Sunday, September 28, 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*ధర్మమే గెలుస్తుంది,*
     *కానీ…*
          *ఎప్పుడంటే...*
             ➖➖➖✍️

```
అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది అని!
అది తప్పు..!

ధర్మం దానంతట అదే గెలవటం కాదు. నువ్వు గెలిపించాలి, మనం కలిసి గెలిపించాలి. అర్థం కాలేదా.?

అయితే రండి..!
ఒక్కసారి నెత్తుటితో తడిసిన చరిత్ర పుస్తకాలలోకి తొంగి చూడండి..

త్రేతాయుగంలో రాముడి భార్యను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు, సరేలే ధర్మమే గెలుస్తుంది కదా, తన సీత తిరిగి వస్తుందిలే అని రాముడు చేతులు కట్టుకొని గుమ్మం వైపు చూస్తూ కూర్చోలేదు. 
రావణాసురుడి మీద ధర్మయుద్ధం ప్రకటించాడు. ఆ రాముడికి అఖండ వానర సైన్యం తోడై ధర్మం వైపుకు అడుగులు వేశారు, ఆ యుద్ధంలో రాముడికి సైతం గాయాలు అయ్యాయి. తన భుజాలను, తొడ భాగాల చర్మాన్ని బాణాలు చీల్చుకొని వెళ్ళాయి. నరాలు తెగి రక్తం చిందుతున్నా సరే తట్టుకొని నిలబడ్డాడు, పోరాడాడు, యద్ధంలో గెలిచాడు. 
*ధర్మం గెలిచింది..!

ద్వాపరయగంలో కుఱుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు తను దేవుడు కదా అని ఒక సామాన్య మానవునిలా యుద్దాన్ని చూడలేదు. ధర్మం చూసుకున్నాడు. పాండవుల పక్షాన నిలుచున్నాడు. అర్జునుడికి రథ సారధిగా మారాడు, గుఱ్ఱమునకు గుగ్గిళ్లు పెట్టాడు, దాని పేడ ఎత్తేశాడు. స్నానాలు చేయించాడు. ఆ యుద్ధంలో రథాన్ని నడుపుతూ ఆ వేగంలో వెనకాల అర్జునుడి మాటాలు వినపడవు గనుక అర్జునుడు తన కాలుతో కృష్ణుడి కటి భాగంలో ఎటువైపు తగిలిస్తే రథాన్ని అటువైపు తిప్పాలని ముందుగనే అనుకున్నారు. అలా కాళ్ళతో కూడా తన్నించుకున్నాడు.  అవన్నీ ధర్మం కోసమే చేసాడు. ధర్మాన్ని గెలిపించడం కోసమే చేసాడు. అలా కురుక్షేత్ర యద్ధం ముగిసింది.
*ధర్మం గెలిచింది..!

కలియుగంలో ఇప్పుడు కూడా మనం ప్రతిరోజు సమస్యలతో పోరాడుతునే ఉన్నాం. 
ప్రతి ఒక్కరి మదిలో మంచికి చెడుకి యుద్ధం జరుగుతునే ఉంది. నువ్వు నమ్మితే అది నిజం మాత్రమే అవుతుంది. ఆచరిస్తే ధర్మం అవుతుంది. అది భవిష్యత్ తరాలకు మార్గదర్శకం అవుతుంది.

అదే నువ్వు నా, నీ, తన, మన భేదాలను పక్కన పెట్టి న్యాయం ఆలోచిస్తేనే ధర్మం అర్థం అవుతుంది. అలా ఆలోచించి పోరాడిన రోజే ధర్మం గెలుస్తుంది, తెగించి అలా ధర్మం వైపుకు నిలబడిన రోజు నీ వెనకాల ప్రపంచమే నడుస్తుంది.           
```
*ధర్మోరక్షతి రక్షితః!*```               
అంటే, ధర్మాన్ని మనం ఆచరిస్తే, 
ఆ ధర్మమే మనలని కాపాడుతుంది!
కావున ధర్మాచరణ తప్పనిసరిగా చేయాలి!!✍️```

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment