైబ్రేషన్ లోనే జరిగింది అని మీరు అర్థం చేసుకోవాలి. అదే యూనివర్స్ సూచిస్తుంది. ఇలా ఉంటే రకరకాలుగా పరిస్థితులు పాడు చేసుకోబోతున్నాం భవిష్యత్తులో అని విశ్వం మీకు చెప్తుంది. రెమిడీ ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం వెలిగించండి సాయంత్రం పూట కళ్ళు మూసుకొని మెత్తగా మెల్లిగా చిరునవ్వుతో శ్వాస తీసుకుంటూ ఉండిపోండి ఒక రెండు నిమిషాల పాటు తర్వాత మూడు సార్లు మనసులో నేను చెప్పబోయే అఫర్మేషన్స్ మీతో మీరు చెప్పుకోండి. భావనతో నా శరీరం సానుకూల దివ్యకాంతితో నిండుగాక. నా ఇల్లంతా సానుకూల దివ్యకాంతితో నిండుగాక. ఇంకా శనివారం నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో 19 నల్లవత్తులతో ఆలయంలో శనీశ్చరుల వారి దగ్గర దీపం వెలిగించండి కరిగిపోతాయండి స్పర్ధలన్నీ సూర్యుడిలా వెలిగి మళ్ళీ అందరికీ మీరు ఫేవరెట్ అయిపోతారు. మిత్రమా రోజు ఇంట్లో ఆవునెయ్యి దీపం వెలిగించడం, వారానికి ఒకసారి నీటిలో రాళ్ల ఉప్పు కరిగించి స్నానం చేయడం, కరిగించిన రాళ్ల ఉప్పుతో ఇంటిని కడగడం లేదా తుడవడం, ఇంట్లో అప్పుడప్పుడు సాంబ్రాణి ప్రతిరోజు కర్పూరం వెలిగించడం, పడుకునే మంచం పక్కన అమితీస్ట్ వంటి క్రిస్టల్ పెట్టుకొని పడుకోవడం ఇటువంటివి బైరాగి చెప్పిన రెమిడీస్ అండి. ఇవి మీరు ఎప్పుడూ చక్కటి శుభస్పందనలు వెలువరించి శుభాలను ఆకర్షించుకునేలా చేస్తాయి అని చెప్తారు బైరాగి. సరే మరి వంశీకి సెలవిప్పించండి. సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినోభవంతు. జై భారత్, జై శ్రీరామ్, జై గురుదేవదత్త.
No comments:
Post a Comment