Friday, September 26, 2025

 అందాల రాముడు ...... ఎందువలన దేవుడు?
ఇదిగో ఇందుకే ...... 💥
🔻ఒక University లో ఒక Professor అడిగిన ప్రశ్నకి 
auditorium లోని students వాళ్ళకున్న perception తో ఇచ్చిన answers.... ఒకే ప్రశ్న/వస్తువుని వేర్వేరు మనుషులు వేర్వేరు కోణాల్లో చూస్తారు, అలా చూసి వాళ్ళకి అర్ధమయ్యిందే నిజమని నమ్మి ఆ angle లోనే react అవుతారు. కానీ పూర్తిగా నిజం ఏదనేది ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. So,
ఒకే వస్తువుని (ప్రశ్నని) మనుషులు ఎన్ని కోణాల్లో చూస్తారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
prof : కొన్ని వేల సంవత్సరాల నుండి ఉన్న 'రామాయణం' గురించి మనం ఇప్పటికీ మాట్లాడుకోవడానికి గల కారణం ఏమయ్యుంటుందంటారు?
student 1: undoubtedly రాముడే కదా sir....
student 2: No.... సీత. ఆవిడే లేకపోతే రాముడుకి ఇన్ని అద్భుతాలు చేసే
అవకాశం వచ్చేదా sir?అసలు రామాయణం జరిగుండేదా?
రామాయణం గురించి మనం మాట్లాడుకునేవాళ్ళమా?
stu 3: వాళ్ళిద్దరూ తప్పు sir. అసలు రావణాసురుడు సీతని ఎత్తుకెళ్ళకపోతే, యుద్ధంలో రావణాసురుడు లాంటి వాడ్ని రాముడు చంపకపోతే అప్పటివరకు మనిషిగా ఉన్న రాముడ్ని జనం దేవుడ్ని చేసేవారా sir?
stu 4: అసలు హనుమంతుడు సీతని దాచిన place కనుక్కోలేకపోతే?
stu 5: సుగ్రీవుడు సైన్యం ఇవ్వకపోతే?
stu 6: వాలి-సుగ్రీవులు కలిసే ఉంటే?
stu 7: అసలు శూర్పణఖ దండకారణ్యంలో తిరగకుండా వుండి ఉంటే?
So, రామాయణానికి ఆవిడే కారణం.
stu 8: కాదు, లక్ష్మణుడు. ఆయన ఉన్నాడనే ధైర్యంతోనే రాముడు మాయలేడి
కోసం సీతని ఒంటరిగా విడిచివెళ్ళాడు. ఒకవేళ ఆయన రాముడితో
వనవాసానికి వెళ్ళకపోతే? పైగా రామాయణం మొత్తం మీద గుర్తింపున్నా
అన్యాయం జరిగిన పాత్ర లక్ష్మణుడిదే....
stu 9: అసలు ఇవన్నీ కాదు sir ... రామాయణం జరగడానికి main reason
దశరథుడు. ఆయనే గనక మొత్తం సామ్రాజ్యాన్ని ఉన్న నలుగురు కొడుకులకి సరి సమానంగా ఇచ్చేస్తే ఇదంతా జరిగేది కాదు కదా.
stu 10 : దీనంతటికి reason విశ్వామిత్రుడు... ఆయనే గనక రాముడ్ని యాగపరిరక్షణకి, తర్వాత మిథిలకు తీసుకువెళ్ళకపోతే?
stu 11: అసలు జనకుడు సీతాకల్యాణానికి శివధనుస్సు ఎక్కుపెట్టాలనే షరతు
పెట్టకపోతే? జనకుడికి సీత భూమిలో దొరక్కపోయుంటే?
stu 12 : ఇవన్నీ కాదు sir, అసలు వాల్మీకి రామాయణం రాయకపోతే?
last student ఇచ్చిన answer తో auditorium మొత్తం ఒక్కసారిగా silent అయిపోయింది. Professors అందరూ అయోమయంలో ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటుండగా ఆ నిశ్శబ్దంలో నుండి ఒక student లేచి నుంచున్నాడు. అందరూ అతనివైపే తిరిగి, అతన్నే చూస్తుండగా ఆ student మాట్లాడాడు.
student : ఇప్పటివరకు చాలామంది చాలా చెప్పారు. కానీ ఇప్పటికీ రామాయణం గురించి మాట్లాడుకోవడానికి ముఖ్యకారణం ఆ "రామాయణం గురించి మాట్లాడుతున్న మనుషులే". " మనిషి కోసం రాయబడ్డ రామాయణం మనిషి గుర్తించాడు కాబట్టే ఇప్పటికీ సజీవంగా ఉంది. "మనిషి గుర్తించిన విషయాలు ఏంటో అవి ఎవరికి వారే తెలుసుకోవాలి. మనిషి వాడికి pleasures ఇచ్చే వాటినే ప్రేమిస్తాడు, ఆరాధిస్తాడు. అప్పటివరకు మనిషిగానే ఉన్న రాముడు, రావణాసురుడ్ని చంపాకే దేవుడయ్యాడు, కాదు దేవుడ్ని చేసారు జనం. మనిషి నుండి దేవుడవ్వడమంటే ఒక stage నుండి ఇంకో stage కి progress అవ్వడమే. రాముడ్ని దేవుడిగా చూసేవాళ్ళకి మనిషికి - దేవుడికి మధ్యలోవున్న progress కనిపించదు. రాముడు సాధించిన progress గమనించినప్పుడే ఎవరిలోనైనా change వచ్చే chance వుంది. ఏ మార్పు తీసుకురాలేనిది అది ఏదైనా సరే useless. రాముడ్ని ఒక మనిషిగా తీసుకున్నప్పుడే ఒక మనిషిగా మనకి connection ఎక్కువ ఉంటుంది. ఆ connection ఏమైనా change తీసుకువస్తుంది. తర్వాత ఆchange కి కారణం అయిన మనిషి మీద ఇష్టం, ఆరాధన, భక్తి. Nothing but gratitude. నిన్ను change చేసినందుకు నువ్వు ఒక మనిషికిచ్చే highest position పేరే దేవుడు. అదే నువ్వు రాముడ్ని దేవుడు దగ్గరనుండి చూడటం మొదలుపెడితే, నువ్వు ఆయనతో comparison పెట్టుకోవు. ఆయనకి నీకు భక్తి అనే connection ఏ ఉంటుంది. Reason లేని భక్తికి automatic గా భయం ఎక్కువ.
"final గా రామాయణం మనిషి ఎలా ఉండాలో చెబుతుంది, ఎలా ఉండకూడదో చెబుతుంది, బ్రతకటం గురించి చెబుతుంది, విలువలు గురించి చెబుతుంది ... మొత్తం మీద రామాయణం మనిషి గురించే మాట్లాడుతుంది. "అందులో ఉన్నవన్నీ ఇప్పుడు పాటించాలా అంటే ..... లేదు అవసరమైనవి తీసుకో... "పక్కనున్న మనిషిని ఇబ్బంది పెట్టనంతవరకు నీ ఆనందం గురించి అడిగే హక్కు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు."
ఇలా తను మాట్లాడాల్సిందంతా మాట్లాడిన student auditorium విడిచి వెళ్ళిపోయాడు... auditorium విడిచి వెళ్ళిపోతున్న student కి అక్కడున్న మనుషులు కనిపించలేదు, వాళ్ళు కొట్టే చప్పట్లు వినిపించలేదు. అంతా నిశ్శబ్దం.... ఆ నిశ్శబ్దంలోనే అతను Exit door open చేసి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు

===
👉 ప్రొఫెసర్ అడిగిన ఒకే ప్రశ్నకు, స్టూడెంట్స్ ఇచ్చిన సమాధానాలన్నీ ఒక్కో కోణం.
👉 ఒక్కో వ్యక్తి తన దృష్టిలో కనిపించిన కారణాన్ని నిజమని నమ్మి చెబుతాడు.
👉 కానీ "రామాయణం" ఎప్పటికీ జీవించి ఉండడానికి కారణం ఒక్క వ్యక్తి కాదు, ఒక సంఘటన కాదు — మనుషులు.

🔸 చివరి విద్యార్థి చెప్పిన మాటల్లో లోతు ఉంది:

రాముడు దేవుడిగా మారడానికి కారణం జనం ఇచ్చిన గుర్తింపు.

మనిషి నుండి దేవుడిగా మారడం అనేది ఒక ప్రగతి.

రాముడు మనిషిగా ఎలా ఉన్నాడో గమనించినప్పుడే మనిషికి ఆయనతో “connection” ఏర్పడుతుంది.

ఆ కనెక్షన్‌ వల్లే భక్తి, ఆరాధన, కృతజ్ఞత కలుగుతాయి.

భయంతో ఉన్న భక్తి కన్నా, మార్పు తెచ్చిన కృతజ్ఞతే నిజమైన భక్తి.

🔻 అందుకే ఆయన తుదిగా చెప్పినది ఎంతో సార్వజనీనమైన సత్యం:
"రామాయణం అంటే మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, బ్రతకటం గురించి, విలువల గురించి చెబుతుంది.
దానిలోని అవసరమైనది తీసుకోవాలి. పక్కవాడిని ఇబ్బంది పెట్టని వరకు నీ ఆనందం గురించి అడిగే హక్కు ఎవరికీ లేదు."

➡️ అంటే, రామాయణం ఒక చరిత్ర కథ కాదు, ఒక జీవన పాఠం.
➡️ రాముడు దేవుడైనందుకే కాదు, రాముడు మనిషిగా చేసిన ప్రయాణం వల్లే ఆయన నేటికీ ప్రాసంగికుడు.

       🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹

No comments:

Post a Comment