🙏 *రమణోదయం* 🙏
*మోక్షమార్గంలో దృఢ చిత్తంతో ముందుకు సాగిపోయే శిష్యులు మఱపు చేతగాని లేదా పేదరికం, వ్యాధులు వంటి ఏ కారణాల వల్లగాని వేద ధర్మాన్ని ఆచరించలేకపోయినా కూడా తమ సద్గురువుల ఉపదేశాన్ని అతిక్రమించి నడవనే కూడదు.*
సంసారమనేది నీ మనస్సులో ఉన్నది గాని
బయటలేదు...బయటి ప్రపంచం
'ఇదిగో నేనిక్కడ ఉన్నా' నంటూ ఘోషించదు.
అది ఎప్పుడూ ఉండేది అయితే , నీ గాఢ నిద్రలో
కూడా ఉండవలసిందే..అలా ఉండదు గనుక అది
అనిత్యం...ఆత్మ ఒక్కటే నిత్యం.
మనస్సుతో, అనాత్మతో, తాదాత్మ్యం వదలిపెట్టడమే
నిక్కమైన సంన్యాసం!
తనువులో తానెక్కడున్నాడో
పట్టుకోగలిగితే
జగత్తులో దేవుడు ఎక్కడున్నాడో
పట్టుకోగలం!
అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏
🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.799)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
No comments:
Post a Comment