*కౌసల్యాదేవి: సీతా! లోకంలో స్త్రీలు తమకు కావలసినవన్నీ సమకూర్చి సంతోషపెట్టేంతవరకు భర్తలను గౌరవిస్తారు. భర్తకు కష్టకాలం రాగానే అంతవరకూ చేసిన మంచినంతా మరచిపోతారు. భర్తను లెక్క చేయరు. ఏ కొంచెం ఆపదవచ్చినా, లేక దరిద్రం వాటిల్లినా వాళ్ళకు చెడుబుద్దులు పుట్టుకొస్తాయి. భర్తలను చీదరించుకుంటారు. లేక వదలి వేస్తారు. సామాన్యంగా వాళ్ళు భర్తతో అబద్దాలాడుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలనే పెద్దవిగాచేసి పోట్లాడుతూ ఉంటారు. వాళ్ళకు కులం, గౌరవాలతో పని ఉండదు. చేసిన మేలు అంతా మరచిపోతారు. లోకమర్యాద పాటించరు. వాళ్ళు చదువుకున్న చదువు ఎందుకూ కొరగాకుండా పోతుంది. అయ్యో! అగ్నిసాక్షిగా పెళ్ళి చేసుకున్నామే, భర్తకు చేదోడువాదోడుగా ఉందామనే జ్ఞానమే ఉండదు. వాళ్ళిప్పుడూ చంచల మనస్కులై ఉంటారు. వికృతంగా ప్రవర్తిస్తారు. అటువంటి స్త్రీని నమ్మలేము.*
No comments:
Post a Comment