Friday, September 26, 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి…
 
         *ఆచార్య సద్బోధన*
              ➖➖➖✍️

```
డబ్బు, భోగం, సుఖం, కష్టం ఏదైనా శరీరానికే కానీ మనస్సుకి కాదు!

మనకు దేవుడు ఒక హోదా ఇచ్చేది ఒక చిన్న ఉద్యోగిని బాధపెట్టడానికి కాదు!
అధికార దర్పంతో, ఒంట్లో పొగరుతో క్రింద వాడ్ని బాధపెడితే...
పైన ఉన్న వాడికి తెలుసు వీడ్ని ఎలా బాధపెట్టలో!!

ఇచ్చిన హోదాని సరైనరీతిలో ఉపయోగించకపోతే దాన్ని ఎలా తీసేయాలో ఆ భగవంతుడికి తెలుసు! 

మనం చేసే వికృత చేష్టలు ఆయనకు తెలియదనుకుంటే అది మన అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనం! 

ఈ రోజున ఒంట్లో ఓపిక ఉంది కదా అని ఎగిరిపడితే..  ఏదో ఒక రోజున     ఆ ఓపిక అయిపోయినప్పుడు, మంచంలో పడి చేసిన పాపాలకు మల, మూత్రాలు విసర్జించలేని పరిస్థితి వస్తుంది. 
అప్పుడు గుర్తువచ్చి ఏం లాభం, ఎంత ఏడ్చినా చేసిన పాపాలు పోలేవు కదా! ఎంత మందిని చూడటం లేదు మనం.

అందుకే గురువు గారు (బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావుగారు) ఎప్పుడూ అంటూ ఉంటారు. ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, వంట్లో ఓపిక ఉండగానే దైవ నామస్మరణ చేయాలి,  బ్రతికుండగానే నలుగురికి మంచి చేయాలి అని....!’✍️```

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment