మాయా బియ్యం (Magic Rice)
స్టవ్ వెలిగించాల్సిన పనిలేదు. పొయ్యి మీద ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ బియ్యాన్ని కేవలం నీళ్లలో వేసి కొంచెం సేపు పక్కన పెడితే చాలు. అన్నం రెడీ. ఇటువంటి మాయ బియ్యం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అయితే అటువంటి బియ్యం గురించి ఇప్పుడు నేను చెప్తాను మీరు వినండి. ఆ బియ్యం పేరు బొకాసాలు. ఈ బియ్యాన్ని అస్సాం రాష్ట్రంలోని గిరిజన తెగ ప్రజలు ఎక్కువగా వాడుతుంటారు. సైనికులు కూడా వాడుతూ ఉంటారు. ఇటువంటి బియ్యం మాకు కూడా దొరికితే బాగుండు అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం వినండి వివరాలు చెప్తాను. కరీంనగర్ జిల్లా శ్రీరాములు పల్లికి చెందినటువంటి శ్రీకాంత్ అనే రైతు అస్సాం తో పాటు తొమ్మిది రాష్ట్రాలు తిరిగి ఈ ధాన్యం గురించి తెలుసుకున్నాడు. అతడు ఇప్పుడు తన ఊరిలో ఈ ధాన్యాన్ని సాగు చేస్తున్నాడు. మన రాష్ట్రంలో ఉన్న అనేకమంది రైతులు అతని దగ్గరకు వెళ్లి, ఈ బొకాసాలు అనేటువంటి వరి ధాన్యం విత్తనాలు తెచ్చుకుంటున్నారు.
ఈ బియ్యం వండుకోవడానికి స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు. పోయ్యి మండించవలసిన అవసరం లేదు. ఈ బియ్యాన్ని చన్నీళ్లలో వేస్తే చల్లని అన్నం, వేడి నీళ్లలో వేస్తే వేడి అన్నం వెంటనే రెడీ అయిపోతుంది. ఇంకో కొసమెరుపేంటో తెలుసా అండి….. ఈ అన్నంలో కూర కూడా వేసుకోవలసిన అవసరం లేదు. వట్టి అన్నమే తినొచ్చు.
No comments:
Post a Comment